వాషింగ్టన్: రష్యా ప్రతిపక్షనేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని జైలులోనే మృతి చెందడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. నావల్ని మృతిని తాము ఇంకా ధృవీకరించలేదని, ఒకవేళ నిజమైతే మాత్రం అదొక భయంకర విషాదం అని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుల్లివాన్ అమెరికా పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
మరోవైపు నావల్ని మృతిపై అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ జర్మనీలోని మ్యూనిచ్‌లో స్పందించారు. నావల్ని మృతి నిజమైతే అది రష్యాలోని ప్రభుత్వ బలహీనత, కుళ్లును సూచిస్తుందని వ్యాఖ్యానించారు. జైలులో నావల్ని మృతి ఒక వ్యక్తిలోని భయాన్ని తెలియజేస్తోందని పరోక్షంగా పుతిన్‌ను ఉద్దేశించి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment