మాస్కో: పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
నావల్ని గతంలో రష్యా ఇన్ ద ఫ్యూచర్ ప్రతిపక్ష పార్టీని లీడ్ చేయడంంతో పాటు పుతిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్థాపించారు. నావాల్ని మరణంపై పుతిన్‌కు సమాచారమందినట్లు రష్యా మీడియా కథనాలు ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్ని మరణం వివాదాస్పదమవుతోంది.
‘ఫిబ్రవరి 16న కరక్షనల్ కాలనీ(జైలు) నెంబర్ 3లో కొంత సేపు నడక తర్వాత నావాల్ని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment