
మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటు: కేసీఆర్
స్పష్టమైన మెజార్టీ వస్తే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.
సిద్దిపేట, స్పష్టమైన మెజార్టీ వస్తే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఉదయం 10.30 గంటలకు ఓటు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏర్పడేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పోలింగ్ శాతం పెంపునకు ఎన్నికల కమిషన్ చేపట్టిన చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ ప్రజలను, చిన్ననాటి స్నేహితులను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు.