సిద్దిపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని కొండపాక మండలం దుద్దెడలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ భవన సమీపంలో కూలిన విమానం పూర్తిగా దగ్దమైంది. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్యారాచూట్ సాయంతో ట్రైనీ పైలెట్ విమానం నుంచి దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.