
సిద్దిపేటలో టీఆర్ఎస్ కు తగ్గిన ఓట్లు
మెదక్: మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సిద్ధిపేట నియోజకవర్గంలో ఓట్లు తగ్గాయి. సిద్దిపేట సెగ్మెంట్ లో టీఆర్ఎస్ కు 86,300 ఓట్ల మెజార్టీ లభించింది. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు 6 వేలు ఆధిక్యం తగ్గింది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీకి 97 వేల ఓట్ల ఆధిక్యం లభించింది.
సిద్దిపేట సెగ్మెంట్‌లో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కు మూడో స్థానం దక్కింది. మంత్రి తన్నీరు హరీష్రావు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.