రౌడీషీటర్ దారుణ హత్య
- పాత కక్షలే కారణమా..?
- నిందితుల కోసం గాలింపు
మదనపల్లె క్రైం: మదనపల్లె చంద్రాకాలనీలో శనివారం అర్ధరాత్రి రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి చంపారు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీనగర్‌కు చెందిన పెద్దరెడ్డెప్ప, సుభద్ర దంపతుల కుమారుడు పూల వెంకటాచలపతి అలి యాస్ పూల చలపతి(29) ట్రాక్టర్ నడుపుకుంటూ, పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
2010 ఆగస్టు 15న నీరుగట్టువారిపల్లెలో జరిగిన విశ్వనాథరెడ్డి హత్య కేసులో, 2012 మార్చి 12న మదనపల్లె రూరల్ పరిధిలోని కోళ్లఫారం వద్ద జరిగిన జయచంద్రారెడ్డి హత్య కేసులో ఇతను నిందితుడు. మరి న్ని కేసుల్లో నేరారోపణలు ఉండడంతో రెండో పట్టణ పోలీసులు 2011లో అతనిపై రౌడీషీట్‌ను ఓపెన్ చేశారు. విశ్వనాథరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టేయడం తో అతని బంధువు జగదీశ్వర్‌రెడ్డి చలపతిపై కక్ష పెంచుకున్నాడు.
శనివారం ఉదయం చలపతి స్నేహితుడు షెటీపై అదే ప్రాంతానికి చెందిన శంకర్ దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన చలపతి రాత్రి రింగ్ రోడ్డులోని డాబా వద్ద శంకర్‌తో గొడవపడ్డాడు. ఇతనితో ఎప్పుడైనా ముప్పేనని భావించిన జగదీశ్వర్‌రెడ్డి, శంకర్, మరి కొందరు కలిసి అర్ధరాత్రి వరకు డాబా వద్ద కాపుకాశారు. తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై చల పతి ఇంటికి వెళుతుండగా కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దాడి చేశారు.
తల, గొంతు, మెడ, చేతులపై విచక్షణారహితంగా నరికారు. ప్రాణభయంతో చలపతి చంద్రాకాలనీలోని ఇంటింటికీ వెళ్లి తలుపులు తట్టినా ఎవరూ తీయలేదు. ఇదే అదనుగా భావించి ప్రత్యర్థు లు అతన్ని చంపేశారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ సీఎం. గంగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. చిత్తూరు నుంచి జాగిలాలను రప్పించారు. డాగ్ చంద్రాకాలనీ గుట్టమీద వరకు వెళ్లి ఆగిపోయింది. పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి ఫోన్ చేసి రెచ్చగొట్టారు
తన భర్త రాత్రి 9.30 గంటలకు ఇంటికొచ్చాడని భార్య జ్యోతి తెలిపింది. ఆ సమయంలో కొంతమంది ఫోన్‌చేసి ‘ఇక్కడ రుబాబు చేసి ఇంటికెళ్లి దా క్కుంటావా.. దమ్ముంటే బయటకు రా.. లేదంటే మమ్మల్నే అక్కడికి రమ్మంటావా’ అని ఫోన్ చేసి రెచ్చగొట్టారని పేర్కొంది. దీంతో తన భర్త ఆవేశంగా బయటకు వెళ్లాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని బోరున విల పించింది. గౌడసానిపల్లె శంకర, చం ద్రాకాలనీ అంజి, డాబా సూరి, జగదీ శ్వర్‌రెడ్డి, గొల్లపల్లె ఆనంద్, పిల్ల నాగ, ఎస్టేట్ నారాయణే తన భర్తను హత్య చేసి ఉంటారని తెలిపింది.