కాలిఫోర్నియా: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని(47) భార్య, కుమార్తెను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరామర్శించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలని ఓ హోటల్‌లో నావల్ని భార్య, కుమార్తెలతో బైడెన్ గురువారం సమావేశమయ్యారు. నావల్ని మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న వారిద్దరనీ బైడెన్ ఓదార్చారు.
ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో బైడెన్ ఒక పోస్టు చేశారు. నావల్ని మృతి తర్వాత కూడా వారు ధైర్యంగానే ఉన్నారు’ అని తెలిపారు. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, దేశంలో ప్రతిపక్షనేత నావల్ని వివాదాస్పద మృతి కారణంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా యోచిస్తోంది. కాగా, గత వారం రష్యాలోని జైలులో వివాదాస్పద స్థితిలో మృతి చెందిన నావల్ని తన జీవితమంతా పుతిన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు.
Comments
Please login to add a commentAdd a comment