mahendarreddi
-
థర్డ్ పార్టీ చెక్‌చేస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పనితీరు, స్టేషన్లలో బాధితులతో వ్యవహరిస్తున్న తీరుపై థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ అందిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ముందస్తుగా హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన సిటిజన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థ విజయవంతం అయ్యింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఈ వ్యవస్థను జిల్లాల్లోనూ అమలు చేస్తున్నారు. ప్రతీ నెలా అన్ని జిల్లాలు, నూతన కమిషనరేట్ల పరిధిలో పోలీసుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై... మారుమూల స్టేషన్ నుంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న ఠాణాల వరకు ప్రతీచోట ఏం జరుగుతోంది? ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో సిబ్బంది, అధికారులు ప్రవర్తించే తీరు ఎలా ఉంటోంది? రిసెప్షన్ సెంటర్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు? సంఘటనా స్థలికి పెట్రోలింగ్, బ్లూకోట్స్ సిబ్బంది ఎంత సమయంలో వస్తున్నారు? పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎలా పని చేస్తోంది? మర్యాదపూర్వకంగా ఉందా? లేకా డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా.. ఇలా ప్రధానంగా నాలుగు అంశాలతో థర్డ్ పార్టీతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతీ ఫిర్యాదుదారుడికి థర్డ్ పార్టీ నుంచి ఫోన్‌కాల్ వెళ్తుంది.. స్టేషన్లో అధికారి, సిబ్బంది వ్యవహరించిన తీరుపై 1 నుంచి 10 వరకు గ్రేడింగ్ ఇస్తారు. ఇలా నాలుగు అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రతీ నెలా ఈ ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ జోన్ల ఐజీలకు అందుతోంది. గ్రేడింగ్ వారీగా... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600కి పైగా పోలీస్స్టేషన్ల నుంచి వచ్చే నివేదికలను ఐజీలు పరిశీలించి థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ నుంచి వచ్చిన మార్కుల ఆధారంగా ఆ ఠాణా అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జోనల్, జిల్లా మీటింగ్‌ల్లో సంబంధిత స్టేషన్, అధికారి, సిబ్బందికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే పనితీరు సరిగా లేని ఠాణా, సర్కిల్, డివిజన్ల అధికారులతో చర్చించి పనితీరు మార్చుకునేలా ఐజీలు, సంబంధిత ఎస్పీ/కమిషనర్లు కృషిచేస్తున్నారు. ఏకరూప పోలీసింగ్‌లో ఇది కీలకమని, ప్రతీ చోటా పోలీస్ సేవలు పారదర్శకంగా, అంకితభావంతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు మంచిపేరు తెచ్చేలా సిబ్బందిని, అధికారులను ప్రోత్సహించేందుకు ఈ సిటిజన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. -
చట్టప్రకారమే రవాణా పన్ను వసూలు
ఏపీపై ఎలాంటి కక్షా లేదు ఆర్టీసీ కార్మికుల ఫిట్‌మెంట్‌పై త్వరలో నిర్ణయం రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి,హైదరాబాద్ : అంతరాష్ర్ట పన్ను వసూళ్ల విషయంలో ఏపీపై తమకు ఎలాంటి కక్ష లేదని, జీవో 43 ప్రకారమే రోడ్డు రవాణా పన్ను వసూలు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.శువ్రారం నగరంలో నిర్వహించిన తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రవాణా పన్ను విషయంలో అనవసరంగా రాద్దాంతాలు చేయరాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలికంగా పన్ను వసూళ్లను వాయిదా వేశామన్నారు. తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఆర్టీసీ కార్మికులకు సైతం తాము అన్యాయం చేయబోమని, ఫిట్‌మెంట్‌పై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులు ఉద్యమస్థాయిలో కృషి చేయాలన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అసోసియేషన్ రూపొందించిన ‘ జర భద్రం కొడుకో’ సీడీని ఆయన ఆవిష్కరించారు.ఎంవీఐలు, ఇతర అధికారుల పదోన్నతులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ, సకలజనుల సమ్మెతో ఆర్టీఏ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనతోనే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, సకల జనుల సమ్మెగా అది విజయవంతమైందని గుర్తు చేశారు. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములైనట్లుగానే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలన్నారు.రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ రవాణా ఉద్యోగులంతా ఒక కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. కమిషనర్ సుల్తానియా మాట్లాడుతూ, స్కూళ్లలో రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించగలమన్నారు. టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ఎంవీఐల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీనివాస్, డీటీసీలు రమేష్,ప్రవీణ్‌రావు,టీఆర్ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హనుమంత రావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
త్వరలో ఆర్టీసీ విభజన
వారం రోజుల్లో ఇద్దరు సీఎస్‌లతో మాట్లాడుతా: గడ్కరీ ఆస్తులు, అప్పుల పంపకం కూడా కొలిక్కి తెస్తాం మంత్రి మహేందర్‌రెడ్డికి కేంద్రమంత్రి హామీ సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ : రాష్ట్రం విడిపోయి ఆరునెలలు గడుస్తున్నా ఇంకా ఆర్టీసీ ఉమ్మడిగానే ఉండడం పట్ల కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే రెండు రవాణా సంస్థలుగా సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. వారంరోజుల్లో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించి దీనిపై చర్చిస్తానని, వీలైనంత తొందరలో ఆస్తులు, అప్పుల పంపకాలను కూడా పూర్తి చేసేలా చూస్తానని గడ్కరీ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ భవన్లో నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆర్టీసీకి 23వేల బస్సులున్నాయని, ఉమ్మడిగా ఉండడంతో ఆస్తుల, ఉద్యోగుల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దాన్ని వెంటనే విభజించాల్సిందిగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మహేందర్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎక్కడి ఆస్తులు అక్కడే, ఏ ప్రాంత బస్సులు ఆ ప్రాంతానికే పరిమితం చే సే అవకాశం ఉన్నందున విభజన పెద్ద సమస్య కాబోదనే అభిప్రాయాన్ని కేంద్రమంత్రి వెలిబుచ్చినట్టు ఆయన తెలిపారు. వారంరోజుల్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లను పిలిపించి చర్చించినప్పుడు వీటన్నింటిపై నిర్ణయాలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తాను గడ్కరీ వద్ద ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడారని, వారంలో విభజనకు వీలుగా చర్యలు తీసుకుంటానని సీఎంకు గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రావాల్సిన మరో 522 బస్సులు తొందరగా అందేలా చూడాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును శుక్రవారం కలసి విన్నవించాలని అనుకున్నామని, కానీ శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ భేటీని వాయిదా వేసుకున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. నితిన్గడ్కరీతో ఈ యూ నేతల భేటీ ... ఇదిలాఉండగా, ఆర్టీసీని వెంటనే విభజించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆర్టీసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. కేంద్ర రోడ్డు భద్రత చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన టీఎస్‌ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భాస్కరరావులు గురువారం గడ్కరీని కలసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఐదువేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, దీనిని పూడ్చుకోవడానికి కేంద్రం సాయం చేయాలని వారు కోరారు. అలాగేప్రజారవాణాలో ఉన్న ఆర్టీసీకి రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో విభజిస్తామని గడ్కరీ తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. కాగా, జంతర్‌మంతర్ ధర్నాలో తమ యూనియన్ నుంచి 50 మంది పాల్గొన్నారని తెలిపారు. -
మరో రౌడీపై పీడీ యాక్ట్
యాకుత్‌పుర: పాతబస్తీకి చెందిన మరో కరుడుగట్టిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ బార్డర్ యూసుఫ్‌పై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీం తో పోలీసులు యూసుఫ్ ఖాన్‌ను ఆదివారం అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. భవానీనగర్‌కు చెం దిన ఇతనిపై మూడు హత్యలు, హత్యాయత్నం, రెండు స్నాచింగ్, బెదిరింపు కేసులున్నాయి. యూసుఫ్ దశాబ్ద కాలం నుంచి వరుసగా నే ర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నాయకుడు కోనపురి రాములు హత్య కేసులో కూడా ఇతడు నిందితుడు. కిరాయి హత్యలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతని ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం కింద ఒక్కసారి జైలుకెళ్తే ఏడాది పాటు బెయిల్ రాదు. ఏడాది వరకు కూడా వీరి ప్రవర్తనలో మార్పు వస్తే విడుదల చేస్తారు. లేని పక్షంలో మరో ఏడాది పాటు జైలులో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది. నెల రోజుల వ్యవధిలో నగర పోలీసులు పది మంది రౌడీషీటర్లను పీడీ యాక్ట్ కింద చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్‌పై అరెస్టయిన రౌడీషీటర్లు వీరే..... మహ్మద్ ఇల్యాస్ బిన్ హబీబ్ సలామ్ (గోల్కొండ) మహ్మద్ మాజిద్ (గొల్కొండ) చోర్ కౌసర్ (ఆసిఫ్‌నగర్) యూసుఫ్ (ఆసిఫ్‌నగర్) మహ్మద్ ఫిర్దౌస్ (బంజారాహిల్స్ సయ్యద్‌నగర్) మహ్మద్ లతీఫ్ (మల్లేపల్లి) మహ్మద్ తన్వీర్ (ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్) పల్లె సుధాకర్‌రెడ్డి(జూబ్లీహిల్స్) బోడ రాజుల (జూబ్లీహిల్స్) తాజాగా మహ్మద్ యూసుఫ్ ఖాన్ (భవానీనగర్) -
నిరుపేదలకు అండగా ఉంటాం
మంత్రి మహేందర్‌రెడ్డి హామీ దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట లో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పి టిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపే ట సర్పంచ్ అర్కల అనంత స్వామి ము ది రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీఓ అరుణ, స ర్పం చ్ల సంఘఅధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి హామీ దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట లో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పి టిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపే ట సర్పంచ్ అర్కల అనంత స్వామి ము ది రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీఓ అరుణ, స ర్పం చ్ల సంఘఅధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు. ఎంపీ ప్రసంగానికి అడ్డంకులు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ అనాలని దుండిగల్‌కు చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ అనాలని దుండిగల్‌కు చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. -
అయ్యో.. గిరిజ!
కళ్ల ఎదుటే బోరు బావిలో పడిన చిన్నారి ఆడుతూ.. పాడుతూ..అంతలోనే విషాదం! రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన మంచాల: నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో చోటు చేసుకుంది. గిరిజ అనే బాలిక ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అమ్మమ్మ, చిన్నమ్మలు పొలం పనుల్లో ఉండగా...గిరిజ ఆడుకుంటూ ముందుకు వెళ్లి తెరిచి ఉన్న బోరు బావిలో పడిపోయింది. విషయం గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా...ఏసీపీ రాములు తన సిబ్బందితో హుటాహుటిన తరలివచ్చారు. జేసీబీలు సాయంతో బోరుచుట్టూ గుంతలు తవ్వారు. అయినా ఫలితం లేకపోయింది. బోరు 320 అడుగుల లోతుండగా...చిన్నారి దాదాపు 45 అడుగుల లోతులో పడినట్లు గమనించారు. అక్కడ నీరున్నట్లుగా గుర్తించారు. రెండు జేసీబీలతో పనులు వేగవంతం కాకపోవడంతో మరో రెండు జేసీబీలను తీసుకువచ్చారు. పరిస్థితిని గమనించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. పాపను రక్షించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 1.15కు కలెక్టర్ శ్రీధర్‌తోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. దాదాపు రెండున్నర గంటలకుపైగా అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. బోరు బావిలోంచి పాపను కాపాడేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సాయంత్రం కావడంతో మరో రెండు హిటాచీలు తీసుకొని వచ్చి పనులు వేగవంతం చేశారు. సాయంత్రం ఆరు గంటలు గడిచినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక పరిస్థితి గురించి తెలియరాలేదు. -
ఎ..బి..సి..డి..
పోలీస్ సిబ్బందికి గ్రేడ్లు బాధితులకు ఉన్నతాధికారుల ఫోన్లు సిబ్బంది పనితీరుపై వివరాలు సేకరణ కమిషనర్ మహేందర్‌రెడ్డి చర్యలు పూర్తిస్థాయిలో అమలుకు కసరత్తు ‘నమస్తే మేడమ్... మీరు పుస్తెలతాడు చోరీకి గురైందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు కదూ. ఫిర్యాదు స్వీకరించడానికి మా సిబ్బంది మీకేమైనా ఇబ్బంది పెట్టారా? లేక సహకరించారా? లంచాలేమైనా అడిగారా? పొరపాటుగా మాట్లాడారా లేక మర్యాద పూర్వకంగా మసలుకున్నారా? ఏవైనా సమస్యలు తలెత్తితే చెప్పండి. వారి పనితీరుకు ఏ గ్రేడ్ ఇవ్వమంటారో సూచించండి’ అంటూ బంజారాహిల్స్‌కు చెందిన శాంతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆరా తీస్తే అది ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిందని ఆమె తెలుసుకుంది. ఆమెకే కాదు...ఇక ముందు నగరంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లే ఫిర్యాదుదారులకు ఇదే తరహా ఫోన్ కాల్స్ రానున్నాయి. పోలీస్ సిబ్బంది పనితీరు తెలుసుకోవడం... వారికి గ్రేడ్లు కేటాయించడం ఈ కాల్స్ ముఖ్య ఉద్దేశం. సాక్షి, సిటీబ్యూరో: నేరాల నియంత్రణకు... పోలీసు సిబ్బంది వైఖరిలో మార్పునకు ఉన్నతాధికారులు విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రక్రియకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సేవలు అందుకున్నాక పోలీసులకు ఎన్ని మార్కులు వేస్తారో అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. సిబ్బంది పనితీరుకు ప్రజలు ఏ గ్రేడింగ్ ఇస్తారో చూడాలని మహేందర్‌రెడ్డి భావిస్తున్నారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. పాస్‌పోర్టు క్లియరెన్స్ కోసం స్పెషల్‌బ్రాంచ్ సిబ్బంది ఏవిధంగా విచారించారు? వారి పని విధానంతో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా..? వారి పని విధానంపై ఏమేరకు సంతృప్తి చెందారు..? సిబ్బంది ఏమైనా తప్పులు చేశారా..? లంచాలు అడిగారా..? మరేరకమైన వేధింపులకు గురిచేశారా..? అనే విషయాలు తెలుసుకునేందుకు అధికారులే స్వయంగా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. సిబ్బంది సక్రమంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడంతో పాటు దర ఖాస్తుదారుకువేధింపులు, సమస్యలు కలిగించుకుండా ఉండాలన్నదే కమిషనర్ ఉద్దేశం. రాబోయే రోజుల్లో ప్రతి కేసులోనూ సిబ్బంది పనితీరు బేరీజు వేసేందుకు కమిషనర్ యత్నిస్తున్నారు. ఉదాహరణకు స్నాచింగ్ బారిన పడిన బాధితులు ఠాణాకు వ స్తే సిబ్బంది ఎలా స్పందించారు. రాగానే ఫిర్యాదు స్వీకరించారా?లేక ప్రశ్నలతో వేధించారా..అనే వివరాలను బాధితుల నుంచి సేకరిస్తారు.ఠాణాలో బాధితులతో మర్యాదగా మాట్లాడాలనే భావనతో ప్రత్యేకంగా రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్త్రీల కోసం మహిళా సిబ్బందిని సైతం రిసెప్షన్లో కేటాయించారు. కాలనీవాసులు, బస్తీ వాసులతో ఫ్రెండ్లీ పోలిసింగ్ నిర్వహించాలని, అందుకు తగ్గ సూచనలు, పోలీసుల నడవడికపై మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై పోలీసుల నుంచి సేవలు పొందే ప్రతి వారి నుంచి సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇందుకోసం కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడింగ్‌పై దృష్టితో ఉపయోగాలు ప్రతి కేసులో బాధితుడిపై ఉన్నతాధికారి పర్యవేక్షణ ఉంటుంది. బాధితుడికి చట్టపరిధిలో సేవలు అందించేందుకు సిబ్బంది చొరవ చూపుతారు. బాధితుడు ఊరట చెందడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. అక్రమ కేసులు బనాయించడం కుదరదు. బాధితులకు సరైన న్యాయం చేయక, నిందితులతో కుమ్మక్కైతే ఆ విషయం పై అధికారులకు తెలిసే అవకాశం ఉంది. ఠాణాలో బాధితుడికి వేధింపులు తగ్గుతాయి. కేసు దర్యాప్తు, పురోగతి విషయాలపై ఎప్పటికప్పుడు సిబ్బంది సమాచారం అందిస్తారు. బాధితులు అడిగిన సమాచారం ఇవ్వకుంటే సిబ్బందిపై వేటు పడుతుంది. తమ పనితీరుపై ప్రజల నుంచి వచ్చే సూచనలు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. -
ప్రశాంతంగా నిమజ్జనం
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్లలోని 23 చెరువులలో గణేశ్ నిమజ్జనం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగింది. గతేడాది పోలీసుల హడావుడి చేయడంతో నిర్వాహకులు నిమజ్జన ప్రక్రియను త్వరగా పూర్తి చేయగా..ఈ సారి పోలీసులు సహకరించడంతో నిదానంగా నిమజ్జనం చేశారు. అక్కడక్కడా ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలిగినా మొత్తం మీద చెప్పుకోదగ్గ సమస్యలు తలెత్తకపోవడంతో పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ ఊపిరిపీల్చుకున్నారు. గతనెల 29న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు నాలుగు రోజుల ముందు నుంచి సోమవారం జరిగిన నిమజ్జనం వరకు అనుసరించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. ఉదయం 11.15కి నిమజ్జనానికి బయల్దేరిన బాలాపూర్ గణేశుడితో ప్రధాన శోభాయాత్ర మొదలైంది. ఈ యాత్రకు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నగర పోలీసు కమిషరేట్ పరిధిలోకి వచ్చే కేశవగిరికి బాలాపూర్ గణేశుడు చేరుకున్నాడు. అక్కడి నుంచి నగర పోలీసులు ప్రధాన ఊరేగింపునకు బందోబస్తు వహించారు. చార్మినార్ వద్దకు ప్రధాన ఊరేగింపు చేరేలోపు ప్రార్థనల నేపథ్యంలో అక్కడి స్వాగత వేదికపై మూడు, నాలుగుసార్లు నేతల ప్రసంగాను పోలీసులు నిలిపివేయించారు. అలాగే ఊరేగింపును కూడా కొద్దిసేపు ఆపేశారు. ఆ తర్వాత ఊరేగింపు ముందుకు సాగింది. ఇదే సమయంలో పాతబస్తీలో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు సీపీలు అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించారు. రెండు గంటల పాటు అక్కడే అన్నారు. ఆ తర్వాత బషీర్‌బాగ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న మహేందర్‌రెడ్డి అక్కడి నుంచే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీల ప్రసారాలను తిలకిస్తూ అక్కడి నుంచే అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6.30కి బాలాపూర్ గణేశుడు చార్మినార్ దాటాడు. గతంలో బాలాపూర్ గణేశుడు వెనకాల ఎలాంటి విగ్రహాలు వచ్చేవికావు. ఈసారి అలా కాకుండా ముందుగా బాలాపూర్ గణేశుడిని దాటించడం.. ఆ తర్వాత పాతబస్తీలోని విగ్రహాలు బయలు దేరడం జరిగింది. రాత్రి 9 గంటల వరకు కూడా పాతబస్తీలో ఊరేగింపులు కొనసాగుతునే ఉన్నాయి. ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా వచ్చిన గణనాథులు లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిశాయి. ట్యాంక్‌బండ్, మిరాలంట్యాంక్, రాజన్నబావి,ఐడీపీఎల్ చెరువు, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పుర చెరువు, సఫిల్‌గూడ చెరువు, సరూర్‌నగర చెరువు, అల్వాల్ కొత్త చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్, షామీర్పేట, సూరారం, ఐడీఎల్ , వెన్నెలగడ్డ, లింగం, కాప్రా, కీసర, పూడురు చెరువులు, అలాగే, ఎల్లమ్మపేట, దుర్గం, హిమాయత్‌నగర్, మేకంపూర్ , బోయిన్, సున్నం చెరువు (మూసాపేట), మల్కన్, గంగారామ్చెరువులో నిమజ్జనం కొనసాగింది. నగరంలో 30 వేల మంది, సైబరాబాద్‌లో 9400 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం ఇంకా పూర్తికాకపోవడంతో మంగళవారం కూడా బందోబస్తు యథావిధిగా కొనసాగుతుంది. -
30వేల మందితో బందోబస్తు: సీపీ
అఫ్జల్‌గంజ్: గణేశ్ సామూహిక నిమజ్జనోత్సవానికి 30 వేల మంది పోలీసులను నియమించినట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి సిద్దిఅంబర్‌బజార్‌లోని బహెతిభవ న్లో గణేశ్ సామూహిక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్, సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ తదితర విభాగాల పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ అశ్లీలతకు తావు లేకుం డా ఉండేందుకు నిమజ్జనోత్సవంలో డీజేను నిషేధించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్ణయించిందన్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు మా ట్లాడుతూ చార్మినార్ వద్ద మైకులు ఆపినా, ఊరేగింపును నిలిపివేసినా సహించేది లేదన్నారు. అవసరమైతే నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గణేశ్ ఊరేగింపును నిలిపేయాలని పిలుపునిచ్చేం దుకు సైతం భాగ్యనగర్ సమితి వెనుకాడబోదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో నగర అదనపు కమిషనర్లు అంజలీకుమా ర్, జితేంద్ర, మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ, అబిడ్స్ ఏసీపీ జైపాల్, జీహెచ్ఎంసీ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, బేగం బజార్ కార్పొరేటర్ జి.శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. నగరానికి చేరుకున్న బలగాలు.. సాక్షి, సిటీబ్యూరో: నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు శుక్రవారం నగరానికి చేరుకున్నాయి. జంట పోలీసు కమిషనరేట్లకు చెందిన 15 వేల మందితోపాటు మరో 15 వేల మంది పోలీసు సిబ్బందితో నిమజ్జన బందోబస్తు నిర్వహించనున్నారు. గతంలో నగరంలో పనిచేసిన రిటైర్ అయిన అధికారుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. నగరంలో పనిచేసి, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని సైతం రప్పిస్తున్నారు.