- జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్ సీపీదే హవా
- కుప్పంలో చంద్రబాబును కంగుతినిపించిన ఓటర్లు
- టీడీపీలో నిరాశ, నిస్పృహలు విజయోత్సాహంలో
- వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగిరింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. కుప్పంలో ఈసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మెజారిటీ కూడా భారీగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి నుం చీ చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకి బలమైన నాయకత్వం ఉండటం, జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చగలరనే నమ్మకం జనాల్లో ఉండటంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు తిరుగులేని వారుగా నిలిచారు.
జనానికి అండగా ఉంటామని, వైఎస్‌ఆర్ ఆశయాలతో ముందుకు వచ్చిన జగన్‌ను గెలిపించుకుందామని అభ్యర్థులు పిలుపునిచ్చారు. వారిని గెలిపించేందుకు కంకణం కట్టుకున్న ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తిరుగులేని శక్తిగా ఫ్యాన్
జిల్లాలో ఫ్యాన్ గుర్తు తిరుగులేని శక్తిగా నిలిచింది. మహిళలు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఇతర కులాలకు చెందిన వారి ఓట్లు ఎక్కువ శాతం వైఎస్‌ఆర్‌సీపీకి వేశారు. టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకోవడాన్ని ముస్లిం మైనారిటీలు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని వారు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే విషయాన్ని చెబుతూ వారు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొదటి నుంచీ టీడీపీలో గ్లోబెల్ ప్రచారం చేసే కొందరు పోలింగ్ సరళిని చూసి కంగుతిన్నారు.
టీడీపీకి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు యత్నించారు. అయితే వారి యత్నాలు ఫలించలేదు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఎస్‌ఆర్‌సీపీ సఫలమైంది. పైగా జగన్ గ్రాఫ్ పడిపోతోందని, జనం ఆయనను తిరస్కరిస్తున్నారనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. ఇదంతా గ్లోబెల్ ప్రచారమేనని ఓటర్లు నిరూపించారు.
కంగుతిన్న టీడీపీ అభ్యర్థులు
‘నిరంతరం కష్టపడి తిరిగాం... అయినా ఫలితం దక్కలేదు. చంద్రబాబును ఎవరూ నమ్మలేదు. నమ్ముతారని భావించాం. ఇన్నేళ్లలో ఏ ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో చంద్రబాబు అమలు చేసిన దాఖలాలు లేవు. పైగా సంక్షేమ పథకాలంటేనే ఆయనకు చిరాకు, సంక్షేమం లేకుండా అభివృద్ధి చేస్తానంటే పేదరికంలో ఉన్న వారిని అభివృద్ధి పథంవైపు ఎలా తీసుకెళతారనేది పలువురి వాదన. అందుకే టీడీపీ వారికి ఓట్లు వేసినా వేస్ట్ అవుతాయని భావించారు. చంద్రబాబు మాటలు నమ్మి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టాం. పార్టీ ఫండ్, చంద్రబాబు జేబుల్లోకి కోట్లాది రూపాయలు ఇచ్చామనే బాధలో ఇంటికే పరిమితమవుతున్నారు. ఏదో వ్యాపారం చేసుకొని పోగొట్టుకున్న డబ్బును సంపాదించే కార్యక్రమంలో నిమగ్నం కావాల’నే ఆలోచనకు టీడీపీ వారు వచ్చారు.
కుప్పం నుంచి చంద్రబాబు...
కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచే అవకాశం ఉంది. అయితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని ఓటింగ్ సరళిని బట్టి చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 46వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి అందులో సగం కూడా వచ్చే పరిస్థితిలేదని పరిశీల కులు చెబుతున్నారు. చంద్రబాబుకు తిరుగులేని శక్తిగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో క్రాస్ ఓటిం గ్ జరిగిందని కొందరు ఓటర్లే అంటున్నారు. ‘మాకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉంది. అయితే స్థానికంగా తాము ఉండాలంటే టీడీపీ వారినుంచి నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనా లి. అందుకే మనసు చంపుకొని సైకిల్‌కు కొందరం ఓటు వేశాం. అదే విధంగా పార్లమెంటుకు వైఎస్‌ఆర్‌సీపీకే ఓటు వేశామ’ని చెప్పారు.