బ్లాక్ అండ్ వైట్ సాంగ్! | Black and White Song in Brother of Bommali movie | Sakshi
Sakshi News home page

బ్లాక్ అండ్ వైట్ సాంగ్!

Published Tue, Sep 2 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

బ్లాక్ అండ్ వైట్  సాంగ్!

బ్లాక్ అండ్ వైట్ సాంగ్!

 అల్లరి నరేశ్, ‘రంగం’ ఫేం కార్తీక అవిభక్త కవలలుగా నటిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఓ విధంగా టైటిల్‌రోల్ కార్తీకదే అనాలి. ‘వీడు తేడా’ ఫేం బి.చిన్ని దర్శకుడు. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో ‘అల్లరి’ నరేశ్, కథానాయిక మోనాల్ గజ్జర్‌లపై చిత్రీకరించిన ‘లవ్ యూ అంటున్నా...’ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది.
 
 బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. వాటిని గుర్తు చేసే విధంగా ఈ పాటను ఆద్యంతం బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర అయినా, ఈ ఒక్క పాటను మాత్రం నాటి ఆణిముత్యాలను గుర్తు చేసే రీతిలో శ్రీవసంత్ స్వరపరిచారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేసి, అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement