Karthika
-
Supritha Karthika Nomu Pooja: కార్తీక మాస నోములు..కూతురితో కలిసి సురేఖవాణి పూజలు (ఫొటోలు)
-
మూడు ముళ్లు... ఏడడుగులు
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. -
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్
సీనియర్ నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం(నవంబర్ 19) ఉదయం రోహిత్ మేనన్‌తో కార్తిక మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్లో..కేరళ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం కార్తిక పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, జోష్(2009) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కార్తిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. కార్తిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జీవా నటించిన ‘రంగం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 2015 నుంచి కార్తిక చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీ అయిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
రహస్యంగా రాధ కూతురు 'కార్తీక' నిశ్చితార్థం.. ఫోటో వైరల్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు 'కార్తీక' జోష్ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది. అందులో నాగచైతన్యకు జోడీగా ఆమె మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించిన కార్తీకకు 'రంగం' సినిమా ఆమె కెరీయర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పవచ్చు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఏకంగా జూ. ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రంలో ఆమెకు అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కార్తీక తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా.. నవ్వులు చిందిస్తూ కనిపించింది. అలాగే ఆమె చేతికి ఓ ఖరీదైన రింగును ధరించింది. ఫోటోలో వారిద్దరి ఫేస్ లుక్స్ కంటే ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆమె.. నెగెటివ్ ఎనర్జీ తమపై పడకూడదనే ‘ఈగల్ ఐ’ ఎమోజీని జత చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటో చూసిన వారందరూ కార్తీక నిశ్చితార్థం చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. మళ్లీ అలాంటి డ్రామానేనా?) కొద్దిరోజుల క్రితమే కార్తీక ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె నిశ్చితార్థం గురించి ఆ వివరాలను అధికారికంగా త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం. అల్లరి నరేష్‌తో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి చిత్రాల్లో నటించిన కార్తీక.. 2015 తర్వాత నుంచి వెండితెరకు దూరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) -
సీనియర్ హీరోయిన్ రాధ కూతురు బర్త్ డే (ఫొటోలు)
-
పాత్రలే దెయ్యాలైతే..!
కాజల్, రెజీనా, జననీ అయ్యర్ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
కార్తీక 2.ఒ
కార్తీక వీకే... ఎంతోమంది సాహిత్యాభిమానులకు సుపరిచితమైన పేరు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషింగ్’గా కీర్తి అందుకున్న వెస్ట్‌ల్యాండ్ బుక్స్ (అమెజాన్ కంపెనీ) పబ్లిషర్‌గా ఎంతోమంది రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. పాఠకుల నాడి పట్టుకుంది. మారుమూల పల్లె నుంచి హైటెక్ సిటీ వరకు ఏ చిన్న మెరుపు మెరిసినా ఆ మెరుపును అందుకోగలిగింది. కారణాలపై స్పష్టత ఇవ్వకపోయినా అమెజాన్ కంపెనీ వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌ను మూసివేసింది. ఆ తరువాత ఏమైంది? ‘ప్రతిలిపి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది కార్తీక. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘ప్రతిలిపి’ దేశంలోని పన్నెండు భాషలకు సంబంధించిన సృజనాత్మక రచనలకు, సాహిత్యభిమానుల మధ్య చర్చలకు వేదిక అయింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ప్రతిలిపి’ వెస్ట్‌ల్యాండ్ పబ్లిషింగ్, ఎడిటోరియల్, మార్కెటింగ్, సేల్స్ టీమ్‌ను యథాతథంగా తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ కొత్త వెంచర్‌ని ‘వెస్ట్‌ల్యాండ్ 2.ఒ’ అని పిలుస్తున్నారు. దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఎడిటర్లలో ఒకరిగా పేరుగాంచిన కార్తీకకు వెస్ట్ల్యాండ్లాగే ‘ప్రతిలిపి’ని పాపులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ‘ప్రతిలిపి పేపర్‌బ్యాక్స్’ శీర్షికతో తమ యాప్‌లో పాపులర్ అయిన రచనలను కార్తీక నేతృత్వంలో పుస్తకాలుగా తీసుకు రానుంది ప్రతిలిపి. ‘గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు పాపులర్ రచనలను పుస్తకాలుగా ప్రచురించేదాన్ని. ఇప్పుడు యాప్‌లో పాపులర్ అయిన రచనలను పుస్తకంగా ప్రచురించబోతున్నాను’ అంటుంది కార్తీక. ‘పుస్తకం అంటే కొన్ని పేజీల సముదాయం కాదు. అదొక ప్రపంచం’ అని చెప్పే కార్తీకకు ‘సంప్రదాయ పబ్లిషర్’ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పబ్లిషర్ ఆడియోబుక్, యాప్, పాడ్‌కాస్ట్... మొదలైన ఫార్మాట్లలో సాహిత్యాభిమానులకు చేరువ కావడానికి కొత్తదారిలో ప్రయాణం చేస్తుంది. ‘కాలంతోపాటు నడవాలి. కొత్త ఫార్మాట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇది సవాలు మాత్రమే కాదు ఎంతో ఉత్సాహం ఇచ్చే పని కూడా’ అంటుంది కార్తీక. కార్తీకతో కలిసి మరోసారి పనిచేయడానికి రచయితలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమె బలమని చెప్పాల్సి అవసరం లేదు కదా! వైవిధ్యమే బలం ప్రచురణ రంగానికి వైవిధ్యమే ప్రధాన బలం. అందుకే ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకులకు ఎలా చేరువ కావాలనేదానిపై రకరకాలుగా ఆలోచిస్తాను. పాఠకులకు చేరువ కావాలనే లక్ష్యం కోసం వక్రమార్గాల్లో పయనించడం నా సిద్ధాంతం కాదు. సమాజానికి హాని చేసే కంటెంట్‌ను దగ్గరికి రానివ్వను. వ్యాపారానికి నైతికత అనేది ముఖ్యం. విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎంపికకు సంబం«ధించిన విషయంలో కూడా ‘నాదే రైట్’ అనే ధోరణితో కాకుండా ఇతరులతో విస్తృతంగా చర్చిస్తాను. సోకాల్ట్–మెయిన్ స్ట్రీమ్ ఆలోచనలకు పక్కకు జరిగితే ఎంతో అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చు. నా కెరీర్లో సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతలో చదివే వారి సంఖ్య పెరగడం. ‘కొత్త పాఠకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు?’ అని తెలుసుకోవడం ముఖ్యం. శక్తిమంతమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కడో ఒకచోట ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వెలుగులోకి తీసుకురావడమే పబ్లిషర్ బలం. – కార్తీక వీకే -
దెయ్యాలు పగబడితే...
హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్‌లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
నటి కార్తికకు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. దుబాయ్‌లోని ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషిస్తుంది కార్తిక. ఈ క్రమంలో కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి యంగ్ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్ అన్నారు. కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్ సముద్ర గ్రూప్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు. -
Lockdown: కష్టాలు.. ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి
షూటింగ్‌లు కలిసి రాలేదు. లాక్డౌన్లో పని లేదు. కార్తీకకు యాక్టింగ్‌తో పాటు డ్రైవింగ్ వచ్చు. ఉన్న డబ్బుతో ఒక ట్రక్ కొనింది. కూరగాయలు, పండ్లు తిప్పే బండ్లకు లాక్డౌన్ నియమాలు వర్తించవు. ఇక కార్తీక ఫుల్ బిజీ అయ్యింది. పైనాపిల్స్ చీప్‌గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు, కొబ్బరిబోండాలు సలీసుగా దొరికే చోటు నుంచి పిరిమిగా ఉండే చోటుకు సరఫరా చేస్తూ స్టార్ డ్రైవర్‌గా నవ్వులు చిందిస్తోంది. ఒక కేరళ నటి స్ఫూర్తి ఇది. అర్ధరాత్రి. కేరళలోని మలప్పురం చెక్‌పోస్ట్ దగ్గర అటుగా వచ్చిన ట్రక్‌ను పోలీసులు ఆపారు. ‘బండిలో ఏముంది?’ డ్రైవర్‌ను అడిగారు. ‘పైనాపిల్స్’ అనే సమాధానం వినిపించింది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కారణం డ్రైవింగ్ సీట్లో ఉన్నది మహిళా డ్రైవర్. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకుని, పైన ఖాకీ షర్ట్ వేసుకుని, టోపీ పెట్టుకుని ఉంది. ‘ఏమైంది సార్. పండ్ల బండ్లకు ప్రాబ్లం లేదు కదా. తొందరగా వదలండి. నాకు ఆలస్యమైపోతోంది’ అందా డ్రైవర్. పోలీసులు లోడ్ చెక్ చేశాక చిరునవ్వుతో ఆ బండిని వదిలారు. చిరునవ్వుతో డ్రైవర్ కూడా కదిలింది. ఆ డ్రైవర్ పేరు కార్తీక. మలయాళంలో చిన్నపాటి నటి. ∙∙ ‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. దాంతో పాటు డ్రైవింగ్ కూడా. రెండూ నేర్చుకున్నాను. పెద్ద లారీలు కూడా నడుపుతాను. కొన్ని సినిమాలలో యాక్ట్ చేశాను. కాని నాకంటూ గుర్తింపు రాలేదు. నా భర్త గల్ఫ్‌లో పని చేస్తాడు. నాకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ లాక్డౌన్లో ఏ పనీ లేకుండా ఉండటం సరి కాదనుకున్నాను. వెంటనే ఒక ట్రక్ కొన్నాను. నిజానికి లారీ కొందామనుకున్నాను. అంత డబ్బు లేదు. ట్రక్‌తో మొదలెట్టాను’ అంటుంది కార్తీక. కేరళలో కన్నూరుకు చెందిన కార్తీక బతుకు దేవులాటలో అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని వాజక్కులంకు షిఫ్ట్ అయ్యింది. ‘ఇక్కడ పైనాపిల్స్ చీప్. కన్నూరులో కాస్ట్లీ. ఒక వెయ్యి కిలోల పైనాపిల్స్ తీసుకుని ఐదారుగంటలు ప్రయాణించి కన్నూరుకు తీసుకెళ్లాను. లాభం వచ్చింది. అలాగే వాజక్కులం నుంచి కొబ్బరిబోండాలు కొని ఎర్నాకులంకు సరఫరా చేస్తుంటాను. నేను కిరాయికి వెళతాను. అలాగే స్వయంగా సరుకు తీసుకెళ్లి అమ్ముతాను. బాగుంది ఇప్పుడు’ అంటుంది కార్తీక. ఖాకీ షర్ట్ ధరించి, తల మీద టోపీ పెట్టుకుని ట్రక్ నడిపే కార్తీకను పెద్దగా ఎవరూ గమనించరు. షాపుల వాళ్లు గమనించినా గౌరవం ఇస్తున్నారు. అర్ధరాత్రిళ్లు, అపరాత్రుళ్లు కూడా ఆమె నిర్భయంగా హైవే మీద దూసుకెళుతూ ఉంటుంది. బతుకు స్పీడ్‌బ్రేకర్ వేసినప్పుడు కూడా జీవితం స్టీరింగ్‌ను ఎలా ఒడిసి పట్టాలో కార్తీక ఇలా మనకు చెబుతోంది. -
వైవిధ్యంగా...
విజయ్‌భాస్కర్‌రెడ్డి హీరోగా, ప్రియాంక శర్మ, సింధు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘కార్తిక’. కొత్త పరశురామ్ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్ పతాకంపై మచెందర్ నట్టల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. కొత్త పరశురామ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ్భాస్కర్రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినా పూర్తి న్యాయం చేసాడు’’ అన్నారు. ‘‘పరశురామ్ నాకు చెప్పిన కథను అలానే తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం బాగా వచ్చింది. మా టీమ్‌కి మంచి పేరొస్తుంది. త్వరలో పాటలు రిలీజ్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మచెందర్ నట్టల. అజయ్‌ఘోష్, రూలర్ రఘు, ప్రీతి, ప్రియ కోల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీష్ గౌడ్, కెమెరా: వల్లి ఎస్కె, సంగీతం: సుభాష్ ఆనంద్. -
ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం
కదిరి అర్బన్: అభం శుభం తెలియని చిన్నారి ఆటో చక్రాల కిందపడి ప్రాణం కోల్పోయింది. పట్నం గ్రామంలో రాధిక, ఆంజనేయులు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. మంగళవారం ఉదయం తాగునీరు పట్టుకునేందుకు రాధిక ఆటో ట్యాంకర్ వద్దకెళ్లింది. ఆమె వెనకాలే కార్తీక (3) వెళ్లింది. బిందెలో నీరు పట్టుకుని తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి వెనకాలే నిల్చుని ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారివ్వడం కోసం డ్రైవర్ ఆటో ట్యాంకర్‌ను వెనక్కు తోలాడు. వెనుకచక్రాల కిందపడిన కార్తీక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. -
కార్తీకకు కాంస్యం
సాక్షి, గుంటూరు: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడోరోజు ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ ఖాతాలో పతకం చేరింది. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జి. కార్తీక (ఏపీ) కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె 12.51 మీ. దూరం జంప్ చేసి మూడో స్థానంలో నిలవగా, షీనా (12.78మీ., కేరళ), జోలిన్ లోబో (12.52మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుచుకున్నారు. 20, 000 మీ. రేస్ వాక్ ఈవెంట్లో సౌమ్య విజేతగా నిలిచింది. ఆమె గంటా 42 నిమిషాల 23.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్లో ఖ్యాతి వఖారియా (కర్ణాటక) 3.70 మీ. జంప్ చేసి చాంపియన్‌గా నిలిచింది. జావెలిన్ త్రో విభాగంలో అన్నూరాణి (54.29మీ.), పూనమ్ రాణి (51.14మీ., హరియాణా), రష్మీ శెట్టి (47.76మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. -
బుల్లితెర దేవసేన కార్తీక
బాహుబలి.. భారతీయ సినిమా స్థాయిని పదింతలు చేసిన సినిమా. కలెక్షన్ల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ ఈ విజువల్ వండర్ హాలీవుడ్ సినిమాలతో పోటి పడింది. ఇప్పుడు ఇదే స్థాయిలో బుల్లితెర మీద కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ప్రసారం కానుంది. బాహుబలి స్థాయిలో తెరకెక్కనున్న ఈ టీవీ సీరీస్ కు కూడా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సీరీస్ ఈ నెలాఖరు నుంచి టీవీలో ప్రసారమవుతోంది. ఆరంభ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ టీవీ సీరీస్ జూన్ 24 నుంచి స్టార్ నెట్ వర్క్‌లో ప్రసారం కానుంది. రెండు వైరి వర్గాలకు చెందిన వరుణ దేవ, దేవసేన ప్రేమకథలో ఈ భారీ సీరియల్ ను రూపొందిస్తున్నారు. వరుణ దేవగా రజనీష్ దుగ్గల్ నటిస్తుండగా దేవసేన పాత్రలో జోష్, దమ్ము సినిమాల హీరోయిన్ కార్తీక నటిస్తోంది. ఈ సీరియల్ కోసం భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వినియోగిస్తున్నారు. ఈ భారీ సీరియల్ కు గోల్డీ బెహెల్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
బుల్లితెర బాహుబలి 'ఆరంభ్'
బాహుబలి భారతీయ సినిమా స్థాయిని పదింతలు చేసిన సినిమా. కలెక్షన్ల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ ఈ విజువల్ వండర్ హాలీవుడ్ సినిమాలతో పోటి పడింది. ఇప్పుడు ఇదే స్థాయిలో బుల్లితెర మీద కూడా ఓ భారీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి స్థాయిలో తెరకెక్కనున్న ఈ టీవీ సీరీస్ కు కూడా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఆరంభ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ టీవీ సీరీస్ ను స్టార్ నెట్ వర్క్ లో ప్రసారం కానుంది. రెండు వైరి వర్గాలకు చెందిన వరుణ దేవ, దేవసేన ప్రేమకథలో ఈ భారీ సీరియల్ ను రూపొందిస్తున్నారు. వరుణ దేవగా రజనీష్ దుగ్గల్ నటిస్తుండగా దేవసేన పాత్రలో జోష్, దమ్ము సినిమాల హీరోయిన్ కార్తీక నటిస్తోంది. ఈ సీరియల్ కోసం భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వినియోగిస్తున్నారు. ఈ భారీ సీరియల్ కు గోల్డీ బెహెల్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..?
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తీక. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక, తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తెలుగులో హిట్ ఇవ్వకపోయినా తమిళ నాట హీరోయిన్గా నటించిన రంగం సినిమాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా కూడా కార్తీక కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. అందుకే కొద్ది రోజులుగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్న ఈ అందాల భామ, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయ్యిందట. అయితే నటిగా మాత్రం కొనసాగేందుకు ఓ హిందీ టివి సీరియల్లో నటించాలని నిర్ణయించుకుంది. మరి బుల్లి తెర అయినా ఈ స్టార్ వారసురాలికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
సినిమా రివ్యూ: బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
తారాగణం: ‘అల్లరి’ నరేశ్, కార్తీక, మోనాల్ గజ్జర్, కథ: విక్రమ్రాజ్, సంగీతం: శేఖర్ చంద్ర, కూర్పు: గౌతంరాజు, నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ బలాలు: అలవాటైన నరేశ్ శైలి వినోదం కార్తీక తెర నిండా కనపడే కమెడియన్లు వ్యంగ్య ధోరణి కథనం ఫస్టాఫ్ పాత సినీ శైలి పాట బలహీనతలు: కథ పెద్దగా లేకపోవడం ఉన్న కొద్ది పాటి కథను ఆసక్తిగా చెప్పలేకపోవడం నిడివి పెంచుతూ సీన్లు సీన్లుగా నడవడం సెకండాఫ్ ఎడిటింగ్ దర్శకత్వం వినోదమంటే ఒకప్పటి నిర్వచనాల మాటేమో కానీ, ప్రస్తుతం తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సందర్భ శుద్ధి, సన్నివేశ అవసరం, పాత్రోచిత ప్రవర్తన ఉన్నా, లేకున్నా కాసేపు నవ్వించడమే. గమనిస్తే, ఇటీవలి కాలపు తెలుగు చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే ప్రధానంగా ఇలాగే సాగుతోంది. ఆ పద్ధతిలో ప్రతి విషయాన్నీ వ్యంగ్యంగా చూపి, ప్రతి పాత్రనూ పంచ్ డైలాగులతో నింపే చిత్రాల ధోరణిలో తాజా చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ కూడా సాగింది. కథ ఏమిటంటే... రామకృష్ణ అలియాస్ రాంకీ (‘అల్లరి’ నరేశ్), మహాలక్ష్మి అలియాస్ లక్కీ (కార్తీకా నాయర్)లు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అన్న రాంకీని సైతం ఆటాడించే చెల్లెలు ఫైట్లకు సైతం సిద్ధపడే ధీర వనిత. శ్రుతి (మోనికా గజ్జర్)ను చూసీచూడగానే ప్రేమలో పడతాడు అన్న. చెల్లి పెళ్ళయితే కానీ, పెళ్ళి చేసేది లేదంటారు అతని తల్లితండ్రులు. తీరా చూస్తే, చెల్లి అప్పటికే హర్ష (హర్షవర్ధన్ రాణే) అనే యువకుణ్ణి ప్రేమిస్తుంటుంది. అతగాడికేమో మరో అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. ఈ క్రమంలో హీరో తన బృందంతో సాక్షాత్తూ ఆ పెళ్ళి ఇంటికే వెళ్ళి ఏం చేశాడు? చెల్లెలి పెళ్ళి ఎలా జరిపించాడు? తన పెళ్ళికి మార్గం ఎలా సుగమం చేసుకున్నాడన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే... కొద్దికాలంగా సరైన హిట్ లేని ‘అల్లరి’ నరేశ్ ఈ సారి పూర్వ వైభవం సంపాదించుకోవడం కోసం తన మార్కు వినోదాన్ని ఆశ్రయించారు. ఎప్పటి లానే తన ఎనర్జీ స్థాయితో అలరించడానికి యత్నించారు. సినిమాలో పేరుకు హీరోయిన్ ఉన్నా, హీరోకు జంటగా పాటల కోసమే తప్ప మోనాల్ గజ్జర్ పోషించిన పాత్ర నుంచి పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. కథకు కీలకమైన హీరో చెల్లెలుగా కార్తీక (నటి రాధ కుమార్తె) ఫైట్స్ సైతం చేసే దిలాసా యువతిగా పాత్రలో ఇమిడిపోవడానికి కృషి చేశారు. బ్రహ్మానందం, అలీ, ఫస్టాఫ్‌లో ‘వెన్నెల’ కిశోర్ - ఇలా చాలామంది కమెడియన్లే సినిమాలో ఉన్నారు. ఎలా ఉందంటే... హీరో ప్రేమ గోల, దానికి చెల్లెలిచ్చే సలహాలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. తీరా సెకండాఫ్‌లో క్యాటరర్ కోన (బ్రహ్మానందం), దొంగ పాత్రధారి అలీ తదితరులతో కలసి హీరో సాగించే డ్రామా సుదీర్ఘమనిపిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో రచయిత కోన వెంకట్ రాసిన పెళ్ళింట్లో గందరగోళపు కామెడీకి కొనసాగింపే అదంతా. అదీ ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. గతంలో నిఖిల్ ‘వీడు తేడా’కి దర్శకత్వం వహించిన బి. చిన్నికృష్ణకు ఇది మరో ప్రయత్నం. కానీ, మరింత సమర్థంగా పాత్రలనూ, సన్నివేశాలనూ తీర్చిదిద్దుకోవాల్సింది. ఎక్కువ మంది రచయితలున్న ఈ సినిమా అంతా నాన్‌స్టాప్‌గా పాత్రలు మాట్లాడేస్తుంటాయి. వరుసగా మీదకొచ్చి పడుతున్న పంచ్ డైలాగ్స వర్షం నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. మొత్తం మీద ఏ సీనుకు ఆ సీనుగా నడిచే ఈ సినిమా - కథ, కథనం లాంటివి పట్టించుకోకుండా కాలక్షేపం కోరే వారికి ఫరవాలేదనిపిస్తుంది. టీవీల్లో బాగా ఆడే సినిమా ఇది! -- రెంటాల జయదేవ Follow @sakshinews -
చెల్లెలిగానా... నో అన్నాను!
‘‘నేనేం కారెక్టర్ ఆర్టిస్ట్‌ని కాదు. హీరోయిన్గా చేస్తున్నా. అయినా కూడా చెల్లెలి పాత్ర చేశానంటే.. ఆ పాత్ర ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు’’ అని కార్తీక అన్నారు. ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో ‘అల్లరి’ నరేశ్‌కి చెల్లిగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరూ కవలలు. బి. చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక మట్లాడుతూ- ‘‘చిన్నిగారు సిస్టర్ కేరక్టర్ చేయాలనగానే అమ్మ, నేను ‘నో’ అనేశాం. కానీ, కథ విన్న తర్వాత నిర్ణయం తీసుకోమన్నారు. విన్నాం.. బాగా నచ్చింది అందుకే ఒప్పుకున్నాం. ఏదనుకుంటే అది చేయాలని, తన సోదరుణ్ణి ఆడుకోవాలని, ఎవరైనా రెచ్చిపోతే రఫ్ఫాడించాలని.. అనుకునే కారెక్టర్ నాది. సినిమాలో నా మీద ‘జేమ్స్ బాండ్’ అనే పాట ఉంది. దీన్నిబట్టి నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘అరుంధతి’లాంటి సినిమా అయితే కథానాయికకు నటనకు అవకాశం దొరుకుతుంది. కానీ, లేడీ ఓరియంటెడ్ కాని ఈ చిత్రంలో నాకు నటనకు అవకాశం దొరకడం ఆనందంగా ఉంది. కొత్తగా వచ్చే హీరోలు తమ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉండాలి? ఎలాంటి రిస్కీ ఫైట్స్ ఉండాలి? అని కలలు కంటారో.. అలాంటివన్నీ నాకు ఈ సినిమాలో ఉన్నాయి. వాస్తవానికి నా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది కాబట్టి, నరేశ్ తల్చుకుంటే దర్శకుడితో చెప్పి, నా సీన్స్ కట్ చేయించొచ్చు. కానీ, అలా చేయకపోవడం తన గొప్పతనం. ఈ సినిమాకి బ్రదర్, సిస్టర్ ఇద్దరూ హీరోలే. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇద్దరు హీరోల సినిమా’’ అన్నారు. తన తల్లి రాధతో తనను పోల్చవద్దని చెబుతూ- ‘‘మా అమ్మ మంచి నటి. ఓ లెజెండ్‌తో ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న నన్ను పోల్చడం సరికాదు. ఆవిడంత పేరు తెచ్చుకోవడానికి నాకు టైమ్ పడుతుంది. అప్పట్లో చిరంజీవిగారు మంచి డాన్సర్. ఎంత కష్టమైనా ఫర్వాలేదు.. నేను కూడా ఆ స్టెప్స్ వేస్తా అని అమ్మ అడిగి మరీ చేసేదట. చిరంజీవిగారు కూడా సపోర్ట్ చేసేవారట. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో కొన్ని డాన్స్ మూమెంట్స్‌ని నేను రోప్ లేకుండా చేశాను. నరేశ్, చిన్ని సహకారం లేకపోతే చేయగలిగేదాన్ని కాదు’’ అన్నారు. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం గురించి చెబుతూ- ‘‘సినిమానే బతుకుదెరువు అనుకునే స్థితిలో నేను లేను. అందుకే, మనసుకి నచ్చినవాటినే చేస్తున్నాను. గ్యాప్ వచ్చినా చింతించను’’ అని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన కనుబొమలు బాగా లేవనేవారని కార్తీక చెబుతూ - ‘‘నా ‘రంగం’ సినిమా విడుదలైన తర్వాత చాలామంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్లో ‘కార్తీకలాంటి కనుబొమలు కావాలి’ అని అడుగుతున్నారట. అప్పుడు మైనస్ అన్నవాళ్లు ఇప్పుడు నా ఐబ్రోసే నాకు ప్లస్ అంటున్నారు. అందుకే విమర్శలకు కంగారుపడను. ఇప్పుడు బాగాలేదనిపించినది భవిష్యత్తులో బాగుంటుందని సర్దిచెప్పుకుంటా’’ అన్నారు. -
చెల్లి చిత్రం అక్కకు తెగనచ్చేసిందట
చెల్లెలి చిత్రం అక్కకు తెగ నచ్చేసిందట. ఈ సోదరి ద్వయం ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక నాటి అందాల తార రాధ పుత్రికలు కార్తీక, తులసి. నటి తులసి తొలి చిత్రం కడల్ ఆమెను నిరాశ పరిచింది. అయినా యాన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. జీవా సరసన నటించిన ఈ చిత్రంపై తులసి చాలా ఆశలు పెట్టుకుంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు రవి కె చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్, జయరామన్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. దీనిన తులసి అక్క కార్తీక విడుదల సమయంలో చూడలేదట. ఆమె పొరంబొక్కు చిత్రంతో పాటు తెలుగులో అల్లరినరేష్‌తో నటిస్తున్న చిత్ర షూటింగుల్లో బిజీగా ఉందట. షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ముంబయి చేరుకున్న కార్తీక చెల్లి తులసి నటించిన యాన్ చిత్రం చూడాలని తహతహ లాడిందట. ఈ చిత్రం మంబయిలో విడుదల కాలేదు. త్వరలో అనువాదమై రిలీజ్ అవుతుందట. దీంతో కార్తీక చెల్లెలు తులసిని తీసుకుని తన సొంత ఊరైన కేరళ రాష్ట్రం త్రివేండ్రం వెళ్లి యాన్ చిత్రాన్ని తిలకించింది. తన గెస్ట్‌హౌస్‌లో స్టాఫ్‌తో సహా యాన్ చిత్రాన్ని ఏకంగా రెండుసార్లు చూసిందట. చిత్రం ఆమెకు అంతగా నచ్చేసిందట. ఈ విషయం గురించి నటి తులసి చెబుతూ తన చిత్రం చూసిన అక్క తన ను గట్టిగా కౌగిలించుకుని ముద్దాడిందని చెప్పింది. -
బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ మూవీ స్టిల్స్
-
నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్
‘‘నరేశ్ మినిమమ్ గ్యారంటీ హీరో. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’. ‘అల్లరి’ నరేశ్, మోనాల్ గజ్జర్ జంటగా బి. చిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర పాటలు స్వరపరిచారు. తొలి సీడీని శాసనసభ్యుడు, నిర్మాత మాగంటి బాబు ఆవిష్కరించి బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని బోయపాటి ఆవిష్కరించారు. ఈవీవీ తనకు మంచి మిత్రుడని, ఆయన లేకపోవడం బాధాకరమని, నరేశ్, రాజేష్ తండ్రి పేరుని నిలబెడుతున్నారని మాగంటి బాబు అన్నారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ - ‘‘కథానాయికగా కొనసాగుతున్నప్పటికీ కార్తీక ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చేసి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. మేమిద్దరం పోటీ పడి నటించాం. ఈ చిత్రం తర్వాత చిన్ని బిజీ డెరైక్టర్ అవుతాడు’’ అని తెలిపారు. దర్శకునిగా ఒకే ఒక్క సినిమా చేసిన తనతో 47 సినిమాలు చేసిన నరేశ్ సినిమా చేయడం గొప్ప విషయమని, విజయవంతమైన సినిమా చేయడానికి అందరం కృషి చేశామని చిన్ని అన్నారు. ఇందులో ఉన్న అన్నా, చెల్లెలి సెంటిమెంట్ అందరికీ నచ్చుతుందని అమ్మిరాజు చెప్పారు. శేఖర్‌చంద్ర, కార్తీక, మోనాల్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు. -
పెంకి చెల్లెలు
‘‘మా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సినిమాలో నరేశ్ చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు ఎవర్ని తీసుకోవాలా అని మేం తర్జనభర్జన పడుతుంటే కార్తీక పేరును మా హీరో నరేశే సూచించారు. ఆయన సూచన మేరకు కార్తీకను ఆ పాత్రకు ఎంపిక చేశాం. మేం అనుకున్న దానికంటే వంద రెట్లు గొప్పగా నటించింది కార్తీక. అల్లరి నరేశ్‌కి పోటీగా కామెడీ పండించింది’’ అని దర్శకుడు బి.చిన్ని అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేశ్, కార్తీక అన్నాచెల్లెళ్లుగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు పై విధంగా స్పందించారు. ‘‘అల్లరి నరేశ్ కామెడీతో పాటు కార్తీక పోరాటాలు, డాన్సులు ఈ చిత్రానికి హైలైట్. తనది పెంకి చెల్లెలి పాత్ర. ఇందులో మన ఇంట్లో అల్లరి పిల్లలా అనిపిస్తారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన. ఈ చిత్రానికి కథ: విక్రమ్రాజ్, కెమెరా: విజయ్‌కుమార్ అడుసుమిల్లి, సంగీతం: శేఖర్‌చంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ. -
'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' కార్తీక స్టిల్స్
-
బ్లాక్ అండ్ వైట్ సాంగ్!
అల్లరి నరేశ్, ‘రంగం’ ఫేం కార్తీక అవిభక్త కవలలుగా నటిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’. ఓ విధంగా టైటిల్‌రోల్ కార్తీకదే అనాలి. ‘వీడు తేడా’ ఫేం బి.చిన్ని దర్శకుడు. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ‘అల్లరి’ నరేశ్, కథానాయిక మోనాల్ గజ్జర్లపై చిత్రీకరించిన ‘లవ్ యూ అంటున్నా...’ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. వాటిని గుర్తు చేసే విధంగా ఈ పాటను ఆద్యంతం బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర అయినా, ఈ ఒక్క పాటను మాత్రం నాటి ఆణిముత్యాలను గుర్తు చేసే రీతిలో శ్రీవసంత్ స్వరపరిచారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేసి, అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ. -
మంచి అన్నయ్య...గయ్యాళి చెల్లెలు!
‘‘ఈ తరం అన్నాచెల్లెళ్లు ఎలా ఉంటున్నారు? వారి అనుబంధం ఎలా సాగుతోంది? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ నచ్చి నా చెల్లెలిగా నటించడానికి కార్తీక అంగీకరించింది. తను గయ్యాళి చెల్లెలు. రిస్కీ ఫైట్స్‌ని అద్భుతంగా చేసింది. చిన్ని దర్శకత్వం వహించిన ‘వీడు తేడా’ నచ్చి, ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ఆయన హీరోగా ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో సిరి మీడియా పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. మోనాల్ గజ్జర్ నాయికగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి. చిన్ని దర్శకుడు. ఈ చిత్రంలో నరేశ్ కొత్తగా కనిపిస్తారని, ఇది మంచి కుటుంబ కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. కార్తీక మాట్లాడుతూ -‘‘ఇందులో నా పాత్ర పేరు లక్కీ. నరేశ్ మంచి కో-స్టార్’’ అన్నారు. టాకీపార్ట్ పూర్తయిందని, ఆగస్ట్ 10న టైటిల్ ప్రకటిస్తామని అమ్మిరాజు తెలిపారు. ఇంకా అడుసుమిల్లి విజయ్‌కుమార్, విక్రమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.