
జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. జూన్ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.