రౌడీషీటర్ దారుణహత్య | Raudisitar Brutal murder | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్ దారుణహత్య

Published Thu, Mar 10 2016 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

రౌడీషీటర్ దారుణహత్య

రౌడీషీటర్ దారుణహత్య

 పరిచయస్తులపైనే అనుమానం?
మృతదేహాన్ని పరిశీలించిన ఏఆర్ ఏఎస్పీ  

 
వెంకటాచలం: రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి అతిదారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీలో బుధవారం మధ్యాహ్నం  జరి గింది. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన కోడూరు అశోక్‌కుమార్ (35) బస్సుడ్రైవర్, ఆటో మెకానిక్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో మొదటి భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో ఉడ్‌కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన బద్దెపూడి చెంచురామయ్య కుమార్తె ధనమ్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. అశోక్‌కుమార్, ధనమ్మ ఉడ్‌కాంప్లెక్స్ సమీపంలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

అశోక్‌కుమార్‌పై ఓ హత్య కేసుతో పాటు పలు కేసులు ఉన్నా యి. దీంతో ఇతనిపై నెల్లూరు ఐదోనగర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. బుధవారం ఉదయం భార్య ధనమ్మతో గొడవపడిన అశోక్‌కుమార్ తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటలకు నక్కలగుంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడనే విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌కార్డు అధారంగా  భగత్‌సింగ్‌కాలనీకి చెందిన అశోక్‌కుమార్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అశోక్‌కుమార్ మామ చెంచురామయ్య, అత్త శ్యామలమ్మ సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.


 పరిచయస్తులే హంతకులు
అశోక్‌కుమార్‌ను అతని పరిచయస్తులే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య ధనమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన అశోక్‌కుమార్‌కు పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినట్లు  కా ల్స్ డీటైల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే నిందితులు పధ కం ప్రకారం అశోక్‌కుమా ర్‌ను అక్కడకు రప్పించి గొడ్డళ్లతో మెడ, తలపై నరికి దారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు.
   
 నిందితులను పట్టుకుంటాం: ఏఆర్ అడిషనల్ ఎస్పీ
రౌడీషీటర్ హత్యకేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ సూరిబాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హత్యకు గురైన రౌడీషీటర్ అశోక్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అశోక్‌కుమార్ హత్యపై అన్నీకోణాల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అశోక్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement