vijaykumar
-
పసిడి కోక.. కట్టుకుంటే కేక
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్.. పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ మేరకు విజయకుమార్ బంగారంతో నిలువు, అడ్డం పోగులను చేనేత మగ్గంపై నేశారు. 800 నుంచి 900 గ్రాముల బరువు.. 49 అంగుళాల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీరను రూపొందించారు.కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశాడు. ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం రూ.18 లక్షలు ఖర్చయినట్టు విజయ్‌కుమార్ తెలిపారు. అక్టోబరు 17న సదరు వ్యాపారి కూతురు పెళ్లి ఉండడంతో.. ఆరు నెలల కిందటే ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, సువాసన వచ్చే చీర, కుట్టులేని జాతీయ జెండాను చేనేత మగ్గంపై నేసిన విజయ్‌కుమార్.. తాజాగా బంగారు చీరను నేయడం విశేషం. -
75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా..
ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్‌ప్యాక్‌ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్‌ప్యాక్‌ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన విజయ్‌కుమార్. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్‌ప్యాక్ కలను సాధించలేకపోతున్నారు.సిక్స్‌ప్యాక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్‌ప్యాక్ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్‌ప్యాక్‌ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్‌కుమార్ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్‌వాక్‌లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్‌కుమార్‌పై సాక్షి కథనం.. సునాయాసంగా కఠోర ఆసనాలు 28 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామాలుఓల్డ్బోయిన్పల్లికి చెందిన ఎం.విజయ్‌కుమార్ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్ వరకూ ఉన్న జిమ్ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్‌లో ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిపరడిన విజయ్‌కుమార్ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్లోనూ...కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్‌కుమార్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్ వర్కవుట్తోపాటు జాగింగ్, సైక్లింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్‌ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.అందరూ క్రీడాకారులే... వ్యాయామం, క్రీడలు విజయ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్‌కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్‌లకు వెళతారు. సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్ కోచ్‌గా ఉన్నాడు.ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...సికింద్రాబాద్ ప్రాంతంలో విజయ్‌కుమార్ వర్కవుట్ చేయని జిమ్, సైక్లింగ్ చేయని రోడ్డు, జాగింగ్ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్‌లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.శేషజీవితం సమాజానికి అంకితం నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. – మందుల విజయ్‌కుమార్ -
‘నారాయణ’ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బలి
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్‌కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్‌ను హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్‌కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
జనసేన ‘కిక్కు’ దిగింది
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు. తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్‌కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్‌ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు. -
నటి శ్రీదేవి విజయ్‌కుమార్ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్‌నగర్: నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను తీసింది. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరం మండలం కందుకూర్ నుంచి కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూర్‌కు కోళ్లను తరలిస్తున్న డీసీఎం.. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగా గురువారం అర్ధరాత్రి మక్తల్ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం వసుదుర్గాకు చెందిన డీసీఎం డ్రైవర్ విజయ్‌కుమార్ (40)తో పాటు కోళ్లను లోడ్ చేసేందుకు వెళ్లిన అంబ్లే గ్రామానికి చెందిన జగదీష్ అలియాస్ మంజు (37), భద్రావతికి చెందిన షఫివుల్లా (35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. డ్రైవర్ విజయ్‌కుమార్‌కు భార్య కుమార్‌బాయితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్‌కు (మంజు)కు భార్య గీత, ఇద్దరు పిల్లలు, షఫి ఉల్లాకు భార్య షాభానుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. Follow the Sakshi TV channel on WhatsApp: -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. -
మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్‌కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం. విజయ్‌కుమార్ మిల్లెట్స్‌తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్‌పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్‌లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. -
లే‘టేస్ట్’ ట్రెండ్..!
మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్‌కుమార్ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చదివిన విజయ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు. భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్‌లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్పై పని చేసే ఇంక్యుబేటర్‌ను సొంతంగా ప్లేవుడ్‌తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు. ఆదాయం బాగుంది నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. – పిల్లా విజయ్‌కుమార్, పాలతోడు, మండపేట మండలం -
టిప్పర్ ఢీకొని.. కాపాడండని వేడుకుని..
ఖమ్మం క్రైం: అతి వేగంతో వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొని ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. టిప్పర్ కింద చిక్కుకుపోయిన యువకుడు తనను కాపాడాలని వేడు కున్నాడు.. పోలీసులు స్పందించి యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరా లివి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన దొప్పా వీరబాబు కుమారుడు విజయ్‌కుమార్ ఖ మ్మంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖమ్మం శ్రీని వాసనగర్‌లో ఉంటున్న ఆయన మంగళవారం గదికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. పక్కనే అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కుడివైపునకు తిరగడంతో విజయ్‌కుమార్‌ను ఢీకొంది. విజయ్ అదుపు తప్పి లారీ చక్రాల కింద పడిపోయాడు. ఆయన నడుం భాగంపైకి టైర్లు ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తన ప్రాణాలు కాపా డాలని ఆ యువకుడు వేడు కున్నాడు. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ చేరుకుని విజయ్ను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా టిప్పర్ నడిపిన డ్రైవర్ బుడిగ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్‌లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్‌కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్‌లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్‌లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్‌ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్‌ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్‌తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్‌తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
ఆస్ట్రేలియాకు పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా దేశం వదిలి పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ నెల 17న పెనమలూరులో రేషన్‌షాపును పీడీఎస్ డీటీ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేశారు. స్టాకు తేడా ఉండటంతో రిపోర్టు రాస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో వచ్చి డీటీ విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజుపై దాడి చేశారు. ఈ దాడి తర్వాత కనిపించకుండాపోయారు. పోలీసులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బోడె అనుచరులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులు తర్వాత బోడె ప్రసాద్ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ పారిపోయి అక్కడ తల దాచుకున్నారని, ఆ తర్వాత 19వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఆ రేషన్ డీలర్ టీడీపీ కార్యకర్తే.. సోషల్ మీడియాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం వీడియో విడుదల చేశారు. రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు టీడీపీ కార్యకర్త అని మరోసారి బహిరంగపరిచారు. రేషన్ షాపు తనిఖీ చేయడం నేరమని, డీటీని ప్రశ్నించేందుకు వెళితే అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేదిలేదని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనుచరులను జైలు పాల్జేసి తాను మాత్రం కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపోవడంపై ఆ పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. రేషన్ షాపులో అక్రమాలు జరగకపోతే స్టాకులో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార ఏమైనట్టని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు ఏ ప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. శనివారం ఆయన సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్‌తో కలిసి అనంతపురం కలెక్టరేట్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, వైఎస్సార్ జిల్లా జాయిం ట్ కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను పరిశీ లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరా లు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. వీటిపై కలెక్టరు నివేదిక పంపుతారన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్ష ల మేరకే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త జిల్లాలన్నింటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. రాయలసీమలో కొత్త జిల్లాలపై 1,600కు పైగా అ భ్యంతరాలు వచ్చాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గానీ పెట్టాలన్న భావన వ్యక్తమైందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందన్నారు. రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్లో కలపాలని, కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో ఉంచమని కోరుతున్నారన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని చెప్పారు. నగరిని తిరుపతిలో ఉంచాలని అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి అంశం పూర్వాపరాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు మౌలిక వసతులపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో బుధవారం విజయవాడలో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ తరపున సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్, జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వాటిలో సహేతుకంగా ఉన్నవి, వాటి అవసరం వంటి అంశాలను పరిశీలిస్తామన్నారు. వీటిపై మార్చి 10 లోపు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలుపుతారని, ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 1,400 వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని, ఒకే విషయానికి సంబంధించి ఎక్కువ వచ్చాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని, నర్సాపురాన్ని జిల్లాగా ఉంచాలని కోరుతూ ఎక్కువ సూచనలు వచ్చాయని తెలిపారు. పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల గురించి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయన్నారు. సహేతుక కారణాలుంటే రెవెన్యూ డివిజన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. ప్రత్యేక డిజైన్‌తో 3 నుంచి 4 లక్షల చదరపు అడుగుల్లో వీటిని నిర్మించాలని చెప్పారన్నారు. వీటి కోసం ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్‌ను నియమించాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాలకు దాదాపు అన్ని జిల్లాల్లో భవనాలు గుర్తించామన్నారు. ప్రభుత్వ భవనాలు, భూముల్లోనే కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు. తప్పనిసరైతేనే ప్రైవేటు భవనాలు చూస్తున్నామన్నారు. -
అధ్యయనం.. ఆకాంక్షలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి శాస్త్రీయంగా రూపొందించినట్లు ప్రణాళికాశాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై జరిగిన సుదీర్ఘ కసరత్తును గురువారం ఆయన విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో విలేకరులకు తెలియచేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తూ జిల్లా కేంద్రాలు అందరికీ సమీపంలో ఉండేలా ప్రతిపాదించినట్లు తెలిపారు. మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ప్రతిపాదించినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రజల అభివృద్ధికి రెండు జిల్లాలు దోహదం చేస్తాయన్నారు. పార్వతీపురం జిల్లా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో ఏర్పాటవుతుంది. అరకు జిల్లా అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం ప్రాంతం రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉన్నా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని వివరించారు. కోనసీమ ప్రజల కల సాకారం శ్రీకాకుళం పేరుతో ఉన్న సంస్థలన్నీ ఎచ్చెర్లలో ఉన్నందున ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం, అభివృద్ధి దెబ్బతినకుండా రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించినప్పుడు అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉండడంతో పెందుర్తిని అందులో కలిపామన్నారు. భీమిలికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలన్న ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమలాపురం కేంద్రంగా ప్రతిపాదించామని తెలిపారు. సగటు జనాభా 20 లక్షలు నరసాపురం పార్లమెంటు స్థానంలో భీమవరం మధ్యలో ఉండడంతో జిల్లా కేంద్రంగా ప్రతిపాదించి కొత్త రెవెన్యూ డివిజన్ తెచ్చామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులో కలిసిపోయి ఉండడంతో దాన్ని ప్రకాశం జిల్లాకు కలిపామని తెలిపారు. ఇదే ప్రాతిపదికన నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో, హిందూపురంలోని రాప్తాడుని అనంతపురం జిల్లాకి కలుపుతున్నట్లు చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌లోని సర్వేపల్లి అసెంబ్లీని నెల్లూరు జిల్లాలో, చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా నివసిస్తున్నట్లు తెలిపారు. 26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లాలోకి, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి తెలిపారు. 26 జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దవిగా ఒంగోలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ రెండు జిల్లాల్లో నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడమేనని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువైనా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, అక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉంటున్నట్లు చెప్పారు. జన గణన అడ్డంకి కాదు.. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయవచ్చని, సహేతుక కారణాలుంటే పరిగణనలోకి తీసుకునే అవకాశముంటుందని ప్రణాళిక శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించాక వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త జిల్లాలపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, ఆర్థిక వ్యవహారాలపై ఆయా కమిటీలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తాయన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జనాభా గణన అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. సమావేశంలో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె.శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
అసాధారణ స్థాయిలో అమరరాజా కాలుష్యం
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్ తిరుపతి, చిత్తూరు యూనిట్ల పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆ యూనిట్లు, వాటి పరిసరాల్లో సేకరించిన శాంపిల్స్‌ను పీసీబీ లేబొరేటరీ, హైదరాబాద్‌లోని ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లలో విశ్లేషించగా ఈ విషయాలు బయటపడినట్టు తెలిపారు. అక్కడ వాడిన నీటిని ట్రీట్ చేయకుండా బయటకు వదలడంతో ఆ నీటిని వాడిన పరిసరాల్లోని మొక్కలు, మనుషులు, జంతువుల్లోకి లెడ్ ప్రవేశించే పరిస్థితి నెలకొందన్నారు. డబ్లు్యహెచ్‌వో గుర్తించిన 10 అత్యధిక ప్రమాదకరమైన మెటల్స్‌లో లెడ్ ఒకటని తెలిపారు. -
అమరరాజాను తరలించాలని మేమే చెప్పాం
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై హైకోర్టులో తాము పిటిషన్ వేశామని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌ను తరలించాలని తాము చెప్పగా.. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలిపోతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం అవాస్తవమని స్పష్టం చేశారు. అవాస్తవాలు రాసిన ఆ పత్రికకు లీగల్ నోటీసు ఇస్తామని, పరువు నష్టం దావా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి విజయకుమార్ ఇంకా ఏం చెప్పారంటే.. గడువు ఇచ్చినా కాలుష్యాన్ని నియంత్రించ లేదు రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ప్రతినెలా చేస్తున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 54 పరిశ్రమల్లో తనిఖీలు చేశాం. వాటిలో కాలుష్యం ఎక్కువగా వస్తుందని గమనించి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వాటిని సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా కొంత సమయం అడిగింది. అందుకు 2 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఉల్లంఘనలు ఎంతవరకు సరయ్యాయో తెలుసుకునేందుకు మళ్లీ తనిఖీ చేశాం. అప్పుడు కూడా సరికాకపోవడంతో మళ్లీ నోటీసు ఇచ్చాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉత్పత్తిని నిలిపివేసి, తప్పుల్ని సరి చేసుకున్నాక మళ్లీ పునఃప్రారంభం చేసుకునేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ నోటీసు ఇచ్చాం. దీనిపై వారి వాదన వినిపించేందుకు రెండుసార్లు (లీగల్ హియరింగ్)కు అవకాశం ఇచ్చాం. అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు, తిరుపతి యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే అందులో పనిచేసే కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం మరింత పెరిగి, అక్కడి వారి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించాం. ఏలూరులో ఇలాంటి పరిస్థితిలోనే లెడ్, నికెల్ లెవెల్స్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడిన విషయాన్ని గుర్తు చేశాం. అలాంటి వైపరీత్యాలు వస్తున్న క్రమంలో కాలుష్యాన్ని నియంత్రిస్తే తప్ప పరిశ్రమను నడిపించడానికి వీల్లేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. ఈ విధంగా ఈ ఏడాది 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని, 50 పరిశ్రమలను మూసివేయాలని క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చాం. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునే వరకు మూసివేసి, నియంత్రణ చర్యలు తీసుకున్నాక ఉత్పత్తి చేసుకోవాలని చెప్పాం. క్లోజర్ ఆర్డర్ ఇచ్చాక అమరరాజా బ్యాటరీస్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 వారాలపాటు స్టే ఇచ్చింది. ఈలోపు ఓ బృందాన్ని నియమించి పూర్తిస్థాయి తనిఖీలు చేసి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఒక సాంకేతిక టీమ్‌ని నియమించి అక్కడికి పంపి హైకోర్టుకు నివేదిక సమర్పించాం. ఉద్యోగుల రక్తంలోనూ సీసం చేరింది అమరరాజా ప్లాంట్ వద్ద వాడే నీటిని పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించాలి. కానీ లెడ్ (సీసం)తో కలిసిన నీటిని నేరుగా మొక్కలు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏవిధమైన ఏటీపీ (ఎఫిలియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) చేయకుండా నేరుగా లెడ్ కలిసిన నీటిని ఎస్టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండపక్కనే ఉండటం వల్ల ఈ నీటితోపాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్ నీరు చెరువుల్లో కలిసింది. మల్లెమడుగులో కేజీకి 134.79 మిల్లీగ్రాముల లెడ్ ఉంది. గొల్లపల్లిలో 319 మిల్లీగ్రాములు, నాయుడు చెరువులో అయితే 3,159 మిల్లీగ్రాములు ఉంది. ఈ నీరు తాగిన జంతువుల్లోకి లెడ్ వెళుతోంది. అక్కడి మొక్కల్లోకి వెళ్లి వాటినుంచి కూరగాయల ద్వారా మనుషుల శరీంలోకి లెడ్ వెళుతోంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు, లోపల, పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 కిలోమీటర్ల భూమి, నీటిలో లెడ్ ప్రవేశించింది. భూమి, నీరు, ఇతర రకరకాల శాంపిల్స్‌ని విశ్లేషించాం. ప్రతిచోటా రెండు చొప్పున శాంపిల్స్‌ని సేకరించి ఒకటి పీసీబీ లేబొరేటరీలో, మరొక శాంపిల్‌ని హైదరాబాద్‌లో ఉన్న స్వతంత్య్ర సంస్థ ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)కి పంపించాం. ఈ రెండు నివేదికలను హైకోర్టుకు సమర్పించాం. పరిశ్రమ మెయిన్ గేటు దగ్గర ఉన్న బోర్ వెల్ శ్యాంపిల్ తీసుకుని ఈపీటీఆర్ఐకి పంపితే అందులో లీటర్‌కి 0.08 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. వాస్తవానికి ఇది 0.01కి మించి ఉండకూడదు. ఎల్వీఆర్ఎల్ఏ స్టోర్స్ అనేచోట తీసుకున్న శాంపిల్‌లో 200 శాతం ఎక్కువ లెడ్ ఉంది., మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర లీటర్‌కి 0.3 మైక్రో గ్రాములు లెడ్ ఉంది. పరిశ్రమకు దగ్గరున్న గొల్లపల్లి చెరువులో 500 శాతం, కరకంబాడీ చెరువులో 90 శాతం, నాయుడుచెరువులో 1,200 శాతం ఎక్కువ లెడ్ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్‌ను బెంగళూరులోని ఒక లేబొరేటరీకి పంపించాం. 12 శాతం శాంపిల్స్‌లో బ్లడ్ లెవెల్స్ డెసిలేటర్‌కి 42 మైక్రో గ్రాములు ఉంది. ఇది అత్యధికంగా 10 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. 450 మంది ఉద్యోగుల శరీరంలో పరిమితిని దాటిపోయి లెడ్ ఉంది. ఈ ఉద్యోగులను లెడ్ రాని ఏరియాలో పనిచేయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు పూర్తిస్థాయి అధ్యయనం చేయమని చెప్పడంతో మద్రాస్ ఐఐటీ నిపుణులను తనిఖీలకు పంపాం. వాళ్లతోపాటు పీసీబీ సిబ్బందిని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. పర్యావరణాన్ని దెబ్బతీస్తే మానవ జాతికి ఇబ్బంది ఈ రెండు పరిశ్రమలు ఉన్నచోట మొక్కలు, చెట్లు, నేల, నీరు, గాలి, చుట్టుపక్కల అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దాన్ని ఎంతో కొంత పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పాం. జరిగిన ఉల్లంఘనల్ని సరిచేసే వరకు ఆ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని చెప్పాం. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని, పరిసర గ్రామాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీసి.. పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మానవ జాతి మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం. -
'అమర్‌రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం'
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టామని పర్యావరణ శాఖ అధికారి, ఎక్స్ ఆఫీసీయో కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమర్‌రాజాను టార్గెట్ చేశామన్నది అవాస్తవమని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌రాజాకు నోటీసులు ఇచ్చి 2 నెలల సమయం ఇచ్చాం. ఆ తర్వాత మళ్లీ తనిఖీ చేసి కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పాం. పర్యావరణ చర్యలు చేపట్టకముందే రెండోసారి నోటీసులు ఇచ్చాం. హానికరమైన అంశాలు గుర్తించి అమర్‌రాజాకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. పరిశ్రమల ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా పీసీబీ నియంత్రిస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ కేటగిరీ పరిశ్రమల్లో ప్రతి నెలా తనిఖీలు చేస్తాం. జనవరిలో 54 పరిశ్రమలు తనిఖీ చేశాం. కొన్ని పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించాం.అందులో భాగంగానే అమర్‌రాజాతో పాటు చాలా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టి 54 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 64 పరిశ్రమలకు ఉత్పత్తి ఆపాలని ఆదేశాలు ఇచ్చాం. 50 పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం అని తెలిపారు. -
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమని పుదుచ్చేరి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తేని.విజయకుమార్ కొనియాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సాయినగర్ గ్రామ సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సర్పంచ్ డీవీ రమణ, సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. తక్కువ సమయంలో పారదర్శకంగా ప్రజలకు సేవలందించడంలో సచివాలయ వ్యవస్థ సంజీవనిలా పనిచేస్తుందని అక్కడి సిబ్బందిని ప్రశంసించారు. చెవిరెడ్డి సేవలు ఆదర్శం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సేవలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని మంత్రి విజయకుమార్ కొనియాడారు. ఫోన్లో చెవిరెడ్డిని అభినందించారు. -
ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని బెనిఫిట్స్ తీసుకెళ్లొచ్చంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కొందరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఇన్చార్జుల నిర్లక్ష్యం కారణంగా అది నెరవేరట్లేదు. ఫలితంగా పదవీ విరమణ చేసిన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే రిటైర్డ్ ఏసీపీ కేఎన్ విజయ్‌కుమార్ పరిస్థితి. సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేసిన కేఎన్ విజయ్‌కుమార్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ దక్క లేదు. ఇటీవల ఆయన కరోనా బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది రోజులు గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. ఆర్థిక కారణాలతో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రస్తుతం మరో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. ఎంతో సేవ చేసిన తన తండ్రిని పోలీస్ విభాగం గాలికి వదిలేసిందంటూ ఆయన కుమార్తె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, విజయ్‌కుమార్‌ను ఫోన్లో ‘సాక్షి’పలకరించింది. ‘నాకు రావాల్సిన బెనిఫిట్స్ నేను దాచుకున్నవి. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కష్టార్జితం నుంచి పొదుపు చేసుకున్న నగదు ఇప్పుడు చేతికి అందట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇందల్వాయి ఎస్ఐ శివప్రసారెడ్డిపై వేటు మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..! -
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్‌ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. -
అధిక రైతాంగం తిరోగమన సంకేతం
సేద్యంలోనే స్వేదం చిందిస్తున్న 70 కోట్ల మంది కలిగిన రైతు రాజ్యం భారతావని. 40 కోట్ల ఎకరాల సువి శాల సాగుక్షేత్రం. ప్రతీఏటా 28.5 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్న సుఫల ధరిత్రి. జీడీపీలో 16.5 శాతం వాటా కలిగిన వ్యవసాయ ప్రభావ ఆర్థిక వ్యవస్థ. ఈ గణాంకాలు చూస్తే వ్యవసాయ రంగంలో భారతదేశం అద్భుతం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ ఎక్కువ మంది రైతులు, ఎక్కువ సాగుభూమి, జీడీపీలో ఎక్కువ శాతం వ్యవసాయం వాటా... ఈ లెక్కలన్నీ వాస్తవానికి తిరోగమన సంకేతాలు. జంతువుల మాదిరిగానే, ఒకప్పుడు మానవులకు కూడా ఆహార అన్వేషణలోనే కాలమంతా గడిచేది. కానీ, మానవ జీవితం అక్కడే ఆగిపోలేదు. ఆహారం సంపాదించడానికే మొత్తం కాలం, శ్రమ ఖర్చు చేయడం లేదు. చాలా దేశాలు తమకు కావల్సిన తిండిని ఉత్పత్తి చేసుకుంటూనే, జేబులు నింపే మరో పని చేసుకుంటున్నాయి. కానీ కొన్ని సమాజాలు మాత్రం ఆరంభ దశలోనే ఆగిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితానుంచి బయట పడడం లేదు. అలాంటి కొన్ని దేశాల జాబితాలో భారతదేశం ఉండడం ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత వైఫల్యం. 1950 దశకంలో నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయిస్ ప్రతిపాదించిన ‘నిర్మాణాత్మక పరివర్తన ఆర్థిక సిద్ధాంతం ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల నుంచి ద్వితీయ, తృతీయ రంగాలుగా పేర్కొన్న పారిశ్రామిక, సేవారంగాలకు ఎంత ఎక్కువ మంది బదిలీ కాగలిగితే ఆ దేశాలు అంత తక్కువ సమయంలో వృద్ధి చెందుతాయని ఆ సిద్ధాంతం తేల్చి చెప్పింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్ ఇలా పరివర్తన చెందినవే. ఫోర్ ఏసియన్ టైగర్స్‌గా పేరొందిన హాంగ్ కాంగ్, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్ ఈ థియరీని అనుసరించి, కేవలం 30 ఏళ్లలో (1960–90) తమ స్థితిని అమాంతం మార్చుకున్నాయి. భారతదేశంలో సగానికిపైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతుంటే, అమెరికాలో కేవలం 0.7 శాతం మంది, జపానులో 3.9, జర్మనీలో 2.4, ఇంగ్లండులో 1.4, రష్యాలో 5.9 శాతం మంది మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. మనలాంటి దేశమే అయిన చైనాలో 26 శాతం, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇజ్రాయిల్‌లో 2 శాతం మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఒకప్పుడు వ్యవసాయం మీదనే ఆధారపడిన మిగతా జనమంతా పారిశ్రామిక, సేవా రంగాలకు మారి వ్యక్తిగతంగా బాగుపడ్డారు. దేశాలు బాగుపడ్డాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, భారతదేశ జిడిపిలో వ్యవసాయరంగం వాటా 16.5 శాతమైతే, అమెరికాలో అది 0.9 శాతం. చైనాలో 7.9, జపానులో 1.1, జర్మనీలో 0.7, ఇంగ్లండులో 0.7, రష్యాలో 3.55, ఇజ్రాయిల్‌లో 2.4 శాతం వ్యవసాయ రంగం వాటా. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తక్కువ ఉన్నప్పటికీ ఈ దేశాలన్నీ ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి కలిగిన దేశాలు. ఆయా దేశాలు వ్యవసాయాన్ని తమకు తిండి పెట్టే రంగంగా, మిగతా రంగాలను ఆర్థికంగా శక్తినిచ్చే రంగాలుగా చూస్తున్నాయి. కానీ భారతదేశంలో రెండింటికీ వ్యవసాయమే దిక్కయింది. తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామీకరణకు తరలించడం సాధ్యమయ్యే పనికాకపోవచ్చు. అందుకే వ్యవసాయాధారిత పరిశ్రమలను పెంచే పని వేగం అందుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు స్థాపించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన అందులో భాగంగానే కనిపిస్తున్నది. నిర్మాణాత్మక పరివర్తన ఆర్థిక సిద్ధాంతం అమలు చేసి తీరాలని భారతదేశంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. నెహ్రూ నాయకత్వంలో రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం కూడా వేగవంతమైన పారిశ్రామికీకరణే. కానీ వేర్వేరు కారణాల వల్ల ఆ స్ఫూర్తి కొనసాగలేదు. దేశంలో ఆహార కొరత ఏర్పడి, హరితవిప్లవం అత్యవసరం అయిపోయి, పారిశ్రామికీకరణ ఆశించిన వేగం అందుకోలేదు. హరిత విప్లవం కారణంగా దేశంలో ఉత్పత్తి పెరిగింది కానీ, ఉత్పాదకత పెరగలేదు. పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిన దేశాలే వ్యవసాయ రంగంలోనూ ఉత్పాదకతను బాగా పెంచుకోవడం గమనించదగ్గ విషయం. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించిన వివరాలు భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత డొల్లతనాన్ని బయట పెడుతున్నవి. భారతదేశంలో 40 కోట్ల ఎకరాల్లో ఏటా 285 మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధించగలుతున్నారు. కానీ మనలాంటి వాతావరణ పరిస్థితులే కలిగిన చైనాలో కేవలం 38 కోట్ల మంది రైతులు, 34 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో ఏటా 571 మిలియన్ టన్నుల పంట పండిస్తున్నారు. దేశంలో ఎకరానికి ఏడాదికి సగటున 17.8 క్వింటాళ్ల వరిధాన్యం పండిస్తే, చైనాలో 28.4 క్వింటాళ్లు పండిస్తున్నారు. అమెరికాలో 34.8, జపాన్‌లో 26.7, రష్యాలో 20 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. వరి, గోధుమ లాంటి తిండి గింజలు, పప్పుల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంటే, ఉత్పాదకతలో మాత్రం 38వ స్థానంలో ఉన్నది. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో తాము విధిలేక వ్యవసాయం చేస్తున్నామని 65 శాతం మంది రైతులు చెప్పారు. అవకాశం వస్తే మరో రంగంలోకి పోతామని 62 శాతం మంది రైతులు చెప్పుకున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేయడం కన్నా పట్టణాలకు పోయి కూలీ చేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని 69 శాతం మంది వెలిబుచ్చారు. మరో అవకాశం వస్తే వెళ్లిపోతామని రైతులూ అంటున్నారు, ఇది దేశానికీ అవసరం కాబట్టి భారతదేశంలో కొత్త వృత్తుల సృష్టి జరిగి తీరాలి. అందరూ ఒకే పంట వేయడం ఎట్ల లాభదాయకం కాదో, అందరూ ఒకే పనిలో ఉండడం కూడా ప్రయోజనకరం కాదు. చైనాలో కేవలం పదేళ్ల కాలంలోనే వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్యను 70 శాతం నుంచి 23 శాతానికి తగ్గించారు. ప్రతీ ఏటా ప్రభుత్వం నిర్దేశించుకునే లక్ష్యాల్లో వ్యవసాయ రంగం నుంచి ఈసారి ఇంత మందిని ఇతర రంగాలకు తరలించాలనే లక్ష్యం కూడా ఉండి తీరాలి. పారిశ్రామిక, సేవా రంగాల్లో వచ్చే గణనీయ ఆదాయంలో కొంత భాగాన్ని (క్రాస్ సబ్సిడీగా) వ్యవసాయ రంగాభివృద్దికి ఉపయోగించడం ఉత్తమ ఆర్థిక విధానం అవుతుంది. దేశ రక్షణ బాధ్యతల్లో ఉండే సైనికుల సంక్షేమం మాదిరిగానే, ప్రజల ఆహార భద్రత బాధ్యత నిర్వరిస్తున్న రైతు సంక్షేమం అమలు కావాలంటే కూడా ఇతర రంగాల పురోగతి తప్పనిసరి. వ్యాసకర్త గటిక విజయ్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రజా సంబంధాల అధికారి Vijaynekkonda@gmail.com -
తగ్గుతున్న వెరీ యాక్టివ్ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏడాది కాలంలో సాగిన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలపై సమీక్ష.. రాబోయే నాలుగేళ్లలో చేపట్టాల్సిన పనులకు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకూ ‘మన పాలన–మీ సూచన’ పేరుతో మేధోమథన సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జరుగుతుందన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ► ప్రజా ప్రభుత్వంలో ఏడాది పాటు సాగిన పాలన, పనితీరు ఏ విధంగా ఉంది. రాబోయే రోజులకు సంబంధించి ప్రజలు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారనే దానిపై ఐదు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ► ఏడాదిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు, పనితీరుపై లబ్ధిదారులు, సమాజంలోని ముఖ్య నాయకులు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి తరహాలో కార్యక్రమాలుంటాయి. ► 25న పాలనా వ్యవస్థలో వికేంద్రీకరణ, గ్రామ, వార్డు స్థాయిలో వచ్చిన మార్పులు, గ్రామ సచివాలయాలు, పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకున్న చర్యలపై మేధోమథనం ఉంటుంది. ► 26న వ్యవసాయం, రైతులు, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడులు, విద్యుత్, సాగునీరు, ఆక్వా, పశు సంవర్ధకం వంటి రంగాల్లో జరిగిన మేలు, ప్రజా సూచనలపై చర్చ. ► 27న విద్యా రంగంలో తెచ్చిన పెను మార్పులు, విద్యను అభ్యసించే పద్ధతిలో వచ్చిన మార్పులు, తల్లులకు కల్పించిన సేవలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య వంటి అన్ని అంశాలపై లబ్ధిదారులు, నిపుణులతో మేధోమథనం. ► 28న పరిశ్రమలకు సంబంధించిన మౌలిక వసతులు, నైపుణ్యాల పెంపు, వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ఆయా రంగాలకు ఏవిధమైన వసతులు వచ్చాయనే దానిపై సమీక్ష. లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం. ► 29న ఆరోగ్య వ్యవస్థపై మేధోమథనం. ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులు, ఆరోగ్య వ్యవస్థ, వైద్య విద్యలో సంవత్సర కాలంగా జరిగిన పనులు, కలిగిన లబ్ధి, రాబోయే రోజులకు సూచనలు తీసుకుంటాం. కోవిడ్‌పైనా సమీక్ష ఉంటుంది. ► 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతుంది. ► రాష్ట్ర స్థాయిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మూడు గంటలపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ► ప్రతిరోజూ ఉదయం పథకాల లబ్ధిదారులు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడి.. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకూ అవే అంశాలపై జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, లబ్ధిదారులు, నిపుణులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ► ఆ జిల్లాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజల నుంచి సూచనలు తీసుకుంటాం. 13 జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుని.. వాటన్నింటినీ క్రోడీకరించి ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ► ప్రతి రంగానికి సంబంధించి ప్రజల సూచనలు తీసుకుని రాబోయే రోజులకు లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకెళ్లడం వీటి ఉద్ధేశం. ప్రతిరోజూ కార్యదర్శులు ఆయా రంగాలపై క్లుప్తంగా నివేదికలు ఇస్తారు. అనంతరం ప్రజలు, లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం. ► ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమంగా దీనిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతరం ప్రజల అభిమతాలను పరిగణనలోకి తీసుకోవాలనే ధృక్పథంతో ముందుకెళుతున్నాం. -
26 నుంచి సచివాలయ సేవలు..
సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు.