![Amara Raja Batteries pollution on an extraordinary level - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/5/Vijaykumar.jpg.webp?itok=J3J7kZXd)
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్ తిరుపతి, చిత్తూరు యూనిట్ల పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు.
ఆ యూనిట్లు, వాటి పరిసరాల్లో సేకరించిన శాంపిల్స్‌ను పీసీబీ లేబొరేటరీ, హైదరాబాద్‌లోని ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లలో విశ్లేషించగా ఈ విషయాలు బయటపడినట్టు తెలిపారు. అక్కడ వాడిన నీటిని ట్రీట్ చేయకుండా బయటకు వదలడంతో ఆ నీటిని వాడిన పరిసరాల్లోని మొక్కలు, మనుషులు, జంతువుల్లోకి లెడ్ ప్రవేశించే పరిస్థితి నెలకొందన్నారు. డబ్లు్యహెచ్‌వో గుర్తించిన 10 అత్యధిక ప్రమాదకరమైన మెటల్స్‌లో లెడ్ ఒకటని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment