BT road construction
-
పల్లెల్లో ప్రయాణం.. ప్రయాసే!
సాక్షి, చిన్నచింతకుంట: ప్రభుత్వాలు, పాలకులు మారిన పల్లెల స్థితిగతులు మారడంలేదు. ఒక గ్రామం అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఆ గ్రామానికి రోడ్డుసౌకర్యం బాగుండాలి. ఈ మేరకు అన్నిగ్రామాలకు రోడ్డు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని గ్రామాలను మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు. మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంధ్యాల గ్రామం కొన్ని ఏళ్లుగా మట్టి, గుంతలు తేలిన రోడ్డే వీరికిగతి. బీటీరోడ్డు లేక గ్రామప్రజలు మండల కేంద్రానికి రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో రోడ్డంతా బురదమయంగా మారి వాహనదారులకు ఎన్నో అవస్థలకు గురిచేస్తుంది. కంకరతేలిన రోడ్డుతో అవస్థలు ఏళ్లుగడుస్తున్నా.. ఉంధ్యాల బీటీరోడ్డుకు నోచుకోవడం లేదు. గుంతలుపడి కంకరతేలిన రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో గ్రామానికి బస్సులు, ఆటోలు రాలేకపోతున్నాయి. గ్రామప్రజలు ఏ చిన్నపని ఉన్నా.. మండల కేంద్రానికి రావాల్సిందే. అయితే ద్విచక్రవాహనాలు తప్పా.. ఏ వాహనాలు గ్రామం నుంచి మండల కేంద్రానికి రాకపోవడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతం. నెలనెలా చికిత్సలు చేయించుకునేందుకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలోనే అవస్థల మధ్య కంకరతేలిన బీటీరోడ్డుపై తిరుగుతున్నారు. ఒకవేళ పురిటినొప్పులు వచ్చాయంటే.. అంబులెన్స్ సైతం రోడ్డు బాగోలేదంటూ ఊర్లోకి రావడం లేదు. ఆటోలో తరలిస్తుంటే కంకర రోడ్డుపై మార్గమధ్యంలోనే ప్రసవాలు అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలోనే నిల్చిన పనులు ఇదిలా ఉండగా మద్దూర్ నుంచి ఉంధ్యాల వరకు రెండు కిలోమీటర్ల బీటీరోడ్డు వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. మిగతా 6 కిలోమీటర్లు అలాగే వదిలేశారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పడి వాహనదారులకు పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు వాపోతున్నారు. ఎందరో గాయపడ్డారు మండల కేంద్రం నుంచి గ్రామానికి రావాలంటే గుంతలు, కంకరతేలిన రోడ్డేగతి. ఇప్పుడు వర్షాకాలంలో బురదగా మారి గుంతలుపడి రాత్రివేళల్లో గుంతల రోడ్డుపై వాహనాలను నడుపుతూ కిందపడి గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైన పాలకులు, ఆర్అండ్బీ అధికారులు తక్షణమే స్పందించి బీటీగా మార్చాలి. – ఆర్.రమేష్, ఉంద్యాల అధికారులు స్పందించాలి అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రోడ్ల విస్తరణ చేపట్టారు. బీటీరోడ్డు, సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యే అధికారులు స్పందించాలి. మా గ్రామం నుంచి మండల కేంద్రం వరకు బీటీరోడ్డు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.రాములు, ఉంద్యాల -
గెలిపిస్తే రైతులకు సాగునీరు అందిస్తాం
సాక్షి,భువనగిరి అర్బన్ : బీఎల్ఎఫ్ పార్టీని గెలుపిస్తే రైతులకు సాగునీరు అందిస్తామని బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్లూరి మల్లేషం అన్నారు. గురువారం బీఎల్ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తుక్కాపురం, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి, నందనం, నమాత్‌పల్లి, బొల్లేపల్లి, అనాజిపురం గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వారిని అధిక మెజార్టీతో గెలుపించాలన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రధానంగా బీటీ రోడ్డు లేని గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. స్థానికంగా వివిధ పరిశ్రమాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఆవకాశాలు కల్చించేలా కృషిచేస్తామన్నారు. ఆడపిల్లల చదువుకోసం చదువుల సావిత్రి పథకం, 2 లక్షల ఉద్యోగాల భర్తి, నిరుద్యోగబృతిని వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. బీఎల్ఎఫ్ పార్టీని ప్రజలు అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ్మ, జంగయ్యయాదవ్, అంజిరెడ్డి, వెంకటేష్, దానయ్య, గునుగుంట్ల శ్రీనివాస్‌గౌడ్,మల్లేషం, వైకుంఠం, అయిలయ్య, ఇస్తారి, యాదయ్య, పాక జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
► టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గంభీరావుపేట: గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభు్వం కృషి చేస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. మల్లుపల్లిలో రూ. 13లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువా రం భూమి పూజ చేశారు. అదే విధంగా రూ. 4 కోట్లతో కొత్తపల్లి, ము చ్చర్ల గ్రామాల మధ్య చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల సమగ్రాభివృద్ధికి మంత్రి కేటీఆర్ చొరువతో నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, సెస్ డైరెక్టర్ దేవేందర్‌యాదవ్, సర్పంచ్‌లు పద్మ, నాగరాజుగౌడ్, మల్లేశం, ఉప సర్పంచ్ శేఖర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంపూర్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దయాకర్‌రావు, మాజీ అధ్యక్షులు రాజారాం, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, పీఆర్ డీఈ చంద్రశేఖర్, ఏఈ సాయిలు పాల్గొన్నారు.