వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం ఆరాటపడుతున్న ట్రంప్ పశ్చిమ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారించారు. నెవాడా, కాలిఫోర్నియా, అరిజోనా తదితర రాష్ట్రాల్లో వరస పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా నెవాడా రాష్ట్రంలో పట్టుబిగించాలని చూస్తున్నారు. 2004 నుంచి ఈ రాష్ట్రం రిపబ్లికన్ అభ్యర్థికి మద్దతుగా నిలవడం లేదు. అందుకే ఈసారి నెవాడాలో ట్రంప్ ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 45 లక్షల డాలర్లు ఖర్చు చేసిన ట్రంప్ మరో 55 లక్షల డాలర్లను కేవలం ఈ రాష్ట్రానికి కేటాయించారు. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కూడా ఇప్పటివరకు 45 లక్షల డాలర్లు ఖర్చు పెట్టారు. మరో 25 లక్షల డాలర్లు కేటాయించారు. అరిజోనాను కోల్పోతే ఎలక్టోరల్ ఓట్లు 270 సాధించడం కష్టమేనని విశ్లేషకుల అంచనా. దీంతో ట్రంప్ అరిజోనాలో మళ్లీ పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment