ట్రంప్‌దే నెవడా | Donald Trump wins Nevada in presidential race | Sakshi
Sakshi News home page

ట్రంప్‌దే నెవడా

Published Sun, Nov 10 2024 5:38 AM | Last Updated on Sun, Nov 10 2024 10:35 AM

Donald Trump wins Nevada in presidential race

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన ట్రంప్‌ తన మెజారిటీని మరింత పెంచుకుంటున్నారు. ఏడు కీలక స్వింగ్‌ రాష్ట్రాల్లో ఒకటైన నెవడాను కూడా శనివారం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి 6 ఎలక్టోరల్‌ ఓట్లతో కలిపి ఆయన మొత్తం ఓట్లు 301కి పెరిగాయి. నెవడా 20 ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల చేజారడం విశేషం. 11 ఓట్లున్న అరిజోనాలో ఫలితం వెలువడాల్సి ఉంది. అక్కడా 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్‌ 5 శాతానికి పైగా ఆధిక్యంలో ఉన్నారు.

 హారిస్‌కు 226 ఓట్లుకు రావడం తెలిసిందే. రిపబ్లికన్లు నాలుగేళ్ల తర్వాత సెనేట్‌లో కూడా మెజారిటీ సాధించడం తెలిసిందే. వారికి 52 సీట్లు రాగా డెమొక్రాట్లు 44కే పరిమితమయ్యారు. 2 సీట్లు స్వతంత్రులకు దక్కగా మరో రెండింట్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.  ప్రతినిధుల సభ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ల ఆధిపత్యమే సాగుతోంది. 435 స్థానాలకు గాను ఇప్పటిదాకా రిపబ్లికన్లు 212 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 సీట్లు వస్తే వారు మెజారిటీ మార్కు చేరుకుంటారు. డెమొక్రాట్లకు 200 స్థానాలు దక్కాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement