majority
-
బారామతిలో అజిత్‌పవార్‌కు భారీ మెజారిటీ
పుణె:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(అజిత్‌పవార్) చీఫ్ అజిత్‌పవార్ భారీ విజయం నమోదు చేసుకున్నారు. శనివారం(నవంబర్23) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ ఏకంగా లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఈ ఎన్నికలో ఆయన లక్షా81వేల ఓట్లు సాధించారు. అజిత్ పవార్ తన సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యోగేంద్రపైనే గెలుపొందారు. యోగేంద్ర ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పార్టీని విజయతీరాల వైపు నడిపించడంతో పాటు అజిత్‌పవార్ స్వయంగా ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం సాధించారు. కాగా, ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అజిత్‌పవార్ సతీమణి సునేత్ర పవార్ ఎంపీగా పోటీచేశారు. ఇక్కడ ఈమె శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం గమనార్హం. -
ట్రంప్‌దే నెవడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన ట్రంప్ తన మెజారిటీని మరింత పెంచుకుంటున్నారు. ఏడు కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన నెవడాను కూడా శనివారం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి 6 ఎలక్టోరల్ ఓట్లతో కలిపి ఆయన మొత్తం ఓట్లు 301కి పెరిగాయి. నెవడా 20 ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల చేజారడం విశేషం. 11 ఓట్లున్న అరిజోనాలో ఫలితం వెలువడాల్సి ఉంది. అక్కడా 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్ 5 శాతానికి పైగా ఆధిక్యంలో ఉన్నారు. హారిస్‌కు 226 ఓట్లుకు రావడం తెలిసిందే. రిపబ్లికన్లు నాలుగేళ్ల తర్వాత సెనేట్‌లో కూడా మెజారిటీ సాధించడం తెలిసిందే. వారికి 52 సీట్లు రాగా డెమొక్రాట్లు 44కే పరిమితమయ్యారు. 2 సీట్లు స్వతంత్రులకు దక్కగా మరో రెండింట్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ల ఆధిపత్యమే సాగుతోంది. 435 స్థానాలకు గాను ఇప్పటిదాకా రిపబ్లికన్లు 212 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 సీట్లు వస్తే వారు మెజారిటీ మార్కు చేరుకుంటారు. డెమొక్రాట్లకు 200 స్థానాలు దక్కాయి. -
రాజ్యసభ: మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే.. 12 మంది ఏకగ్రీవం
ఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంగళవారం.. మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి. -
ఫలించిన ‘ఉత్తమ్’ వ్యూహం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా గెలిచిన నియోజకవర్గాల్లో రెండో అతి పెద్ద మెజార్టీని కైవసం చేసుకుని నల్లగొండ లోక్‌సభ స్థానం రికార్డు సృష్టించింది.అసోంలోని ధుబ్రీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హసన్‌కు 9.8 లక్షలకు పైగా మెజార్టీ రాగా, ఆ తర్వాత కేరళలోని తిరువల్లూర్లో శశికాంత్ సెంథిల్ 5.7 లక్షల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నల్లగొండలోనే రఘువీర్‌రెడ్డి 5.59 లక్షల అత్యధిక మెజార్టీ సాధించగలిగారు. పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ఇన్చార్జి గా వ్యవహరించిన ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక వ్యూ హం రచించారు. రఘువీర్‌రెడ్డిని అభ్యరి్థగా ప్రకటించినప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి కేంద్రీకరించారు. దాదాపు నెలరోజులకు పైగా నియోజకవర్గంలోనే పనిచేసి కేడర్‌ను కదిలించగలిగారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, పార్టీ మండల, గ్రామ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో గెలుపు వ్యూహాన్ని అమలు చేశారు. ఎక్కడికక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మిగతా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌తో పాటు తన సతీమణి పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి మెజారిటీ ఓట్లు వచ్చేలా ఉత్తమ్ కసరత్తు చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆ రెండు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో రఘువీర్‌కు అత్యధికంగా ఓట్లు లభించాయి. కోదాడ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు 1,25,472 ఓట్లు రాగా, హుజూర్‌నగర్‌లో 1,33,198 ఓట్లు వచ్చాయి. పోలైన మొత్తం ఓట్లలో 33.50 శాతం ఓట్లు ఈ రెండు నియోజకవర్గాల్లోనే లభించడం విశేషం. దేవరకొండ, మిర్యాలగూడ, సాగర్, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాలను మించి ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వచ్చాయి. హుజూర్‌నగర్‌లో 1.05 లక్షలు, కోదాడలో 95 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ లభించింది. హుజూర్‌నగర్‌లో వచ్చిన మెజార్టీ రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ పరిధిలోనూ రాకపోగా, దేశంలోని టాప్–5 స్థానాల్లోనూ హుజూర్నగర్ ఉంటుందని టీపీసీసీ అంచనా వేస్తోంది. అత్యధిక మెజార్టీపై ఉత్తమ్ హర్షం హుజూర్నగర్: నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి దాదాపు 5.50 లక్షలకు పైగా మెజార్టీ తో విజయం సాధించడంపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1.05 లక్షల మెజార్టీ , తన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 95 వేల మెజార్టీ ని ప్రజలు కాంగ్రెస్ అభ్యరి్థకి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీ ఇచి్చన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
రాజ్యాంగమే దారిదీపం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం తమకు మార్గం చూపే దారిదీపం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. లక్ష్య సాధన కోసం పారీ్టలకు అతీతంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జై జగన్నాథ్ అంటూ ప్రసంగం ప్రారంభించారు.ప్రధానమంత్రిగా మూడో పర్యాయంలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. అవినీతిని నిర్మూలించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి సాధించిన మొత్తం సీట్ల కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుండడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఒడిశా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే పక్షాలకు సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్ దిశగా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటామని పేర్నొన్నారు. మహిళలే కేంద్రంగా అభివృద్ధి నమూనా తన తల్లి మృతి చెందిన తర్వాత తనకు ఇది మొదటి ఎన్నిక అంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు తనపట్ల ఆప్యాయత ఆదరణ చూపించారని, ఆశీస్సులు అందించారని, తనకు తల్లి లేని లోటు కని్పంచకుండా చేశారని వెల్లడించారు. మహిళలే కేంద్రంగా అభివృద్ధి నమూనాను కొనసాగిస్తామని ప్రకటించారు. యువత సాధికారత కోసం కృషి చేస్తామన్నారు. భవిష్యత్తు మొత్తం ఇకపై హరిత శకానిదేనని, గ్రీన్ ఎకానమీలో పెట్టుబడులు పెంచుతామని హామీ ఇచ్చారు.వాతావరణ మార్పుల నుంచి ఆహార భద్రత దాకా భిన్న రంగాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపుతుందన్నారు. బలమైన భారత్ బలమైన ప్రపంచానికి బలమైన మూలస్తంభంగా నిలుస్తుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు 10 గంటలు పని చేస్తే తాను 18 గంటలు పని చేస్తానన్నారు. వారు రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానన్నారు. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కొత్త అధ్యాయం లిఖిస్తుందని, ఇది మోదీ గ్యారంటీ అని వివరించారు. దేశంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే పని చేస్తుందన్నారు. -
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
కరీంనగర్‌టౌన్: ‘బండి సంజయ్ గలీజోడు.. ముస్లింలంతా ఏకమై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచి్చండు. ఏమైంది? అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అడ్రస్సే గల్లంతు చేశారు’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం సంజయ్ కరీంనగర్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి రిటరి్నంగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను ఓడించేందుకు ఒకవర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం గతం కన్నా ఎక్కువ నిధులు తీసుకొస్తానని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లేముందు, ఆ తర్వాత గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఇంటికి చేరుకుని సంజయ్ తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆయన గెలుపు సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కుటుంబ సభ్యులతో కలసి సంజయ్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. -
MP: దూసుకెళ్తున్న ‘మామ’.. బంపర్ మెజార్టీలో సీఎం చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి కమల్ నాథ్ చింద్వారాలో వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్ 56,124 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్ విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్య మంత్రి లాడ్లీ బెహనా యోజన పథకం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిందని నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహిళలు చౌహాన్‌పై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే ధీమా వ్యక్తం చేశారు. -
మెజారిటీ.. మ్యాజిక్ ఫిఫ్టీ పంచ్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమంటేనే ఓ కిక్కు..1000లోపు ఓట్లతో గెలిస్తే అబ్బా..చాలా తక్కువ మెజారిటీ వచ్చిందే.. అయినా బుల్లెట్ దిగిందా లేదా.. అంటారు. 10వేలు దాటితే ఫర్వాలేదంటారు..20వేలు దాటితే ఇరగదీశాడని మెచ్చుకుంటారు..30వేలు దాటితే ఏదో మ్యాజిక్ చేశాడంటారు..40వేలు దాటిందంటే నెవర్ బిఫోర్ అని సర్టిఫికెట్ ఇచ్చేస్తారు..అదే 50వేల మెజారిటీ దాటిందంటే...ఇక ఆ కిక్కే వేరు. లాస్ట్ పంచ్ మనదైతే ఎంత కిక్కు ఉంటుందో 50వేల మెజారిటీ దాటిందంటే అంతకంటే ఎక్కువే కిక్కొస్తుంది. తెలంగాణలో జరిగిన అనేక ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ఈ కిక్కు.. అదే ఘనత సాధించారు. ఆ జాబితాలో సీఎం కేసీఆర్‌తో సహా పలువురు రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కొన్ని స్థానాల్లో అయితే వరుసగా రెండు, మూడు దఫాలుగా ఒకే అభ్యర్థికి 50వేల కంటే ఎక్కువ మెజారిటీ ఇస్తున్నారు ఆయా నియోజకవర్గాల ప్రజలు. ఇక మరో విశేషమేమిటంటే... ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఏ పార్టీకి చెందిన అభ్యర్థికి కూడా 50వేల మెజారిటీ రాలేదు. అంటే ఆయా స్థానాల్లో మరీ ఏకపక్షంగా పోలింగ్ ఎప్పుడూ జరగదని, ఎన్నికలెప్పుడు జరిగినా సీన్ సితారేనని అర్థమవుతోంది. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు, ఎప్పుడు 50 వేల కంటే ఎక్కువ మెజారిటీ సాధించారంటే ♦ 2014 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి చిన్నం దుర్గయ్య (టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి గుండా మల్లేశ్ (సీపీఐ)పై 52,528 ఓట్ల ఆధిక్యత సాధించారు. ♦ ఇవే ఎన్నికల్లో మంచిర్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్‌రావు తన ప్రత్యర్థి అరవింద్‌రెడ్డి (కాంగ్రెస్)పై 59,250 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, 2010లో జరిగిన ఉప ఎన్నికలో అరవింద్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జి. హనుమంతరావు (టీడీపీ)పై ఏకంగా 78,047 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦ 2011లో జరిగిన ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్) సరిగ్గా 50వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై గెలిచారు. ♦2004లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన షబ్బీర్‌అలీ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మురళీధర్గౌడ్పై 52,763 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ♦ 2010 ఉప ఎన్నికలో కోరుట్ల నుంచి జువ్యాడి రత్నాకర్‌రావు (కాంగ్రెస్)పై కె.విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్) 56,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ 2018లో జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్‌కుమార్ (టీఆర్ఎస్), కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 61,125 ఓట్ల ఆధిక్యత సాధించారు. ♦ 2010 ఉప ఎన్నికలో ధర్మపురి నుంచి గెలిచిన కొప్పుల ఈశ్వర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై 58,891 ఓట్ల ఆధిక్యత లభించింది. అదే 2018 ఎన్నికల్లో ఈశ్వర్ కేవలం 441 ఓట్ల తేడాతో అదే లక్ష్మణ్‌కుమార్‌పై విజయం సాధించడం గమనార్హం. ఇక కొప్పుల ఈశ్వర్ 2004 ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా 56,563 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి మూలం మల్లేశంపై గెలిచారు. ♦పెద్దపల్లి నియోజకవర్గంలో 2014లో జరిగిన ఎన్నికల్లో దాసరి మనోహర్‌రెడ్డి (టీఆర్ఎస్) 62,677 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి భానుప్రసాదరావుపై గెలిచారు. ♦ చొప్పదండిలో 2014లో బొడిగె శోభ (టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి సుద్దాల దేవయ్య (కాంగ్రెస్)పై 54,981 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦ 2010 ఉప ఎన్నికలో వేములవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ 50,451 ఓట్ల మెజారిటీ సాధించారు. ♦హుజూరాబాద్ నుంచి 2010 ఉప ఎన్నికల్లో 79,227, 2014 సాధారణ ఎన్నికల్లో 57,037 ఓట్ల మెజారిటీని ఈటల రాజేందర్ సాధించ గ లిగారు. ♦ నారాయణ్‌ఖేడ్‌లో 2016 ఉప ఎన్నిక, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి వరుసగా 53,625 ఓట్లు, 58,508 ఓట్ల ఆధిక్యత సాధించారు. ♦ నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దనరెడ్డి 2018 ఎన్నికల్లో 54354 ఓట్ల తేడాతో నాగం జనార్దనరెడ్డి (కాంగ్రెస్)పై గెలిచారు. ♦ దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రాంలింగారెడ్డి (టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి నాగేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 66,421 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦ సంగారెడ్డిలో 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కె. సదాశివరెడ్డి తన ప్రత్యర్థి పి. రామచంద్రారెడ్డి (కాంగ్రెస్)పై 57,550 ఓట్ల మెజారిటీ సాధించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ.. ♦ 2018 ఎన్నికల్లో మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు (టీఆర్ఎస్) 73,968 ఓట్ల మెజారిటీ సాధించారు. ♦ రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్ 2018 ఎన్నికల్లో 57,331 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో అరికెపూడి గాంధీ తన సమీప ప్రత్యర్థి శంకర్‌గౌడ్ పై శేరిలింగంపల్లి నుంచి 75,904 ఓట్ల ఆధిక్యత సాధించారు. ♦ ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వై. సుధాకర్‌రెడ్డిపై 62,598 ఓట్ల ఆధిక్యత సాధించారు. పాతబస్తీలో అలవోకగా లక్ష ఓట్ల మెజారిటీ ♦ చార్మినార్ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీ 1999లో 93,505 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం నుంచే పోటీ చేసిన అహ్మద్ పాషా ఖాద్రి తన సమీప ప్రత్యర్థి తయ్యబా తస్లీం (టీడీపీ)పై 1,07,921 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) గత రెండు ఎన్నికల్లోనూ 50వేల కంటే ఎక్కువ మెజా రిటీ సాధించారు. 2014లో 59,279 ఓట్లు, 2018లో 80,263 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ♦ బహుదూర్‌పుర నుంచి మౌజంఖాన్ వరుసగా మూడుసార్లుగా 50వేల కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యత సాధిస్తున్నారు. 2009లో 56,735 ఓట్లు, 2014లో 95,045 ఓట్లు, 2018లో 82,518 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో అరలక్ష దాటిన మంత్రులు ♦ ప్రస్తుతం మంత్రిగా ఉన్న వి.శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ నుంచి 2018 ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఎం.చంద్రశేఖర్ (టీడీపీ)పై 57,775 ఓట్ల మెజారిటీ సాధించారు. ♦ ఇదే ఎన్నికల్లో వనపర్తి నుంచి మరో మంత్రి ఎస్. నిరంజన్‌రెడ్డి 51,685 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ పాలకుర్తి నుంచి ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవరెడ్డిపై 53,053 ఓట్ల ఆధిక్యత సాధించారు. ♦ మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి 2018 ఎన్నికల్లో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కాంగ్రెస్)పై 88,066 ఓట్ల ఆధిక్యత సాధించారు. అత్యధిక మెజారిటీ రికార్డు విష్ణుదే ఉమ్మడి ఏపీలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడంతో లోక్‌సత్తా అభ్యర్థి కఠారి శ్రీనివాసరావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యత సాధించారు. మెజారిటీ పెంచుకుంటూ కేటీఆర్.. లక్ష దాటిన హరీశ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి మూడోసారి వరుసగా భారీ మెజారిటీ సాధించారు. 2009లో కేవలం 171 ఓట్లతో గెలిచిన ఆయన 2010 ఉప ఎన్నికల్లో ఏకంగా 68,220 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో 53,004 ఓట్లు, 2018లో 89,009 ఓట్ల మెజారిటీ సాధించడం గమనార్హం. సిద్దిపేట నుంచి మరో మంత్రి హరీశ్‌రావు కూడా వరుసగా ఐదుసార్లు 50 వేల కంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో 58,935, 2009లో 64,677, 2010 ఉప ఎన్నికల్లో 95,858, 2014లో 93,328 మెజారిటీ సాధించగా, ఇక, 2018 ఎన్నికల్లో ఆయన ఆధిక్యత లక్ష ఓట్లు దాటింది. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్)పై 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించారు. ఒక్కసారే కేసీఆర్‌కు.. సీఎం కేసీఆర్ మాత్రం 50 వేల కంటే ఎక్కువ మెజారిటీతో ఒకే ఒక్కసారి గెలిచారు. 2018 ఎన్నికల్లో వి.ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్)పై 56,922 ఓట్ల ఆధిక్యత సాధించారు. లక్షకు దగ్గరగా ఆరూరి రమేశ్ వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్ వరుసగా రెండుసార్లు 50 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 2014లో 86,349 ఓట్లు, 2018లో 97,670 ఓట్ల ఆధిక్యత ఆయనకు లభించింది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి దాస్యం వినయ్‌భాస్కర్ 2014 ఎన్నికల్లో 56,304 ఓట్ల ఆధిక్యత సాధించారు. అంతకుముందు జరిగిన 2010 ఉప ఎన్నికల్లో 67,524 ఓట్ల మెజారిటీ ఆయనకు వచ్చింది. ఈస్ట్ నుంచి 2014 ఎన్నికల్లో కొండా సురేఖ 55085 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ నుంచి గెలిచారు. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలు కానున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారు. 2024 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో సాధారణ ఓటర్లు, ఓవర్సీస్, సర్విసు ఓటర్లతో కలిపి మొత్తం 4,02,21,450 ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా 2,03,85,851 మంది మహిళా ఓటర్లుండగా 1,98,31,791 మంది పురుష ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నారు. సర్విసు ఓటర్లు 68,158 ఉండగా థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 మంది ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా–2024ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 9 వరకు ఓటర్ల నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను, నమోదు దరఖాస్తులను పరిష్కరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. మూడు జిల్లాలు మినహా.. రాష్ట్రంలో ప్రకాశం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం మినహా మిగతా 23 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అత్యధికం. పురుష, మహిళా ఓటర్లు కలిపి అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లుండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు 2,88,155 మంది ఉన్నారు. 2023 తుది ఓటర్ల జాబితాతో పోల్చితే తొలగింపులు, నమోదుల అనంతరం ముసాయిదా జాబితా–2024లో 2,36,586 మంది ఓటర్లు పెరిగారు. నవంబర్ 4, 5, డిసెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు వచ్చే ఏడాది ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో నవంబర్ 4, 5 తేదీలు, డిసెంబర్ 2, 3 తేదీల్లో (శని, ఆదివారాలు) ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాతో ఆ తేదీల్లో వారు అందుబాటులో ఉంటారు. ఆయా పరిధిలోని ఓటర్లు తమ పేర్లు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పరిశీలించుకుని, లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుకు కూడా అవకాశం ఉంది. క్షేత్రస్థాయి డాక్యుమెంట్లతో తనిఖీల ద్వారా ఓటర్ల జాబితాలో 21.18 లక్షల ఓటర్లను తొలగించారు. 99.9 శాతం తనిఖీలు పూర్తయ్యాయి. వెయ్యి మంది జనాభాకు ఓటర్ల నిష్పత్తి 729, జెండర్ రేషియో 1,031గా ఉంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 46,165 ఉన్నాయి. -
85 సీట్లతో అధికారం మాదే
సాక్షి, హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 85 సీట్ల దాకా గెలుపొంది బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుని బీజేపీ సంచలనం సృష్టించబోతోందన్నారు. రాబోయే 50, 55 రోజుల్లో ఇది వాస్తవరూపం దాల్చడాన్ని అందరూ చూస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలను కేసీఆర్ సర్కార్ విస్మరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. సకల జనులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అవినీతి మయం చేయడంతో పాటు, పూర్తిగా కుటుంబ స్వామ్యంగా మార్చివేయడాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు ఊహించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ సరిగా లేదని, తెలంగాణ ఏర్పడ్డాక మండలి చైర్మన్‌తో సహా ఎమ్మెల్సీలందరూ టీఆర్ఎస్లో విలీనం కావడం, 2014లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 2018లో 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం ద్వారా ఆ రెండు పార్టీలూ ఒక్కటే అన్న విషయం స్పష్టమైందని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యేలెవరూ బీఆర్ఎస్లోకి వెళ్లలేదని, ఇతర పార్టీల్లోంచే బీజేపీలోకి వస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వహించకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. జవదేకర్ గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వైఎస్ విజయం సాధిస్తారని ముందే చెప్పా 2004 ఎన్నికలకు ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రను, దానికి వచ్చిన స్పందనను నేను స్వయంగా గమనించా. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పా. నేను చెప్పినట్టే ఆయన అధికారంలోకి వచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందనే నా జోస్యం నిజం అవుతుంది. అది పూర్తిగా అబద్ధం బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అ న్నారన్నది పూర్తిగా అబద్ధం. ఈ వార్త మీడియాలో వచ్చాక కూడా దానిని ఖండిం చకపోవడంపై నేను పార్టీ అధికార ప్రతినిధులను మందలించా. తెలంగాణలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ఆ అంతర్గత సమావేశంలో సంతోష్ చెప్పారు. అయితే హంగ్ అని అన్నట్టుగా వార్త వచ్చినందుకు నేను జర్నలిస్టులను కూడా తప్పుబట్టను. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియో రికార్డ్ లేదు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్‌లో ప్రస్తుతం అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కర్ణాటకలో గెలుపు ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశముంది. అయితే కాంగ్రెస్ తమను మోసం చేసిందనే భావనలో ఉన్న తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ వేరు, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ నేత రాహుల్ జేఎన్‌యూ గాంధీ. ఆయన లెఫ్టిస్ట్ల భాష మాట్లాడుతున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది. మోదీ మ్యాజిక్ పనిచేస్తుంది తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ పాపులారిటీ అత్యు న్నత స్థాయికి చేరుకుంది. ఒక్క అవినీతి మర కలేదు. పదేళ్ల యూపీఏ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూడగా, తొమ్మిదేళ్ల ఎన్డీఏ ఆధ్వర్యంలోని మోదీ పాలనలో ప్రధాని మోదీ లేదా మంత్రులపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ముఖ్య మైన సానుకూల అంశం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలు, కులం, మతం, వర్గాలకు అతీతంగా ప్రజలకు చేరవేయడంతో ..మోదీని వారు పూర్తి స్థాయిలో విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాజిక్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టంగా పనిచేయబోతోంది. బీజేపీని గెలిపించబోతోంది. బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ప్రభుత్వంపై విశ్వసనీయత అనేది అత్యంత అధమ స్థాయిలో ఉంది. ఓటమిపై భయంతోనే కొన్ని మినహా అన్ని సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే నామినేషన్ల చివరినాటికి ఆ అభ్యర్థుల్లో కనీసం 20 మందిని మార్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే కతను మాకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రజల వద్దకు వెళుతున్నాం. మా వద్ద ఉన్న ఏకైక మార్గం ప్రజలను కలుసుకోవడం, బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు తెలియజేసి వారి మద్దతు సాధించడం. మేం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. మరోవైపు ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. -
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్ లో బీజేపీకి బంపర్ మెజార్టీ
-
ఆత్మకూరులో లక్ష మెజారిటీ కొడతాం: మంత్రి జోగి రమేష్
-
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో భారీ షాక్
ఇస్లామాబాద్: చివరి బంతి దాకా బరిలో ఉంటానన్న ఇమ్రాన్‌ఖాన్ ఆట ఆడకుండానే వెనుదిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కీలక భాగస్వామ్య పక్షమైన ఎమ్‌క్యూఎమ్ బుధవారం సంకీర్ణానికి గుడ్‌బై చెప్పి, ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీలో విపక్షాల బలం 176కు పెరిగింది. అధికార కూటమి బలం 164కు పడిపోయింది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మెజార్టీ కోల్పోయారు. అయితే అవిశ్వాస తీర్మానం విదేశీ శక్తులు సృష్టించిన సంక్షోభమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపించారు. దీనిపై మీడియాకు ఆధారాలు విడుదల చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా, పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సభ్యులకుగాను పీటీఐకి 155 మంది ఉన్నారు. మరో ఆరు పార్టీల నుంచి 23 మంది మద్దతుతో ఇమ్రాన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అవిశ్వాస గండం గట్టెక్కాలంటే 172 మంది మద్దతు కావాలి. కానీ 24 మంది సొంత ఎంపీల తిరుగుబాటుతో పాటు, ఐదుగురు సభ్యులున్న ఎమ్‌క్యూఎమ్ కూడా సంకీర్ణానికి గుడ్‌బై చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ చివరి బంతిదాకా మ్యాచ్‌ను కొనసాగించకుండా రాజీనామా చేస్తారని సమాచారం. చదవండి: (యుద్దం ముగిసిపోలేదు: జెలెన్స్కీ) జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తారా ? అవిశ్వాసం తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారంటున్నానరు. జాతీయ అసెంబ్లీ గడువు ఎటూ ఏడాదిలో ముగియనున్నందున దాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సన్నిహితులు సూచిస్తున్నారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ జరిపిన ర్యాలీ బల ప్రదర్శనేనన్న అభిప్రాయాలున్నాయి. లండన్‌లో కూర్చున్న వ్యక్తి పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చడానికి విదేశీ డబ్బును వాడుతున్నారంటూ విపక్ష నేత నవాజ్ షరీఫ్‌పై ర్యాలీలో ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. ఇదంతా ఎన్నికల ప్రచారం మాదిరిగానే ఉందని, బహుశా ముందస్తుకు ఇమ్రాన్ సై అంటారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ సర్కార్
-
బద్వేల్లో వైఎస్ఆర్సీపీ కి భారీ మెజారిటీ వస్తుంది
-
వైఎస్సార్సీపీకి మండలిలో పూర్తి మెజార్టీ
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో టీడీపీ బలం తగ్గిపోయింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ప్రస్తుతం మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 21 కాగా టీడీపీ బలం 15కి తగ్గింది. శుక్రవారంతో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియగా వారిలో టీడీపీకి చెందిన ఏడుగురు, వైఎస్సార్సీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, పప్పుల చలపతిరావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్ధా నాగజగదీశ్వరరావుల పదవీకాలం ముగిసింది. గత నెల 24వ తేదీన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సైతం పదవీ విరమణ చేశారు. వాకాటి నారాయణరెడ్డి బీజేపీలో చేరడం, చదిపిరాల శివనాథ్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో టీడీపీ బలం 15కి తగ్గిపోయింది. బిల్లులను అడ్డుకోవటమే లక్ష్యంగా... సాధారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మండలిలో ఇటీవల వరకు ఉన్న ఆధిక్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన బిల్లుల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించింది. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు మోకాలడ్డింది. పేద విద్యార్థులకు ఆంగ్ల మాథ్యమంలో విద్యనందించే బిల్లును సైతం కుట్రతో అడ్డుకుంది. సలహాలివ్వాల్సిన పెద్దల సభను రాజకీయ వేదికగా మార్చుకుని అడ్డంకులు సృష్టించింది. అయితే శాసనమండలిలో ఇప్పుడు వైఎస్సార్సీపీ పూర్తి మెజారిటీ సాధించింది. మరింత పెరగనున్న అధికార పార్టీ బలం.. మండలిలో వైఎస్సార్సీపీ తరఫున 18 మంది (గవర్నర్ నామినేట్ చేసిన నలుగురితో కలిపి) సభ్యులున్నారు. కొద్దిరోజుల క్రితం టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్పలత, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీకి దూరంగా ఉన్న శివనాథ్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అధికార పార్టీ బలం 21కి పెరిగింది. ఇవికాకుండా ఎమ్మెల్యేల కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కరోనా కారణంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వాయిదా పడింది. అవి ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీనే గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఆ కోటాలోని 11 ఎమ్మెల్సీలూ అధికార పార్టీకే దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలిలో ఆధిపత్యంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాబోయే రోజుల్లో మరింత బలం పెంచుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్ -
తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తాం
-
తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తాం
అమరావతి: తిరుపతి ఉప ఎన్నికలో కూడా రికార్డ్ సృష్టిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 3 లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ రాబోతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కేసులు క్లియర్ అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎస్ఈసీ వెంటనే జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. అన్ని ఎన్నికలు ఈయన హయాంలోనే పూర్తి కావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేవలం 6 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని, ఈ ఎన్నికలు పూర్తి చేస్తే మేం వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఈనెల 18వ తేదీన జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను నియమిస్తామని, ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. -
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ, టీడీపీ అడ్రస్ లేకుండా పోయాయి. హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్రలొనే అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ట్రక్ సింబల్.. కారు గుర్తును పోలివుండటంతో తాను ఓడిపోయానని సైదిరెడ్డి అప్పట్లో వాపోయారు. ఉప ఎన్నికల ఫలితంతో ఆయన వాదనలో వాస్తముందని తేలింది. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి హైదరాబాద్ కంపెనీ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ మిత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్ డాలర్ల డీల్‌తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. ప్రస్తుతం మిత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెన్యూవబుల్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. పిరమల్ గ్రూప్ రుణం చెల్లింపు.. మిత్రా ఎనర్జీ సంస్థ 2017 సెప్టెంబర్‌లో పిరమల్ గ్రూప్ నుంచి నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ.1,800 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌తో డీల్ ఉపయోగపడుతుందని.. వాస్తవానికి ఈ డీల్ సక్సెస్‌లో రీ పేమెంటే ప్రధానంగా నిలవనుందని తెలిసింది. అయితే ఈ డీల్ గురించి ఇరు వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
పెద్ద జీతగాడిలా పనిచేస్తా
సాక్షి,నాగర్‌కర్నూల్: పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పెద్ద జీతగాడిలా పనిచేసి రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.హౌసింగ్ బోర్డు నుంచి బస్టాండ్ కూడలి వరకు బైక్ ర్యాలీ తీసిన అనంతరం అక్కడే కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజులు కార్యకర్తలు పనిచేస్తే ఐదేళ్లు కందనూలు అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. ఎంపీ నిధుల్లో సింహభాగం నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికే కేటాయిస్తామని, గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానన్నారు. 1996 నుంచి అచ్చంపేట ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేలపై జీవించిన నేను.. ఈ నేల ప్రజలకే సేవ చేసి తనువు చాలిస్తానన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిచి సీఎంకు బహుమతిగా ఇస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌కు సంబంధించిన రైతులు గతంలో హైదరాబాద్‌లో అడ్డా కూలీలుగా ఉన్నారని, కేఎల్ఐ నీటి రాకతో తిరిగి కొన్ని ప్రాంతాలకు చేరుకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేసినందుకే రెండోసారి సీఎం అయ్యారన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కేసీఆర్ ప్రధాని అవుతారన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా వలస వచ్చిన వారేనని, ప్రస్తుతం స్థానికుడికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌యాదవ్, రఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెజారిటీపై మరింత విశ్వాసం
సాక్షి,మహబూబాబాద్: సీఎం సభ సక్సెస్‌తో అభ్యర్థి మెజార్టీ పై మరింత విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్సీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి సత్యవతిరాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.మానుకోటలో జరిగిన సీఎం సభలో మెడికల్ కళాశాలతోపాటు పలు విషయాలపై స్పందించి హామీ ఇచ్చారన్నారు. పోడు భూముల సమస్య కూడా పరిష్కరిస్తామని సీఎం ప్రకటించారని, పోడు రైతులు అర్థం చేసుకుని టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. సమష్టిగా కృషి చేయడంతో సభ సక్సెస్ అయ్యిందని, అలాగే అభ్యర్థి గెలుపు విషయంలోనూ కలిసి పనిచేసి సీఎం చెప్పిన విధంగా 3.50లక్షల మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలన్నారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ టికెట్ రాలేదనే మనోవేదన సీఎం సభ కంటే ముందు ఉండేదని, సభలో సీఎం తనను మచ్చలేని నాయకుడని, కొన్ని సమీకరణల్లో టికెట్ ఇవ్వలేకపోయామని తనపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థి కవిత గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రంలో బలం పెరిగి ఎక్కువ నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎంపీ అభ్యర్థికి మానుకోట నియోజకవర్గం నుంచి 50వేల మెజార్టీ ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ నెహ్రూ, రంగన్న, డోలి లింగుబాబు, యాళ్ల మురళీధర్‌రెడ్డి, నాయిని రంజిత్, ఆదిల్, యాళ్ల పుష్పలత, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం నెరవేరేనా
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమ కేంద్రంగా పేరు తెచ్చుకున్న సిద్దిపేట నియోజకవర్గం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వేదికైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కీలక నేతగా, కష్టాల్లో ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం వెలువడనున్న శాసనభ ఎన్నికల ఫలితాల్లో అరుదైన రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మేన మామ, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి వారసత్వంగా స్వీకరించిన సిద్దిపేట నియోజకవర్గ బాధ్యతలను హరీశ్ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హరీశ్‌రావు గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. కాకపోతే పార్టీ శ్రేణులతోపాటు హరీశ్‌రావు ఆశ పెట్టుకున్న లక్ష మెజారిటీ, డబుల్ హ్యాట్రిక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. అదే జరిగితే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా రికార్డు సృష్టిస్తారు. దాంతోపాటు ఇప్పటి వరకు తాను గెలిచిన ఐదుసార్లూ ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేసిన ఘనత కూడా హరీశ్‌రావుకు దక్కనుంది. దీంతో మంగళవారం వెలువడనున్న ఫలితాలపై హరీశ్ అనుచరులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నాలుగుసార్లు ప్రత్యర్థికి డిపాజిట్ గల్లంతు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2004లో మామ కేసీ ఆర్ రాజీనామాతో ఉప ఎన్నికల్లో పోటీలోకి దిగిన హరీశ్‌రావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉన్నారు. 2004 ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి, మాజీ మం త్రి ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మరో సారి ప్రత్యర్థి బైరి అంజయ్యపై 58,935 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో అంజయ్యకు 17,335 ఓట్లు మాత్రమే రాగా.. డిపాజిట్ కూడా దక్కలేదు. 2009 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 85,843 ఓట్లు రాగా తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి బైరి అం జయ్యకు కేవలం 21,166 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్ 64,677 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రత్యర్థికి డిపాజిట్ దక్కలేదు. 2010 ఉప ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,779 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 12,921 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్ 95,858 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మరోసారి హరీశ్‌రావుకు 93,328 ఓట్ల ఆధిక్యత వచ్చింది. అయితే గడిచిన రెండు ఎన్నికల్లో 90 వేలు మెజారిటీ సాధించిన హరీశ్‌రావు.. ఈసారి ఎలాగైనా తన మెజారిటీని లక్ష దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా కష్టపడ్డారు. దాంతోపాటు పోలింగ్ శాతం పెరిగితేనే మెజారిటీ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించి విస్తృతంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించడం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. -
‘బావ.. నీ మెజారిటీలో సగమైనా తెచ్చుకుంటా’
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న వేళ అపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం తన నియోజకర్గం సిరిసిల్లలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి అక్కడికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సిద్దపేటలోని గుర్రాల గొంది వద్ద కేటీఆర్‌కు హరీశ్ రావు ఎదురయ్యారు. తమ వాహనాల్లో నుంచి దిగివచ్చిన బావ బామ్మర్ధులు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌తో కేటీఆర్ మాట్లాడుతూ..‘బావ కంగ్రాట్స్.. నీకు లక్ష ఓట్ల మెజార్టీ ఖాయం. నీ మెజారిటీలో నేను సగం అన్న తెచ్చుకుంట’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న హరీశ్‌తో పాటు అక్కడున్న వారంత నవ్వులు చిందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన పోలింగ్ జరుగుతుందని ఇరువురు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ తన బావ హరీశ్‌కు బాయ్ చెప్పి సిరిసిల్లకు బయలుదేరి వెళ్లారు. -
20వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నా
సాక్షి, యాదాద్రి : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా 20వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నాను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఈసారి ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మహాకూటమి వాగ్దానాలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది : అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తన పనితీరు ఉంటుంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారని మహాకూటమి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలం బండసోమారంలో ప్రచారం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి : మహాకూటమి తరఫున పోటీలో ఉన్న తన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు వివిధ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గ్రామగ్రామాన ప్రజలు తనకు మద్దతు ప్రకటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కోసం తాను చేసిన కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. రెండు నెలల క్రితం నుంచే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రచారంలో ఈమార్పు క్రమంగా కనిపిస్తోంది. సాక్షి: మీ విజయానికి కలిసొచ్చే అంశాలు ఏమిటి? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ మూడేళ్లు చేశారు. అది వడ్డీలకే సరిపోయింది. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ తెచ్చుకుంది బాగుపడటానికా, ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడానికా అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. సాక్షి: మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారు? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తోంది. ప్రతి పేద కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తుంది. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల మంజూరు చేస్తుంది. హైదరాబాద్ మురికి, కంపెనీల కాలుష్యంతో నిండిన మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన జలాలను అందించడానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తాం. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తాం. సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమి? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: వైద్యం, సాగు, తాగునీరు, ఉపాధి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. వీటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కృషి చేయలేదు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తా. ఇప్పటి వరకు ఉన్న సీఎం నిమ్స్‌కు వంద కోట్లు ఇవ్వడానికి కనికరం లేదు. 5 వేల మందితో నిమ్స్‌కు నిధులు కేటాయించాలని పాదయాత్ర చేశాను. అయినా స్పందన లేదు. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వల ఆధునీకరణ కోసం నిధులు కేటాయించాలని పాదయాత్ర చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బిల్లులో భాగంగానే ఎయిమ్స్ మంజూరైంది. సాక్షి: మహాకూటమి మీతో కలిసి వస్తుందా? కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి: మహాకూటమితో కాంగ్రెస్ పార్టీకి భారీ చేకూరుతుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కలిసికట్టుగా పని చేస్తుంది. ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి నేతను కలిగిన టీడీపీ మాతో కలిసి రావడం లాభిస్తుంది. రావి నారాయణరెడ్డి మహానేతను కలిగిన సీపీఐతోపాటు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వాన గల టీజేఎస్ మాకు అండగా ఉంది. మహాకూటమి సహకారంతో 20వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నాను. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. -
నా గెలుపు.. చరిత్రలో నిలిచిపోవాలి
సాక్షి, నిడమనూరు (నాగార్జునసాగర్): నాగార్జునసాగర్‌లో తన గెలుపు ఉమ్మడి ఏపీలో చరిత్రగా నిలిచిపోవాలని, ఆవిధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం పదో సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మొదటి సారి అనుభవం లేక, రెండోసారి ప్రయోగానికి పోతే ప్రజలు అర్థం చేసుకోలేక ఓడించారన్నారు. మిగతా అన్ని దఫాలు అఖండ మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగేలా చేశారన్నారు. ఇప్పటికే 7సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి గెలిపిస్తే 8సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన చరిత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కడారి అంజయ్య(టీడీపీ), పొదిల్ల శ్రీనివాస్(సీపీఐ), కంచి శ్రీనివాస్(టీజేఎస్), కాంగ్రెస్ నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, యడవెల్లి రంగగశాయిరెడ్డి, చేకూరి హన్మంతరావు, అంకతి సత్యం, మర్ల చంద్రారెడ్డి, శంకర్‌నాయక్, ఉన్నం శోభ, ఉన్నం చినవీరయ్య, వెంకటయ్య, పిల్లి రాజు, పగిల్ల శివ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం సీట్ల పంపిణీ: మిర్యాలగూడ : రాష్ట్రంలో ప్రజలకు సామాజిక న్యాయం అందించడానికి మహాకూటమిలో సీట్లు పంపిణీ చేసినట్లు కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పాటు బీసీ సంఘాలు కూడా ఉన్నాయన్నారు. అందరు కలిసి ఆర్.కృష్ణయ్యను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య, దైద సంజీవరెడ్డి, కందిమళ్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి
సాక్షి,తిప్పర్తి(నల్లగొండ) : బంగారు తెలంగాణ అంటూ మోసం చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని మజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి, రాయినిగూడెం, జొన్నగడ్డలగూడెం రాజుపేట, గంగన్నపాలెం, కాశివారిగూడెం, చిన్నాయిగూడెం, జంగారెడ్డిగూడెం, రామలింగాలగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎవరు ఆపదలో ఉన్నా అదుకున్నానని తెలిపారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ది తప్ప నాలుగున్నర ఎళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నాలుగు సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఐదోసారి భారీ మెజార్టీతో గెలించాలని, తెలంగాణ రాష్ట్రం మొత్తం కోమటిరెడ్డి మెజార్టీపై ఎదురు చూస్తుందన్నారు. అందరికోసం కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగుపడిందన్నారు. వేయ్యి కోట్లతో పూర్తయ్యే శ్రీశైల సొరంగమార్గాన్ని పూర్తి చేయకుండా లక్ష కోట్లతో కాళేశ్వరం కడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలింపించా లని, అధికారంలోకి వచ్చిన వారంలో రోజుల్లోనే రైతులకు 2లక్షల రుణ మాఫీ, ప్రతి ఇంట్లో 58ఎళ్లు ఉన్న దంపతులకు 2 చొప్పున పింఛన్, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాల కల్పన, మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణా లు అందించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని తప్పకుం డా ఈ హమీలను అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్ తనను ఓడించేందుకు ఆయన బంధువును ఇక్కడ పార్టీ ఇన్చార్జ్గా నియమించారని విమర్శించారు. కేసీఆర్‌కు కోమటిరెడ్డి అంటే భయం అని అన్నారు. ఇంటింటికీ తాగు నీరందిస్తానని లేకుం టే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాతో పాటు రాష్ట్రం వ్యా ప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యకరమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వంగాల స్వామిగౌడ్, హఫీజ్ ఖాన్, నాయకులు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, జూకూరి రమేష్, కిన్నెర అంజి, దొంగరి ప్రకాశ్, కమ్మంపాటి కృష్ణ, చింతపల్లి పద్మ శౌరి, వెంకట్రాంరెడ్డి, ప్రసాద్, అబ్దుల్ రహీం, లతీఫ్, ఇస్మాయిల్, అంజయ్య, రామకృష్ణ, మహ్మద్ పాల్గొన్నారు. -
రూ. 1600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
సాక్షి,అర్వపల్లి: గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హయాంలో నాలుగేళ్లలో రూ. 1600 కోట్లతో జరిగిందని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్ చెప్పారు. తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ గెలుపు కోసం గురువారం సీతారాంపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిశోర్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల అర్వపల్లి, రాసాల సైదులు, బందెల వెంకన్న, చిత్రాల వీరయ్య, బందెల శశికాంత్, కుర్రె రమేశ్, ఎ. భద్రయ్య, బైరబోయిన రామలింగయ్య, పెద్దయ్య, కె. శ్రీకాంత్, జి. రామ్మూర్తి, ఎస్. వెంకన్న, ఎ. వెంకన్న, కె. భిక్షం, ఎ. సంతు, ఎ. ప్రవీణ్, పి. శ్రీను, ఎ. లింగయ్య, వీరమల్లు, ఎ. సంతు, దావుల లింగయ్య, కె. నాగరాజు, పి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం తుంగతుర్తి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూసపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిశోర్కుమాదే అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటనారాయణ, జలేందర్, రాములు, సంతోష్, భిక్షం, వెంకన్న, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గెలిపిస్తే రైతులకు సాగునీరు అందిస్తాం
సాక్షి,భువనగిరి అర్బన్ : బీఎల్ఎఫ్ పార్టీని గెలుపిస్తే రైతులకు సాగునీరు అందిస్తామని బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి మల్లేషం అన్నారు. గురువారం బీఎల్ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తుక్కాపురం, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి, నందనం, నమాత్‌పల్లి, బొల్లేపల్లి, అనాజిపురం గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని అధిక మెజార్టీతో గెలుపించాలన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రధానంగా బీటీ రోడ్డు లేని గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్థానికంగా వివిధ పరిశ్రమాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఆవకాశాలు కల్చించేలా కృషిచేస్తామన్నారు. ఆడపిల్లల చదువుకోసం చదువుల సావిత్రి పథకం, 2 లక్షల ఉద్యోగాల భర్తి, నిరుద్యోగబృతిని వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. బీఎల్ఎఫ్ పార్టీని ప్రజలు అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ్మ, జంగయ్యయాదవ్, అంజిరెడ్డి, వెంకటేష్, దానయ్య, గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్,మల్లేషం, వైకుంఠం, అయిలయ్య, ఇస్తారి, యాదయ్య, పాక జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
దినకరన్‌కు పచ్చ జెండా
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్లో దినకరన్ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు. భారీ ఆధిక్యంతో విజయ కేత నం ఎగురవేసిన దినకరన్‌కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్‌కు ఊరట లభించింది. -
కన్నడనాట హంగే: సర్వే
బెంగళూరు: కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని మరో సర్వే స్పష్టం చేసింది. పూర్తిస్థాయి డిజిటల్ సాంకేతికతతో ఎన్జీ మైండ్‌ఫ్రేమ్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 95–105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. బీజేపీకి 75–85 సీట్లు, జేడీఎస్‌కు 35–41 సీట్లు వచ్చే చాన్సుందని వెల్లడైంది. ఇతరులకు 4–8 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. 224 నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 25 మందితో శాంపుల్స్ సేకరించి సర్వే చేశారు. ఇందులో 65% మంది ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని పేర్కొనగా మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్‌లకే మరోసారి పట్టంగట్టే అవకాశం స్పష్టమైంది. ఎవరి నాయకత్వంలో కర్ణాటక అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ప్రశ్నకు.. 41%మంది సిద్దరామయ్యకు, 33% మంది యడ్యూరప్పకు, 23% మంది కుమారస్వామికి ఓటేశారు. ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని సర్వేలో వెల్లడైంది. జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారనుందని సర్వే తెలిపింది. -
‘హిందువుల వల్లే.. ప్రజాస్వామ్యం పదిలం’
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా మాటల తూటాలు పేల్చారు. ‘భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల.. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంది’ అని అన్నారు. దేశంలో మెజారిటీ వర్గం సంఖ్య తగ్గితే.. సామాజిక అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆయన చెప్పారు. మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గితే.. జాతీయతావాదం కూడా మరుగున పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సురక్షితంగా ఉందని, హిందువులు ఇంకా ఇక్కడ మెజారిటీ జనాభాగా ఉండడమే ఇందుకు కారణం అని గిరిరాజ్ స్పష్టం చేశారు. దేశంలో ఎప్పుడైతే మెజారిటీ ప్రజల సంఖ్య తగ్గుముఖం పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సామాజిక సామరస్యం ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. దేశంలో సుమారు 54 జిల్లాల్లో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇదీ మరీ ఎక్కువగా ఉంది. ముస్లింలు మెజారిటీ వర్గంగా అవతరిస్తే దేశసమగ్రత, ఐకమత్యానికి భంగం కలిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
సంతోషం కొంతే!
ఎమ్మెల్సీ గెలుపుపై టీడీపీ నేతల్లో కనిపించని ఆనందం – మెజార్టీ తగ్గడంతో ఎక్కడో గుబులు – భారీగా డబ్బులు వెదజల్లి.. సీఎం రంగంలోకి దిగినా దిగదుడుపే – అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని శిల్పా హెచ్చరికలు – చర్యలు తప్పవని ఘాటు వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎక్కడో అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఎమ్మెల్సీగా అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించినా ఆ సంతోషం పెద్దగా కనిపించని పరిస్థితి. మెజార్టీ భారీగా తగ్గడంతో ఎక్కడో గుబులు కనిపించింది. అడుగడుగునా ఇది గెలుపు కాదని.. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా తమ పరిస్థితి తయారైందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన గెలుపునకు కొందరు పనిచేయలేదని.. వారి జాబితాను ఇప్పటికే తయారు చేశామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల విజేత శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ఇలాంటి నేతలపై చర్యలు తప్పవని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తన గెలుపుపై తనకే పెద్దగా సంతృప్తి లేదన్నారు. తమ పార్టీలోకి 5గురు విపక్ష ఎమ్మెల్యేలు చేరిన తర్వాత కూడా మెజార్టీ తగ్గడాన్ని నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. అనంతరం అధిష్టానానికి ఫిర్యాదు చేసి.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన అధికార పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. చావుతప్పి.. తమ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఈ ప్రభాకర్‌తో పాటు కేఈ ప్రతాప్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. నైతికంగా గెలుపు తమదేనన్న గౌరు వ్యాఖ్యలను మరికొద్ది మంది టీడీపీ నేతలు కూడా సపోర్టు చేయడం గమనార్హం. పార్టీలోకి ఏకంగా 5గురు ఎమ్మెల్యేలు వచ్చినా వైసీపీకి ప్రజాబలం తగ్గకపోగా పెరగడం బట్టి చూస్తే తాము పునారోలించుకోవాల్సిందేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమయ్యింది. అయితే, ఎంత ఖర్చు చేసినప్పటికీ.. మెజార్టీ తగ్గిన నేపథ్యంలో సహకరించని వారిపై ఫిర్యాదు చేస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటనపై ఆ పార్టీలో చర్చ రేపుతోంది. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు భారీగా డబ్బులు వెదజల్లినా.. చివరి రెండు రోజుల్లో నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా తమ పరిస్థితి ఇంతేనా అని వాపోతున్నారు. ఆ ఎమ్మెల్యేలు వచ్చినా..! వాస్తవానికి రెండేళ్లక్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డికి 147 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే, ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుందని.. కనీసంలో కనీసం 200 వరకూ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకున్నారు. ఇదే అంశాన్ని తమ నివేదికలో అధిష్టానానికి వెల్లడించారు. అయితే, ఇందుకు భిన్నంగా మెజార్టీ భారీగా తగ్గడంతో ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. తమ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు బాగానే చేశారని శిల్పా ప్రకటించారు. తద్వారా పరోక్షంగా పార్టీ మారిన నేతలు సహకరించలేదని తన అభిప్రాయాన్ని ఆయన గెలిచిన వెంటనే వెలిబుచ్చారు. అంతేకాకుండా ఎవరెవరు సహకరించలేదో తమకు తెలుసునని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆయన అనుమానిస్తున్నారని.. వారు తమ పార్టీలోకి వచ్చినప్పటికీ పెద్దగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పార్టీ మారిన నేతలకు– అప్పటికే ఉన్న ఇన్‌చార్జీలకు మధ్య మరోసారి విభేదాలు పొడచూపే అవకాశం కనిపిస్తోంది. కొసమెరుపు: శిల్పా వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారిన నేతలెవ్వరూ కౌంటింగ్ వద్ద కనపడకపోవడం గమనార్హం. -
ఫలించని పన్నీర్ సెల్వం తిరుగుబాటు
-
మెజార్టీ కోసమే ప్రచారం
కొండపాక: వెలికట్ట ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దివంగత ఎంపీటీసీ బూర్గుల యాదంరావు భార్య మల్లవ్వ గెలుపు పార్టీ బి- ఫారం తీసుకున్నప్పుడే ఖాయమైందని, భారీ మెజార్టీ కోసమే ప్రచారం నిర్వహిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య పేర్కొన్నారు. ఉపఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం వెలికట్ట , జప్తినాచారం, ఆరెపల్లి, రవీంద్రనగర్, రాజంపల్లిలో మండల టీఆర్ఎస్ నాయకులు మల్లవ్వ తరుపున ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో వారు మాట్లాడుతూ గతంలో వెలికట్ట ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన యాదంరావు అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరారన్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైందన్న విషయాన్ని ఓటర్లు గుర్తిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలికట్టకు మంజూరు చేసినన్ని నిధులు మండలంలో ఏ గ్రామానికి మంజూరు చేయలేదన్నారు. అకార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే వెలికట్ట ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలు మరింత అభివృద్ధిచెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గొడుగు యాదగిరి, కనకారెడ్డి, యాదయ్య, పసుల సరిత, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బైరెడ్డి రాదాకిషన్‌రెడ్డి, నాయకులు అనంతుల నరేందర్, బాల్‌చందర్‌గౌడ్ , అంజి, జైన్ ఆంజనేయులు, అమరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, పెరుగు ఆంజనేయులు, కొండు రవి, మీస రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
21లో అత్యధికం.. 46లో అత్యల్పం
పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బరిలో మొత్తం 398 మంది అభ్యర్థు లు నిలిచారు. వీరిలో ఎక్కువ మంది విజయం సాధించాల న్న తపనతో ఇంటింటికీ తిరి గి ఓటర్లను ఆకట్టుకునేం దుకు యత్నించారు. అయితే, ఎవరు ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని ఎత్తులు వేసి నా విజయం సాధించింది 58 మందే. అయితే, గెలిచిన వారిలో కొందరు తమకు పోటీనే లేదంటూ ప్రతీ రౌండ్లో ఆధికత్య ప్రదర్శించగా.. మరికొందరు మాత్రం అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించారు. ఆ వివరాలు... అతి తక్కువ మెజార్టీతో 46వ డివిజన్ నుంచి విజయం సాధించిన సిరంగి సునీల్‌కుమార్, 35వ డివిజన్ నుంచి గెలిచిన బస్కె శ్రీలత ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులే కావడం.. వీరిద్దరు గెలిచింది టీఆర్ఎస్ అభ్యర్థుల పైనే కావడం విశేషం. ఇక 38 డివిజన్ నుంచి తక్కువ ఓట్లతో బయటపడిన టీఆర్ఎస్ కె.మాధవి తర్వాత బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు 329 46వ డివిజన్ నుంచి 27ఓట్లు హన్మకొండ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ముని సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మొత్తం 329 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల య్యాయి. ఇందులో అత్యధికంగా 46వ డివి జన్ నుంచి 27 ఓట్లు నమోదు కావడం విశే షం. ఇక 38వ డివిజన్ నుంచి 23ఓట్లు పో స్టల్ ఓట్లు వచ్చాయి. -
కడియం రికార్డు బద్దలయింది
వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గత రికార్డు బద్దలయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఓట్లతో మెజార్టీ దిశగా దూసుకు వెళుతున్నారు. గతంలో ఇక్కడ రికార్డు ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరిట ఉండేది. దయాకర్ సాధించిన ఈ రికార్డు గతంలో 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సాధించిన మెజార్టీ కన్నా కూడా అధికమే. ప్రస్తుతానికి టీఆర్ఎస్-5,39,096, కాంగ్రెస్-1,53,896, బీజేపీ - 1,28,452, వైఎస్ఆర్ సీపీకి-20,666 ఓట్లు లభించాయి. 2014లో ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. కాగా, నేటి ఉప ఎన్నికల ఫలితాల్లోని ప్రతి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 62 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు పార్టీ హవా ఇలాగే కొనసాగితే మెజారిటీ 5 లక్షలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. -
కడియం రికార్డు బద్ధలయింది
-
అంతా మోదమే
దారిద్య్ర నిర్మూలనపైనే దృష్టి సగానికి తగ్గిన ద్రవ్యోల్బణం నీతి ఆయోగ్ ఆవిర్భావం స్వచ్ఛ భారత్ మహాయజ్ఞం ముద్రా బ్యాంకు ఏర్పాటు జన్‌ధన్ యోజనకు శ్రీకారం స్మార్ట్ నగరాలకు పచ్చజెండా పెరిగిన విద్యుదుత్పాదన ఇనుమడించిన దేశ ప్రతిష్ట రోడ్ల నిర్మాణం వేగవంతం దేశంలో ఉన్న 60 శాతం పేదరికాన్ని, 30 శాతానికి తగ్గించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. మిగిలిన సగాన్ని నిర్మూలించడానికి మరో డెబ్బయ్ సంవత్సరాలు కావాలా? ఇది మోదీ వేసుకున్న చరిత్రాత్మకమైన ప్రశ్న. ఆరెస్సెస్ పేరు వింటేనే చాలా వర్గాల నుంచి విమర్శల నిప్పులు కురు స్తాయి. అలాంటి సంస్థలో ఆయన పూర్తిస్థాయి కార్యకర్త. భారత ముస్లింలు సరే, అసలు ఉపఖండ ముస్లింల ఆలోచనలలో మార్పునకు మార్గంవేసినదిగా పేర్గాంచిన అయోధ్య రథికులలో ఆయన ఒకరు. ప్రపంచస్థాయిలో హక్కుల పరిరక్షణ సంస్థల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్న గోధ్రా రైలు దగ్ధం ఘటన ఆయన పాలనలోనే చోటు చేసుకుంది. ఆయన నరేంద్రభాయ్ దామో దర్ మోదీ. అయినా ఆయన భారత ప్రధాని కావడం దేశ రాజకీయాలలో పెను మలుపు. ప్రపంచానికి ఆయన విజయం ఓ అద్భుతమన్నా అతిశయోక్తి కాదు. మోదీ ఈ సంవత్సరానికిగాను సీఎన్ఎన్-ఐబీఎన్ ఎంపిక చేసిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కావచ్చు. కానీ ఆయనను విమర్శించడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని మీడియా ఇక్కడే ఉంది. కాబట్టి ఆయన ఏడాది పాలనపై మదింపునకు అవకాశం వచ్చినపుడు విమర్శలు వెల్లువెత్త కుండా ఉంటే, అది వింతల్లో వింత. ఎవరి మీదనైనా విమర్శలనూ, ఆరోపణ లనూ కప్పిపుచ్చనక్కరలేదు. అది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమే. అలాగే మూడు దశాబ్దాల తరువాత ప్రజల నుంచి పూర్తి మెజారిటీ సాధించిన దేశాధినేత సాధించినదేమైనా ఉంటే, దానిని గుర్తించడానికే నిరాకరించడం అంతకుమించిన ప్రజాస్వామ్యద్రోహం. దేశాభివృద్ధి అంటే ప్రధానమంత్రి ఇంటి కార్యమన్నట్టూ, ఇంకా చెప్పాలంటే వందలమంది అధికారుల, విమ ర్శలకు అతీతులైన ఇతర నేతల సమష్టి కృషి అన్న వాస్తవాన్ని విస్మరించేటట్టూ వ్యవహరించడం కూడా అప్రజాస్వామికమే. ఏ పార్టీ, ఏ నేత సాధించినప్ప టికీ అభివృద్ధి అనేది ప్రజాధనంతో, రాజ్యాంగ పరిధిలో జరిగిన యజ్ఞం. ఆ దృష్టితో నరేంద్ర మోదీ ఏడాది పాలనలో దేశం సాధించిన పురోగతిని అవలో కించాలి. మంచి ఉంటే చెప్పాలి. అభ్యంతరాలు వెల్లడించాలి. ఈ దారిలో ► పన్నెండు మాసాలలో ప్రధాని మోదీ 18 దేశాలలో పర్యటించారు. దీనితో ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు పటిష్టమైనాయని పార్టీ, నిపుణులు ప్రకటించారు. ► సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికే నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం చెప్పింది. బొగ్గు వేలం ద్వారా లభించే ఆదాయం రాష్ట్రాలకు వెళ్లాలని ఆశిస్తోంది. అదే సమయంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కూడా ఆమోదించింది. దీనితో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతుంది. ► దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఇక గతం. నల్లధనం వెలికితీతకు భవి ష్యత్తులో మరిన్ని చట్టాలు రూపొందించాలని ఎన్డీఏ-2 భావిస్తోంది. ► సుపరిపాలన మీద దృష్టి. వ్యవసాయంలో ముఖ్యంగా, నీటి పారుదల రంగం మీద; గ్రామీణ మౌలిక వసతుల కల్పన రంగంలోను ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించాలని మోదీ ఆలోచన. పాలనా రంగం మీద కొత్త దృష్టి ‘కాంగ్రెస్ ముక్తి భారత్’ వంటి నినాదంతో, పూర్తి ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో ఎన్నికల రణం చేసి అధికారంలోకి వచ్చారు మోదీ. ఇప్పుడు రాజ్య మేలుతున్న రాజకీయ సంస్కృతి పూర్తిగా మారాలన్న దృక్పథం దేశవాసులలో పుష్కలంగా ఉన్న కాలంలో ఈ పరిణామం జరిగింది. ఢిల్లీలో ఆప్ రాజకీ యాలూ, వాటికి లభించిన స్పందన ఇందుకు అద్దం పట్టాయి. అవినీతి, బంధుప్రీతి, జవాబుదారీతనం లోపించడం, పేదరికాన్ని రాజకీయానికి పెట్టు బడిగా మార్చుకునే నీచత్వం, కుహనా లౌకికవాదంతో జరుగుతున్న దగా, జాతీయ సమగ్రతనూ, భద్రతనూ గాలికి వదిలేసే నిర్లక్ష్యం దేశాన్ని అతలా కుతలం చేస్తున్న కాలంలో ప్రజలు మోదీకి ఓటు వేశారు. బీజేపీ సంగ తేమో కానీ, దేశ ప్రజలు మోదీలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని చూశారు. వివాదా స్పదుడే అయినా, అవినీతి మచ్చ లేకపోవడం మోదీకి కలసివచ్చిన అంశం. కాంగ్రెస్‌లో అనేకమంది వివాదాస్పదులు. మచ్చలేనివారు మిగల లేదు. అందుకే మోదీ మేలని అనిపించారు. పైగా జీరో రాజకీయ అవినీతి మీద పట్టుదల ఉన్నవాడు. ఇంతవరకు అది రుజువు చేసుకున్నారు కూడా. 21వ శతాబ్దం గురించి పదే పదే చెప్పినా, దేశానికి అలాంటి రూపును ఇవ్వడంలో రాజీవ్‌గాంధీ దారుణంగా విఫలమయ్యారు. నిజానికి అలాంటి రూపు కొంత వరకు పీవీ నరసింహారావు ద్వారా సాధ్యమైంది. కానీ కాంగ్రెస్ అవినీతి ఆయన విజయాలను, ఫలితాలను అచిరకాలంలోనే కాలగర్భంలోకి నెట్టి వేసింది. కాబట్టే మోదీలో కొత్త ‘రాజకీయ ముఖాన్ని’ దేశ ప్రజలు చూశారు. తొలినాటి ప్రధానులూ, ప్రణాళికా నేతలూ, రాష్ట్రపతులూ ప్రవేశ పెట్టిన పథ కాలను, పంథాలను ఏళ్ల తరబడి అరమోడ్పు కళ్లతో భక్తిగా కొనసాగించడం కాదు, కాలపరీక్షకు నిలబడని వ్యవస్థలను సగౌరవంగా తప్పించేందుకు మోదీ చేసిన సాహసమే మేధావులను ఆయన వైపు మొగ్గేటట్టు చేసింది. ► పన్నెండు మాసాల మోదీ పాలనలో ద్రవ్యోల్బణం సగానికి తగ్గింది. వృద్ధిరేటు ఏడు శాతానికి పురోగమిస్తున్నది. ► 17,830 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి, 22,566 మెగావాట్లను సాధించారు. ► కాంగ్రెస్ నత్తనడక పాలన పుణ్యాన ఇటీవల వరకు రోడ్డు నిర్మాణం రోజుకు రెండు కిలోమీటర్లకు పరిమితం కాగా, ఇప్పుడు అది పది కిలో మీటర్లకు పుంజుకుంది. ► మోదీ పార్లమెంటులో ఇచ్చిన తొలి ఉపన్యాసంలో పేర్కొన్న దారిద్య్ర నిర్మూలనకు ఆయన కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యలతో భావించవచ్చు. స్వాతంత్య్రం తెచ్చుకున్న నాటికి దేశంలో ఉన్న 60 శాతం పేదరికాన్ని, 30 శాతానికి తగ్గించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. మిగిలిన సగాన్ని నిర్మూలించడానికి మరో డెబ్బయ్ సంవత్సరాలు కావాలా? ఇది మోదీ వేసుకున్న చరిత్రాత్మకమైన ప్రశ్న. వాస్తవానికి ఈ ప్రశ్నకే భవిష్యత్తు సరైన సమాధానం కోరుతోంది. ఇది సాధిస్తేనే మోదీ విజయం నిజంగా చరిత్రా త్మకం అవుతుంది. ► జన్‌ధన్ యోజన ద్వారా 15 కోట్లకు పైగా ప్రజలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చారు. పింఛన్ తదితర సౌకర్యాలు కల్పిస్తూ పది కోట్ల రూపే కార్డులను మోదీ ప్రభుత్వం ఇచ్చింది. ► రూ. 20,000 కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంకు ఏర్పాటయింది. రూ. 50,000 మొదలు పది లక్షల పెట్టుబడులతో వ్యాపారాలు చేయదలచిన వారికి ఈ బ్యాంకు రుణాలు ఇస్తుంది. 5.7 కోట్ల మంది చిన్న వ్యాపారు లకు సాయం అందించడమే దీని లక్ష్యం. అటల్ పెన్షన్ ఆయోజన వంటి సామాజిక భద్రత పథకాల ఏర్పాటు. ► స్వచ్ఛభారత్ మిషన్ కింద 2019 నాటి దేశంలో సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడానికి కార్పొరేట్ రంగం హామీ ఇచ్చింది. ► వంట గ్యాస్ పంపిణీని డెరైక్ట్ క్యాష్ బెనిఫిట్ పథకం కిందకు తెచ్చారు. దీనితో సంవత్సరానికి ఐదు బిలియన్ డాలర్ల మేర రాయితీలు తగ్గాయి. ► రక్షణ, బీమా, రైల్వే మౌలిక వ్యవస్థలోకి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డులకు అవకాశం కల్పించడం మేలేనని నిపుణుల అంచనా. హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టడంతో సహా ఐదేళ్ల కాలంలో రైల్వేల మీద 130 బిలి యన్ డాలర్లు ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ► వంద స్మార్ట్ నగరాల నిర్మాణానికి మంత్రి మం డలి ఆమోదించింది. ► కొత్త చట్టాలను ఆమోదింపచేయడం ద్వారా గనుల రంగంలో ఏర్పడిన ప్రతిష్టంభనను నిరోధించింది. బొగ్గుగనుల, మొబైల్ టెలిఫోనీకి చెందిన టెలికం స్పెక్ట్రమ్ వేలాలను మోదీ సర్కారు దిగ్విజయంగా పూర్తి చేసింది. ► ఉక్కు, బొగ్గు, విద్యుత్ రంగాల పథకాలకు అనుమతుల కోసం ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మంత్రుల బృందాల విధానాన్ని మోదీ రద్దు చేశారు. ► వ్యవసాయ సాధనాల ధరల స్థిరీకరణకూ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికీ నిధి. సవాళ్లూ ఎక్కువే మోదీ అధిగమించవలసిన సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఎన్డీఏ-1లో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను నిర్వహించిన అరుణ్‌శౌరి ఇటీవలనే మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలే చేశారు. ఈ ప్రభుత్వానికి దిశానిర్దేశం ఏదీ లేదని ఆయన ఆరోపణ. అలాగే బీజేపీ సిద్ధాంతకర్త గోవిం దాచార్య యూపీఏకూ, ఎన్డీఏకూ భేదం లేదని విమర్శించారు. ఇక అత్యంత దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్న అంశం- భూసేకరణ బిల్లు. రాజ్యసభలో బలం లేని మోదీ సర్కారు ఈ బిల్లును ఎలా ఆమోదింప చేస్తుందో, ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఇందుకు బీజేపీ అనుబంధ రైతు సంఘం కిసాన్ మోర్చా కూడా వ్యతిరేకమే మరి. కల్హణ -
బీజేపీకి కాదు ఆప్కే మొగ్గు!
34 నుంచి 37 స్థానాలు ఆప్‌కు వస్తాయని సర్వేల అంచనా సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరవుతున్న కొద్దీ ప్రధాన పార్టీల విజయావకాశాలు అనూహ్యంగా తారుమారు అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు నిర్వహించిన సర్వేల్లో బీజేపీది పైచేయి కాగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గాలి వీస్తున్నట్లు సర్వేల్లో తేలింది. హస్తిన ఓటర్లు ఆప్‌కు స్వల్ప మెజారిటీతో పట్టం కట్టనున్నట్లు ప్రధాన సర్వేల ఫలితాలపై చేసిన రెండు సగటు ఫలితాల సర్వేల్లో వెల్లడైంది. హిందుస్థాన్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్, ఏబీపీ న్యూస్‌ల సర్వేల ఫలితాల ఆధారంగా ఎన్డీటీవీ వేసిన సగటు అంచనా సర్వే ప్రకారం.. అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 37 సీట్ల సాధించి అధికారంలోకి వచ్చే అవకాశముంది. బీజేపీకి 29, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కొచ్చు. అలాగే.. ఏబీపీ నీల్సన్, సీ-ఓటర్, ఈటీ-టీఎన్ఎస్, హెచ్‌టీ, ద వీక్ సర్వేల ఫలితాలపై ‘టైమ్స్ నౌ’ వేసిన సగటు ఫలితాల అంచనాల్లో ఆప్‌కు 34, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 2 సీట్లు రావొచ్చని తెలిసింది. మరోపక్క.. ఇండియా టుడే-సిసిరో తాజా సర్వేలో ఆప్ ఏకంగా 38 నుంచి 46 సాధించనున్నట్లు తేలింది. బీజే పీకి 19 నుంచి 25, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 స్థానాలు దక్కొచ్చు. పాత సర్వేలు బీజేపీకి 38 నుంచి 37, ఆప్‌కు 28 నుంచి 29 సీట్లు రావొచ్చని అంచనా వేయడం తెలిసిందే. పోటీ ప్రధానంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతున్నా...కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలటంపైనే వాటి గెలుపోటములు ఉన్నాయని తాజా సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంపైనే ఆప్ విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని భావిస్తున్న 4 నుంచి 8 స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేయగలిగితే దాని విజయం ఖాయమని ఎకనమిక్ సర్వే అంచనా. గెలవడానికి కావాల్సిన ఆ కీలక స్థానాల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్‌ను మరోమారు నిలుపుకుంటే తమ విజయానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నది బీజేపీ అంచనా. -
సిద్దిపేటలో టీఆర్ఎస్ కు తగ్గిన ఓట్లు
మెదక్: మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సిద్ధిపేట నియోజకవర్గంలో ఓట్లు తగ్గాయి. సిద్దిపేట సెగ్మెంట్ లో టీఆర్ఎస్ కు 86,300 ఓట్ల మెజార్టీ లభించింది. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు 6 వేలు ఆధిక్యం తగ్గింది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీకి 97 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. సిద్దిపేట సెగ్మెంట్లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కు మూడో స్థానం దక్కింది. మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేడు
- ఇంకా ఎటూ తేల్చుకోలే కపోతున్న ‘దేశం’ - అధిష్టానం నుంచి రానున్న సీల్డ్ కవర్ ! - పేరాబత్తుల రాజశేఖర్ వైపే పార్టీ మొగ్గు - బీసీలకే దక్కనున్న ఉపాధ్యక్ష పదవి సాక్షి ప్రతినిధి, కాకినాడ : స్పష్టమైన మెజారిటీ సాధించినా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరో తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాత్రి వరకు తేల్చుకోలేకపోయింది. కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక జరగనుంది. జిల్లాలో 57 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా 43 చోట్ల టీడీపీ, 14 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించాయి. పూర్తిస్థాయి మెజారిటీ దక్కినా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. జెడ్పీ పీఠాన్ని సంప్రదాయం ప్రకారం కాపు సామాజికవర్గానికే కట్టబెట్టాలని తొలుత నిర్ణయించి, అభ్యర్థిని ఆ సామాజికవర్గం నుంచే ఎంపిక చేయాలనుకున్నారు. తొలుత పి.గన్నవరం జెడ్పీటీసీ అభ్యర్థి నామన రాంబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల వ్యయం మూడు కోట్ల వరకు నామన భరించేలా ముఖ్యనేతలు ఒప్పందం కుదిర్చారని పార్టీలో చర్చ నడిచింది. అయితే నామన పేరు తెరపైకి వచ్చేసరికే ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వైపు పార్టీలో మెజారిటీ నేతలు మొగ్గు చూపారు. రాజశేఖర్ కూడాఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎంత ఖర్చు పెట్టమంటే అంత ఒకేసారి పార్టీ నాయకత్వం చేతిలో పెట్టేందుకు ముందుకు వచ్చారు. దీంతో చైర్మన్ అభ్యర్థి ఎంపిక టీడీపీ నాయకులకు సవాల్‌గా మారింది. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కాకినాడలో రెండు దఫాలు సమావేశమైనా తేల్చలేక చేతులెత్తేశారు. అంతా చంద్రబాబు వ్యూహమే! ఈ పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ కూడా చైర్మన్ గిరీని ఆశించారు. చివరిగా బుధవారం కాకినాడలో జరిగిన సమావేశంలోనూ సైతం ఎటూ తేల్చుకోలేని జిల్లా నాయకులు నిర్ణయాన్ని అధినేత చంద్రబాబుకు విడిచి పెట్టారు. జిల్లా నేతల సమావేశాలు, నిర్ణయాన్ని అధిష్టానానికి విడిచి పెట్టడం బాబు వ్యూహంలో భాగమేననే వాదన పార్టీలో వినిపిస్తోంది. యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెజార్టీ నేతలు రాజశేఖర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఒకరిద్దరు పాతతరం నాయకులు మాత్రం నామన కోసం పట్టుబడుతున్నారని చెబుతున్నారు. యువకుడు, వివాదరహితుడు, చెప్పిన మాట వింటాడనే ముందుచూపుతో అధిష్టానం కూడా రాజశేఖర్ వైపే మొగ్గుచూపిస్తోందని తెలుస్తోంది. కాగా వైస్ చైర్మన్ పదవి కోసం ఇటీవల జరిగిన జిల్లా ముఖ్యనేతల భేటీ సందర్భంగా రంగంపేట, సామర్లకోట జెడ్పీటీసీ సభ్యులు పెండ్యాల నళీనికాంత్, గుమ్మళ్ల విజయలక్ష్మి వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ పదవిని బీసీలకు కట్టబెట్టాలని పార్టీ భావిస్తుండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీలు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలతో పాటు రాష్ర్ట స్థాయిలో తమకున్న పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. శనివారం ఉదయం పార్టీ దూతగా ఎంపీ గరికిపాటి మోహనరావును పంపుతారని ప్రచారం జరిగినా ఆయన స్థానంలో మరో నేత షీల్డ్ కవర్‌తో వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక జరిగేదిలా... తొలుత జెడ్పీలో ఇద్దరు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12 గంటల వరకు పరిశీలన జరుగుతుంది. మధాహ్నం ఒంటి గంట వరకు ఉపసంహరణకు గడువు. తరువాత ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం జెడ్పీటీసీలతో ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రమాణం చేయిస్తారు. మధ్యాహ్నం 3గంటల తరువాత చైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావచ్చు. అయితే ఓటు హక్కు ఉండదు. -
అయ్యయ్యో..
పాపం.. డిపాజిట్లూ దక్కలేదు! హనుమంతు.. ధరావత్తు గల్లంతు అదే వరుసలో ‘సర్వే’.. ఇంకా జేపీ, జయసుధ, కూన, ప్రొ.నాగేశ్వర్‌లకు కూడా.. ముద్దం, శ్రీధర్లకూ భంగపాటే.. సాక్షి, సిటీబ్యూరో: గెలుపు ఖాయమనుకున్నారు. ఏయే ప్రాంతాల్లో, ఏయే వర్గాల నుంచి ఎన్నెన్ని ఓట్లు పడతాయో అంచనాలు వేశారు. మెజారిటీ ఎంతన్నది లెక్కలు కట్టారు. కానీ, ఓటర్ల ‘లెక్క’ వేరే ఉంది. గుక్కతిప్పుకోలేని విధంగా తీర్పునిచ్చారు. బిత్తరపోవడం అభ్యర్థుల వంతైంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు డిపాజిట్ కోల్పోయారు. గెలుపు ధీమాతో బరిలో దిగిన పలువురికి గెలుపు సంగతలా ఉంచితే, కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాంటి వారిలో ఏకంగా సీఎం స్థానం కోసం, కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఆశపడిన వారూ ఉన్నారు. రెండుసార్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, గత మంత్రివర్గంలో మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలుగా చేసిన వారూ.. ఈ జాబితాలో ఉన్నారు. సీఎం అవుతారన్నారు! పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్ల కన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోయినట్టు. అలా డిపాజిట్లు కోల్పోయిన గ్రేటర్ ప్రముఖుల్లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా వీహెచ్ రేసులో ఉంటారని ప్రచారం జరిగింది. పైగా ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై పోటీకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రాజ్యసభ పదవీకాలం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశతో వీహెచ్ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 1,46,682 కాగా డిపాజిట్ దక్కాలంటే 24,447 ఓట్లు పొందాలి. వీహెచ్‌కు 16,975 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన డిపాజిట్ గల్లంతైంది. అయ్యో.. పాపం! శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోలైన ఓట్లు 2,82,823. వీటిలో కనీసం 47,137 ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్టు. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన బిక్షపతి యాదవ్ (కాంగ్రెస్)కు 43,196 ఓట్లు మాత్రమే వచ్చాయి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ ప్రముఖురాలు జయసుధకు సైతం డిపాజిట్ దక్కలేదు. అక్కడ 1,36,549 ఓట్లు పోలవగా, జయసుధకు 14,090 ఓట్లు లభించాయి. ఇవి ఆరో వంతు కూడా లేకపోవడంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్)కు 40,199 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక్కడ డిపాజిట్ దక్కాలంటే 48,711 ఓట్లు రావాల్సి ఉంది జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఎదగాలని ఆశపడ్డప్పటికీ, డిపాజిట్లు కూడా దక్కించుకోని వారిలో ముద్దం నరసింహయాదవ్, నందికంటి శ్రీధర్ ఉన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్ కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 23,321 ఓట్లు మాత్రమే రావడంతో ఆయనకు డిపాజిట్ దక్కలేదు. ఆ నియోజకవర్గంలో పోలైన 2,36,367 ఓట్లలో డిపాజిట్ రావాలంటే 39,394 ఓట్లు రావాలి జీహెచ్ఎంసీ కో-ఆప్షన్ సభ్యుడైన నందికంటి శ్రీధర్ మల్కాజిగిరి కా్రంగెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ 2,31,103 ఓట్లు పోలవగా, ఆయనకు 37,201 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ డిపాజిట్ దక్కాలంటే 38,517 ఓట్లు రావాల్సి ఉంది. లోక్‌సభ బరిలో డిపాజిట్ దక్కని ప్రముఖులు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో హాట్ స్పాట్‌గా మారింది. పలువురు హేమాహేమీలు ఇక్కడి నుంచి బరిలో దిగారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 16,05,550 ఓట్లు పోలవగా, డిపాజిట్ దక్కాలంటే అభ్యర్థి 2,67,591 ఓట్లు పొందాలి. ఈ మొత్తం ఓట్లు రాక డిపాజిట్లు కోల్పోయిన ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్నారాాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి భీమ్సేన్ (టీఆర్ఎస్)కు సైతం డిపాజిట్ గల్లంతైంది. అక్కడ మొత్తం 9,86,590 ఓట్లు పోలవగా, ఆయనకు 1,43, 847 ఓట్లు మాత్రమే లభించాయి. -
మిథున్ అఖండ విజయం
పుంగనూరు, న్యూస్‌లైన్ : ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి, సాయిప్రతాప్ త మ శక్తియుక్తులు దారపోసి మిథున్‌రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చతురత ముందు ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. యువనేత మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి 1,05,772 ఓట్లు లభించాయి. పురందేశ్వరికి 60,674 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు 4,927 ఓట్లు మాత్రమే పోలయ్యూరుు. పుంగనూరులో మిథున్‌రెడ్డికి 46,009 ఓట్ల మెజారిటీ లభించింది. నిత్యం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చుచేస్తున్న తండ్రీతనయులను ప్రజలు ఆదరించారు. విశేష అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లోని మొత్తం శాసనసభ నియోజకవర్గాల్లో అందరికన్నా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల నుంచి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్‌కుమార్‌రెడ్డిపై ఏకంగా 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు. సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇదే! ఆ తరువాత మెజారిటీని విశాఖపట్నం జిల్లాలోని విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సాధించారు. ఆయనకు 47,883 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తరువాత స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. ఆయన తన సమీప వైఎస్సార్సీపీ ప్రత్యర్థి చంద్ర మౌళిపై 47,121 ఓట్ల మెజారిటీని సాధించారు. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీచేసిన వర్మ 47,080 ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
ఎంపీగా ‘కడియం’దే రికార్డు మెజార్టీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థులు సాధించిన మెజార్టీ ఓట్ల విషయంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి బద్దలు కొట్టారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కడియం శ్రీహరి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య పై 3,92,137 ఓట్లు మెజారిటీ సాధించారు. జిల్లాలో గతంలో ఉన్న హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2008 ఉపఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అప్పటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బి.వినోద్‌కుమార్(టీఆర్ఎస్) 2.17 లక్షల మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు జిల్లాలో మెజార్టీపరంగా ఇదే రికార్డుగా ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అత్యంత ఎక్కువ మెజార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ పార్లమెంట్ నుంచి సాధించారు. ఆ మెజార్టీ 3,92,7029 కాగా తెలంగాణలో ప్రస్తు తం ఇదే రికార్డు మెజార్టీ కాగా తర్వాత స్థానంలో కడియం ఉన్నారు. అంటే తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులో కడియంది రెండో స్థానం. జిల్లాలో పార్లమెంట్‌కు తక్కువ మెజార్టీ విషయానికి వస్తే 1962లో బీఏ.మీర్జా సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి ఎస్.రామనాథంపై కేవలం 736 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. -
ఉద్యమవీరునికే పట్టం
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన టీఆర్ఎస్ తన సత్తా చాటింది. క్షణం క్షణం టెన్షన్...టెన్షన్‌గా సాగిన గజ్వేల్ అసెంబ్లీ లెక్కింపులో చివరకు ఉద్యమవీరున్నే విజయం వరించింది. గజ్వేల్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో ప్రారంభం కాగా, తెలంగాణలోనే కాదు...దేశ, విదేశాల్లోని తెలంగాణవాదులంతా ఫలితం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూశారు. మధ్యాహ్నానికే లెక్కింపు పూర్తయి కేసీఆర్‌ను విజేతగా ప్రకటించడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. 21 రౌండ్లుగా చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఐదు మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ తన ఆధిక్యాన్ని చాటారు. ఈ నియోజకర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోగల 262 బూత్‌లలో మొత్తం 1,99,062 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కేసీఆర్ 86,372 ఓట్లను దక్కించుకుని సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19,218 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే కేసీఆర్ విజయం నల్లేరుమీద నడకే అయినా, టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కేసీఆర్‌కు గట్టిపోటీనే ఇచ్చారు. ఈ ఎన్నికలో ప్రతాప్‌రెడ్డికి మొత్తం 67,154 ఓట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ తరఫున ఇక్కడ బరిలో దిగినమాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి కేవలం 33,998 ఓట్లే సాధించారు. ప్రాదేశిక ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్, టీడీపీలతో పోలిస్తే అత్యధిక ఓట్లను సాధించిన నర్సారెడ్డి, ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం చతికిలపడ్డారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో మొత్తం పదిమంది ‘బరి’లో నిలవగా, ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. -
ఫ్యాన్‌కు జేకొట్టిన జనం
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ సీపీదే హవా కుప్పంలో చంద్రబాబును కంగుతినిపించిన ఓటర్లు టీడీపీలో నిరాశ, నిస్పృహలు విజయోత్సాహంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. కుప్పంలో ఈసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మెజారిటీ కూడా భారీగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి నుం చీ చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకత్వం ఉండటం, జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చగలరనే నమ్మకం జనాల్లో ఉండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తిరుగులేని వారుగా నిలిచారు. జనానికి అండగా ఉంటామని, వైఎస్ఆర్ ఆశయాలతో ముందుకు వచ్చిన జగన్‌ను గెలిపించుకుందామని అభ్యర్థులు పిలుపునిచ్చారు. వారిని గెలిపించేందుకు కంకణం కట్టుకున్న ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుగులేని శక్తిగా ఫ్యాన్ జిల్లాలో ఫ్యాన్ గుర్తు తిరుగులేని శక్తిగా నిలిచింది. మహిళలు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఇతర కులాలకు చెందిన వారి ఓట్లు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి వేశారు. టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకోవడాన్ని ముస్లిం మైనారిటీలు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని వారు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే విషయాన్ని చెబుతూ వారు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొదటి నుంచీ టీడీపీలో గ్లోబెల్ ప్రచారం చేసే కొందరు పోలింగ్ సరళిని చూసి కంగుతిన్నారు. టీడీపీకి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు యత్నించారు. అయితే వారి యత్నాలు ఫలించలేదు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ సఫలమైంది. పైగా జగన్ గ్రాఫ్ పడిపోతోందని, జనం ఆయనను తిరస్కరిస్తున్నారనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. ఇదంతా గ్లోబెల్ ప్రచారమేనని ఓటర్లు నిరూపించారు. కంగుతిన్న టీడీపీ అభ్యర్థులు ‘నిరంతరం కష్టపడి తిరిగాం... అయినా ఫలితం దక్కలేదు. చంద్రబాబును ఎవరూ నమ్మలేదు. నమ్ముతారని భావించాం. ఇన్నేళ్లలో ఏ ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో చంద్రబాబు అమలు చేసిన దాఖలాలు లేవు. పైగా సంక్షేమ పథకాలంటేనే ఆయనకు చిరాకు, సంక్షేమం లేకుండా అభివృద్ధి చేస్తానంటే పేదరికంలో ఉన్న వారిని అభివృద్ధి పథంవైపు ఎలా తీసుకెళతారనేది పలువురి వాదన. అందుకే టీడీపీ వారికి ఓట్లు వేసినా వేస్ట్ అవుతాయని భావించారు. చంద్రబాబు మాటలు నమ్మి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టాం. పార్టీ ఫండ్, చంద్రబాబు జేబుల్లోకి కోట్లాది రూపాయలు ఇచ్చామనే బాధలో ఇంటికే పరిమితమవుతున్నారు. ఏదో వ్యాపారం చేసుకొని పోగొట్టుకున్న డబ్బును సంపాదించే కార్యక్రమంలో నిమగ్నం కావాల’నే ఆలోచనకు టీడీపీ వారు వచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు... కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచే అవకాశం ఉంది. అయితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని ఓటింగ్ సరళిని బట్టి చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 46వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి అందులో సగం కూడా వచ్చే పరిస్థితిలేదని పరిశీల కులు చెబుతున్నారు. చంద్రబాబుకు తిరుగులేని శక్తిగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో క్రాస్ ఓటిం గ్ జరిగిందని కొందరు ఓటర్లే అంటున్నారు. ‘మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉంది. అయితే స్థానికంగా తాము ఉండాలంటే టీడీపీ వారినుంచి నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనా లి. అందుకే మనసు చంపుకొని సైకిల్‌కు కొందరం ఓటు వేశాం. అదే విధంగా పార్లమెంటుకు వైఎస్ఆర్సీపీకే ఓటు వేశామ’ని చెప్పారు. -
మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటు: కేసీఆర్
సిద్దిపేట, స్పష్టమైన మెజార్టీ వస్తే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఉదయం 10.30 గంటలకు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏర్పడేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పోలింగ్ శాతం పెంపునకు ఎన్నికల కమిషన్ చేపట్టిన చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ ప్రజలను, చిన్ననాటి స్నేహితులను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. -
ఢిల్లీలో త్రిశంకు సభ
-
హస్తం హవా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు పెట్టని కోటల్లా ఉన్న బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ రెండు స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరుగగా, శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆది నుంచీ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను సాధిస్తూనే వచ్చారు. బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామిని 1,37,000 ఓట్ల తేడాతో ఓడించారు. సురేశ్‌కు 5,78,596 ఓట్లు, అనితా కుమారస్వామికి 4,41,600 ఓట్లు లభించాయి. మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి రమ్య చేతిలో జేడీఎస్ అభ్యర్థి సీఎస్. పుట్టరాజు 67,611 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రమ్యకు 4,84,085 ఓట్లు, పుట్టరాజుకు 4,16,474 ఓట్లు లభించాయి. జేడీఎస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి ఎన్. చలువరాయస్వామిల రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగాయి. వారిద్దరూ గత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. సిద్ధుకు మరింత బలం ఈ ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పార్టీలో మరింత బలవంతుడిని చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావించాయి. సిద్ధరామయ్య వంద రోజుల పాలనపై కూడా ఈ ఫలితాలను తీర్పుగా అభివర్ణించాయి. దీంతో ఆయన అభ్యర్థుల ఎంపిక సమయం నుంచే జాగ్రత్త పడ్డారు. పార్టీలో అందరినీ ఏకతాటిపై నడిపించారు. మంత్రి పదవి రాకపోవడంతో అలిగి కూర్చున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్‌ను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఆయన తమ్ముడినే పార్టీ అభ్యర్థిగా అధిష్టానం చేత ఖరారు చేయించారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబీకులకు శివకుమార్ రాజకీయంగా ఆగర్భ శత్రువు. ఆయన మద్దతు లేనిదే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమని భావించిన ముఖ్యమంత్రి గెలుపు భారాన్ని ఆయనపైనే మోపారు. ఇక మండ్యలో సుమారు 60 శాతం మంది దాకా దేవెగౌడ సామాజిక వర్గమైన ఒక్కలిగులు ఉన్నారు. లోక్‌సభ నియోజక వర్గంలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదింటిలో జేడీఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్‌కు ప్రచార బాధ్యతలను అప్పగించారు. అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణతో అంబరీశ్‌కు విభేదాలున్నాయి. కృష్ణకు ఆమోదయోగ్యంగా ఉంటుందని రమ్యను అభ్యర్థిగా ఖరారు చేయించారు. దీంతో ఇద్దరూ ఇష్టం లేకపోయినా పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఒకే వేదిక ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అన్నిటికీ మించి అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు తోడు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకపై గట్టి అంచనాలను పెట్టుకుని ఉంది. ఈ సత్యాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి విజయం కోసం చక్కటి వ్యూహాన్ని రూపొందించి, పకడ్బందీగా అమలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే కావస్తున్నందున, జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రయోజనమేమిటనే ఓటరు తర్కం కూడా అంతిమంగా అధికార పార్టీ అభ్యర్థుల మెడలో విజయ మాల పడేలా చేసింది. వ్రతం చెడ్డా.... ఉప ఎన్నికల్లో విజయం కోసం లౌకిక వాదాన్ని కాసేపు పక్కన పెట్టి బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా జేడీఎస్ విజయం సాధించలేక పోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని రామనగర, చన్నపట్టణ అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. జేడీఎస్‌ను ఆది నుంచీ వారు ఆదరిస్తూనే వస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి డీకే. సురేశ్‌కు లభించిన భారీ మెజారిటీ ఈ మర్మాన్ని చెప్పకనే చెబుతోంది. ‘మీరు గత ఎన్నికల్లో కుమారస్వామిని గెలిపిస్తే ఒక నాడైనా లోక్‌సభకు వెళ్లారా. ఆయనే వెళ్లనప్పుడు ఆయన సతీమణి వెళతారని ఊహించగలమా? జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబ పెత్తనం ఎక్కువ అని అంటే ఆ పార్టీ నాయకులకు మా చెడ్డ కోపం వస్తుంది. అనితా కుమారస్వామి మినహా వేరే అభ్యర్థి ఆ పార్టీలో లేరా. కుమారస్వామి అధికార దాహం వల్ల కేవలం స్వల్ప కాలానికి ఈ ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రచారం ఓటర్లలో తారక మంత్రంలా పని చేసింది. రెంటికీ చెడ్డ రేవడి మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మండ్యలో ఆ పార్టీకి పెద్దగా ఉనికి లేనప్పటికీ, బెంగళూరు గ్రామీణలో పట్టుంది. ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు లక్షలు దాకా ఓట్లు పోలయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమ్మడిగా ఎదుర్కొన్నా కాంగ్రెస్‌ను ఓడించలేక పోయిందని అపహాస్యానికి గురైంది.