పాత నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సర్వేలో 2011 నుంచి ఇప్పటి వరకూ అరెస్టైన పాత నేరస్తుల పూర్తి వివరాలు సేకరించ నున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 11,500 మంది పాత నేరస్తుల వివరాలు ఉన్నాయని.. తెలిపారు.
సర్వే కోసం హైదరాబాద్ లో ఇంటింటి సర్వే చేయనున్నట్లు వివరించారు. స్థానిక పోలీసులకు నేరస్తుల కదలికలపై అవగాహన కల్పించేందుకే సర్వే చేస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సర్వే వల్ల హైదరాబాద్ లో నేరాలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని అన్నారు.