ఎంపీగా ‘కడియం’దే రికార్డు మెజార్టీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థులు సాధించిన మెజార్టీ ఓట్ల విషయంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి బద్దలు కొట్టారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కడియం శ్రీహరి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య పై 3,92,137 ఓట్లు మెజారిటీ సాధించారు.
జిల్లాలో గతంలో ఉన్న హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2008 ఉపఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి అప్పటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బి.వినోద్‌కుమార్(టీఆర్‌ఎస్) 2.17 లక్షల మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు జిల్లాలో మెజార్టీపరంగా ఇదే రికార్డుగా ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అత్యంత ఎక్కువ మెజార్టీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ పార్లమెంట్ నుంచి సాధించారు.
ఆ మెజార్టీ 3,92,7029 కాగా తెలంగాణలో ప్రస్తు తం ఇదే రికార్డు మెజార్టీ కాగా తర్వాత స్థానంలో కడియం ఉన్నారు. అంటే తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులో కడియంది రెండో స్థానం. జిల్లాలో పార్లమెంట్‌కు తక్కువ మెజార్టీ విషయానికి వస్తే 1962లో బీఏ.మీర్జా సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి ఎస్.రామనాథంపై కేవలం 736 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.