Raudisitar
-
రౌడీషీటర్ హత్య?
జగిత్యాల క్రైం/రాయికల్: విందులో ఏర్పడ్డ చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. స్నేహితులే ఓ రౌడీషీటర్‌ను హత్య చేసిన ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా సింగరావుపేట శివారులో జరిగింది. అయితే మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల మండలం చల్గల్కు చెందిన బొల్లారపు యశ్వంత్, గాజర్ల కిశోర్ జగిత్యాలలోని అరవింద్నగర్కు చెందిన రౌడీషీటర్ మాద అనిల్‌కుమార్(21)తో కలిసి సింగరావుపేట శివారులోని ఓ రేకులషెడ్డులో మంగళవారం విందు చేసుకున్నారు. చిన్నపాటి గొడవనే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం యశ్వంత్, కిశోర్ చల్గల్కు వచ్చి.. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని.. అత్యవసరంగా కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని కారు తీసుకెళ్లారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి గుర్తుతెలియని చోట పడేశారు. తర్వాత యశ్వంత్ అతని మిత్రునికి ఫోన్‌చేసి కారును మెట్పల్లిలో వదిలిపెట్టామని, తాము అనిల్‌ను హత్య చేశామని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. కారు యజమాని, అతని మిత్రుడు మెట్‌పల్లికి వెళ్లి కారును అందులో రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ సీఐ రాజేశ్, రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్, రాయికల్ ఎస్సై కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తల్లి ఫిర్యాదుతో రాయికల్ ఠాణాలో కేసు నమోదు చేశారు. అనంతరం జగిత్యాల డీఎస్పీ భద్రయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో రక్తపు మరకలు ఉండడంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు దొరికితేనే మృతదేహం లభ్యం? అనిల్‌కుమార్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు లొంగిపోతే తప్ప మృతదేహం ఎక్కడుందనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. నిందితుల సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో పోలీసులు పలుకోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రౌడీషీటర్ వాహెద్ దారుణ హత్య
► ప్రత్యర్థిగా మారిన అనుచరుడు ఫెరోజ్ ► పథకం ప్రకారం విందుకు పిలిచి ఘాతుకం ► జహీరాబాద్‌లో ఘటన ► దందాలో తలెత్తిన విభేదాలే కారణం జహీరాబాద్/సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ వాహెద్ (35) జహీరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక బృందావన్ కాలనీ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఈ హత్య జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం ప్రకారం... నగరంలోని బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కు చెందిన పహిల్వాన్ వాహెద్‌పై సనత్‌నగర్ ఠాణాలో‡ రౌడీషీట్ ఉంది. ఇతడిపై 11 కేసులున్నాయి. మూడు హత్యలు, మరో మూడు రేప్ కేసుల్లో నిందితుడు. అంతేకాకుండా పండిట్ ¯ð హ్రూనగర్, రాజీవ్‌గాంధీ నగర్, యూసుఫ్ నగర్, వాహెద్ నగర్ ప్రాంతాల్లో తను అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకొని నేరాలు, సెటిల్మెంట్లు చేసేవాడు. దీంతో పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైల్లో ఉండి.. ఈనెల 4న జైలు నుంచి విడుదలయ్యాడు. అతని గ్యాంగ్‌లోనే కొనసాగిన కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఫెరోజ్ సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇతడిపై ఒక హత్యతో పాటు పలు కేసులున్నాయి. వాహెద్ జైల్లో ఉన్న సమయంలో ఫెరోజ్ తన దందాలు ఉధృతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదిలా ఉండగా, గతంలో మాదిరిగా కలిసి పనిచేద్దామని ఫెరోజ్.. వాహెద్‌తో నమ్మబలికాడు. జహీరాబాద్‌లో విందు ఉందని, అక్కడికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాడు. జహీరాబాద్‌కు చెందిన ఇనాయత్తో బీదర్‌కు చెందిన వ్యక్తి ఫాంహౌస్‌లో ఫెరోజ్ విందు ఏర్పాటు చేయించాడు. 2.30 గంటల ప్రాంతంలో హత్య శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫెరోజ్ తన అనుచరులు ఆరుగురితో హైదరాబాద్ నుంచి జహీరాబాద్ చేరుకున్నాడు. సాయంత్రం 6 గంటలకు వాహెద్ ఏడుగురు అనుచరులతో ఫాంహౌస్‌కు వచ్చాడు. ఫెరోజ్, అతడి మనుషులతో కలిసి గదిలో కూర్చుని వాహెద్ మద్యం తాగాడు. వాహెద్ అనుచరులు మాత్రం ఫాంహౌజ్ బయట కూర్చుని తాగారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాహెద్‌పై ఫెరోజ్, అతని మనుషులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశాడు. దీంతో వాహెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని అనుచరులపై దాడికి యత్నించగా వారంతా పరారయ్యాడు. మృతుడి తమ్ముడు వసీం విషయం తెలుసుకొని ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. డీఎస్పీ తిరుపతన్న, సీఐ నాగరాజు, ఎస్సైలు రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్యకు గల కారణాలు సేకరించారు. విందు ఏర్పాటు చేసిన ఇనాయత్‌ను, ఫాంహౌస్ మేనేజర్ మొయిజ్‌ను విచారించారు. మద్యం, మగువలతో ఎర వాహెద్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఫెరోజ్ మద్యం, మగువలను ఎరివేసినట్టు తెలుస్తోంది. విందులో 25 మంది వరకు ఉండి ఉంటారని, వారిలో మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళను గదిలోకి పంపించిన అనంతరం ఫెరోజ్ మనుషులు వాహెద్‌పై దాడి చేసి ఉండొచ్చని తెలిపారు. హత్యకు గురైన సమయంలో వాహెద్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు, మహిళకు సంబంధించిన వస్రా్తలు కూడా పడి ఉన్నాయి. -
రౌడీషీటర్ దారుణహత్య
పరిచయస్తులపైనే అనుమానం? మృతదేహాన్ని పరిశీలించిన ఏఆర్ ఏఎస్పీ వెంకటాచలం: రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి అతిదారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీలో బుధవారం మధ్యాహ్నం జరి గింది. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన కోడూరు అశోక్‌కుమార్ (35) బస్సుడ్రైవర్, ఆటో మెకానిక్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో మొదటి భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో ఉడ్‌కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన బద్దెపూడి చెంచురామయ్య కుమార్తె ధనమ్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. అశోక్‌కుమార్, ధనమ్మ ఉడ్‌కాంప్లెక్స్ సమీపంలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అశోక్‌కుమార్‌పై ఓ హత్య కేసుతో పాటు పలు కేసులు ఉన్నా యి. దీంతో ఇతనిపై నెల్లూరు ఐదోనగర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. బుధవారం ఉదయం భార్య ధనమ్మతో గొడవపడిన అశోక్‌కుమార్ తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటలకు నక్కలగుంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడనే విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌కార్డు అధారంగా భగత్‌సింగ్‌కాలనీకి చెందిన అశోక్‌కుమార్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అశోక్‌కుమార్ మామ చెంచురామయ్య, అత్త శ్యామలమ్మ సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పరిచయస్తులే హంతకులు అశోక్‌కుమార్‌ను అతని పరిచయస్తులే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య ధనమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన అశోక్‌కుమార్‌కు పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినట్లు కా ల్స్ డీటైల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే నిందితులు పధ కం ప్రకారం అశోక్‌కుమా ర్ను అక్కడకు రప్పించి గొడ్డళ్లతో మెడ, తలపై నరికి దారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటాం: ఏఆర్ అడిషనల్ ఎస్పీ రౌడీషీటర్ హత్యకేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ సూరిబాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హత్యకు గురైన రౌడీషీటర్ అశోక్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అశోక్‌కుమార్ హత్యపై అన్నీకోణాల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అశోక్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. -
మరో రౌడీపై పీడీ యాక్ట్
యాకుత్‌పుర: పాతబస్తీకి చెందిన మరో కరుడుగట్టిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ బార్డర్ యూసుఫ్‌పై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీం తో పోలీసులు యూసుఫ్ ఖాన్‌ను ఆదివారం అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. భవానీనగర్‌కు చెం దిన ఇతనిపై మూడు హత్యలు, హత్యాయత్నం, రెండు స్నాచింగ్, బెదిరింపు కేసులున్నాయి. యూసుఫ్ దశాబ్ద కాలం నుంచి వరుసగా నే ర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నాయకుడు కోనపురి రాములు హత్య కేసులో కూడా ఇతడు నిందితుడు. కిరాయి హత్యలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతని ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం కింద ఒక్కసారి జైలుకెళ్తే ఏడాది పాటు బెయిల్ రాదు. ఏడాది వరకు కూడా వీరి ప్రవర్తనలో మార్పు వస్తే విడుదల చేస్తారు. లేని పక్షంలో మరో ఏడాది పాటు జైలులో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది. నెల రోజుల వ్యవధిలో నగర పోలీసులు పది మంది రౌడీషీటర్లను పీడీ యాక్ట్ కింద చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్‌పై అరెస్టయిన రౌడీషీటర్లు వీరే..... మహ్మద్ ఇల్యాస్ బిన్ హబీబ్ సలామ్ (గోల్కొండ) మహ్మద్ మాజిద్ (గొల్కొండ) చోర్ కౌసర్ (ఆసిఫ్‌నగర్) యూసుఫ్ (ఆసిఫ్‌నగర్) మహ్మద్ ఫిర్దౌస్ (బంజారాహిల్స్ సయ్యద్‌నగర్) మహ్మద్ లతీఫ్ (మల్లేపల్లి) మహ్మద్ తన్వీర్ (ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్) పల్లె సుధాకర్‌రెడ్డి(జూబ్లీహిల్స్) బోడ రాజుల (జూబ్లీహిల్స్) తాజాగా మహ్మద్ యూసుఫ్ ఖాన్ (భవానీనగర్) -
పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య
బెంగళూరు: పాతకక్షలతో రౌడీషీటర్‌ను దారుణంగా నరికి చంపిన సంఘటన ఇక్కడి మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీటీఎం లేఔట్లో నివాసం ఉంటున్న నఖ్రా బాబు (35)ను దారుణంగా హత్య చేశారు. ఇదే ఏడాది జూన్ 24న రాత్రి కర్ణాటక-తమిళనాడు సరిహద్దులలోని సిఫ్‌కాట్‌లో బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ కవల అలియాస్ విజయ్‌కుమార్ కారులో వెళ్తుంటే ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా రోడ్డుపై వెంటాడి హత్య చేశారు. ఈ కేసులో నఖ్రా బాబుతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జామీనుపై బయటకు వచ్చిన నిందితులు బెంగళూరులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే రెండు వర్గాలు రాజీకి వచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇక్కడి బీటీఎం లేఔట్‌లోని జైభీమానగరలోని వెళ్లారు. ఆ సమయంలో ఇరు వ ర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పరస్పరం దాడులకు చేసుకున్నారు. కవలను హత్య చేసిన నఖ్రా బాబును దారుణంగా హత్య చేశారు. అతని వెంట ఉన్న విశ్వ, హీరాలాల్, బాబులకు తీవ్రగాయాలు కావడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రౌడీషీటర్ నాగాకు స్పాట్
శివమొగ్గలో పేరు మోసిన రౌడీ బెయిల్‌పై బయటకు వచ్చి ప్రత్యర్థుల చేతిలో హతం నిందితుడిపై గూండా చట్టం శివమొగ్గ : పట్టణంలో పేరు మోసిన రౌడీ నాగరాజు అలియాస్ స్పాట్ నాగ (38) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణా రహితంగా నరికివేశారు. వివరాలు... పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళ్తుండగా అతనికి ఎటువ ంటి అనుమానం రాకుండా వెంబడించిన ప్రత్యర్థులు బీహెచ్ రోడ్డు వద్ద చుట్టుముట్టారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా నరికివేశారు. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం నాగ హత్యతో స్థానికులు హడిలిపోయారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కౌశలేంద్రకుమార్, అడిషనల్ ఎస్పీ దయాల్, డీవైఎస్పీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ సంఘటన స్థాలాన్ని పరిశీలించారు. దొడ్డపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్పాట్ నాగ హత్యకు సంబంధించి తమిళ రమేష్, రౌడీ హంది (పంది) అణ్ణి సోదరులు గిరిష్, బీఆర్పీ రఘు, మరి కొంత మంది హస్తం ఉందని నాగ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పేరుమోసిన రౌడీ : శివమొగ్గలో స్పాట్ నాగపై పలు హత్యలు, దోపిడీలు, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఓ కేసులో జైలులో ఉన్న నాగ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా కూడా నేరవృత్తి వీడలేదు. నాగకు రౌడీ హెబ్బెట్టు మంజుతో పాత కక్షలు ఉన్నా యి. జైలులో ఉండగానే నాగను హత్య చేయడానికి పథకం రచించారని తెలుసుకున్న జైలు సిబ్బంది నాగను మరోజైలుకు తరలించారు. వీరి నేర ప్రవృత్తిని అదుపు చేయాలని జిల్లా కలెక్టర్ విపుల్ బన్సాల్, ఎస్పీ నాగపై గుండా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే 15 రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన నాగ హత్యకు గురికావడంతో పోలీసులు నిఘాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రౌడీషీటర్ దారుణ హత్య
పాత కక్షలే కారణమా..? నిందితుల కోసం గాలింపు మదనపల్లె క్రైం: మదనపల్లె చంద్రాకాలనీలో శనివారం అర్ధరాత్రి రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి చంపారు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీనగర్‌కు చెందిన పెద్దరెడ్డెప్ప, సుభద్ర దంపతుల కుమారుడు పూల వెంకటాచలపతి అలి యాస్ పూల చలపతి(29) ట్రాక్టర్ నడుపుకుంటూ, పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2010 ఆగస్టు 15న నీరుగట్టువారిపల్లెలో జరిగిన విశ్వనాథరెడ్డి హత్య కేసులో, 2012 మార్చి 12న మదనపల్లె రూరల్ పరిధిలోని కోళ్లఫారం వద్ద జరిగిన జయచంద్రారెడ్డి హత్య కేసులో ఇతను నిందితుడు. మరి న్ని కేసుల్లో నేరారోపణలు ఉండడంతో రెండో పట్టణ పోలీసులు 2011లో అతనిపై రౌడీషీట్‌ను ఓపెన్ చేశారు. విశ్వనాథరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టేయడం తో అతని బంధువు జగదీశ్వర్‌రెడ్డి చలపతిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం ఉదయం చలపతి స్నేహితుడు షెటీపై అదే ప్రాంతానికి చెందిన శంకర్ దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన చలపతి రాత్రి రింగ్ రోడ్డులోని డాబా వద్ద శంకర్‌తో గొడవపడ్డాడు. ఇతనితో ఎప్పుడైనా ముప్పేనని భావించిన జగదీశ్వర్‌రెడ్డి, శంకర్, మరి కొందరు కలిసి అర్ధరాత్రి వరకు డాబా వద్ద కాపుకాశారు. తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై చల పతి ఇంటికి వెళుతుండగా కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దాడి చేశారు. తల, గొంతు, మెడ, చేతులపై విచక్షణారహితంగా నరికారు. ప్రాణభయంతో చలపతి చంద్రాకాలనీలోని ఇంటింటికీ వెళ్లి తలుపులు తట్టినా ఎవరూ తీయలేదు. ఇదే అదనుగా భావించి ప్రత్యర్థు లు అతన్ని చంపేశారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ సీఎం. గంగయ్య, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. చిత్తూరు నుంచి జాగిలాలను రప్పించారు. డాగ్ చంద్రాకాలనీ గుట్టమీద వరకు వెళ్లి ఆగిపోయింది. పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి ఫోన్ చేసి రెచ్చగొట్టారు తన భర్త రాత్రి 9.30 గంటలకు ఇంటికొచ్చాడని భార్య జ్యోతి తెలిపింది. ఆ సమయంలో కొంతమంది ఫోన్‌చేసి ‘ఇక్కడ రుబాబు చేసి ఇంటికెళ్లి దా క్కుంటావా.. దమ్ముంటే బయటకు రా.. లేదంటే మమ్మల్నే అక్కడికి రమ్మంటావా’ అని ఫోన్ చేసి రెచ్చగొట్టారని పేర్కొంది. దీంతో తన భర్త ఆవేశంగా బయటకు వెళ్లాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని బోరున విల పించింది. గౌడసానిపల్లె శంకర, చం ద్రాకాలనీ అంజి, డాబా సూరి, జగదీ శ్వర్‌రెడ్డి, గొల్లపల్లె ఆనంద్, పిల్ల నాగ, ఎస్టేట్ నారాయణే తన భర్తను హత్య చేసి ఉంటారని తెలిపింది. -
సెటిల్మెంట్లపై ప్రత్యేక దృష్టి
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :జిల్లాలో రౌడీషీటర్ల సెటిల్మెంట్లు, వారి ఆధిపత్యపోరుతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇకపై ఇటువంటి అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రా రీజియన్ ఐజీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గురువారం రాత్రి ఆయన అమలాపురం డివిజన్లో నేరాలు, దర్యాప్తు పురోగతిపై డీఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రౌడీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కేసుల దర్యాప్తులో కొంత వెనుకబడిందన్నారు. ఇపుడు సమైక్యాంధ్ర ఉద్యమం ముగిసినందున పూర్తిగా కేసుల దర్యాప్తుపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమాన్సింగ్, జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి, అమలాపురం డీఎస్పీ కె.రఘు, అమలాపురం సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు, ముమ్మిడివరం సీఐ ఆలీ, రాజోలు సీఐ పెద్దిరాజుతో ఆయన డివిజన్లో శాంతి భద్రతల పరిస్థితి, కేసుల దర్యాప్తులో పురోగతిపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల అమలాపురం పట్టణంలో రౌడీషీటర్లకు చెందిన రెండు వర్గాల పరస్పర హత్యాయత్నం ఘటనలపై ఐజీ లోతుగా ఆరా తీశారు. రౌడీలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన డీఎస్పీ రఘును ప్రశ్నించినట్టు తెలిసింది. పట్టణంలో రౌడీషీటర్లపై నిఘా ఉంచామని చెప్పిన డీఎస్పీ వారిపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. డివిజన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు, ఇతర నేరాలపై ఐజీ, డీఐజీ కోనసీమలోని స్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలించి సమీక్షించారు. -
పాతనేరస్తులపై నిఘా పెంచండి
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ :పాత నేరస్తుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెంచాలని అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్పరెన్స్ హాలులో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ మొదటసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్ష కొనసాగింది. జిల్లా పరిధిలోని నాలుగు సబ్డివిజన్ల అధికారులతో విడివిడిగా సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. జిల్లా పరిధిలోని ఏ కానిస్టేబుల్‌ను అడిగినా కేడీ, డెకాయిట్, రౌడీషీటర్ల నివాసాలను తనిఖీల సమయంలో తప్పక చూపించాలని చె ప్పారు. వారి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగినప్పుడే నేరాలను నియంత్రిం చగలమన్నారు. పెండింగ్‌లో, దర్యాప్తులో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారంట్లలోని నిందితులను గుర్తించి కోర్టులో హాజరుపరచాలని, నిందితుల ఆచూకీ లభించనట్లయితే మళ్లీ వారంట్లను కోర్టులో అప్పగించి నూతన వారంట్లను ఇచ్చి నిందితుల ఆచూకీ కనుగొనాలని సూచించారు. పలురకాల సమస్యలపై భార్యాభర్తల మధ్య ఏర్పడే వివాదాల్లో వెంటనే కేసులు నమోదు చేయకుం డా చట్టపరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సివిల్ వివాదాల్లో అధికారుల అనుమతిలేకుండా చట్టా న్ని అతిక్రమించి కేసులు నమోదు చేయడం, రాజీచేసే యత్నాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు అందించే ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదుచేయాలని తెలిపారు. రహదార్లవెంట ఆక్రమణలను తొలగించేందు కు ఇటీవల కార్పొరేషన్ అధికారులతో చర్చిం చామని స్థానిక వ్యాపారులు, ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో తప్పనిసరిగా డీఎస్పీ లేదా సీఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలను తెలియజేయాలన్నారు. సమావేశంలో ఓఎస్డీ వెలిశల రత్న, డీఎస్పీలు టి.రవీంద్రబాబు, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎన్.జోసఫ్రాజ్కుమార్, ఎం.మధుసూదనరావు, పీవీ సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.