మరో రౌడీపై పీడీ యాక్ట్ | Another punt PD Act | Sakshi
Sakshi News home page

మరో రౌడీపై పీడీ యాక్ట్

Published Mon, Oct 27 2014 12:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

మరో రౌడీపై పీడీ యాక్ట్ - Sakshi

మరో రౌడీపై పీడీ యాక్ట్

యాకుత్‌పుర:  పాతబస్తీకి చెందిన మరో కరుడుగట్టిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ బార్డర్ యూసుఫ్‌పై  నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీం తో పోలీసులు యూసుఫ్ ఖాన్‌ను ఆదివారం అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. భవానీనగర్‌కు చెం దిన ఇతనిపై మూడు హత్యలు, హత్యాయత్నం, రెండు స్నాచింగ్, బెదిరింపు కేసులున్నాయి. యూసుఫ్ దశాబ్ద కాలం నుంచి వరుసగా నే ర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్ నాయకుడు కోనపురి రాములు హత్య కేసులో కూడా ఇతడు నిందితుడు.

కిరాయి హత్యలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతని ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం కింద ఒక్కసారి జైలుకెళ్తే ఏడాది పాటు బెయిల్ రాదు. ఏడాది వరకు కూడా వీరి ప్రవర్తనలో మార్పు వస్తే విడుదల చేస్తారు. లేని పక్షంలో మరో ఏడాది పాటు జైలులో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది. నెల రోజుల వ్యవధిలో నగర పోలీసులు పది మంది రౌడీషీటర్లను పీడీ యాక్ట్ కింద చర్లపల్లి జైలుకు తరలించారు.

 పీడీ యాక్ట్‌పై అరెస్టయిన రౌడీషీటర్లు వీరే.....
మహ్మద్ ఇల్యాస్ బిన్ హబీబ్ సలామ్ (గోల్కొండ)
మహ్మద్ మాజిద్ (గొల్కొండ)
చోర్ కౌసర్ (ఆసిఫ్‌నగర్)
యూసుఫ్ (ఆసిఫ్‌నగర్)
మహ్మద్ ఫిర్దౌస్ (బంజారాహిల్స్ సయ్యద్‌నగర్)
మహ్మద్ లతీఫ్ (మల్లేపల్లి)
మహ్మద్ తన్వీర్
(ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్)
పల్లె సుధాకర్‌రెడ్డి(జూబ్లీహిల్స్)
బోడ రాజుల (జూబ్లీహిల్స్)
తాజాగా మహ్మద్ యూసుఫ్ ఖాన్ (భవానీనగర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement