Parliament constituency
-
పటేల్ రమేష్‌రెడ్డికి హామీ ఇచ్చినా.. కుందూరు రఘువీర్‌రెడ్డికే టికెట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేసింది. కుందూరు రఘువీర్‌రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో నల్లగొండ అభ్యర్థి పేరును కూడా వెల్లడించింది. భువనగిరి ఎంపీ సీటు విషయాన్ని పెండింగ్‌లో పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిత్వాల విషయంలో నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జానారెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పించుకున్నారు. జయవీర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత జానారెడ్డి లేదా రఘువీర్రెడ్డిలలో ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం సాగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ కోసం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీపడ్డారు. అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో రమేష్‌రెడ్డి అలకబూనగా ఎంపీ టికెట్ ఇస్తామని మల్లు రవితోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా అప్పుడు హామీ ఇచ్చారు. అయితే, పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఇస్తారని భావించినా ఆ తరువాత జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి పేర్లే తెరపైకి వచ్చాయి. వీరితో పాటు పలువురు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డికి జానారెడ్డి, అయన కుమారులతో మంచి సంబంధాలు ఉండటంతో అధిష్టానం రఘువీర్‌రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేసింది. జానారెడ్డి తాను అనుకున్నట్లుగా పెద్ద కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఇప్పించుకోవడం ద్వారా తన ఇరువురు కుమారులకు రాజకీయంగా బాటలు వేసినట్లయింది. పెండింగ్‌లో భువనగిరి అభ్యర్థి పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. దానిని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. కోమటిరెడ్డి సోదరులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేశారు. కోమటిరెడ్డి సూర్యపవన్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి పోటీచేస్తారన్న చర్చ సాగింది. ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు టీపీసీసీ నాయకుడు పున్నా కై లాష్ నేత, చెవిటి వెంకన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజేపీ అక్కడ బీసీ అభ్యర్థి, గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఆలోచనల్లో పడ్డాయి. అక్కడ బీసీ అభ్యర్థిని పోటీలో నిలుపాలా.. ఓసీ అభ్యర్థిని నిలపాలా అన్న ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది. పేరు: కుందూరు రఘువీర్ రెడ్డి తండ్రి: కుందూరు జానారెడ్డి వయస్సు: 44 (02–01–1980) విద్యార్హత: డిగ్రీ, వృత్తి: వ్యాపారం భార్య పేరు: లక్ష్మి పిల్లలు: ఈశాన్వి, గౌతమ్‌రెడ్డి పార్టీ పదవులు : 2009లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యుడు 2014, 2018లో పీసీసీ సభ్యుడు 2021లో పీసీసీ జనరల్ సెక్రటరీ -
బీజేపీ లిస్ట్‌లో ‘నో’ ప్లేస్.. సోయం బాపురావు సంచలన కామెంట్స్
సాక్షి, ఆదిలాబాద్: తనకు లోక్‌సభ స్థానం నుంచి టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ హైకమాండ్ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్ గురించి హైకమాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో బాపురావు ఆదివారం మీడియాతో మాట్లాడూతూ.. నాకు టికట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారు. నేను ఎక్కడో గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉంది. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలి. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నారు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. జడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది. రెండో లిస్ట్‌లో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ల నియామకం
-
నల్లగొండకు దేశవ్యాప్త గుర్తింపు
సాక్షి, నల్ల గొండ : పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక సహా 2014 వరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో ద్విసభా నియోజకవర్గాలుగా ఉంది. నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడెం, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీబీ రావుపై గెలిచారు. ఆ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి ఏకంగా 2,72,280 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే రావికి ఎక్కువ ఓట్లు రావడంతో పార్లమెంట్ భవనంలోకి తొలి అడుగు పెట్టే (ప్రారంభోత్సవం) అవకాశం రావి నారాయణరెడ్డికి దక్కింది. తొలి ఎన్నికల్లో రావి పీడీఎఫ్ నుంచి పోటీ చేసి గెలిచారు. సాయుధ పోరాటాన్ని నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)పై నిషేధం ఉండడంతో సాయుధపోరాట యోధులంతా తొలి ఎన్నికల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య వేదిక (ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ /పీడీఎఫ్) తరపున పోటీ చేశారు. దేశంలో తొలి ఎన్నికల్లో 489 పార్లమెంట్ స్థానాల్లో ఆ రకంగా నల్లగొండకు గుర్తింపు లభించింది. రావి నారాయణరెడ్డి తిరిగి 1962లో జరిగిన మూడో ఎన్నికల్లో నల్లగొండ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేవీపీ రావుపై 33,396 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా 1960లో నల్లగొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ నుంచి వి.కాశీరాం ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్దయ్యపై విజయం సాధించారు. అతిరథ నాయకులు గెలిచిన నియోజకవర్గం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దేశ వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న నాయకులే పోటీ చేసి గెలిచారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డితో పాటు దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం కూడా ఈ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టిన వారే. 1957 ఎన్నికల్లో నల్లగొండ ద్విసభకు దేవులపల్లి వెంకటేశ్వరావు పీడీఎఫ్ నుంచి పోటీపడి కాంగ్రెస్ అభ్యర్థి జీఎస్‌రెడ్డిపై 53,214 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి ఈ నియోజకవకర్గం నుంచి 1998, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే ఈ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు గెలిచి రికార్డు సాధించారు. మొదట ఆయన టీడీపీ నుంచి 1999 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆది నుంచీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యనే పోరు సాగింది. టీడీపీ కేవలం రెండు సార్లు గెలవగా, బీజేపీ అసలు బోణీ చేయలేదు. 1971 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ఒక సారి ఇక్కడి నుంచి గెలిచింది. మొత్తంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల చరిత్ర అంతా ఆసక్తికరంగానే ఉంది. -
మెదక్‌లో...మోదం కాస్త ఖేదం
మహామహులను పార్లమెంట్‌కు పంపించిన చరిత్ర మెదక్ లోక్‌సభ స్థానానికి ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన 17 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వారు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినా.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే వాదన కొన్ని ప్రాంతాల్లో ఉంది. మరికొన్ని చోట్ల కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరిగిందని ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని హామీ ఇవ్వడంతోపాటు, పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ప్రజలకు చెబితే తప్ప ఓట్లు రాబట్టుకోలేరని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితులపై సాక్షి ‘స్కానింగ్’ ... సిద్దిపేట... అభివృద్ధికి చిరునామా... నియోజకవర్గాల పునర్ విభజనకు ముందు సిద్దిపేట నియోజకవర్గం గజ్వేల్, దొమ్మాట, కంటోన్మెంట్‌ను కలుపుకొని స్వతంత్ర నియోజకవర్గంగా బాసిల్లింది. అయితే ఇక్కడి నుండి గెలిచిన వెంకటస్వామి ఇతరులు కేంద్ర మంత్రిగా కొనసాగినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గాంలో అభివృద్ధి పరవళ్లు తొక్కింది. వాటిలో కొన్ని ఇలా... సిద్దిపేట పట్టణంలో ఇటీవల పాస్‌పోర్ట్ రీజనల్ కేంద్రం ప్రజలకు సేవలందిస్తోంది. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైన్. జిల్లాలో 87 కిలోమీటర్ల పొడువున కొనసాగుతున్న మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే మార్గానికి మార్గం సుగమం. వేగవంతంగా సర్వే పనులు, భూసేకరణ, గజ్వేల్ నుండి సిద్దిపేట వరకు లైన్ పనులు కొనసాగడం, సిద్దిపేట నియోజకవర్గంలోని పొన్నాల నుంచి జక్కాపూర్ వరకు 29 కిలోమీటర్ల పొడువునా రైల్వేలైన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గాన్ని కలుపుతూ రెండు జాతీయ రహదారుల మంజూరు ప్రక్రియతో రాష్ట్ర రాజధాని నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు మార్గం సుగమనం అయ్యింది. సిద్దిపేట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం నిధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొనసాగుతోంది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పథకం మహత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సద్వినియోగం చేసుకొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి ప్రతిష్టాత్మకమైన కేంద్రియ విద్యాలయం మంజూరు, తరగతుల కోనసాగింపు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన బీడీ కార్మికులకు గృహవసతి కింద పట్టణంలో వెయ్యి మంది లబ్ధిదారుల గుర్తింపు, చేనేత కార్మికులకు సంక్షేమ పథకాల అమలు. అయితే ఈ పథకాలు అన్ని సక్రమంగా ముందుకు సాగాలంటే కేంద్రలో ఈ ప్రాంతం గురించి మాట్లాడే నాయకుడు కావాలి అనేది ఇక్కడి ప్రజల మనోభావం. ఇటీవల జరిగిన ఎన్నికలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మాజీ మంత్రి హరీశ్‌రావు గెలుపొండం గమనార్హం. సిద్దిపేట: పురుషులు 1,08,155 మహిళలు 1,09,961 ఇతరులు 12 మొత్తం ఓటర్లు 2,17,831 పటాన్చెరు... కాలుష్యమే అసలు సమస్య కాలుష్యం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పటాన్చెరు. పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు వదులుతున్న వాయు, జల కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా కాలుష్యమయంగా మారాయి. భూగర్భం నుంచి పసుపు రంగులో నీరు బయటకు వస్తుందంటే కాలుష్యం సమస్య ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కాలుష్యంపై గ్రీన్ పీస్ సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్లు: పారిశ్రామిక వాడలు కావటంతో సరైన జాతీయ రోడ్లు లేవు. ప్రస్తుతం ఉన్న రోడ్లు గుంతలుగా మారడంతో జాతీయ స్థాయిలో వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడి రోడ్లను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు: పారిశ్రామిక వాడలు కావటంతో చిన్నారులకు సరైన పోషక ఆహారం అందటం లేదు. సరిపడా అంగన్వాడీ కేంద్రాలు లేకపోవటంతో చిన్నారులు ప్రాథమిక విద్యకు, పోషక ఆహారానికి దూరవుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. రైలు మార్గం: దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు పటాన్చెరు నియోజకవర్గంలో నివాసం ఉంటారు. పటాన్‌చెరుతో పాటు బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి లాంటి పారిశ్రామిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. పటాన్‌చెరుకు రైలు మార్గం లేదు. దీంతో పారిశ్రామికంగా సరుకుల రవాణ కష్టమవుతుంది. పారిశ్రామిక వేత్తలు, పనిచేసే కార్మికులకు కూడా రైలు మార్గం లేదు. ఎంఎంటీఎస్ లాంటి మామూలు రైలు మార్గం కూడా లేకపోవటంతో ఇక్కడి ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పటాన్చెరు పురుషులు 1,54,879 మహిళలు 1,44,536 ఇతరులు 13 మొత్తం ఓటర్లు 2,99,428 గజ్వేల్.. జిగేల్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ ఇక ఏకపక్షమేనని భావిస్తున్నారు. ఈ సెగ్మెంట్లో కీలక వ్యక్తిగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమనే ధీమాలో టీఆర్ఎస్ ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. సీఎం దిశానిర్దేశం మేరకు నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపతిరెడ్డి నేతృత్వంలో నాయకులంతా పనిచేస్తున్నారు. అభివృద్ధితో పాటు ప్రతిపక్షంలో బలమైన నేతను టీఆర్ఎస్లోకి రప్పించడం ద్వారా అనుకున్న మెజార్టీ సాధిస్తామనే నమ్మకం టీఆర్ఎస్లో ఉంది. ప్రధానంగా సీఎం నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే రైల్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు పనులు పూర్తి దశకు చేరుకోగా.. మరో ఔటర్ రింగ్‌రోడ్డు గజ్వేల్ నియోజకవర్గం నుంచి వెళ్తుంది. ఇది పూర్తయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్‌లోనూ కుతూహలం కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఎప్పటిలాగే తమకున్న సాంప్రదాయ ఓటింగ్‌తో పాటు వ్యతిరేక ఓట్లను కూడా భారీ ఎత్తున సాధించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. గజ్వేల్ పురుషులు 1,24,358 మహిళలు 1,23,720 ఇతరులు 2 మొత్తం ఓటర్లు 2,48,080 సంగారెడ్డి... నీరిస్తే మేలు... ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి తాగునీరు, సాగునీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రాంతంలో విద్యావంతులు అధికంగా ఉన్నా వారికి ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేక పరిశ్రమల్లో రోజువారి కూలీలుగా పనిచేసే వారు అధికంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో భూగర్భ జలాలు ఈ స్థాయిలో అడుగంటడానికి ప్రధాన కారణం సింగూర్ జలాలు 15 టీఎంసీలను దిగువ ప్రాంతానికి తరలించడం. దీంతో ఘణపురం, వివిధ ఆయకట్టు కింద ఉన్నరైతులు యాసంగి పంటను సాగు చేసుకోకపోతున్నారు. సంగారెడ్డి పట్టణానికి సమీపంలో మంజీరా రిజర్వాయర్ ఉన్నా అది ఎండిపోవటంతోనే పట్టణంలో నీటి కష్టాలు అన్న భావం ఉంది. ఇవన్ని కూడా రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపనున్న అంశాలు. వీటిపై ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగంలోకి కొన్ని విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినా, నీరుపేద రైతులకు అంతంత మాత్రంగానే ప్రయోజనం చేకూరింది. ఎక్కువ భూమి ఉన్న సంపన్న వర్గాలకు ఎక్కువ ప్రయోజనం జరిగిందన్న భావన ప్రజల్లో ఉంది. నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. ఇటువంటి ఆరోపణలే గత శాసనభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డికి వరంగా మారాయి. అందుకోసమే నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. సంగారెడ్డి పురుషులు 1,08,395 మహిళలు 1,08,008 ఇతరులు 04 మొత్తం ఓటర్లు 2,16,407 నర్సాపూర్... రవాణా రంగం అభివృద్ధి.. నర్సాపూర్, కౌడిపల్లి కేంద్రాలలో ఉన్న సబ్ పోస్టాఫీసులకు సరైన భవనాలు లేక అక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. నర్సాపూర్‌లో బీఎస్ఎన్ఎల్ ఎక్సేంజ్‌తో పాటు సబ్ డివిజనల్ అధికారి కార్యాలయం ఉండగా సిబ్బంది నివసించేందుకు లక్షల రూపాయలు వ్యయం చేసి క్వార్టర్లు నిర్మించారు. కొంత కాలం వాటిలో కొందరు ఉద్యోగులు నివసించినా తరువాత నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటిలో సిబ్బంది ఉండకపోయినా ఇతర అవసరాలకు (ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు) వినియోగించే విధంగా ఏ అధికారి పట్టించుకోనందున ప్రభుత్వ ధనం నిరుపయోగమైందని విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్ జిల్లా దుందిగల్ ఔటర్ రింగు రోడ్డు నుంచి మెదక్ మండలం రాంపూర్ వరకు సుమారు 68 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జాతీయ రహదారిగా మార్చి 444 కోట్ల రూపాయలు మంజూరు చేయగా సుమారు ఎనిమిది నెలలుగా రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. అయితే రోడ్డు విస్థరణతో ప్రధానంగా నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న బిల్డింగులను తొలగించేదుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ తమకు నష్టం జరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేసినందున రవాణా మెరుగవుతుందని హర్షం వ్యక్తం చేస్తూనే రోడ్డు మధ్య గుండా డివైడరును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే వీలుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్... పురుషులు 1,03,731 మహిళలు 1,06,921 ఇతరులు 06 మొత్తం ఓటర్లు 2,10,658 దుబ్బాక... వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలి దుబ్బాక నియోజకవర్గం మిగతా వాటితో పోలిస్తే అభివృద్ధి కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీటి రంగాలు మరికొంత మెరుగుపడాల్సి ఉంది. వాస్తవంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ ప్రాంతం తాగునీటి కష్టాలు తీరాయి. విద్య, వైద్య పరంగా మెరుగైన సేవలు అందుతున్నాయి. అయితే సాగునీటి కష్టాలు తొలగాల్సి ఉంది. వందల మీటర్ల లోతున ఉన్న నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో 85 శాతం పైగా వ్యవసాయం, బీడి, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్‌లు 30 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్ మండలాల పరిధిలో వ్యవసాయం మొత్తం వర్షాధారంపైనే.. సాగునీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. చేనేత, బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు జిల్లాలోనే అధికంగా ఉండటం.. వీరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందుతుండటంతో ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు పలికే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డిని 62,50భారీ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలోనే మెజార్టీలో ఏడోస్థానంలో నిలిచారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశం ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డిది దుబ్బాక ప్రాంతం. కాబట్టి స్థానికత ఆధారంగ ఓట్లు పడే అవకాశం ఉంది. దుబ్బాక పురుషులు 97,637 మహిళలు 1,00,786 ఇతరులు 0 మొత్తం ఓటర్లు 1,98,423 మెదక్...పర్యాటక పురోభివృద్ధి కావాలి పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమైనా అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రంగా ఉంది. మెదక్ చర్చి, ఏడుపాయల వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నా వాటికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదనే విమర్శలు ఉన్నాయి. మెదక్–అక్కన్నపేట రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2018 జనవరి నాటికి మెదక్–అక్కన్నపేట రైల్వేపనులు పూర్తి కావాల్సింది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ పట్టణంలోని సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేయగా, ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం పనులు మరమ్మతులు చేస్తుండటంతో ఇక్కడ అథ్లేటిక్ క్రీడల్లో శిక్షణ పొందే క్రీడాకారులను హైదరాబాద్‌కు తరలించారు. పనులు పూర్తి అయితేనే తిరిగి క్రీడాకారులు ఇక్కడికి వస్తారు. ప్రస్తుతం ఓట్ల కోసం వచ్చే నాయకులు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వాల్సి ఉంది. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు..ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపిస్తే పనులు వేగంగా జరుగుతాయనే ప్రచారం ఉంది. మెదక్.. పురుషులు 98090 మహిళలు 1,06,353 ఇతరులు 02 మొత్తం ఓటర్లు 2,04,445 -
ఎంపీగా ‘కడియం’దే రికార్డు మెజార్టీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థులు సాధించిన మెజార్టీ ఓట్ల విషయంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి బద్దలు కొట్టారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కడియం శ్రీహరి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య పై 3,92,137 ఓట్లు మెజారిటీ సాధించారు. జిల్లాలో గతంలో ఉన్న హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2008 ఉపఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అప్పటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బి.వినోద్‌కుమార్(టీఆర్ఎస్) 2.17 లక్షల మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు జిల్లాలో మెజార్టీపరంగా ఇదే రికార్డుగా ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అత్యంత ఎక్కువ మెజార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ పార్లమెంట్ నుంచి సాధించారు. ఆ మెజార్టీ 3,92,7029 కాగా తెలంగాణలో ప్రస్తు తం ఇదే రికార్డు మెజార్టీ కాగా తర్వాత స్థానంలో కడియం ఉన్నారు. అంటే తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులో కడియంది రెండో స్థానం. జిల్లాలో పార్లమెంట్‌కు తక్కువ మెజార్టీ విషయానికి వస్తే 1962లో బీఏ.మీర్జా సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి ఎస్.రామనాథంపై కేవలం 736 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. -
వైఎస్సార్సీపీలోకి ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి!
నేడో రేపో రంగం సిద్ధం ఫలించిన భూమా మంతనాలు నంద్యాల, న్యూస్‌లైన్ : నేడో రేపో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నంద్యాలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నందున ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని పేర్కొన్నారు. కాగా.. అంతకుముందు వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమా నాగిరెడ్డి.. ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి, ఆయన సోదరుడు, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎన్‌హెచ్ ప్రసాదరెడ్డిని కలిసి మంతనాలు జరిపారు. ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి 2009లో నంద్యాల అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 34,979 ఓట్లను సాధించారు. ఈయన వైఎస్సార్సీపీలో చేరితే పార్టీ మరింత బలోపేతం కాగలదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీలో చేరడంతో భాస్కరరెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి 2009లో టీడీపీ తరఫున ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రాని సమయంలో ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి సాహసం చేశారు. అంతేగాక మూడేళ్ల క్రితం టీడీపీ తరఫున శాసనమండలికి పోటీ చేయడానికి అభ్యర్థులెవరూ సమయంలో పార్టీకి అండగా నిలిచారు. ఐదేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు భారీ ఎత్తున వ్యయం చేశారు. కష్ట సమయాల్లో టీడీపీకి అండగా నిలిచినా.. చివర్లో తనతో ఏ మాత్రం సంప్రదించకుండా తన రాజకీయ ప్రత్యర్థి శిల్పాను పార్టీలో చేర్చుకోవడం బాధాకరమని తన అనుచరులతో ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి హైదరాబాద్ రషీద్ షరీఫ్ మెదక్ కె. చంద్రశేఖరరావు జహీరాబాద్ బి.బి. పాటిల్ పెద్దపల్లి బాల్క సుమన్ నిజామాబాద్ కవిత ఆదిలాబాద్ గోదం నగేష్ మహబూబాబాద్ ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఖమ్మం బదాన్ బేగ్ షేక్ (మల్కాజ్గిరి స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది) అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఉప్పల్ బి. సుభాష్‌రెడ్డి చార్మినార్ ఇనాయత్ ఆలీ బఖారి మలక్‌పేట సతీష్‌కుమార్ యాదవ్ చాంద్రాయణగుట్ట ఎం. సేత రాంరెడ్డి ఖైరతాబాద్ మన్నె గోవర్ధన్‌రెడ్డి అంబర్‌పేట ఎడ్ల సుధాకర్‌రెడ్డి కార్వాన్ ఠాకూర్ జీవన్ సింగ్ ఖమ్మం జి. కృష్ణ పినపాక శంకర్ నాయక్ మధిర బొమ్మెర రాంమూర్తి వైరా చంద్రావతి కుత్బుల్లాపూర్ కొల న్ హనుమంతరెడ్డి సనత్‌నగర్ దండే విఠల్ మంచిర్యాల దివాకర్‌రావు నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్త నారాయణఖేడ్ ఎం. భూపాల్‌రెడ్డి కూకట్పల్లి గొట్టుముక్కల పద్మారావు మహేశ్వరం కొత్త మనోహర్‌రెడ్డి యాకుత్‌పుర ఎండీ శబీర్ అహ్మద్ ఎల్బీ నగర్ ఎన్. రామ్మోహన్‌గౌడ్ కొడంగల్ గురునాథ్‌రెడ్డి గోషామహల్ ప్రేమ్‌కుమార్ దూత్ అశ్వారావు పేట జె. ఆదినారాయణ భువనగిరి పైలా శేఖర్‌రెడ్డి నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య పరకాల ఎం. సహోదర్‌రెడ్డి జహీరాబాద్ కె. మాణిక్‌రావు చొప్పదండి బుడిగె శోభ నర్సాపూర్ సి.హెచ్. మదన్‌రెడ్డి మహబూబాబాద్ బి. శంకర్‌నాయక్ ముషీరాబాద్ ముఠా గోపాల్ కంటోన్మెంట్ గజ్జెల నగేష్ నాంపల్లి కె. హనుమంతరావు గంగపుత్ర బహుదూర్‌పల్లి ఎండీ జియాఉద్దీన్ నారాయణపేట కుంబం శివకుమార్‌రెడ్డి భద్రాచలం ఝాన్సీ రాణి అనంద్‌రావు (ఇంకా ప్రకటించాల్సినవి: ఇబ్రహీంపట్నం, దుబ్బాక, మునుగోడు, తుంగతుర్తి, శేర్లింగపల్లి, జూబ్లీహిల్స్, ఇల్లందు, రాజేంద్రనగర్, పాలేరు, నల్లగొండ) -
రాజకీయాలనూ బాధ్యతగా స్వీకరిస్తా :గల్లా జయదేవ్
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :రాజకీయాలను కూడా బాధ్యతగా స్వీకరిస్తానని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను 25 ఏళ్లపాటు గుంటూరు నగరంలో ఉండేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. సినీ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం రాజకీయాల్లోకిగానీ, ఎన్నికల ప్రచారానికిగానీ రారని, కానీ ఆయన మద్ధతు తనకు ఎల్లవేళల ఉంటుందని స్పష్టం చేశారు. గుంటూరు తనకు అత్తగారి జిల్లాగా చూడకుండా సొంత జిల్లాగా భావిస్తున్నానన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని, అందరి సహకారంతో గుంటూరులో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించేలా చూస్తామని తెలపారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పట్లో ఉన్న నాయకులందరిలోకి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి గల్లా అరుణ మాట్లాడుతూ గుంటూరును గ్రీన్ సిటీగా మార్చగల శక్తి సామర్ధ్యాలు జయదేవ్‌కు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్, మన్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, కోవెలమూడి రవీంద్ర, కందుకూరి వీరయ్య, మద్దిరాల మ్యానీ, సిహెచ్ చిట్టిబాబు, ఎం.రాజేష్, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పదవే ప్రాణం..
చీరాల, న్యూస్‌లైన్: పనబాక లక్ష్మి..పక్క జిల్లా నుంచి వచ్చి ఎంపీగా పోటీచేసి ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి కేంద్రమంత్రిగా అధికారాన్ని అనుభవిస్తున్నారు. 2009 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమెకు ఇక్కడి ప్రజలు, పార్టీ నాయకులతో పరిచయం లేదు. కనీసం అన్ని ప్రాంతాల్లో తిరిగి ఓట్లు కూడా అభ్యర్ధించలేదు. కానీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆమె ముఖం కూడా చూడకుండానే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దీంతో ఆమెకు కేంద్రమంత్రి పదవి దక్కింది. చేనేత జౌళిశాఖ సహాయ మంత్రి, పెట్రోలియం, సహజవాయువుల సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో చేనేతలు చీరాలలో ఉన్నారు. చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న కార్మికులకు పనబాక చేయూతనిస్తారని ఆశించారు. అయితే ఐదేళ్ల కాలంలో ఆమె చేనేత కార్మికులు, నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమే. బాపట్ల పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గుంటూరు జిల్లాలో బాపట్ల, రేపల్లె, వేమూరు, ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి. వీటిలో అత్యధికంగా రైతులు, చేనేత కార్మికులున్నారు. ఐదేళ్లపాటు కేంద్రమంత్రి స్థాయిలో ఆమె నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. గెలిచిన అనంతరం చీరాల ప్రాంతంలో మెగాక్లస్టర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన ఆమె కేంద్ర బడ్జెట్లో ప్రకటించినా..నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఆదివారం చేనేత పార్కు స్థలంలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో కూడా నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వడం మినహా కార్మికులకు పెద్దగా ఉపాధి అవకాశాలు ఉండవనేది సమాచారం. విభజనవాది...పనబాక: నియోజకవర్గాల అభివృద్ధి గాలికొదిలేసిన పనబాక లక్ష్మి రాష్ట్ర విభజనకు అందరికంటే ఎక్కువ సహాయ సహకారాలందించారు. రాష్ట్ర విభజనపై మొదటిసారి సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సోనియాగాంధీని కలిసినప్పుడు అందరిముందే ‘నీకు ముందే విభజన గురించి చెప్పాను కదా..మళ్లీ ఇప్పుడు రావడం ఏమిటి’ అని ఆమె పనబాకతో అన్నట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలే చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు ఎంపీలు, కేంద్రమంత్రులు సమైక్యాంధ్ర కోసం అంటూ నాటకీయంగా ఆందోళనలు చేసినా..పనబాక మాత్రం సోనియా చెప్పిందే వేదవాక్కు అన్నట్లు వ్యవహరించారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ఆమె ఒక్కసారి కూడా నిరసన వ్యక్తం చేయలేదు. పెపైచ్చు అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని పలుమార్లు ప్రకటించారు. దీంతో ప్రజలు పనబాకపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆమెను బహిరంగంగా విమర్శిస్తున్నారు. పనబాక ఎక్కడికెళ్లినా..సమైక్యవాదులు అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆమె కూడా చీరాల వచ్చారు. సీఎం ఎదుటే పనబాక లక్ష్మిని సీమాంధ్ర ద్రోహి అంటూ సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు నినాదాలు చేసి అడ్డుకోబోయారు. ఇదిలా ఉంటే మెగా క్లస్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన పేరుతో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతో కలిసి ఆమె ఆదివారం వేటపాలెం రానున్నారు. దీంతో మరోసారి పనబాకకు నిరసనలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే ఆమె మళ్లీ బాపట్ల నుంచే పోటీ చేస్తానని అనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రను సింగపూర్ చేస్తుందని ప్రజల ఆగ్రహంపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేయడం గమనార్హం. -
దేవినేని ఉమా అసంతృప్తి !
సాక్షి, విజయవాడ : టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) తనపై దుష్ర్పచారం చేస్తూన్నారంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా పార్టీ పరిశీలకుడు సుజానాచౌదరి వద్ద ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌డే ఉత్సవాలతో పాటు పార్టీకి సంబంధించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సుజానా చౌదరి ఆదివారం మధ్యాహ్నం బందరురోడ్డులోని ఒక హోటల్లో బస చేసినప్పుడు దేవినేని ఉమా వ్యక్తిగతంగా కలిసి తన నిరసన తెలియజేశారు. కేశినేని నాని తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా జిల్లాలోని పార్టీ ముఖ్యనేతల వద్ద మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తన ప్రతిష్టే కాకుండా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుదని చెప్పారు.ఈ అంశాన్ని తాను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లతానని చెప్పగా, సుజనా చౌదరి వారించి పరిస్థితిని ఇక్కడే చక్కదిద్దుకుందామని సర్థి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణులకు తలనొప్పి.... ఇప్పటికే కేశినేని, దేవినేని మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పోరు తారాస్థాయికి చేరుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే జి ల్లాలో పార్టీ తీరు అంతంత మాత్రంగా ఉండగా... ఇ ప్పుడు ఇరువురు ముఖ్యనేతలు నువ్వా-నేనా అన్న ట్లు తలపడుతూ ఉండటం కలవరపాటుకు గురిచేస్తుంది. చంద్రబాబు వద్దకు జిల్లా ముఖ్యులు.... నగరంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు పార్ధీవశరీరాన్ని చూడడానికి హైదరాబాద్ వెళ్లారు. అక్కినేని మృతదేహాన్ని సందర్శించిన అనంతరం వారంతా వెళ్లి చంద్రబాబునాయుడ్ని కలిశారు. అదే సమయంలో జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి చర్చకు రాగా కేశినేని-దేవినేని మధ్య విభేదాలు, ఇటీవల కాళేశ్వరీ రవీ ప్లెక్సీల వివాదం గురించి వివరించినట్లు తెలిసింది. దీంతో పరిస్థితి చక్కదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చి వారిని పంపారని సమాచారం.