older offenders
-
దొంగలు దొరికారు
♦ ఆంధ్రా బ్యాంక్ లూటీ కి విఫలయత్నం ♦ ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలింపు కుత్బుల్లాపూర్: ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నిం చిన ఇద్దరు పాత నేరస్థులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్కు తరలించారు. శనివారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ సాయి శేఖర్, ఏసీపీ అశోక్ కుమార్, సీఐ డీవీ రంగారెడ్డిలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం స్వామి (25) అదే జిల్లాకు చెందిన దోమకొండ మం డలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన సడుగు నవీన్ (21)లు కుత్బుల్లాపూర్ సర్కిల్ వెన్నెలగడ్డ సమీపంతో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరు కూలీ పనిచేస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్నారు. గతంలో ఓ హత్య, చెయిన్ స్నాచింగ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాము 4.30 సమయం లో వెన్నెలగడ్డ సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. తరువాత ఐదు కంప్యూటర్లను మూట కట్టుకుని వెళ్తూ స్థానికుల కంట పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ థామస్, కానిస్టేబుల్ విఘ్నేశ్వరుడు, హోంగార్డు కృపానందరెడ్డిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటాడి తుడుం స్వామిని పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు నవీన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన థామస్, విఘ్నేశ్వరుడు, కృపానందరెడ్డిలను డీసీపీ సాయిశేఖర్ అభినందించి రివార్డు ప్రకటించారు. -
పాత నేరస్తుల మీద సర్వే
పాత నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సర్వేలో 2011 నుంచి ఇప్పటి వరకూ అరెస్టైన పాత నేరస్తుల పూర్తి వివరాలు సేకరించ నున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 11,500 మంది పాత నేరస్తుల వివరాలు ఉన్నాయని.. తెలిపారు. సర్వే కోసం హైదరాబాద్ లో ఇంటింటి సర్వే చేయనున్నట్లు వివరించారు. స్థానిక పోలీసులకు నేరస్తుల కదలికలపై అవగాహన కల్పించేందుకే సర్వే చేస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సర్వే వల్ల హైదరాబాద్ లో నేరాలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని అన్నారు. -
కాసులివ్వండి..! నేరస్తులను తీసుకెళ్లండి..!!
లక్షలు నొక్కేసి నిందితుని వదిలివేత కమిషనరేట్‌లో పెరిగిన అవినీతి విజయవాడ సిటీ : ఆసియాలోనే అతిపెద్దదైన జవహర్ ఆటోనగర్‌లో పాత వాహనాల ఖండం(డిస్మాంటిలింగ్) వ్యవహారాలు అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి. పోలీసు అధికారుల వెన్నుదన్నుతో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ‘సి బుక్’లను విక్రయించి కొందరు వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు సరుకుల లోడు మాయం చేసేందుకు.. ఫైనాన్స్ కంపెనీలను మోసగించేందుకు వినియోగిస్తున్నారు. మూడు రోజుల కిందట సి బుక్‌ల విక్రయం కేసులో అదుపులోకి తీసుకున్న డిస్మాంటిల్ వ్యాపారిని లక్షలు నొక్కేసి పోలీసులు వదిలేశారు. గతంలో కూడా ఈ తరహా కేసుల్లో పలువురు పట్టుబడినప్పటికీ.. ఎప్పటికప్పుడు పోలీసులను మామూళ్ల మత్తులో ముంచుతూ బయటపడుతున్నట్టు ఆరోపణలు వినబడుతున్నాయి. ఇదీ జరిగింది ఆటోనగర్ ఐదో రోడ్డుకు చెందిన ఓ డిస్మాంటిల్ వ్యాపారి తన భాగస్వాములతో కలిసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 200 పైబడి పాత వాహనాలు కొనుగోలు చేశాడు. వీటిని తుక్కు కింద చేసిన తర్వాత సి బుక్‌లను బళ్లారి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులకు మోడల్‌ను బట్టి రూ.1లక్ష నుంచి 5లక్షల వరకు విక్రయించాడు. వీటిని దొంగ వాహనాలకు వినియోగించేందుకు అక్కడి వారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొనుగోలు చేసిన సి బుక్స్‌లోని ఇంజిన్, ఛాసిస్ నంబర్లు మార్చేందుకు ఆటోనగర్‌లోనే కొందరు ప్రత్యేకంగా ఉన్నారు. వీరి ద్వారా లారీల ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చేసిన ‘బళ్లారి బాబులు’ పెద్ద ఎత్తున ఐరన్ ఓర్, నిత్యావసర సరుకులు మాయం చేసినట్టు తెలిసింది. వరుస ఘటనలపై దృష్టిసారించిన బళ్లారి పోలీసులకు ఈ వ్యవహారాలు విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్టు గుర్తించారు. ఎవరెవరు ఇందుకు సూత్రధారులో గుర్తించేందుకు బళ్లారి పోలీసులు సమాయత్తమవుతున్న విషయం ‘తూర్పు మండలం’ లోని ఓ పోలీసు స్టేషన్ అధికారికి ఉప్పందింది. ఆపై ఆయన రంగంలోకి దిగి తన పని చక్కబెట్టుకున్నారు. రంగంలోకి పాత నేరస్తులు గతంలో ఈ తరహా నేరాలు చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసు అధికారిని కలిసి మంతనాలు జరిపారు. రూ.6 లక్షలు ఇస్తే వదిలేస్తానని ఆ అధికారి బేరం పెట్టారు. బెంజిసర్కిల్ సమీపంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇరువర్గాల మధ్య గంటలకొద్దీ చర్చలు జరిగాయి. ఎట్టకేలకు రూ.3లక్షలు ఇచ్చేందుకు మధ్యవర్తులు అంగీకరించారు. చర్చలు జరిగిన చోటనే నగదు లావాదేవీలు నిర్వహించేందుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా స్టేషన్లో ఉంచిన వ్యక్తిని వదిలేశారు. వ్యవహారం సద్దుమణిగే వరకు కొద్ది రోజుల పాటు ఊరు విడిచి వెళ్లాలంటూ ఆ పోలీసు అధికారి చేసిన సూచనకు వారు అంగీకరించారు. అనుకున్నట్టుగానే ఆదివారం నగదు ముట్టింది. విషయం కమిషనరేట్‌లోని కొందరు అధికారులకు తెలియడంతో.. బదిలీపై మరో జోన్‌కు వెళుతూ కూడా బహుమానంగా రూ.3లక్షలు పట్టుకెళ్లాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు హైడ్రామా సమాచారం వచ్చిన వెంటనే ఆటోనగర్‌కు చెందిన డిస్మాంటిల్ వ్యాపారిని గత శనివారం స్టేషన్‌కి తీసుకొచ్చి అర్ధరాత్రి వదిలేయడం వరకు హైడ్రామా చోటు చేసుకుంది. గతంలో రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఈ తరహా కేసులు రాగా, సెటిల్ చేసుకున్న వ్యవహారాలను ఉటంకించారు. తుక్కు చేసిన వాహనాల సి బుక్స్ విక్రయించడం నేరం కాబట్టి కేసు నమోదు చేయక తప్పదన్నారు. తాను అరెస్టు చేసిన తర్వాత బళ్లారి పోలీసులు కూడా వచ్చి అరెస్టు చేస్తారని హెచ్చరించారు. ఏదో ఒకటి సెటిల్ చేసుకోమంటూ హితబోధ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లోనే నిర్బంధించడంతో సెటిల్ చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. -
పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం మైదానంలో శుక్రవారం ఉదయం సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఎస్పీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులందరూ సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించినందుకు అభినందించారు. కొత్త సంవత్సరంలో దొంగతనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బస్టాండ్, రైల్వేస్టేషన్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. దొంగలను పట్టుకోవడంలో అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు కొనసాగించాలని సూచించారు. పండుగల సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు విలువైన బంగారు ఆభరణాలు, బీరువాల్లో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకునేలా పోలీసు సిబ్బంది సూచనలు ఇవ్వాలన్నారు. అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఊర్లకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డులకు సమాచారం ఇచ్చి వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా నేరం జరిగి బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినప్పుడు కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆటోల్లో వారు ఒంటరిగా వెళ్లకుండా సూచనలు జారీ చేయాలన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను మరింత పెంపొందించుకుని మెరుగైన సేవలందించాలన్నారు. పెరేడ్‌కు హాజరైన పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, సీఐ రంగనాయకులు, ఆర్ఐ రంగముని, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంధ్రాలో ‘పాత నేరగాళ్లు’ అధికం
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగమైన పోలీసు విభాగం రికార్డుల పంపకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పదే పదే నేరాలు చేసి పోలీసులకు చిక్కుతున్న పాత నేరగాళ్లు (ఎంఓ క్రిమినల్స్) తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు వాటిల్లో తేలింది. సీఐడీ అధీనంలో ఉండే వేలిముద్రల విభాగం (ఎఫ్‌పీబీ) రికార్డుల్లో ఇది బహిర్గతమైంది. ఉమ్మడి రాష్ట్ర ఎఫ్పీబీలో మొత్తం 1.8 లక్షల మంది పాత నేరగాళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 1.27 లక్షలు, తెలంగాణకు చెందిన వారు 53 వేల మంది ఉన్నట్లు తేలింది. -
తనిష్క్ చోరీ కేసులో కిరణ్ అనే వ్యక్తి లొంగుబాటు
హైదరాబాద్ : తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీ కేసులో కిరణ్ అనే ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఈ చోరీకి పాల్పడినట్లు ఆవ్యక్తి చెబుతున్నాడు. కిరణ్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా చోరీ జరిగిన రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సంస్థకు చెందిన మరో వ్యక్తి, జ్యువెలర్స్‌కు చెందిన మరొకరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మాజీ తాజా ఉద్యోగులకు సంబంధించి సమాచారం సేకరించటంతో పాటు మరికొన్ని అనుమానలను నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. షోరూమ్‌కు చెందిన కొన్ని రికార్డుల్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తనిష్క్ జ్యువెలర్స్‌లో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే నిన్న ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
రూ.5.97 కోట్లే...!
తనిష్క్’లో చోరీ సొత్తు పోలీసులకు తెలిపిన యాజమాన్యం సీసీఎస్ బృందాల దర్యాప్తు ముమ్మరం పాత నేరస్తుల వివరాల సేకరణ సాక్షి, సిటీబ్యూరో : పంజగుట్ట పరిధిలోని తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తమ షోరూమ్ ధరని చెప్పడంతో వీటి మార్కెట్ విలువ రూ.8 కోట్ల వరకు ఉండచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతుచిక్కని ‘కన్నం’ విధానం బంగారం దుకాణంలో చోరీ జరిగిన తీరును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. వెనుక వైపు అనువైన ప్రాంతాన్ని దుండగులు ఎలా గుర్తించారన్న దానితో పాటు లోపలకు ప్రవేశించిన తరవాత నేరుగా స్విచ్‌బోర్డ్ వద్దకు వెళ్లి లైట్లను ఎలా ఆర్పగలిగారు? అనే వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మూడో పిల్లర్‌కు పక్కగా, రెండు షెల్ఫ్‌లకు మధ్యలో కచ్చితంగా రంధ్రం చేడయం, స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉందో వారికి తెలియడం వెనుక తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ సెక్యూరిటీ గార్డులు, ఉద్యోగులతో పాటు సంస్థకు మరమ్మతులు చేసిన మేస్త్రీల వివరాలు రాబడుతున్నారు. ఇది కచ్చితంగా బయటి రాష్ట్రాలకు చెందిన ముఠాల పనిగా చెప్పలేమని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నమని సీసీఎస్ అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకూ సమాచారం దర్యాప్తులో భాగంగా పాత నేరగాళ్ల వివరాలను సేకరిస్తున్న పోలీసులు వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. చోరీ కోసం దుకాణంలోకి ప్రవేశించిన దొంగ ఎడమకాలు కుంటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ తరహా అంగవైకల్యం కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన దోపిడీ దొంగ గతంలో ఎస్సార్‌నగర్ స్టేట్‌హోమ్ సమీపంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో దోపిడీకి పాల్పడ్డాడు. అలాగే పంజగుట్టలోని ఉన్న జాయ్ అలుక్కాస్ షోరూమ్‌లో 2006లో చోరీ చేసిన ముంబై వాసి వినోద్రాంబోలీ సింగ్‌ను అనుమానితుల జాబితాలో చేర్చారు. వీరిద్దరి వివరాలను కోరుతూ యూపీ, ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాంబోలీసింగ్ను ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో ఉన్న మరికొన్ని, బీహార్ తదితర పోలీసులకు తనిష్క్లో రికార్డు అయిన సీసీ కెమెరా ఫీడ్‌ను పంపాలని నిర్ణయించారు. అన్ని కోణాల్లో ఆరా ఈ చోరీలో దుండగులు ఆధారం విడిచిపెట్టకపోవడంతో పోలీసులు సెల్‌ఫోన్, సిగ్నల్ వంటివి విశ్లేషిస్తూ సాంకేతికంగా, సంప్రదాయ పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ తరహా చోరీలు చేసేవారి (ఎంఓ క్రిమినల్స్) వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి వచ్చిన వాళ్లు ఎక్కడో ఒకచోట షెల్టర్ తీసుకుని ఉంటారనే అనుమానంతో నగరంలోని లాడ్జిలు, హోటళ్లలోనూ వివరాలు సేకరిస్తున్నారు. మరోపక్క ఘటనాస్థలి నుంచి నిపుణులు పదుల సంఖ్యలో వేలిముద్రలు సేకరించారు. శని-ఆదివారాల్లో తనిష్క్లో పని చేసే వారి వేలిముద్రల్ని సేకరించి విశ్లేషిస్తున్నారు. షోరూమ్ సీసీ కెమెరాల్లో వారం రోజులుగా రికార్డైన ఫీడ్, చుట్టు పక్కల దుకాణాల్లోదీ సేకరించి విశ్లేషించడం ప్రారంభించారు. -
ఐదుగురు పాత నేరస్తుల అరెస్ట్
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఐదుగురు పాత నేరస్తులను సోమవారం ఇల్లెందు పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 12లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రంగనాధ్ ఈ వివరాలు తెలిపారు. ఇల్లెందు డీఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో ఇల్లెందు రూరల్ సీఐ రవీందర్‌రెడ్డి సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్లేందుకు కొత్తలింగాల క్రాస్‌రోడ్డు వద్ద ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారించగా పలు చోరీలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన బెల్లంకొండ యాకయ్యపై ఇల్లెందులో 3, కారేపల్లిలో 4, కామేపల్లిలో 1, బయ్యారంలో 4 కేసులు ఉన్నాయని అన్నారు. అదే జిల్లా అమనగల్‌కు చెందిన కూజ పెద్ద శ్రీను ఖమ్మంజిల్లా టేకులపల్లి మండలం భద్రుతండాలో ఉంటున్నాడని, ఇతనిపై ఇల్లెందులో 1, కారేపల్లిలో 3, బయ్యారంలో 3, టేకులపల్లిలో 1, ఖమ్మం రూరల్‌లో 1 కేసులు ఉన్నాయని, వరంగల్ జిల్లా చెందిన దాసరి యాకయ్య ఖమ్మం జిల్లా కోయగూడెంలో ఉంటున్నాడని, ఇతనిపై ఇల్లెందులో 1, కారేపల్లిలో 2, కామేపల్లిలో 3, బయ్యారంలో 3, టేకులపల్లిలో 1 కేసులు ఉన్నాయని అన్నారు. అదే జిల్లాకు చెందిన కూజ చిన్న శ్రీను ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం ఉంటున్నాడని, ఇతనిపై కారేపల్లిలో 1, కామేపల్లిలో 1 కేసులు ఉన్నాయని అన్నారు. అలాగే ఖమ్మం జిల్లా టేకులపల్లికి చెందిన బిజిలి నాగయ్య పై కారేపల్లిలో 1, కామేపల్లిలో 1, టేకులపల్లిలో 1కేసులు ఉన్నాయని అన్నారు. వీరిపై నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నాయని అన్నారు. వీరు చైన్ స్నాచింగ్, ఇంటి తాళలు పగులగొట్టి చోరీలు చేసేవారని ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి బంగారం కొనుగోలు చేసిన 10 మందిని, వీరికి సహకరించిన మరో నలుగుర్ని అరెస్ట్ చేశామని అన్నారు. వారి వద్ద నుంచి 37.5 తులాల బంగారం, 130 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో భారీగా రికవరీలు చేశామని ఎస్పీ తెలిపారు. ఖమ్మంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించామని, బంగారం తాకట్టు, విక్రయానికి వచ్చిన వారి వద్ద గుర్తింపు కార్డులు ఉంటేనే తీసుకోవాలని, తెలిసిన వ్యక్తి వస్తేనే కొనుగోలు చేయాలని సూచించామని అన్నారు. అలా కాదని బంగారం కొనుగోలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బంగారం షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఉంటే దొంగలను గుర్తించడం సులువవుతుందని అన్నారు. మధిర శ్రీరామ్‌సిటీ గోల్డ్ చోరీ కేసును త్వరలోనే ఛేదిస్తామని అన్నారు. ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ద్విచక్ర వాహనలు కొనుగోలు చేసేప్పుడు సరైన పత్రాలు ఉన్నాయా..? లేవా..? చూసుకోవాలని, నకిలీ ఆర్సీ పేపరు కేసులో నల్లగొండ ఎంవీఐని రిమాండ్ చేశామని తెలిపారు. సిబ్బందికి రివార్డులు అందజేస్తాం.. ఈ రికవరీలో పాల్గొన్న సిబ్బంది రివార్డులు అందజేస్తామన్నారు. ఇల్లెందు డీఎస్పీ కృష్ణ, టేకులపల్లి సీఐ రాజిరెడ్డి, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, సంతోష్, ఏఎస్సై అబ్రహం, కానిస్టేబుళ్ళలకు రివార్డులు అందజేస్తామని, అదేవిధంగా రికవరీలకు ప్రత్యేక టింలు ఏర్పాటు చేశామని, రికవరీల్లో ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు అందజేస్తామని, పని చేయని వారిని విధుల నుంచి తొలగిస్తామని అన్నారు. -
పాతనేరస్తులపై నిఘా పెంచండి
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ :పాత నేరస్తుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెంచాలని అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్పరెన్స్ హాలులో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ మొదటసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్ష కొనసాగింది. జిల్లా పరిధిలోని నాలుగు సబ్డివిజన్ల అధికారులతో విడివిడిగా సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. జిల్లా పరిధిలోని ఏ కానిస్టేబుల్‌ను అడిగినా కేడీ, డెకాయిట్, రౌడీషీటర్ల నివాసాలను తనిఖీల సమయంలో తప్పక చూపించాలని చె ప్పారు. వారి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగినప్పుడే నేరాలను నియంత్రిం చగలమన్నారు. పెండింగ్‌లో, దర్యాప్తులో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారంట్లలోని నిందితులను గుర్తించి కోర్టులో హాజరుపరచాలని, నిందితుల ఆచూకీ లభించనట్లయితే మళ్లీ వారంట్లను కోర్టులో అప్పగించి నూతన వారంట్లను ఇచ్చి నిందితుల ఆచూకీ కనుగొనాలని సూచించారు. పలురకాల సమస్యలపై భార్యాభర్తల మధ్య ఏర్పడే వివాదాల్లో వెంటనే కేసులు నమోదు చేయకుం డా చట్టపరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సివిల్ వివాదాల్లో అధికారుల అనుమతిలేకుండా చట్టా న్ని అతిక్రమించి కేసులు నమోదు చేయడం, రాజీచేసే యత్నాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు అందించే ప్రతి ఫిర్యాదును కేసుగా నమోదుచేయాలని తెలిపారు. రహదార్లవెంట ఆక్రమణలను తొలగించేందు కు ఇటీవల కార్పొరేషన్ అధికారులతో చర్చిం చామని స్థానిక వ్యాపారులు, ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో తప్పనిసరిగా డీఎస్పీ లేదా సీఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలను తెలియజేయాలన్నారు. సమావేశంలో ఓఎస్డీ వెలిశల రత్న, డీఎస్పీలు టి.రవీంద్రబాబు, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎన్.జోసఫ్రాజ్కుమార్, ఎం.మధుసూదనరావు, పీవీ సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.