పాతనేరస్తులపై నిఘా పెంచండి
Published Sun, Nov 10 2013 1:51 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ :పాత నేరస్తుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెంచాలని అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్పరెన్స్ హాలులో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ మొదటసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్ష కొనసాగింది. జిల్లా పరిధిలోని నాలుగు సబ్‌డివిజన్ల అధికారులతో విడివిడిగా సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. జిల్లా పరిధిలోని ఏ కానిస్టేబుల్‌ను అడిగినా కేడీ, డెకాయిట్, రౌడీషీటర్ల నివాసాలను తనిఖీల సమయంలో తప్పక చూపించాలని చె ప్పారు. వారి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగినప్పుడే నేరాలను నియంత్రిం చగలమన్నారు.
పెండింగ్‌లో, దర్యాప్తులో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారంట్లలోని నిందితులను గుర్తించి కోర్టులో హాజరుపరచాలని, నిందితుల ఆచూకీ లభించనట్లయితే మళ్లీ వారంట్లను కోర్టులో అప్పగించి నూతన వారంట్లను ఇచ్చి నిందితుల ఆచూకీ కనుగొనాలని సూచించారు. పలురకాల సమస్యలపై భార్యాభర్తల మధ్య ఏర్పడే వివాదాల్లో వెంటనే కేసులు నమోదు చేయకుం డా చట్టపరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సివిల్ వివాదాల్లో అధికారుల అనుమతిలేకుండా చట్టా న్ని అతిక్రమించి కేసులు నమోదు చేయడం, రాజీచేసే యత్నాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాధితులు అందించే ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదుచేయాలని తెలిపారు. రహదార్లవెంట ఆక్రమణలను తొలగించేందు కు ఇటీవల కార్పొరేషన్ అధికారులతో చర్చిం చామని స్థానిక వ్యాపారులు, ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో తప్పనిసరిగా డీఎస్పీ లేదా సీఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలను తెలియజేయాలన్నారు. సమావేశంలో ఓఎస్‌డీ వెలిశల రత్న, డీఎస్పీలు టి.రవీంద్రబాబు, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎన్.జోసఫ్‌రాజ్‌కుమార్, ఎం.మధుసూదనరావు, పీవీ సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Advertisement