- ఆరుగురికి గాయూలు
-నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరంలో ఘటన
రామన్నపేట (నల్గొండ జిల్లా)
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బంధువు ఇంటిపై ఆదివారం రాత్రి ప్రత్యర్థులు దాడి చేసి ఆరుగురిని గాయపరిచారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వివరాలు.. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మంత్రి బంధువు మందడి విద్యాసాగర్‌రెడ్డి, తెలంగాణ బెస్త సేవా సంఘం అధ్యక్షుడు పూస బాలకిషన్ మధ్య కొంతగాలంగా విభేదాలు ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అదికాస్త పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. స్టేషన్‌లోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోగా పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, ఆగ్రహించిన పూలబాలకిషన్‌తో పాటు అతడి వర్గీయులు 30 మంది బైక్‌లపై విద్యాసాగర్‌రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. కాంపౌండ్‌లో ఉన్న మంత్రి బంధువులకు చెందిన ఇన్నోవా, ఐ ట్వంటీ కార్లను, ఇంటికిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ దొరికిన పొయ్యిలకట్టెలు,ఇనుపరాడ్, కంకరరాళ్లతో దాడిచేయడంతో విద్యాసాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, వారి బంధువులు బేతి మదన్‌మోహన్‌రెడ్డి, శోభ, మంత్రి వ్యక్తి గత కార్యదర్శి సోదరుడు జయచందర్‌రెడ్డికి గాయూలయ్యాయి. దాడి జరిగిన సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం ఘటన స్థలాన్ని ఎస్పీ ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి బంధువు ఇంటిపై దాడి
Published Mon, Aug 8 2016 7:42 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement