కొండపాక: వెలికట్ట ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దివంగత ఎంపీటీసీ బూర్గుల యాదంరావు భార్య మల్లవ్వ గెలుపు పార్టీ బి- ఫారం తీసుకున్నప్పుడే ఖాయమైందని, భారీ మెజార్టీ కోసమే ప్రచారం నిర్వహిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య పేర్కొన్నారు.
ఉపఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం వెలికట్ట , జప్తినాచారం, ఆరెపల్లి, రవీంద్రనగర్, రాజంపల్లిలో మండల టీఆర్‌ఎస్ నాయకులు మల్లవ్వ తరుపున ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో వారు మాట్లాడుతూ గతంలో వెలికట్ట ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన యాదంరావు అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు.
ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైందన్న విషయాన్ని ఓటర్లు గుర్తిస్తారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలికట్టకు మంజూరు చేసినన్ని నిధులు మండలంలో ఏ గ్రామానికి మంజూరు చేయలేదన్నారు. అకార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే వెలికట్ట ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలు మరింత అభివృద్ధిచెందుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గొడుగు యాదగిరి, కనకారెడ్డి, యాదయ్య, పసుల సరిత, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బైరెడ్డి రాదాకిషన్‌రెడ్డి, నాయకులు అనంతుల నరేందర్, బాల్‌చందర్‌గౌడ్ , అంజి, జైన్ ఆంజనేయులు, అమరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, పెరుగు ఆంజనేయులు, కొండు రవి, మీస రాజయ్య తదితరులు పాల్గొన్నారు.