విజయ్‌భాస్కర్‌రెడ్డి హీరోగా, ప్రియాంక శర్మ, సింధు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘కార్తిక’. కొత్త పరశురామ్ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్ పతాకంపై మచెందర్ నట్టల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. కొత్త పరశురామ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ్‌భాస్కర్‌రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినా పూర్తి న్యాయం చేసాడు’’ అన్నారు.
‘‘పరశురామ్ నాకు చెప్పిన కథను అలానే తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం బాగా వచ్చింది. మా టీమ్‌కి మంచి పేరొస్తుంది. త్వరలో పాటలు రిలీజ్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మచెందర్ నట్టల. అజయ్‌ఘోష్, రూలర్ రఘు, ప్రీతి, ప్రియ కోల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీష్ గౌడ్, కెమెరా: వల్లి ఎస్‌కె, సంగీతం: సుభాష్ ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment