బెంగళూరు: కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని మరో సర్వే స్పష్టం చేసింది. పూర్తిస్థాయి డిజిటల్ సాంకేతికతతో ఎన్జీ మైండ్‌ఫ్రేమ్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 95–105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. బీజేపీకి 75–85 సీట్లు, జేడీఎస్‌కు 35–41 సీట్లు వచ్చే చాన్సుందని వెల్లడైంది. ఇతరులకు 4–8 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. 224 నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 25 మందితో శాంపుల్స్ సేకరించి సర్వే చేశారు.
ఇందులో 65% మంది ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని పేర్కొనగా మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్‌లకే మరోసారి పట్టంగట్టే అవకాశం స్పష్టమైంది. ఎవరి నాయకత్వంలో కర్ణాటక అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ప్రశ్నకు.. 41%మంది సిద్దరామయ్యకు, 33% మంది యడ్యూరప్పకు, 23% మంది కుమారస్వామికి ఓటేశారు. ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని సర్వేలో వెల్లడైంది. జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారనుందని సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment