వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం సోమవారంతో ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైంది. ఎన్నికలు పూర్తవడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో.. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో వంటి అనేక అంశాలపై పోస్ట్ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి.
ఈ క్రమంలో గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.
చదవండి: మణిపూర్ ఎగ్జిట్ పోల్స్: కమలం Vs కాంగ్రెస్.. వారిదే పైచేయి
గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్ తప్పనిసరైతే.. కింగ్ మేకర్‌గా ఎవరు మారనున్నారో మార్చి 10న తేలనుంది.
చదవండి: పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు
టైమ్స్ నౌ
బీజేపీ:14
కాంగ్రెస్-16
ఆప్-4
జీ న్యూస్
బీజేపీ:15
కాంగ్రెస్-16
ఆప్-2
ఇతరులు7
జన్ కీ బాత్
బీజేపీ: 17
కాంగ్రెస్ కూటమి 17
ఆప్: 1
ఇతరులు: 4
న్యూస్‌ఎక్స్-పోల్‌స్ట్రాట్
బీజేపీ:17-19
కాంగ్రెస్:11-13
సీఎన్‌ఎక్స్
బీజేపీ- 16-21
కాంగ్రెస్11-17
ఆప్0-2
ఇతరులు5-7
Comments
Please login to add a commentAdd a comment