మాస్కో: డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్‌స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment