పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య | Raudisitar brutal daylight murder | Sakshi
Sakshi News home page

పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య

Published Mon, Oct 13 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

Raudisitar brutal daylight murder

బెంగళూరు: పాతకక్షలతో రౌడీషీటర్‌ను దారుణంగా నరికి చంపిన సంఘటన ఇక్కడి మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీటీఎం లేఔట్‌లో నివాసం ఉంటున్న నఖ్రా బాబు (35)ను దారుణంగా హత్య చేశారు. ఇదే ఏడాది జూన్ 24న రాత్రి కర్ణాటక-తమిళనాడు సరిహద్దులలోని సిఫ్‌కాట్‌లో బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ కవల అలియాస్ విజయ్‌కుమార్  కారులో వెళ్తుంటే ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా రోడ్డుపై వెంటాడి హత్య చేశారు.

ఈ కేసులో నఖ్రా బాబుతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జామీనుపై బయటకు వచ్చిన నిందితులు బెంగళూరులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే రెండు వర్గాలు రాజీకి వచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇక్కడి బీటీఎం లేఔట్‌లోని జైభీమానగరలోని వెళ్లారు. ఆ సమయంలో ఇరు వ ర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పరస్పరం దాడులకు చేసుకున్నారు.

కవలను హత్య చేసిన నఖ్రా బాబును దారుణంగా హత్య చేశారు. అతని వెంట ఉన్న విశ్వ, హీరాలాల్, బాబులకు తీవ్రగాయాలు కావడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement