Hung Results
-
జపాన్‌లో హంగ్
టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమి ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయింది. 465 స్థానాలున్న దిగువ సభలో కూటమి బలం 279 స్థానాల నుంచి 215కు పడిపోయింది. మెజారిటీకి కనీసం 233 స్థానాలు అవసరం. కూటమి సారథి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి 2009 తర్వాత అత్యంత దారుణమైన ఫలితాలివే. జపాన్ను దాదాపుగా 1955 నుంచీ ఎల్డీపీయే పాలిస్తూ వస్తోంది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అనిశ్చితి దెబ్బకు జపాన్ కరెన్సీ యెన్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చాయని ఇషిబా సోమవారం అంగీకరించారు. ‘‘ప్రజా తీర్పును అంగీకరిస్తున్నా. అయితే ప్రధానిగా నేనే కొనసాగుతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘అధికార కూటమికి మా ఎల్డీపీయే సారథ్యం వహిస్తుంది. కీలక విధానాలతో ప్రణాళికాబద్ధమైన బడ్జెట్‌ను రూపొందిస్తాం. రాజకీయ సంస్కరణలు కొనసాగిస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే ప్రతిపక్షాలకు సహకరించడానికి మా పార్టీ సిద్ధం’’ అన్నారు. డిసెంబర్ నెలాఖరులో కీలకమైన బడ్జెట్ ప్రణాళికలను పాలకవర్గం ఆమోదించేదాకా ఇషిబా కొనసాగే అవకాశముంది. ఫ్యూమియో కిషిడా నుంచి ఇషిబా అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఆ వెంటనే సాధారణ ఎన్నికలకు వెళ్లారు.చిన్న పార్టీలే కీలకంసెంట్రిస్ట్ నేత యోషిహికో నోడా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం కాన్స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీపీజే) 148 స్థానాలు గెలుచుకుంది. ఇది గతంలో కంటే 50 స్థానాలు అధికం. ‘‘అధికార కూటమికి మెజారిటీ రాకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఇది గొప్ప విజయం’’ అని నోడా అన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి సంకీర్ణానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 30 రోజుల సమయముంది. ఎక్కవ సీట్లు సాధించిన చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. ఇషిబాతో చేయి కలిపేందుకు డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ది పీపుల్, కన్జర్వేటివ్ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ సిద్ధంగా ఉన్నాయి. పాక్షిక పొత్తుకు సిద్ధమని డీపీపీ అధినేత యుచిరో తమాకీ కూడా తెలిపారు. -
French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా?
పారిస్: ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీకి జూన్ 30న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం కీలకమైన రెండో రౌండ్ పోలింగ్‌లో చేతులెత్తేసింది. 577 స్థానాలకు గాను 143 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో అవగాహనకు రావడం అధికార సెంట్రిస్ట్ కూటమికి కలిసొచి్చంది. మెజారిటీ స్థానాల్లో అవి ఒకే అభ్యరి్థని నిలపడంతో నేషనల్ ర్యాలీ కూటమి జోరుకు కళ్లెం పడింది. ముఖ్యంగా మెరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ కూటమి ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితరాలతో ముందుకొచ్చిన ఎన్పీఎఫ్ అతి పెద్ద కూటమిగా అవతరించింది. దానికి 193 సీట్లు రాగా సెంట్రిస్ట్ కూటమి 164 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 289 సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దాంతో ఎన్పీఎఫ్తో కలిసి మాక్రాన్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రధాని పదవి కోసం ఎన్పీఎఫ్ పట్టుబడుతుండటం, ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్ సుముఖంగా లేకపోవడం వంటివి కారణం. దీనికి తోడు ఎన్పీఎఫ్లోనూ కీచులాటలున్నాయి. ఫ్రాన్సు లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే సాగుతూ వస్తోంది. నేషనల్ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా 2022 ఎన్నికల్లో కేవలం 89 సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది. ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని, తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీ పెన్ అన్నారు. అప్పుడే కీచులాటలు ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియెల్ అటల్ సోమవారం రాజీనామా చేశారు. దాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు. అందుకు అటల్ సిద్ధంగా ఉన్నా ఎన్పీఎఫ్ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రజాభీష్టాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ డిమాండ్ చేశారు. అదే జరిగితే అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరు పారీ్టల నుంచి ఉండటం ఫ్రాన్స్‌లో 22 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని కో హాబిటేషన్గా పిలుస్తారు. దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటికి మూడుసార్లు వచ్చాయి. పలు మాక్రాన్ సంస్కరణలకు చరమగీతం పాడతామని, అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్పీఎఫ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు, మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఎన్పీఎఫ్ భాగస్వాముల్లో అతివాద వామపక్షమైన ఫ్రాన్స్ అన్»ౌడ్తో కలిసి పని చేయబోమని మాక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. సోషలిస్టులు, గ్రీన్స్‌తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు. కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్పీఎఫ్ కూటమి అంగీకరించకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై 18న సమావేశపరుస్తానని మాక్రాన్ ప్రకటించారు. నాటో భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్పీఎఫ్తో చర్చలుంటాయని భావిస్తున్నారు. హంగ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోయింది. యూరో విలువ కూడా 0.2 శాతం పడిపోయింది.ప్రధానీ పవర్‌ఫుల్లే... ఫ్రాన్స్‌లో 1958 నుంచి సెమీ ప్రెసిడెన్షియల్ పాలన వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఫిఫ్త్ రిపబ్లిక్‌గా పిలుస్తారు. ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకూ విశేషాధికారాలు ఉంటాయి. 1962 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నేరుగా ఎన్నుకుంటున్నారు. ఆయనే దేశాధిపతిగా, సాయుధ దళాల కమాండర్‌గా వ్యవహరిస్తారు. విదేశాంగ విధానం, రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవే. ప్రధాని సిఫార్సు మేరకు కేబినెట్‌ను నియమిస్తారు. దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంటు తీసుకుంటుంది. ఆయనను అధ్యక్షుడు తొలగించలేరు. రాజీనామాను అభ్యరి్థంచవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో అధ్యక్షున్ని పార్లమెంటు అభిశంసించవచ్చు. ఫలించని ముందస్తు... నేషనల్ అసెంబ్లీ పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ జూన్ 9న యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతుల్లో మాక్రాన్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీనికితోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నేరాలు తదితరాలతో మాక్రాన్ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మాక్రాన్ ముందస్తుకు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్అన్»ౌడ్ వంటివి కలిసి కలిసి ఎన్పీఎఫ్గా ఏర్పడ్డాయి. నేషనల్ ర్యాలీ కూటమిని ఓడించడమే లక్ష్యంగా చాలాచోట్ల ఎన్పీఎఫ్, సెంట్రిస్ట్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకుని ఓట్ల చీలికను నివారించారు. ఫలితంగా నేషనల్ ర్యాలీని నిలువరించినా మాక్రాన్ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.దేశవ్యాప్త హింస... ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో ఎన్పీఎఫ్ మద్దతుదారులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పారిస్‌లోని ప్లేస్ డి లా రిపబ్లిక్ వద్ద వేలాదిగా గుమిగూడారు. ఈ క్రమంలో వారికి, నేషనల్ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది. మాసు్కలు ధరించిన నిరసనకారులు పారిస్ వీధుల్లో పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఆస్తులను తగలబెట్టారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఒలింపిక్స్‌పై ప్రభావమెంత? హంగ్ ఫలితాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై 26 నుంచి జరగాల్సిన పారిస్ ఒలింపిక్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. అవి పూర్తయేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్ సుముఖంగా ఉన్నా ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్ కూటమి పట్టుబడుతోంది. ఒలింపిక్స్ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెలాల్డ్ డ్రమానియన్ కొనసాగడంపైనా సందిగ్ధతే కొనసాగుతోంది. ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక స్టేడియాలు, మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే 260 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టేనని, ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బందేమీ ఉండబోదని మాక్రాన్ ప్రభుత్వం చెబుతోంది. వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్ రాజీనామాను మాక్రాన్ ఆమోదించలేదని సమాచారం. ఏం జరగవచ్చు? సంకీర్ణ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో రోజువారీ వ్యవహారాలను నడిపేందుకు ఏ పారీ్టలకు చెందని నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని మాక్రాన్ ఏర్పాటు చేసే వీలుంది. అయితే దేనికైనా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అధ్యక్షునిగా మాక్రాన్ పదవీకాలం 2027 దాకా ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆలోపు తప్పుకోబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారు. -
Pakistan General Elections 2024: పాకిస్తాన్లో హంగ్
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం రాత్రికల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడవాల్సి ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 336 కాగా 266 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. మహిళలకు, మైనారిటీలకు రిజర్వు చేసిన 70 సీట్లను పార్టీలు గెలుచుకునే స్థానాల ఆధారంగా వాటికి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మృతి నేపథ్యంలో ఈసారి 265 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ఇప్పటిదాకా 238 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులే ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలాసేపటిదాకా వెనకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజారిటీతో నెగ్గినట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్‌లోని మరో మూడు స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ ప్రదర్శనను షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పీఎంఎల్ అత్యధిక స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టిగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎర వేసి లాక్కునేందుకు పీఎంఎల్ జోరుగా ప్రయతి్నస్తోందని వార్తలొస్తున్నాయి. -
గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం సోమవారంతో ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైంది. ఎన్నికలు పూర్తవడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో.. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో వంటి అనేక అంశాలపై పోస్ట్ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. ఈ క్రమంలో గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. చదవండి: మణిపూర్ ఎగ్జిట్ పోల్స్: కమలం Vs కాంగ్రెస్.. వారిదే పైచేయి గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్ తప్పనిసరైతే.. కింగ్ మేకర్‌గా ఎవరు మారనున్నారో మార్చి 10న తేలనుంది. చదవండి: పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు టైమ్స్ నౌ బీజేపీ:14 కాంగ్రెస్-16 ఆప్-4 జీ న్యూస్ బీజేపీ:15 కాంగ్రెస్-16 ఆప్-2 ఇతరులు7 జన్ కీ బాత్ బీజేపీ: 17 కాంగ్రెస్ కూటమి 17 ఆప్: 1 ఇతరులు: 4 న్యూస్ఎక్స్-పోల్‌స్ట్రాట్ బీజేపీ:17-19 కాంగ్రెస్:11-13 సీఎన్ఎక్స్ బీజేపీ- 16-21 కాంగ్రెస్11-17 ఆప్0-2 ఇతరులు5-7 -
2019 హంగ్!
-
మధ్యప్రదేశ్‌లో హంగ్?
భోపాల్: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్‌ను ఆనందీబెన్ పటేల్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్ 85, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 113 సీట్లు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్ చేరుకున్నారు. గవర్నర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు భోపాల్: మధ్యప్రదేశ్‌లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్ ఫిగర్ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్ కీ బేటా)పే రొందిన చౌహాన్ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్) నుంచి మధ్యప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చి చౌహాన్ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. -
కర్ణాటకలో మళ్లీ 2004 నాటి సీన్
-
హంగే అంటున్నారు..!
కన్నడనాట హంగ్ తప్పదా? ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 స్థానాలను ఏ పార్టీ అందుకోలేదా? ముందునుంచీ అనుకుంటున్నట్టు జేడీఎస్ కింగ్‌మేకర్ అవబోతోందా? ఎగ్జిట్ పోల్స్ ఇదే చెబుతున్నాయి. కొన్ని చానళ్లు బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుందని తేల్చగా..మరికొన్ని కాంగ్రెసేనని పేర్కొన్నాయి. బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ప్రీపోల్స్ సర్వేల్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ తప్పదనే సంకేతాలిచ్చాయి. శనివారం సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 70% ఓటింగ్ నమోదైంది. దీని ఆధారంగా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ వివరాల సగటు ప్రకారం బీజేపీ 103 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలుండగా.. 86 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో, జేడీఎస్ 31 సీట్లతో మూడో స్థానంలో నిలువనుంది. ఈ వివరాల ప్రకారం ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాల మేజిక్ ఫిగర్‌ను చేరుకోవటం లేదు. దీంతో జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారటం ఖాయంగా కనబడుతోంది. విడుదలైన అన్ని సర్వేల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లశాతంలో తేడా పెద్దగా లేదు. 2–3 శాతం తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే ఈ తేడాయే కనీసం 10కిపైగా సీట్లను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఏడు ప్రధాన సర్వే సంస్థల్లో ఐదు బీజేపీ, రెండు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నాయి. బీజేపీ వైపు కాస్త మొగ్గు వివిధ వార్తాసంస్థలు పలు సర్వే గ్రూపులతో కలిసి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో (కాంగ్రెస్‌కు 112 సీట్లు) తప్ప మిగిలిన అన్నింటిలోనూ బీజేపీకే మెజారిటీ రానుందని వెల్లడవుతోంది. టైమ్స్‌నౌ గ్రూప్ కూడా రెండు సర్వే సంస్థలతో కలిసి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించింది. ఇందులో వీఎంఆర్తో కలిసి చేసిన సర్వే బీజేపీ 94 స్థానాల్లో, కాంగ్రెస్ 97 స్థానాల్లో, జేడీఎస్ 28 చోట్ల గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే టుడేస్ చాణక్యతో జరిపిన సర్వే మాత్రం బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావొచ్చని తెలిపింది. బీజేపీ 120 స్థానాల్లో.. కాంగ్రెస్ 73 సీట్లలో గెలిచే అవకాశముందని ఈ సర్వే పేర్కొంది. అయితే మిగిలిన సర్వేల ప్రకారం బీజేపీ పెద్ద పార్టీగా నిలుస్తున్నప్పటికీ జేడీఎస్ కింగ్‌మేకర్ కానుందని వెల్లడైంది. చివర్లో ప్రధాని మోదీ చేసిన సుడిగాలి ప్రచారం ఫలితంగానే బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే బీజేపీ తన సీట్ల సంఖ్యను కొంతమేర పెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీకి..! సాయంత్రం ఆరున్నర గంటలకు ఎన్నిక పూర్తవగానే టైమ్స్‌నౌ–సీఓటర్ మొదటగా సర్వే వివరాలు వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లొస్తాయని వెల్లడైంది. అయితే.. కాసేపటికే మిగిలిన సంస్థలు ఒక్కొక్కటిగా తమ సర్వే వివరాలు వెల్లడించాయి. వాటిలో రిపబ్లిక్ టీవీ, జన్‌కీ బాత్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే.. బీజేపీకి 105, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 సీట్లు రావొచ్చని పేర్కొంది. అయితే.. ఇండియాటుడే యాక్సిస్ సర్వే మాత్రం.. కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది. బీజేపీకి 85 సీట్లు ఇచ్చిన ఈ సర్వే.. కాంగ్రెస్ 112 చోట్ల గెలుస్తుందని, జేడీఎస్ 26 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. టుడేస్ చాణక్యతోపాటు న్యూస్ నేషన్, న్యూస్ఎక్స్–సీఎన్ఎక్స్, ఏబీపీ–సీఓటర్, రిపబ్లిక్ సర్వేలు బీజేపీ 100 సీట్ల మార్కును దాటుతుందని తెలిపాయి. టుడేస్ చాణక్య తన సర్వేలో మీరు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా 47 శాతం మంది అవునని, 40 శాతం మంది సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుతో సంతృప్తికరంగానే ఉన్నామని పేర్కొన్నారు. కాగా, ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సంస్థ 70,500 శాంపిల్స్‌తో సర్వే చేసినట్లు వెల్లడించింది. మంగళవారం (మే 15న) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. పాత మైసూరులో కాంగ్రెస్! బాంబే కర్ణాటక, సెంట్రల్, కోస్తా కర్ణాటకల్లో బీజేపీ గత ఎన్నికల కన్నా బలం పుంజుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటి కారణంగానే కాంగ్రెస్ కన్నా ఎక్కువసీట్లు సంపాదించనున్నట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం కనబర్చనుంది. 50 సీట్లలో 28–30 సీట్లు ఈపార్టీకి వస్తా యని సర్వేలు పేర్కొన్నాయి. ముస్లిం, దళిత ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటకలో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ తప్పేట్లు లేదు. ఏ ప్రాంతంలో ఎవరికెన్ని..? బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రాంతాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవొచ్చనే విషయాన్ని గమనిస్తే.. కోస్తా కర్ణాటక: ఈ ప్రాంతంలో మొత్తం 21 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 13 చోట్ల గెలిచింది. కానీ ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ అత్యధికంగా 14–16 స్థానాలు గెలిచే అవకాశం ఉందని.. కాంగ్రెస్ 5–7 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కాంగ్రెస్ హయాంలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటాన్ని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామనీ ప్రకటించింది. ఇది బీజేపీకి అనుకూలంగా మారినట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బాంబే కర్ణాటక: ఇక్కడ 50 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమానస్థాయిలో 25–26 సీట్లు రావచ్చు. మహదాయి నదీ నీటి పంపకం విషయంలో మహారాష్ట్ర, గోవాతో కర్నాటకకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మోదీ ప్రచారంలో ప్రస్తావించారు. మహదాయినదీ వివాద పరిష్కారంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, ఆ సమస్యను తాము పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ ప్రభావం చూపింది. పాత మైసూర్: ఇక్కడ 55 స్థానాలు ఉన్నాయి. వక్కలిగ సామాజికవర్గం ఈ ప్రాంతంలో బలంగా ఉంటుంది. జేడీఎస్ అత్యంత బలంగా ఉన్న ప్రాంతం ఇదే! ఇక్కడ కాంగ్రెస్ 27–29 స్థానాలు, జేడీఎస్ 19–21, బీజేపీ 4–6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ వక్కలిగలకు కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎక్కువ స్థానాలు కేటాయించాయి. దేవెగౌడపై మోదీ సానుకూల వ్యాఖ్యలు చేసినా అది బీజేపీకి ఓట్లు సంపాదించిపెట్టలేక పోయిందని ఈ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ కర్ణాటక: ఇక్కడ మొత్తం 31 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ 15–17, కాంగ్రెస్ 14–16లు గెలిచే అవకాశం ఉంది. జేడీఎస్ ఒకస్థానానికి పరిమితం కావొచ్చు. బీదర్, గుల్బర్గా, రాయచూర్, యాదగిరి, కొప్పల్ జిల్లాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ మౌలిక వసతుల కల్పన, నీటి వనరుల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయి. దీంతోనే ఏ పార్టీకి ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వరు. సెంట్రల్ కర్ణాటక: ఈ ప్రాంతంలో 35 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ చిత్రదుర్గ, దావణగిరి, హవేరి, బళ్లారి జిల్లాలో శ్రీరాములు బలమైన నేతగా ఉన్నారు. అలాగే ఇక్కడ రెడ్డిబ్రదర్స్ ప్రభావం కూడా ఎక్కువ. ఈ ఎన్నికలను శ్రీరాములుతో పాటు రెడ్డిబ్రదర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ 22–24, కాంగ్రెస్ 9–11 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. జేడీఎస్‌కు 1–3 స్థానాలు దక్కొచ్చు. గ్రేటర్ బెంగళూరు: బెంగళూరు రీజియన్‌లో 30 స్థానాలున్నాయి. బీజేపీ 18–20, కాంగ్రెస్ 8–10, జేడీఎస్ 2 స్థానాలు గెలవచ్చు. నగరంలో పారిశుద్ధ్యం లేకపోవటంతో పాటు నేరాలు పెరగటం, మహిళల భద్రతపై అనుమానాలు బీజేపీకి వరంగా మారాయి. దీంతోపాటు ట్రాఫిక్, కాలుష్యం సిటీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ నెల 17న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తా. 15న ఢిల్లీకి వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తా. మా పార్టీ 140– 150 సీట్లు గెలుపొందుతుంది. – బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని యడ్యూరప్ప చెప్పడాన్ని చూస్తే ఆయన మతి భ్రమించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితి లేదు. మేమే మళ్లీ అధికారం చేపడతాం. 120కి పైగా స్థానాల్లో గెలుస్తాం. బీజేపీకి 60–65 స్థానాలు కూడా దక్కవు. – కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శివమొగ్గ జిల్లా శికారిపురలో ఓటేసిన యడ్యూరప్ప మైసూరు జిల్లాలో కుమారుడు యతీంద్రతో సిద్దరామయ్య రామ్‌నగర్‌లో ఓటేసిన కుమారస్వామి, ఆయన భార్య అనిత -
కన్నడనాట హంగే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడ్రోజుల ముందు వెలువడిన ఇండియా టీవీ సర్వే కూడా హంగ్ తప్పదనే సంకేతాలిచ్చింది. 223 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో కాంగ్రెస్ 96 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నప్పటికీ మేజిక్ ఫిగర్‌ను చేరుకోవటం కష్టమేనని పేర్కొంది. అటు బీజేపీ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలవనుండగా..జేడీఎస్ 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. అయితే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు ఈ పోల్ నిర్వహించినట్లు తెలిపిన ఇండియా టీవీ.. ప్రధాని ప్రచారంతో కన్నడ రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని పేర్కొంది. సర్వే ఫలితాల ప్రకారం.. బాంబే కర్ణాటకలో బీజేపీ 23, కాంగ్రెస్ 21, జేడీఎస్ 4 స్థానాలు గెలుచుకోనుండగా.. కోస్తా కర్ణాటకలో బీజేపీ 9, కాంగ్రెస్ 10, జేడీఎస్ 2 చోట్ల గెలవనున్నాయి. గ్రేటర్ బెంగళూరులో బీజేపీ 13, కాంగ్రెస్ 18, జేడీఎస్ 1 స్థానంలో, మధ్య కర్ణాటకలో బీజేపీ 20, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2 చోట్ల విజయం సాధించనున్నాయి. హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ 15 సీట్లు, కాంగ్రెస్ 14, జేడీఎస్ 2 చోట్ల గెలవనుండగా.. మైసూరు ప్రాంతంలో జేడీఎస్ 24, కాంగ్రెస్21 చోట్ల గెలవనుండగా.. బీజేపీకి 8 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే వెల్లడించనుంది. -
కన్నడనాట హంగే: సర్వే
బెంగళూరు: కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని మరో సర్వే స్పష్టం చేసింది. పూర్తిస్థాయి డిజిటల్ సాంకేతికతతో ఎన్జీ మైండ్‌ఫ్రేమ్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 95–105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. బీజేపీకి 75–85 సీట్లు, జేడీఎస్‌కు 35–41 సీట్లు వచ్చే చాన్సుందని వెల్లడైంది. ఇతరులకు 4–8 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. 224 నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 25 మందితో శాంపుల్స్ సేకరించి సర్వే చేశారు. ఇందులో 65% మంది ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని పేర్కొనగా మెజారిటీ స్థానాల్లో సిట్టింగ్‌లకే మరోసారి పట్టంగట్టే అవకాశం స్పష్టమైంది. ఎవరి నాయకత్వంలో కర్ణాటక అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ప్రశ్నకు.. 41%మంది సిద్దరామయ్యకు, 33% మంది యడ్యూరప్పకు, 23% మంది కుమారస్వామికి ఓటేశారు. ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని సర్వేలో వెల్లడైంది. జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారనుందని సర్వే తెలిపింది. -
అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
-
కర్ణాటకలో హంగ్!
హోరాహోరీ ప్రచార హోరు కొనసాగుతున్న కర్ణాటకలో.. ఓటరు తుది తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ వ్యతిరేకతను కాదని కాంగ్రెస్ మళ్లీ అధికార పీఠం అధిరోహిస్తుందా? లేక బీజేపీ చీఫ్ అమిత్ షా మంత్రాంగం ఫలించి దక్షిణ భారతావనిలోనూ బీజేపీ హవా ప్రారంభమవుతుందా? సీఎంగా సిద్దరామయ్య ఓకేనా? యడ్యూరప్పకు లభిస్తున్న మద్దతెంత?.. తదితర ప్రశ్నలకు ఇండియాటుడే–కార్వీ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కొంతవరకు సమాధానాలు లభించాయి. రాష్ట్రంలో హంగ్ రాబోతోందని, కాంగ్రెస్(90–101 సీట్లలో గెలుపు) అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, జేడీఎస్(34–43 సీట్లు) కింగ్ మేకర్ పాత్ర పోషించబోతోందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, బీజేపీ(78–86 సీట్లు)కి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ, మెజారిటీకి మాత్రం దూరంగానే ఉంటుందని తేలింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కన్నా సీఎంగా సిద్దరామయ్యకే ఎక్కువ మద్దతు లభించడం విశేషం. బెంగళూరు: కన్నడనాట హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఇండియాటుడే–కార్వీ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తెలిపింది. 225 మంది ఎమ్మెల్యే (ఒక నామినేటెడ్ ఆంగ్లో సాక్సన్)లున్న కన్నడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్ 90–101 స్థానాల్లో, బీజేపీ 78–96 చోట్ల గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీతో చేతులు కలిపిన జేడీ (ఎస్) 34–43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలో తేలింది. అటు సీఎంగా సిద్దరామయ్యకే 33 శాతం మంది ఓకే చెప్పగా.. యడ్యూరప్పకు 26 శాతం, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతిచ్చారు. తగ్గనున్న కాంగ్రెస్ సీట్లు ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత లేకపోయినా అధికారానికి అవసరమైన సీట్లు రావని సర్వేలో తేలింది. ఉపాధి కల్పన, స్వచ్ఛమైన తాగునీరు సహా పలు అంశాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ కోల్పోనున్న సీట్లలో బీజేపీ పాగా వేయనుంది. అయితే కమలదళం కూడా సంపూర్ణంగా ప్రజల మద్దతు సంపాదించలేదని తేలింది. లింగాయత్‌ల మైనారిటీ హోదా రిజర్వేషన్ల అంశం బీజేపీకి భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో 40 సీట్లున్న జేడీఎస్ తన సీట్లను కాపాడుకోనుంది. కన్నడ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికల కన్నా గణనీయంగా పెరగనున్నట్లు ఇండియాటుడే–కార్వీ సర్వేలో వెల్లడయింది. అయితే ఈ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేదని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి 35 శాతం ఓట్లను సాధించొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో లాగే 37 శాతం ఓట్లను గెలుచుకోనుండగా.. జేడీఎస్–బీఎస్పీ కూటమి 19 శాతం ఓట్లను గెలవొచ్చని సర్వే పేర్కొంది. ప్రజాభిప్రాయం కాంగ్రెస్+జేడీఎస్ ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి జేడీఎస్ మద్దతుండాలనే ప్రశ్నకు.. కాంగ్రెస్‌కే జేడీఎస్–బీఎస్పీ కూటమి మద్దతివ్వాలని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది కన్నడిగులు అభిప్రాయపడ్డారు. కేవలం 29 శాతం మందే కుమారస్వామి బీజేపీతో వెళ్తే బాగుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 224 నియోజకవర్గాల్లో 27,919 మందిని ఈ సర్వే బృందం ఇంటర్వ్యూ చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిపిన ఈ సర్వేలో 62 శాతం సర్వే శాంపుల్స్ గ్రామీణ కర్ణాటకలో.. మిగిలింది పట్టణ ప్రాంతాల్లో తీసుకున్నారు. 45 శాతం మంది సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 65 శాతం ముస్లింలు, 44 శాతం హిందువులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులాల వారిగా చూస్తే.. 55 శాతం మంది కురుబ గౌడ(సిద్దరామయ్య సామాజిక వర్గం)లు, 53 శాతం మంది దళితులు, 37 శాతం మంది లింగాయత్‌లు, 36 శాతం మంది బ్రాహ్మణులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో కీలకాంశాలు కన్నడ ఎన్నికల్లో ఉపాధికల్పన ప్రధాన అజెండాగా మారింది. 56 శాతం మంది ఉద్యోగాల్లేకపోవటం.. చాలా తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ విషయంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, సరైన తాగునీరు అందుబాటులో లేకపోవటం మొదలైన అంశాలపైనా ప్రజల్లో ఆందోళన నెలకొంది. సిద్దరామయ్యపైనే మెజారిటీ కన్నడిగులు సానుకూలంగా ఉన్నారు. 38 శాతం మంది సిద్దరామయ్య పనితీరు బాగుంది, చాలా బాగుందని తెలపగా..31 శాతం మంది పర్వాలేదన్నారు. 29 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. భాష, జెండా, టిప్పు సుల్తాన్.. కర్ణాటకలో కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న అంశాలపైనా రాష్ట్ర ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. అన్ని పాఠశాలల్లో కన్నడ భాషను తప్పనిసరి చేయటాన్ని 73 శాతం మంది అంగీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండే అంశంలోనూ 59 శాతం మంది సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచారు. కేవలం 29 శాతం మంది మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించటంపై మాత్రం 33 శాతం మందే సానుకూలంగా స్పందించగా.. 44 శాతం మంది వ్యతిరేకించారు. ముస్లింల్లోనూ 58 శాతం మంది మాత్రమే టిప్పు జయంతికి మద్దతు తెలిపారు. లింగాయత్‌లకు రిజర్వేషన్లపై మాత్రం ఆచితూచి స్పందించారు. 52 శాతం మంది ఈ ఎన్నికల్లో లింగాయత్‌ల అంశం కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. -
కర్ణాటకలో హంగ్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తాజాగా జరిపిన ఒక సర్వే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని, జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. సీహెచ్ఎస్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వే రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందంది. కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలకు మరింత పదును పెడితే తప్ప మ్యాజిక్ నంబర్ (112 సీట్లు)ను అందుకోవడం కష్టమని తేల్చింది. మొత్తం 224 సీట్లలో కాంగ్రెస్ 77–81 సీట్లు, బీజేపీ 73–76, జేడీఎస్ 64–66 సీట్లను సొంతం చేసుకుంటాయంది. ఈ సర్వే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రతి నియోజకవర్గంలో 2 వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి సర్వే జరిపినట్లు సీహెచ్ఎస్ తెలిపింది. ఈ సర్వేను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. తనకు దీంతో సంబంధమే లేదని, సీహెచ్ఎస్తో పాటు గుర్తు తెలియని వ్యక్తులపై సైబర్‌క్రైం సెల్లో ఫిర్యాదు చేసినట్లు పరమేశ్వర్ తెలిపారు. నిజానికి తమ పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని జేడీఎస్ చెప్పగా, బీజేపీ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది. -
31 మండలాల్లో హంగ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుర ఫలితాల తరహాలోనే.. జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలకు హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని 57 ఎంపీపీ స్థానాల్లో.. 31 చోట్ల ప్రధాన పార్టీలకు స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. టీఆర్ఎస్ 18 చోట్ల, కాంగ్రెస్ ఎనిమిది మండలాల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించాయి. దీంతో హంగ్ ఫలితాలు వెలువడ్డ చోట ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుంది.. ఇతరుల మద్దతుతో టీఆర్ఎస్ కైవశం చేసుకుంటుందా..? రాయబారాలు.. బేరసారాలతో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందా..? అనేది ఉత్కంఠ రేపుతోంది. పరోక్ష పద్ధతిన మెజారిటీ ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో జరిగే ఎన్నిక కావటంతో ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుక్షణం నుంచే... హంగ్ మండలాల్లో బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ 18 మండలాల్లో స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆయా మండలాల్లోని మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో సగానికి పైగా సీట్లను గెలుచుకొని ముందంజ వేసింది. మంథని, మహదేవ్పూర్, కోరుట్ల, మల్లాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, కరీంనగర్, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, హుస్నాబాద్, బెజ్జంకి, తిమ్మాపూర్, రామడుగు, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో టీఆర్ఎస్ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అవలీలగా తమ పార్టీ సభ్యుల మద్దతుతో అక్కడి ఎంపీపీ పీఠాలను కైవశం చేసుకోనుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎనిమిది మండలాల్లో ఆధిక్యత ప్రదర్శించింది. మంథని ముత్తారం, కమాన్‌పూర్, సారంగపూర్, మల్యాల, మేడిపల్లి, రాయికల్, భీమదేవరపల్లి, ఎలిగేడు మండలాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అక్కడి ఎంపీపీ పదవులను హస్తగతం చేసుకునేంత మెజారిటీని సాధించింది. మహాముత్తారం, కాటారం, మల్హర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కొడిమ్యాల, కథలాపూర్, జమ్మికుంట, ఎల్కతుర్తి, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, రామగుండం, ఓదెల, జూలపల్లి, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్, ధర్మారం, వెల్గటూరు, ముస్తాబాద్, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లకు స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో అక్కడ ఎంపీటీసీలు గెలుపొందిన స్వతంత్రులు, ఇతర పార్టీల విజేతలు కీలకమవనున్నారు. చాలాచోట్ల ఒకరిద్దరు సభ్యుల మద్దతుతో బలబలాలు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే క్యాంపు రాజకీయాలు, ఒప్పందాలకు తెరలేచింది. వచ్చే నెలలో ఎంపీపీ ఎన్నిక జరగనుంది. సుమారు నెల రోజుల వ్యవధి మిగిలి ఉందనే ధీమా ఉన్నప్పటికీ స్థానిక నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతుండటంతో మండలాల్లో వాతావరణం వేడెక్కింది. తుదికంటా ఎంపీపీ పీఠాలే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు పోటాపోటీ పడటం ఖాయమైంది. -
మెజారిటీ హంగ్
- ఎనిమిది చోట్ల అనిశ్చితి - కాంగ్రెస్, టీఆర్ఎస్లో ఉత్కంఠ - ఇతరుల మద్దతే కీలకం - నెంబర్ గేమ్‌కు పోటాపోటీ పుర ఫలితాల్లో గులాబీ జెండా ఎగరేసింది. కానీ.. ఛైర్మన్లు, మేయర్ స్థానాలకు సరిపడేన్ని మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోయింది.జమ్మికుంట, హుస్నాబాద్‌లో టీఆర్ఎస్, జగిత్యాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జిల్లాలోని 11 పట్టణాల్లో మిగతా ఎనిమిది చోట్ల హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో వచ్చే నెలలో జరిగే ఛైర్మన్లు, మేయర్ స్థానాల ఎంపిక ఉత్కంఠ రేపనుంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మేయర్, చైర్మన్ సభ్యుల సంఖ్యా బలాబలాలపై జరిగేవి కావటంతో... అన్ని పార్టీలు ఇతరులు, స్వతంత్రుల మద్దతు కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ బలాబలాలు ఎవరికి మొగ్గు చూపితే... ఆ పార్టీ అక్కడి పుర పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశముంది. అందుకే... రెండు పార్టీలు మరో నెల రోజులు బస్తీమే సవాల్‌కు కత్తులు దువ్వనున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు సైతం ఓటుహక్కు ఉండటంతో జయాపజయాల మొగ్గు ఎటువైపు ఆసక్తి రేపుతోంది. - కరీంనగర్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ అత్యధికంగా 24 స్థానాలను కైవశం చేసుకుంది. కాంగ్రెస్‌ను కేవలం 14 స్థానాలకు కట్టడి చేసింది. కానీ మేయర్ సీటును దక్కించుకునేందుకు మరో రెండు సీట్లు కావాల్సి ఉండటంతో.. తుది ఫలితానికి టీఆర్ఎస్ మళ్లీ శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. - రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ అత్తెసరు ఆధిక్యం ప్రదర్శించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకోగా టీఆర్ఎస్ 14 డివిజన్లలో విజయం సాధించింది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఇండిపెండెంట్లు 15 స్థానాల్లో సత్తా చాటుకున్నారు. దీంతో అక్కడ హంగ్ ఫలితం వెలువడింది. ఇండిపెండెంట్లు కీలకంగా మారటంతో రామగుండం మేయర్ పీఠం చివరి వరకు ఉత్కంఠ రేపనుంది. - కోరుట్ల మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 13 చోట్ల గెలుపొందారు. 8 చోట్ల టీఆర్ఎస్, ఎంఐఎం 5, బీజేపీ 2, ఇండిపెండెంట్లు మూడు చోట్ల విజయం సాధించారు. ఇక్కడి ఛైర్మన్ పీఠాన్ని అందుకునేందుకు కాంగ్రెస్‌కు ఇతరుల మద్దతు కీలకంగా మారనుంది. - సిరిసిల్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో 15 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ 10, బీజేపీ-3, టీడీపీ-1, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో విజయం సాధించారు. మరో ఇద్దరు సభ్యుల మద్దతు సాధిస్తే మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఖాతాలో జమవుతుంది. - మెట్‌పల్లిలోని మొత్తం 24 వార్డుల్లో సగానికి సగం 12 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 9 వార్డులకే పరిమితమైంది. బీజేపీ ఒక చోట, ఇండిపెండెంట్లు రెండు చోట్ల విజయం సాధించారు. మేజిక్ ఫిగర్‌కు మరో సీటు అవసరం కావటంతో టీఆర్ఎస్ అక్కడి ఎమ్మెల్యే ఓటు.. లేదా ఇతరుల మద్దతు కీలకంగా మారనుంది. - హుజూరాబాద్ నగర పంచాయతీలో టీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ ఆరు వార్డులు గెలుచుకున్నాయి. బీజేపీ, టీడీపీలో చెరో సీటు, ఇండిపెండెంట్లు మూడు చోట్ల సత్తా చాటుకున్నారు. దీంతో ఇక్కడ ఇతరుల మద్దతు కీలకంగా మారనుంది. - వేములవాడ నగర పంచాయతీలో బీజేపీ అత్యధికంగా తొమ్మిది వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చెరో మూడు వార్డులు గెలుచుకున్నాయి. మిగతా అయిదుగురు ఇండిపెండెంట్లు విజయం సాదించారు. వీరిలో ఇద్దరి మద్దతుతో బీజేపీ నగర పంచాయతీని కైవశం చేసుకునే అవకాశముంది. - పెద్దపల్లి నగర పంచాయతీ టై అయింది. ఇక్కడి 20 వార్డు స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా చెరో ఆరు సీట్లు గెలుచుకున్నాయి. టీడీపీ మూడు వార్డుల్లో, ఇండిపెండెంట్లు 3 చోట్ల సత్తా చాటుకున్నారు. ఒక చోట ఎంఐఎం, మరో చోట బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఇక్కడి ఫలితం రెండు పార్టీల మధ్య దోబూచులాడుతోంది. -
చలో చలో క్యాంప్
- ఆత్మరక్షణ వ్యూహం - వల వేసే ఎత్తుగడలు - రెండు పార్టీల్లో హడావుడి సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అత్యధిక స్థానాల్లో హంగ్ ఫలితాలతో మేయర్, ఛైర్మన్లను కైవవం చేసుకోవటం ప్రధా న పార్టీలకు తలనొప్పిగా మారనుంది. సొంత సభ్యులను కాపాడుకుంటూనే ఇతరుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహరచన చేయటం రెండు పార్టీలకు తప్పనిసరిగా మారింది. ఏమరుపాటుగా ఉంటే బలాబలాలు తారుమారయ్యేలా ఉండటంతో సభ్యుల బేరసారాలు.. రకరకాల ఒప్పందాల ఎత్తులతో పాటు క్యాంపు రాజకీయాలకు నేతలు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఛైర్మన్, మేయర్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ నుంచి 24 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మేయర్ రేసులో ఉన్న అభ్యర్ధి రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో వీరు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపు నిర్వహించే ఆలోచనలో ఉంది. - కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి జువ్వాడి నర్సింగరావు శనివారం రాత్రి 31 మందిని ధర్మపురికి తీసుకెళ్లారు. మరుసటి రోజున తిరిగి వచ్చారు. వీరిలో 13 మంది విజయం సాధించారు. - మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో ఈ నెల 11న టీఆర్ఎస్ అభ్యర్థులు 31 మంది హైదరాబాద్‌కు తీసుకెళ్లి తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది గెలిచారు. ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవడంతో వారితో కలిసి క్యాంపునకు వెళ్లేందు కు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. - మెట్పల్లి మున్సిపాలిటీలో 12 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు చేరుకున్నారు. పట్టణ అధ్యక్షుడు బర్ల సాయన్న సతీమణి బాగీర్త చైర్పర్సన్ అభ్యర్థి రేసులో ఉన్నారు. సాయన్న అధ్వర్యంలో వీరందరూ హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలిసింది. - హుస్నాబాద్ నగర పంచాయతీని స్పష్టమైన ఆధిక్యంతో కైవశం చేసుకున్న టీఆర్ఎస్.. సొంత సభ్యులు చేజారకుండా అప్రమత్తమైంది. చైర్మన్ అభ్యర్థి చంద్రయ్య ఆధ్వర్యంలో 11 మంది సోమవారం రాత్రి హైదరాబాద్ బయల్దేరుతున్నారు. - హుజూరాబాద్ నగర పంచాయతీ నుంచి 9 మంది టీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లను సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్యాంపునకు తరలించేందుకు సిద్ధమయ్యారు. -
పురం.. ‘హంగ్’పరం!
మెజార్టీ మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నంతలో కాంగ్రెస్‌కే ఆధిక్యం మొత్తం 56 స్థానాల్లో 18 చోట్ల మాత్రమే స్పష్టమైన మెజారిటీ 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, మూడింట్లో టీఆర్ఎస్ గెలుపు ఒక్కో మున్సిపాలిటీలో టీడీపీ, బీజేపీ, ఎంఐఎం జయకేతనం చాలాచోట్ల మెజారిటీకి కొద్ది దూరంలో పార్టీలు.. స్వతంత్రులే కీలకం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. అత్యధిక పురపాలక సంఘాల్లో హంగ్ ఫలితాలే దర్శనమిచ్చాయి. 33 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలు, 3 కార్పొరేషన్లు.. మొత్తం 56 పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరిగితే ఓటర్లు 18 చోట్ల మాత్రమే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 12 చోట్ల కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాగా, టీఆర్ఎస్ మూడు స్థానాల్లో మెజారిటీ సాధించింది. టీడీపీ, బీజేపీ, మజ్లిస్ పార్టీలకు ఒక్కో మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ లభించింది. మిగిలిన 35 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల విషయానికొస్తే వీటిల్లో ఏ ఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. అయితే కాంగ్రెస్ 14, టీఆర్ఎస్ 7, టీడీపీ 6, బీఎస్పీ 1, బీజేపీ 2 మున్సిపాలిటీల్లో అధిక స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీలుగా అవతరించాయి. మూడు కార్పొరేషన్ల (నిజామాబాద్, రామగుండం, కరీంనగర్)లోనూ మిశ్రమ ఫలితాలొచ్చాయి. నిజామాబాద్‌లో మొత్తం 50 వార్డులకుగాను కాంగ్రెస్, మజ్లిస్ చెరో 16 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక్కడ 10 వార్డుల్లో గెలిచిన టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. కరీంనగర్లో 50 వార్డులకుగాను టీఆర్ఎస్ 24 వార్డుల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక్కడ కాంగ్రెస్ 14 స్థానాలకే పరిమితమైంది. రామగుండ ంలో మాత్రం 50 వార్డుల కుగాను 19 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఏర్పడింది. స్వతంత్రులే కీలకం మొత్తం మీద మెజారిటీ మున్సిపాలిటీలలో చైర్మన్ పీఠం సాధించేందుకు స్వతంత్రులు, మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. మొత్తం 53 మున్సిపాలిటీల్లో 18 చోట్ల చైర్మన్ పదవి దక్కాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతే పార్టీలకు ప్రధానంగా మారింది. అదే సమయంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఓట్లకూ ప్రాధాన్యత లభించనుంది. మెజారిటీకి ఒకటి రెండు ఓట్లు తక్కువ పడిన పక్షంలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే కీలకమవుతాయి. ఎక్కడ తమ ఓట్లు అవసరమో ఆ మున్సిపాలిటీలనే ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల 16న సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే పార్టీల వారీగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఎక్కడెక్కడ కీలకమో స్పష్టం కానుంది. ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్‌లో మొత్తం 36 స్థానాలుంటే.. అత్యధికంగా టీఆర్ఎస్కు 14 వార్డులు లభించాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతోపాటు, ఎక్స్ అఫీఫియో సభ్యుల ఓట్లతో చైర్మన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 34 స్థానాలు ఉన్న బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు 14 స్థానాలు వచ్చాయి. మరో నాలుగు సీట్లు ఉంటే కానీ చైర్మన్ స్థానాన్ని పొందే అవకాశం లేదు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. స్వతంత్రుల మద్దతు లభించినా.. ఎక్స్ అఫీషియో సభ్యులు లేదా మరో పార్టీ నుంచి మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిర్మల్‌లో 36 స్థానాలుంటే.. బీఎస్పీకి 16 దక్కాయి. ఇక్కడి ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతుగా నిలిచినా ఎక్స్ అఫీషియో సభ్యుడు లేదా మరో పార్టీ మద్దతు తప్పనిసరి. కాగజ్‌నగర్‌లో 28 స్థానాలకు టీఆర్ఎస్కు 13 వచ్చాయి. ఇక్కడ ఆ పార్టీకి మరో రెండు కావాల్సి ఉంది. 10 మంది స్వతంత్రుల్లో ఇద్దరు లేదా ముగ్గురి మద్దతు తప్పనిసరి. సిరిసిల్లలో 33 స్థానాలకుగాను టీఆర్ఎస్కు 15 వచ్చాయి. స్వతంత్రుల మద్దతు లభిస్తే మున్సిపాలిటీని దక్కించుకోవచ్చు. 31 స్థానాలున్న కోరుట్లలో కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించగా, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. మెట్‌పల్లిలోని 24 స్థానాల్లో 12 చోట్ల టీఆర్ఎస్ నెగ్గింది. ఇక్కడ కూడా ఇద్దరు ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. వేములవాడలోని 20 స్థానాలకు బీజేపీకి తొమ్మిది వచ్చాయి. ఇక్కడ ఐదుగురు స్వతంత్రులున్నారు. హుజురాబాద్‌లోని 20 స్థానాల్లో టీఆర్ఎస్ 9 నెగ్గింది. ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఇక్కడ కీలకంగా మారింది. సంగారెడ్డిలో 31 స్థానాలుంటే.. కాంగ్రెస్‌కు 11 లభించాయి. ఐదుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. జహీరాబాద్లోనూ కాంగ్రెస్‌కు 24 స్థానాలు రాగా, మెజారిటీకి మరొక సీటు కావాలి. అక్కడ ఒక్కరే ఇండిపెండెంట్ ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 41 స్థానాలుంటే.. కాంగ్రెస్‌కు 14 మాత్రమే వచ్చాయి. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఆరుగురు ఎంఐఎం సభ్యుల మద్దతు ఇక్కడ కీలకంగా మారింది. వనపర్తిలో 26 స్థానాలకు టీడీపీ ఎనిమిది నెగ్గింది. 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో టీడీపీ ఇక్కడ చైర్మన్ పదవి దక్కించుకోవచ్చు. కోదాడలో 30 స్థానాలుంటే... మెజారిటీకి 16 కావాలి. ఇక్కడ కాంగ్రెస్‌కు 14 స్థానాలుండగా.. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు అవసరం. హుజూర్‌నగర్‌లోని 20 సీట్లలో కాంగ్రెస్ పది నెగ్గింది. ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్మన్ పీఠం పొందవచ్చు. జనగామలో 28 స్థానాలకు కాంగ్రెస్ 14 దక్కించుకుంది. స్వతంత్ర లేదా ఎక్స్ అఫీఫియో సభ్యుల ఓట్లు ఇక్కడ కీలకమయ్యాయి. పరకాలలోని 20 స్థానాల్లో టీఆర్ఎస్కు ఎనిమిది వచ్చాయి. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకంగా మారారు. కొత్తగూడెంలో 33 స్థానాలు ఉంటే.. కాంగ్రెస్‌కు 12 మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు లేకుంటే పీఠం దక్కదు. కార్పొరేషన్లలో.. కరీంనగర్ కార్పొరేషన్లో 50 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 24 డివిజన్లలో గెలుపొందింది. పూర్తి మెజారిటీ రావాలంటే మరో రెండు స్థానాలైనా కావాలి. ఇక్కడ ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. వారి మద్దతు వద్దనుకుంటే కనీసం ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు పొందాల్సి ఉంటుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ మేయర్ పీఠం సాధించాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకంగా మారింది. నిజామాబాద్‌లోనూ ఎవరికీ మెజారిటీ రాలేదు. ఇక్కడ టీఆర్ఎస్, మజ్లిస్ కూటమిగా లేదా మజ్లిస్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి మేయర్ పీఠం ద క్కించుకునే వీలుంది. మరోవైపు ఐదు పురపాలక సంఘాల్లో ఫలితాలు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. పెద్దపల్లి, మహబూబాబాద్, భూపాలపల్లి, భువనగిరి, తాండూరు పురపాలక సంఘాల్లో ప్రధాన ప్రత్యర్థులకు సమాన సీట్లు వచ్చాయి. ప్రధాన పార్టీలకు సమానంగా.. మరోవైపు ఐదు పురపాలక సంఘాల్లో ఫలితాలు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. పెద్దపల్లి, మహబూబాబాద్, భూపాలపల్లి, భువనగిరి, తాండూరు పురపాలక సంఘాల్లో ప్రధాన పార్టీలకు సమాన సీట్లు వచ్చాయి. పెద్దపల్లిలో 20 వార్డులకుగాను కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెరో 6 స్థానాలు దక్కాయి. మహబూబాబాద్‌లో 28 వార్డులుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెరో ఏడు స్థానాలు దక్కాయి. భూపాలపల్లిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లు చెరో ఏడు స్థానాలు గెలుచుకున్నాయి. భువనగిరిలో 30 వార్డులుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. తాండూరులో 31 వార్డులకుగాను టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు 10 స్థానాల చొప్పున దక్కాయి.