brother of bommali
-
బొమ్మాళి బ్రదర్
-
బొమ్మాళి బ్రదర్ టిమ్‌తో చిట్‌చాట్
-
డబుల్ హ్యాపీగా ఉన్నా: శేఖర్‌చంద్ర
‘‘నా కెరీర్లోనే పెద్ద బ్రేక్ ‘కార్తికేయ’. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ రూపంలో మరొకటి నా తలుపు తట్టింది. వరుస విజయాలు ఎంతో ఆనందానిస్తున్నాయి. డబుల్హ్యాపీగా ఉన్నా’’ అని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘చిన్నప్పట్నుంచీ సంగీతమంటే ప్రాణం. అందుకే కీబోర్డ్ నేర్చుకున్నాను. చెన్నైలో కర్ణాటక సంగీతం అభ్యసించాను. సంగీత దర్శకత్వం వహించాలని మాత్రం అనుకోలేదు. కీరవాణి, కోటి నన్ను సంగీత దర్శకునిగా ప్రోత్సహించారు. రవిబాబు ‘అనసూయ’ చిత్రంతో సంగీత దర్శకుణ్ణి చేశారు’’ అని శేఖర్‌చంద్ర గుర్తు చేసుకున్నారు. ఇంకా మాట్లాడుతూ-‘‘రవిబాబుతో అనసూయ, నచ్చావులే, మనసారా, నువ్విలా, అవును.. చిత్రాలు చేశాను. అవన్నీ నాకు మంచి శిక్షణగా ఉపయోగపడ్డాయి. ‘కార్తికేయ’కు గొప్పగా సంగీతం చేశానని అంటున్నారంటే కారణం అదే. ప్రస్తుతం ‘అవును-2’, నక్కిన త్రినాథరావు రూపొందిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, ఇళయరాజా, రెహ్మాన్, దేవిశ్రీ ప్రసాద్‌లు తనకు ప్రేరణ అనీ, పాప్ సంగీతాన్ని కూడా గమనిస్తుంటాననీ శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. సామాజిక స్పృహతో కూడిన మ్యూజిక్ ఆల్బమ్‌ని రూపొందించనున్నాననీ, ఆ వివరాలు త్వరలో చెబుతానని శేఖర్‌చంద్ర చెప్పారు. -
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి టీమ్‌తో చిట్ చాట్
-
అల్లరి బొమ్మాళి
-
చెల్లెలిగానా... నో అన్నాను!
‘‘నేనేం కారెక్టర్ ఆర్టిస్ట్‌ని కాదు. హీరోయిన్గా చేస్తున్నా. అయినా కూడా చెల్లెలి పాత్ర చేశానంటే.. ఆ పాత్ర ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు’’ అని కార్తీక అన్నారు. ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో ‘అల్లరి’ నరేశ్‌కి చెల్లిగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరూ కవలలు. బి. చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక మట్లాడుతూ- ‘‘చిన్నిగారు సిస్టర్ కేరక్టర్ చేయాలనగానే అమ్మ, నేను ‘నో’ అనేశాం. కానీ, కథ విన్న తర్వాత నిర్ణయం తీసుకోమన్నారు. విన్నాం.. బాగా నచ్చింది అందుకే ఒప్పుకున్నాం. ఏదనుకుంటే అది చేయాలని, తన సోదరుణ్ణి ఆడుకోవాలని, ఎవరైనా రెచ్చిపోతే రఫ్ఫాడించాలని.. అనుకునే కారెక్టర్ నాది. సినిమాలో నా మీద ‘జేమ్స్ బాండ్’ అనే పాట ఉంది. దీన్నిబట్టి నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘అరుంధతి’లాంటి సినిమా అయితే కథానాయికకు నటనకు అవకాశం దొరుకుతుంది. కానీ, లేడీ ఓరియంటెడ్ కాని ఈ చిత్రంలో నాకు నటనకు అవకాశం దొరకడం ఆనందంగా ఉంది. కొత్తగా వచ్చే హీరోలు తమ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉండాలి? ఎలాంటి రిస్కీ ఫైట్స్ ఉండాలి? అని కలలు కంటారో.. అలాంటివన్నీ నాకు ఈ సినిమాలో ఉన్నాయి. వాస్తవానికి నా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది కాబట్టి, నరేశ్ తల్చుకుంటే దర్శకుడితో చెప్పి, నా సీన్స్ కట్ చేయించొచ్చు. కానీ, అలా చేయకపోవడం తన గొప్పతనం. ఈ సినిమాకి బ్రదర్, సిస్టర్ ఇద్దరూ హీరోలే. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇద్దరు హీరోల సినిమా’’ అన్నారు. తన తల్లి రాధతో తనను పోల్చవద్దని చెబుతూ- ‘‘మా అమ్మ మంచి నటి. ఓ లెజెండ్‌తో ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న నన్ను పోల్చడం సరికాదు. ఆవిడంత పేరు తెచ్చుకోవడానికి నాకు టైమ్ పడుతుంది. అప్పట్లో చిరంజీవిగారు మంచి డాన్సర్. ఎంత కష్టమైనా ఫర్వాలేదు.. నేను కూడా ఆ స్టెప్స్ వేస్తా అని అమ్మ అడిగి మరీ చేసేదట. చిరంజీవిగారు కూడా సపోర్ట్ చేసేవారట. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో కొన్ని డాన్స్ మూమెంట్స్‌ని నేను రోప్ లేకుండా చేశాను. నరేశ్, చిన్ని సహకారం లేకపోతే చేయగలిగేదాన్ని కాదు’’ అన్నారు. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం గురించి చెబుతూ- ‘‘సినిమానే బతుకుదెరువు అనుకునే స్థితిలో నేను లేను. అందుకే, మనసుకి నచ్చినవాటినే చేస్తున్నాను. గ్యాప్ వచ్చినా చింతించను’’ అని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన కనుబొమలు బాగా లేవనేవారని కార్తీక చెబుతూ - ‘‘నా ‘రంగం’ సినిమా విడుదలైన తర్వాత చాలామంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్లో ‘కార్తీకలాంటి కనుబొమలు కావాలి’ అని అడుగుతున్నారట. అప్పుడు మైనస్ అన్నవాళ్లు ఇప్పుడు నా ఐబ్రోసే నాకు ప్లస్ అంటున్నారు. అందుకే విమర్శలకు కంగారుపడను. ఇప్పుడు బాగాలేదనిపించినది భవిష్యత్తులో బాగుంటుందని సర్దిచెప్పుకుంటా’’ అన్నారు. -
బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ మూవీ స్టిల్స్
-
నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్
‘‘నరేశ్ మినిమమ్ గ్యారంటీ హీరో. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’. ‘అల్లరి’ నరేశ్, మోనాల్ గజ్జర్ జంటగా బి. చిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర పాటలు స్వరపరిచారు. తొలి సీడీని శాసనసభ్యుడు, నిర్మాత మాగంటి బాబు ఆవిష్కరించి బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని బోయపాటి ఆవిష్కరించారు. ఈవీవీ తనకు మంచి మిత్రుడని, ఆయన లేకపోవడం బాధాకరమని, నరేశ్, రాజేష్ తండ్రి పేరుని నిలబెడుతున్నారని మాగంటి బాబు అన్నారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ - ‘‘కథానాయికగా కొనసాగుతున్నప్పటికీ కార్తీక ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చేసి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. మేమిద్దరం పోటీ పడి నటించాం. ఈ చిత్రం తర్వాత చిన్ని బిజీ డెరైక్టర్ అవుతాడు’’ అని తెలిపారు. దర్శకునిగా ఒకే ఒక్క సినిమా చేసిన తనతో 47 సినిమాలు చేసిన నరేశ్ సినిమా చేయడం గొప్ప విషయమని, విజయవంతమైన సినిమా చేయడానికి అందరం కృషి చేశామని చిన్ని అన్నారు. ఇందులో ఉన్న అన్నా, చెల్లెలి సెంటిమెంట్ అందరికీ నచ్చుతుందని అమ్మిరాజు చెప్పారు. శేఖర్‌చంద్ర, కార్తీక, మోనాల్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు. -
‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఫస్ట్‌లుక్ లాంచ్
-
పెంకి చెల్లెలు
‘‘మా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సినిమాలో నరేశ్ చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా అని మేం తర్జనభర్జన పడుతుంటే కార్తీక పేరును మా హీరో నరేశే సూచించారు. ఆయన సూచన మేరకు కార్తీకను ఆ పాత్రకు ఎంపిక చేశాం. మేం అనుకున్న దానికంటే వంద రెట్లు గొప్పగా నటించింది కార్తీక. అల్లరి నరేశ్‌కి పోటీగా కామెడీ పండించింది’’ అని దర్శకుడు బి.చిన్ని అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేశ్, కార్తీక అన్నాచెల్లెళ్లుగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు పై విధంగా స్పందించారు. ‘‘అల్లరి నరేశ్ కామెడీతో పాటు కార్తీక పోరాటాలు, డాన్సులు ఈ చిత్రానికి హైలైట్. తనది పెంకి చెల్లెలి పాత్ర. ఇందులో మన ఇంట్లో అల్లరి పిల్లలా అనిపిస్తారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన. ఈ చిత్రానికి కథ: విక్రమ్రాజ్, కెమెరా: విజయ్‌కుమార్ అడుసుమిల్లి, సంగీతం: శేఖర్‌చంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ. -
'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' కార్తీక స్టిల్స్
-
బ్లాక్ అండ్ వైట్ సాంగ్!
అల్లరి నరేశ్, ‘రంగం’ ఫేం కార్తీక అవిభక్త కవలలుగా నటిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఓ విధంగా టైటిల్‌రోల్ కార్తీకదే అనాలి. ‘వీడు తేడా’ ఫేం బి.చిన్ని దర్శకుడు. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ‘అల్లరి’ నరేశ్, కథానాయిక మోనాల్ గజ్జర్లపై చిత్రీకరించిన ‘లవ్ యూ అంటున్నా...’ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. వాటిని గుర్తు చేసే విధంగా ఈ పాటను ఆద్యంతం బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర అయినా, ఈ ఒక్క పాటను మాత్రం నాటి ఆణిముత్యాలను గుర్తు చేసే రీతిలో శ్రీవసంత్ స్వరపరిచారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేసి, అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ. -
బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ మూవీ స్టిల్స్
-
బొమ్మాళీ తమ్ముడు
‘అల్లరి’ నరేశ్ హీరోగా బి.చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ అనే టైటిల్’ను ఖరారు చేశారు. మోనాల్ గజ్జర్, కార్తీక తదితరులు నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.