గంగన్నపాలెంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి
సాక్షి,తిప్పర్తి(నల్లగొండ) : బంగారు తెలంగాణ అంటూ మోసం చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలని మజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి, రాయినిగూడెం, జొన్నగడ్డలగూడెం రాజుపేట, గంగన్నపాలెం, కాశివారిగూడెం, చిన్నాయిగూడెం, జంగారెడ్డిగూడెం, రామలింగాలగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎవరు ఆపదలో ఉన్నా అదుకున్నానని తెలిపారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ది తప్ప నాలుగున్నర ఎళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నాలుగు సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఐదోసారి భారీ మెజార్టీతో గెలించాలని, తెలంగాణ రాష్ట్రం మొత్తం కోమటిరెడ్డి మెజార్టీపై ఎదురు చూస్తుందన్నారు. అందరికోసం కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగుపడిందన్నారు. వేయ్యి కోట్లతో పూర్తయ్యే శ్రీశైల సొరంగమార్గాన్ని పూర్తి చేయకుండా లక్ష కోట్లతో కాళేశ్వరం కడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలింపించా లని, అధికారంలోకి వచ్చిన వారంలో రోజుల్లోనే రైతులకు 2లక్షల రుణ మాఫీ, ప్రతి ఇంట్లో 58ఎళ్లు ఉన్న దంపతులకు 2 చొప్పున పింఛన్, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాల కల్పన, మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణా లు అందించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని తప్పకుం డా ఈ హమీలను అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్ తనను ఓడించేందుకు ఆయన బంధువును ఇక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమించారని విమర్శించారు. కేసీఆర్‌కు కోమటిరెడ్డి అంటే భయం అని అన్నారు. ఇంటింటికీ తాగు నీరందిస్తానని లేకుం టే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాతో పాటు రాష్ట్రం వ్యా ప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యకరమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వంగాల స్వామిగౌడ్, హఫీజ్ ఖాన్, నాయకులు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, జూకూరి రమేష్, కిన్నెర అంజి, దొంగరి ప్రకాశ్, కమ్మంపాటి కృష్ణ, చింతపల్లి పద్మ శౌరి, వెంకట్‌రాంరెడ్డి, ప్రసాద్, అబ్దుల్ రహీం, లతీఫ్, ఇస్మాయిల్, అంజయ్య, రామకృష్ణ, మహ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment