హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగమైన పోలీసు విభాగం రికార్డుల పంపకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పదే పదే నేరాలు చేసి పోలీసులకు చిక్కుతున్న పాత నేరగాళ్లు (ఎంఓ క్రిమినల్స్) తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు వాటిల్లో తేలింది. సీఐడీ అధీనంలో ఉండే వేలిముద్రల విభాగం (ఎఫ్‌పీబీ) రికార్డుల్లో ఇది బహిర్గతమైంది. ఉమ్మడి రాష్ట్ర ఎఫ్‌పీబీలో మొత్తం 1.8 లక్షల మంది పాత నేరగాళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 1.27 లక్షలు, తెలంగాణకు చెందిన వారు 53 వేల మంది ఉన్నట్లు తేలింది.
ఆంధ్రాలో ‘పాత నేరగాళ్లు’ అధికం
Published Mon, Jul 28 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement