పెంకి చెల్లెలు
‘‘మా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సినిమాలో నరేశ్ చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా అని మేం తర్జనభర్జన పడుతుంటే కార్తీక పేరును మా హీరో నరేశే సూచించారు. ఆయన సూచన మేరకు కార్తీకను ఆ పాత్రకు ఎంపిక చేశాం. మేం అనుకున్న దానికంటే వంద రెట్లు గొప్పగా నటించింది కార్తీక. అల్లరి నరేశ్‌కి పోటీగా కామెడీ పండించింది’’ అని దర్శకుడు బి.చిన్ని అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేశ్, కార్తీక అన్నాచెల్లెళ్లుగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు పై విధంగా స్పందించారు. ‘‘అల్లరి నరేశ్ కామెడీతో పాటు కార్తీక పోరాటాలు, డాన్సులు ఈ చిత్రానికి హైలైట్. తనది పెంకి చెల్లెలి పాత్ర. ఇందులో మన ఇంట్లో అల్లరి పిల్లలా అనిపిస్తారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన. ఈ చిత్రానికి కథ: విక్రమ్‌రాజ్, కెమెరా: విజయ్‌కుమార్ అడుసుమిల్లి, సంగీతం: శేఖర్‌చంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ.