opponents
-
హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్ ఫైరింగ్ మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. టోలీచౌకిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్ధం విన్నామంటూ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. భూ వివాదంలో అక్తర్ ఇంటికి షకీల్, అతని అనుచరులు చేరుకున్నారు. ప్లాట్ విషయంలో ఇరువర్గాలకు చెందిన వారు గొడవ పడ్డారు. ఇదే సమయంలో ఫైరింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఫేస్బుక్ పరిచయం.. వివాహితకు శాపం -
పాలిటిక్స్‌కు తాత్కాలిక బ్రేక్..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
సాక్షి,హైదరాబాద్:ప్రతిరోజు రాజకీయాలపై ట్వీట్ చేసే కేటీఆర్ శనివారం(నవంబర్ 30) ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.తాను వెల్నెస్ కోసం కొద్దిరోజుల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.అయితే ఈ బ్రేక్‌తో తన రాజకీయ ప్రత్యర్థులు తనను అంతగా మిస్సవరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ట్వీట్ వైరల్ అవడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁— KTR (@KTRBRS) November 30, 2024 -
Alexi Navalni: పుతిన్ ప్రత్యర్థి మరణం.. వెలుగులోకి సంచలన విషయం
మాస్కో: ఇటీవల రష్యా జైలులో వివాదాస్పద స్థితిలో మరణించిన పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని మృతికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నవాల్నిని జైలులో గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేసి ఉంటారని మానవహక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచిన్ తెలిపారు. ఇది రష్యా గూఢచారి సంస్థ కేజీబీ వేగులు చేసిన హత్యే అయి ఉండొచ్చన్నారు. కేజీబీ ప్రత్యేక వేగులకు మనుషులను గుండెపై ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేయడంపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇది వారి హాల్‌మార్క్ హత్య చేసే విధానమని తెలిపారు. ఈ హత్య చేసే ముందు నవాల్ని శరీరాన్ని బలహీపర్చే ఉద్దేశంతో జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అతడిని ఉంచారన్నారు. ఇలా చేయడం వల్ల మనిషిలో రక్తప్రసరణ నెమ్మదిస్తుందని చెప్పారు. అనంతరం గుండెపై గుద్ది చంపేస్తారన్నారు. కాగా, గత వారం ఆర్కిటిక్ పోలార్ వోల్ఫ్‌లోని పీనల్ కాలనీ జైలు అలెక్సీ నవాల్ని వివాదాస్పద స్థితిలో మృతి చెందారు. జైలులో సాయంత్రం వేళ కొద్దిసేపు వాకింగ్ తర్వాత నావల్ని ఇబ్బందిగా ఫీలయ్యారని, అనంతరం ఆయన కుప్పకూలారని జైలు అధికారులు వెల్లడించారు. అత్యంత వివాదాస్పదంగా మారిన నావల్ని మృతిపై రష్యాలో ఆయన అభిమానుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహా పలు దేశాధినేతలు నవాల్ని మృతికి పుతినే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాయి. నవాల్ని భార్య, కూతురును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో కలిసి పరామర్శించారు. ఇదీ చదవండి.. నవల్ని మృతదేహం తల్లికి అప్పగింత -
Alexi Navalni: నావల్ని భార్య, కూతురుకు బైడెన్ ఓదార్పు
కాలిఫోర్నియా: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని(47) భార్య, కుమార్తెను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరామర్శించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలని ఓ హోటల్లో నావల్ని భార్య, కుమార్తెలతో బైడెన్ గురువారం సమావేశమయ్యారు. నావల్ని మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న వారిద్దరనీ బైడెన్ ఓదార్చారు. ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో బైడెన్ ఒక పోస్టు చేశారు. నావల్ని మృతి తర్వాత కూడా వారు ధైర్యంగానే ఉన్నారు’ అని తెలిపారు. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, దేశంలో ప్రతిపక్షనేత నావల్ని వివాదాస్పద మృతి కారణంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా యోచిస్తోంది. కాగా, గత వారం రష్యాలోని జైలులో వివాదాస్పద స్థితిలో మృతి చెందిన నావల్ని తన జీవితమంతా పుతిన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది మృతి -
జైలులో పుతిన్ ప్రత్యర్థి మృతి.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్షనేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని జైలులోనే మృతి చెందడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. నావల్ని మృతిని తాము ఇంకా ధృవీకరించలేదని, ఒకవేళ నిజమైతే మాత్రం అదొక భయంకర విషాదం అని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుల్లివాన్ అమెరికా పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు నావల్ని మృతిపై అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ జర్మనీలోని మ్యూనిచ్‌లో స్పందించారు. నావల్ని మృతి నిజమైతే అది రష్యాలోని ప్రభుత్వ బలహీనత, కుళ్లును సూచిస్తుందని వ్యాఖ్యానించారు. జైలులో నావల్ని మృతి ఒక వ్యక్తిలోని భయాన్ని తెలియజేస్తోందని పరోక్షంగా పుతిన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి -
Russia: జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి
మాస్కో: పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నావల్ని గతంలో రష్యా ఇన్ ద ఫ్యూచర్ ప్రతిపక్ష పార్టీని లీడ్ చేయడంంతో పాటు పుతిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్థాపించారు. నావాల్ని మరణంపై పుతిన్‌కు సమాచారమందినట్లు రష్యా మీడియా కథనాలు ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్ని మరణం వివాదాస్పదమవుతోంది. ‘ఫిబ్రవరి 16న కరక్షనల్ కాలనీ(జైలు) నెంబర్ 3లో కొంత సేపు నడక తర్వాత నావాల్ని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది. ఇదీ చదవండి.. భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన అమెరికా -
పసిగట్టి.. వాహనంతో ఢీకొట్టి.. బైక్‌పై వెళ్తు..
అనంతపురం క్రైం: బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డిలను టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. గ్రామ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి హత్యకు ప్రతీకారంగా అతని కుమారుడు నాగలింగేశ్వర్ రెడ్డి, అనుచరుడు పవన్‌కుమార్‌రెడ్డి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాత కక్షల నేపథ్యం రేగడికొత్తూరులో 2019 ఆగస్టు 13న మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్య రస్తా విషయంలో గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డిపై వెంకటరమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్ రెడ్డి మొద్దుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సోమిరెడ్డి అదే నెల 14న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వెంకటరమణారెడ్డి, అతని కుమారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య కక్షలు కొనసాగుతున్నాయి. వాయిదాకు వెళ్తుండగా... సోమిరెడ్డి హత్య కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు వెంకటరమణారెడ్డి , పెద్దకుమారుడు పుల్లారెడ్డి, రెండో కుమారుడు గరుడ శేఖర్ రెడ్డి పల్సర్ బైక్‌పై సోమవారం ఉదయం 9.30 గంటలకు రేగడికొత్తూరు నుంచి అనంతపురం కోర్టుకు బయలుదేరారు. ఈ విషయాన్ని ప్రత్యర్థులు పసిగట్టారు. మార్గమధ్యంలోని పామురాయి–సోములదొడ్డి మధ్య పెద్దమ్మ ఆలయ సమీపంలో బైక్‌ను వెనుక నుంచి టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ గాల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి అపస్మారకస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు రెఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని బెంగళూరుకు తీసుకెళ్లారు. వెంకటరమణారెడ్డి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సఫారీని కెనాల్లో తోసేశారు ఢీకొన్న తర్వాత బైక్.. సఫారీ వాహనానికి అతుక్కుపోయింది. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక అది ఊడిపోయింది. వాహనంలో వెళితే పోలీసులకు దొరికిపోతామని భావించిన నిందితులు సఫారీని హైవే మీదుగా హెచ్చెల్సీ(ఇందిరానగర్) వైపునకు తిప్పారు. వాహనాన్ని రన్నింగ్‌లోనే ఉంచి.. వారు కిందకు దిగి దాన్ని కెనాల్లోకి తోసేశారు. స్థానికులు డయల్ 100కు సమాచారం అందివ్వడంతో డీఎస్పీ ప్రసాద రెడ్డి, సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్ఐలు మహానంది, నాగమధు అక్కడికి చేరుకున్నారు. కెనాల్లో పడి ఉన్న వాహనాన్ని క్రేన్ సాయంతో బయటకు తీయించి..స్టేషన్‌కు తరలించారు. కాగా..సఫారీ వాహనాన్ని నాగలింగేశ్వర్ రెడ్డి ఇటీవల ఉరవకొండకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదుహత్యాయత్నానికి సంబంధించి నాగలింగేశ్వర్రెడ్డి, అతని అనుచరుడు పవన్‌కుమార్ రెడ్డిలపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రేగడి కొత్తూరులో బందోబస్తు తండ్రీకొడుకులపై హత్యాయత్నం నేపథ్యంలో రేగడి కొత్తూరు గ్రామంలో బుక్కరాయసముద్రం సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించారు. -
యూపీ+యోగి = ఉపయోగి.. సీఎంపై ప్రధాని చమత్కారాలు !
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రాజెక్ట్‌లను ఆ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు శనివారం ప్రధాని పునాది రాయి వేశారు. మోదీ మాటల శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూపీలో జరిగిన ఈ కార్యక్రమంలో కూడా తన మార్క్ మాటలను కనబరిచారు ప్రధాని మోది. ఈ సారి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, విపక్షాలపై తనదైన మాటలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాఫియా అక్రమ నిర్మాణాలను ఓ బుల్డోజర్ కూల్చివేస్తోంది. కాకపోతే ఆ మాఫియాను నమ్ముకున్న వాళ్లకు ఇది బాధకలిగిస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఈ పని తీరుతో సంతోషంగా ఉన్నారు. అందుకే ప్రజలు యూపీ+యోగి...ఉపయోగి ( ఎంతో ఉపయోగకరం) అంటున్నారు’ అని యోగి పాలనను చమత్కరిచి అందరినీ ఆకట్టుకున్నారు. జరిగిన ఐటీ దాడులను ఉద్దేశించి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మాజీ ముఖ్యమంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ప్రజా సొమ్మును అభివృద్ధి, పథకాల పేరుతో ఎలా ఉపయోగించారో మనందరికి తెలిసిన విషయమే. అవన్నీ కేవలం కాగితల్లో మాత్రం కనపడేవి. వాటివల్ల కొందరి జేబులు మాత్రం నిండాయి. ఇప్పుడు ప్రజల సొమ్ము అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల తీరును ఈ కార్యక్రమంలో ప్రధాని ఎండగట్టారు. చదవండి: Viral Video: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ -
పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం!
మాస్కో: రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇటీవల కాలంలో బలమైన ప్రత్యర్థిగా మారారు అలెక్సీ నావల్నీ. ప్రస్తుతం ఆయన కోమాలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. 44 ఏళ్ల నావల్నీపై విషప్రయోగం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఆయన సైబీరియా నుంచి మాస్కోకి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లి అపస్మారకస్థితిలో కింద పడిపోయారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓమ్స్క్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ ట్విటర్ ద్వారా తెలిపారు. నావల్నీ ఉదయం బోర్డింగ్ సమయంలో ఎయిర్ పోర్టులో టీ తాగారని, అది తప్ప మరేమీ తీసుకోలేదని చెప్పారు. టీలోనే విషం కలిపి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు. విమానంలోకి ఎక్కిన తరువాత ఆయనకు చెమటలు పట్టాయని, తనని మాట్లాడుతూ ఉండమని కోరారని, తద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా ఉండొచ్చని చెప్పారని కిరా యార్మిష్ తెలిపారు. తరువాత బాత్రూంకి వెళ్లి కిందపడిపోయారని వెల్లడించారు. రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో బలమైన నేతగా ఎదిగారు. ఆయన ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే అవినీతి ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయనపై పలుమార్లు దాడులు కూడా జరిగాయి. దీనికి ముందు కూడా ఒకసారి ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ విష ప్రయోగం అధ్యక్షుడు పుతిన్ చేయించి వుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పాక్ కుయుక్తులు: కశ్మీర్‌పై డ్రాగన్‌తో మంతనాలు -
ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేకులు విడుదల
-
ఇరికించబోయారు.. ఇరుక్కున్నారు!
► తండ్రిని చంపి ప్రత్యర్థులపై ఫిర్యాదు ► పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకున్న ఫిర్యాదుదారులు ► నేడో రేపో అరెస్టుకు రంగం సిద్ధం జమ్మలమడుగు/ పెద్దముడియం: తన తండ్రిని చంపి ఆ కేసులో తమ ప్రత్యర్థులను ఇరికించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం కేసు రివర్స్ అయిపోయింది. వివరాలిలా ఉన్నాయి. గతనెల 17వతేదీ రాత్రి పెద్దముడియం మండలం డి.కల్వటాల గ్రామంలో పెద్దసుబ్బరాయుడు(64) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాత్రి నిద్రిస్తున్న వ్యక్తిని ఎవరో చంపి వెళ్లారని, స్థానిక వైఎస్సార్సీపీ నేతలపై తమకు అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు తమకు ఎలాంటి సంబంధంలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. దీంతో పోలీసులు కేసు చిక్కుముడి ఎలా విప్పాలో అర్థంకాక అవస్థలు పడ్డారు. హత్య జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా డాగ్‌స్క్వాడ్ మృతుని ఇంట్లోకి వెళ్లింది. అయినా పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులపై ఎలాంటి అనుమానం రాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ ఇది ఫ్యాక్షన్ హత్య కాదని ఎవరో చంపి ఇక్కడ పడుకోబెట్టారంటూ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ వ్యక్తం చేసిన అనుమానం ఆధారంగా.. మృతుడు పెద్ద సుబ్బరాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడు వెంకటేశ్వర్లుకు అప్పులు ఎక్కువగా ఉండటంతో పాటు భార్య రెండు నెలలపాటు పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్యను తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. అయితే వేంకటేశ్వర్లు తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని 50వేల రూపాయలు ఇవ్వాలని లేదా పట్టాదారు పుస్తకాలు పెట్టి బ్యాంక్‌లో రుణం తెచ్చుకుంటానని తండ్రి సుబ్బరాయుడిని కోరాడు. తన వద్ద డబ్బులేదని తండ్రి చెప్పాడు. దీంతో కుమారుడు వెంకటేశ్వర్లు, తండ్రి సుబ్బరాయుడు మధ్య గొడవ పెరిగింది. దీంతో కోపంలో ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. భయపడిపోయిన కుమారుడు వెంటనే తల్లిని పిలిచి జరిగిన విషయాన్ని చెప్పి తల్లి కాళ్లుపట్టుకున్నాడు. దీంతో కొడుకును కాపాడుకునేందుకు ఇంట్లో పడిఉన్న రక్తాన్ని పూర్తిగా తుడిచి ఇంటిని శుభ్రం చేశారు. రాత్రి పదిగంటల ప్రాంతంలో మరణించిన పెద్దసుబ్బరాయుడుని ఎవరికి అనుమానం రాకుండా ఇంటి ఆరుబయట మంచం వేసి పడుకోబెట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడైన ప్రకాష్‌రెడ్డి మరో నలుగురు చంపి ఉంటారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వెంకటేశ్వర్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎస్పీనుంచి ఆదేశాలు రాగానే వీరిని అరెస్టు చూపిం^è నున్నారు. -
రౌడీ షీటర్‌ను హత్య చేసిన ప్రత్యర్థులు
-
మంత్రి జగదీశ్‌రెడ్డి బంధువు ఇంటిపై దాడి
- ఆరుగురికి గాయూలు -నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరంలో ఘటన రామన్నపేట (నల్గొండ జిల్లా) రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బంధువు ఇంటిపై ఆదివారం రాత్రి ప్రత్యర్థులు దాడి చేసి ఆరుగురిని గాయపరిచారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వివరాలు.. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మంత్రి బంధువు మందడి విద్యాసాగర్‌రెడ్డి, తెలంగాణ బెస్త సేవా సంఘం అధ్యక్షుడు పూస బాలకిషన్ మధ్య కొంతగాలంగా విభేదాలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అదికాస్త పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. స్టేషన్లోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోగా పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, ఆగ్రహించిన పూలబాలకిషన్‌తో పాటు అతడి వర్గీయులు 30 మంది బైక్‌లపై విద్యాసాగర్‌రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. కాంపౌండ్‌లో ఉన్న మంత్రి బంధువులకు చెందిన ఇన్నోవా, ఐ ట్వంటీ కార్లను, ఇంటికిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ దొరికిన పొయ్యిలకట్టెలు,ఇనుపరాడ్, కంకరరాళ్లతో దాడిచేయడంతో విద్యాసాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, వారి బంధువులు బేతి మదన్‌మోహన్‌రెడ్డి, శోభ, మంత్రి వ్యక్తి గత కార్యదర్శి సోదరుడు జయచందర్‌రెడ్డికి గాయూలయ్యాయి. దాడి జరిగిన సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం ఘటన స్థలాన్ని ఎస్పీ ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. -
పట్టపగలు హత్యాయత్నం
పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు భూవివాదాలే కారణం బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద ఘటన బీబీనగర్ : పట్టపగలు... అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. హోటల్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వేటకొడవలి, కర్రలతో విరుచుకుపడ్డారు. బాధితుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర భయాందోళన రేకెత్తించిన ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండమడుగు గ్రామానికి చెందిన సయ్యద్ హైదర్జ్రా కొంతకాలంగా హైదరాబాద్‌లోని రెయిన్‌బజార్‌లో ఉంటున్నాడు. ఇతను కొండమడుగులోని పీర్ల కొట్టం ముతావళి నిర్వహణ, గ్రామ పరిధిలోని వక్ఫ్ భూముల సంరక్షణ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. అదే గ్రామంలో ఉండే పెద్దనాన్న కుమారుడు మక్బూల్‌తో హైదర్జ్రాకు పీర్లకొట్టం, వక్ఫ్‌భూముల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. బుధవారం ఉదయం గ్రామానికి వచ్చిన హైదర్జ్రా పీర్ల కొట్టానికి వెళ్లగా.. మక్బూల్ అతడితో గొడవపడి వెళ్లిపోయాడు. అనంతరం హైదర్జ్రా కొండమడుగు మెట్టు వద్ద జాతీయ రహదారి పక్కన గల న్యూషాలిమార్ హోటల్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఇదే సమయంలో మక్బూల్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే హైదర్జ్రాపై కత్తులు, కర్రలతో దాడి చేశాడు. తలపై కత్తితో వేటు పడటంతో బాధితుడు పెద్దగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకోగా దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలకు గురైన హైదర్జ్రాను ఉప్పల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా హత్యాయత్నానికి పాల్పడిన మక్బూల్ బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తానే దాడి చేశానని లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
పాత కక్షలే కారణమా..? నిందితుల కోసం గాలింపు మదనపల్లె క్రైం: మదనపల్లె చంద్రాకాలనీలో శనివారం అర్ధరాత్రి రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి చంపారు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీనగర్‌కు చెందిన పెద్దరెడ్డెప్ప, సుభద్ర దంపతుల కుమారుడు పూల వెంకటాచలపతి అలి యాస్ పూల చలపతి(29) ట్రాక్టర్ నడుపుకుంటూ, పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2010 ఆగస్టు 15న నీరుగట్టువారిపల్లెలో జరిగిన విశ్వనాథరెడ్డి హత్య కేసులో, 2012 మార్చి 12న మదనపల్లె రూరల్ పరిధిలోని కోళ్లఫారం వద్ద జరిగిన జయచంద్రారెడ్డి హత్య కేసులో ఇతను నిందితుడు. మరి న్ని కేసుల్లో నేరారోపణలు ఉండడంతో రెండో పట్టణ పోలీసులు 2011లో అతనిపై రౌడీషీట్‌ను ఓపెన్ చేశారు. విశ్వనాథరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టేయడం తో అతని బంధువు జగదీశ్వర్‌రెడ్డి చలపతిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం ఉదయం చలపతి స్నేహితుడు షెటీపై అదే ప్రాంతానికి చెందిన శంకర్ దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన చలపతి రాత్రి రింగ్ రోడ్డులోని డాబా వద్ద శంకర్‌తో గొడవపడ్డాడు. ఇతనితో ఎప్పుడైనా ముప్పేనని భావించిన జగదీశ్వర్‌రెడ్డి, శంకర్, మరి కొందరు కలిసి అర్ధరాత్రి వరకు డాబా వద్ద కాపుకాశారు. తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై చల పతి ఇంటికి వెళుతుండగా కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దాడి చేశారు. తల, గొంతు, మెడ, చేతులపై విచక్షణారహితంగా నరికారు. ప్రాణభయంతో చలపతి చంద్రాకాలనీలోని ఇంటింటికీ వెళ్లి తలుపులు తట్టినా ఎవరూ తీయలేదు. ఇదే అదనుగా భావించి ప్రత్యర్థు లు అతన్ని చంపేశారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ సీఎం. గంగయ్య, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. చిత్తూరు నుంచి జాగిలాలను రప్పించారు. డాగ్ చంద్రాకాలనీ గుట్టమీద వరకు వెళ్లి ఆగిపోయింది. పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి ఫోన్ చేసి రెచ్చగొట్టారు తన భర్త రాత్రి 9.30 గంటలకు ఇంటికొచ్చాడని భార్య జ్యోతి తెలిపింది. ఆ సమయంలో కొంతమంది ఫోన్‌చేసి ‘ఇక్కడ రుబాబు చేసి ఇంటికెళ్లి దా క్కుంటావా.. దమ్ముంటే బయటకు రా.. లేదంటే మమ్మల్నే అక్కడికి రమ్మంటావా’ అని ఫోన్ చేసి రెచ్చగొట్టారని పేర్కొంది. దీంతో తన భర్త ఆవేశంగా బయటకు వెళ్లాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని బోరున విల పించింది. గౌడసానిపల్లె శంకర, చం ద్రాకాలనీ అంజి, డాబా సూరి, జగదీ శ్వర్‌రెడ్డి, గొల్లపల్లె ఆనంద్, పిల్ల నాగ, ఎస్టేట్ నారాయణే తన భర్తను హత్య చేసి ఉంటారని తెలిపింది.