
ఓటు అభ్యర్థిస్తున్న కల్లూరి మల్లేషం
సాక్షి,భువనగిరి అర్బన్ : బీఎల్‌ఎఫ్ పార్టీని గెలుపిస్తే రైతులకు సాగునీరు అందిస్తామని బీఎల్‌ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి మల్లేషం అన్నారు. గురువారం బీఎల్‌ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తుక్కాపురం, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి, నందనం, నమాత్‌పల్లి, బొల్లేపల్లి, అనాజిపురం గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని అధిక మెజార్టీతో గెలుపించాలన్నారు. బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రధానంగా బీటీ రోడ్డు లేని గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్థానికంగా వివిధ పరిశ్రమాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఆవకాశాలు కల్చించేలా కృషిచేస్తామన్నారు. ఆడపిల్లల చదువుకోసం చదువుల సావిత్రి పథకం, 2 లక్షల ఉద్యోగాల భర్తి, నిరుద్యోగబృతిని వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. బీఎల్‌ఎఫ్ పార్టీని ప్రజలు అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ్మ, జంగయ్యయాదవ్, అంజిరెడ్డి, వెంకటేష్, దానయ్య, గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్,మల్లేషం, వైకుంఠం, అయిలయ్య, ఇస్తారి, యాదయ్య, పాక జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment