
మిథున్ అఖండ విజయం
పుంగనూరు, న్యూస్‌లైన్ : ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు.
ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి, సాయిప్రతాప్ త మ శక్తియుక్తులు దారపోసి మిథున్‌రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చతురత ముందు ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. యువనేత మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి 1,05,772 ఓట్లు లభించాయి.
పురందేశ్వరికి 60,674 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు 4,927 ఓట్లు మాత్రమే పోలయ్యూరుు. పుంగనూరులో మిథున్‌రెడ్డికి 46,009 ఓట్ల మెజారిటీ లభించింది. నిత్యం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చుచేస్తున్న తండ్రీతనయులను ప్రజలు ఆదరించారు. విశేష అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.