సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు: మిధున్‌ రెడ్డి | Midhun Reddy Said CM YS Jagan Gave Directions To Party MPs | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు: మిధున్‌ రెడ్డి

Published Mon, Sep 14 2020 5:45 PM | Last Updated on Mon, Sep 14 2020 6:00 PM

Midhun Reddy Said CM YS Jagan Gave Directions To Party MPs - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మిధున్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశాము. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తాము. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. 

'జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్‌ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది టనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఆర్‌డీఏ, ఫైబర్ గ్రిడ్‌లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలి. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలి' అని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. (వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement