పుణె:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(అజిత్‌పవార్) చీఫ్ అజిత్‌పవార్ భారీ విజయం నమోదు చేసుకున్నారు. శనివారం(నవంబర్23) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ ఏకంగా లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఈ ఎన్నికలో ఆయన లక్షా81వేల ఓట్లు సాధించారు. అజిత్ పవార్ తన సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యోగేంద్రపైనే గెలుపొందారు.
యోగేంద్ర ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పార్టీని విజయతీరాల వైపు నడిపించడంతో పాటు అజిత్‌పవార్ స్వయంగా ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం సాధించారు. కాగా, ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అజిత్‌పవార్ సతీమణి సునేత్ర పవార్ ఎంపీగా పోటీచేశారు. ఇక్కడ ఈమె శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment