Priyanka Sharma
-
ప్రేమలో గీతాశంకరం
ముఖేష్ గౌడ, ప్రియాంకా శర్మ జంటగా కె.దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ మాట్లాడుతూ– ‘‘సీరియల్స్‌లో పేరు సంపాదించుకున్నట్లే ఈ సినిమాతో వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడం నా లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘ఇరవై కథలు విన్నాం. కానీ రుద్ర చెప్పిన ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నెల 14న కొత్త షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు దేవానంద్. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు రుద్ర. ఈ చిత్రానికి సంగీతం: అబు, కెమెరా: ఉదయ్ ఆకుల. -
భయపెట్టే తంతిరం
భార్యాభర్తల మధ్యలో ఓ ఆత్మ ప్రవేశించడం వల్ల వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితమైంది? అనే కథాంశంతో రూపొందిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘తంతిరం’. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వంలో శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఆడియన్స్‌కు గుర్తుండిపోయే చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ గుర్రం. ‘‘ఈ సినిమా చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు మెహర్ దీపక్. ‘‘బడ్జెట్ ఎక్కువ అవుతున్నా రాజీ పడకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు శ్రీకాంత్ కంద్రగుల. -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్‌టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్‌ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
#మెన్‌టూ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మెన్‌టూ(MenToo) నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి నిర్మాత : మౌర్య సిద్ధవరం సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ విడుదల తేదీ: మే 26, 2023 నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఎలా అలరించిందో చూద్దాం . అసలు కథేంటంటే.. ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్‌లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. కథ ఎలా సాగిందంటే.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్‌గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచారు దర్శకుడు. కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్‌లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్‌గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే... ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : డై హార్డ్ ఫ్యాన్ నటీనటులు :ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీహాన్ సినీ క్రియేషన్స్ నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది దర్శకత్వం: అభిరామ్ సంగీతం : మధు పొన్నాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి సినిమాటోగ్రఫీ:జగదీష్ బొమ్మిశెట్టి ఎడిటర్: తిరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్ విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ప్రియాంక శర్మ, శివ ఆలపాటి జంటగా నటించిన చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కితర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 2)న విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? శివ(శివ ఆలపాటి) అనే యువకుడికి హీరోయిన్ ప్రియాంక (ప్రియాంక శర్మ) అంటే ఎనలేని అభిమానం. ఒక్కసారైనా తనను ప్రత్యేక్షంగా కలవాలనుకుంటాడు. ఆమె ఏ ఫంక్షన్‌కి వెళ్లినా తను అక్కడికి వెళ్లేవాడు. ఇక తన అభిమాన హీరోయిన్ ప్రియాంక బర్త్‌డేని ఎంతో గ్రాండ్‌గా చేద్దామని ప్లాన్ వేస్తాడు శివ. అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి ఆమె పర్సనల్ మొబైల్ నుంచి శివకు మెసేజ్ వస్తుంది. శివ ఆ షాక్‌లో ఉండగానే.. ప్రియాంక నేరుగా అతని ఇంటికి వస్తుంది. ఆ రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక.. తన అభిమాని ఇంటికి రావడానికి కారణం ఏంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన సంఘటన నుంచి శివ ఎలా బయట పడ్డాడు? హత్య కేసులో ఇరుక్కున్న శివ, అతని మామయ్య శంకర్‌ని బయటకు తీసుకురావడానికి లాయర్ కృష్ణకాంత్(రాజీవ్ కనకాల) ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఈ హత్య కేసుకు లాయర్ కృష్ణకాంత్‌కు ఏదైనా సంబధం ఉందా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా లో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరొయిన్ ని కలవాలనుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అభిరామ్. సాధారణ కథే అయినా.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అయిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ల్యాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. ఈ సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతంది. కథని మరింత పకడ్బందీగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరోయిన్ ప్రియాంకగా ప్రియాంక శర్మ తనదైన నటనతో ఆకట్టుకుంది. డై హార్డ్ ఫ్యాన్‌గా శివగా శివ ఆలపాటి ఆకట్టుకున్నాడు. షకలక శంకర్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాబోయే రాజకీయ నాయకుడు బేబమ్మ పాత్రలో శంకర్ ఒదిగిపోయాడు. లాయర్ కృష్ణకాంత్గా రాజీవ్ కనకాల మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఆదిత్య పాత్రలో నోయల్ చాలా చక్కగా నటించారు. కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే..ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. మధు పొన్నాస్ కంపోజ్ చేసిన పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ తిరు పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
అభిమాని... హీరోయిన్ని కలిసిన రాత్రి ఏం జరిగింది?
ప్రియాంక శర్మ, శివ ఆలపాటి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కితర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ‘సినిమా లో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరొయిన్ ని కలవాలనుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేది ఈ చిత్ర ముఖ్య కథాంశం. ఈ చిత్రం లో అన్ని పాత్రలు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కథలో మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని రిచ్‌గా నిర్మించామని నిర్మాత చంద్రప్రియ సుబుధి తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
Sub-Inspector Priyanka Sharma: గన్ లేడీ
ఎన్కౌంటర్ టీమ్‌లో గ్యాంగ్‌స్టర్‌తో తలపడిన తొలి మహిళా పోలీస్‌గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్‌లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్‌కు తగిలింది. గ్యాంగ్‌స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్‌తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్‌స్టర్‌ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్‌కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్‌స్టర్‌ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు. ప్రగతి మైదాన్‌లోకి పోలీస్‌లు వచ్చారని తెలియగానే గ్యాగ్‌స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్‌స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్‌తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్‌స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు. గ్యాంగ్‌స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్‌పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్‌లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్‌స్టర్‌తో ఎన్‌కౌంటర్‌కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్‌కు, ప్రవీణ్‌కు నచ్చకపోవచ్చు. ∙ -
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే ఇష్టం వచ్చినట్లు.... ఆత్మగౌరవాన్ని అహంలా భావించేవాడు నా స్థానంలో ఉండి ఉంటే సూసైడ్ చేసుకోవాలేమో. నాకు డబ్బు కన్నా.. గౌరవం ముఖ్యం. ఫలితంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నా పదమూడేళ్ల స్ట్రగుల్‌కు ‘సవారి’ చిత్రం నాకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు నందు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంకా శర్మ జంటగా నిషాంక్ రెడ్డి కుడితి, సంతోష్ మోత్కూరి నిర్మించిన ‘సవారి’ నేడు విడుదవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ – ‘‘సాహిత్ మోత్కూరి ‘సవారి’ కథ చెప్పారు. బాగా నచ్చింది. కానీ సినిమాలో నాది సెకండ్ లీడ్ రోల్ అన్నారు. అసలు నన్నెందుకు హీరోగా ఊహించుకోలేకపోతున్నారనే బాధ కలిగింది. హీరోగా నటిస్తానని చెబితే సరే అన్నారు. ప్రాణం పెట్టి సినిమా చేశాం. యూఎస్‌లో మూడు ప్రీమియర్ షోలు సోల్డ్ అవుట్ అయ్యాయి’’ అన్నారు. పాత్రను చంపను! కెరీర్ మొదట్లో సర్వైవల్ కోసం కొన్ని సినిమాలు చేశాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. నందు ఏ పాత్ర అయినా చేయగలడు అంటున్నారు కానీ నా కోసం పాత్ర రాయడం లేదు. నాకు ఇచ్చిన పాత్రను నా యాక్టింగ్‌తో చంపను. వీలైనంత బాగా చేయడానికే ట్రై చేస్తా. -
వేసవిలో సవారి
నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. నందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి బజ్ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్ (కోటి) వ్యూస్ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం పాల్గొన్నారు. -
సవారికి సిద్ధం
నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవారి’. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాలను ఆకట్టుకునే లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, శేఖర్ చంద్ర సంగీతానికి మంచి స్పందన రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నీ కన్నులు..’ లిరికల్ సాంగ్‌కి ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ దక్కాయి. అదేవిధంగా ‘ఉండిపోయా..’ పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ మా సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.. నైజాంలో వారు విడుదల చేయనున్నారు’’ అన్నారు. శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
మలుపుల సరోవరం
విశాల్ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్.శ్రీలత. ‘‘మాస్కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు. -
నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ సవారి
‘‘తెలుగు తెరపై కొత్త కథలు వస్తున్నాయి. సాహిత్ ఎంచుకొన్న కథ డిఫరెంట్‌గా ఉంది. దాన్ని తెరపై బాగా చూపించి ఉంటారనే నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమా చక్కటి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌తో గుర్తింపు పొందిన సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సవారి’. సంతోశ్ మోత్కూరి, నిశాంక్ కుడితి నిర్మించారు. నందు, ప్రియాంకా శర్మలు జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు తరుణ్ భాస్కర్, ప్రణయ్‌రెడ్డి వంగా, టి.ఎన్.ఆర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. ‘సవారి’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్. సాహిత్ ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నా బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ ఈ సినిమాకు కరెక్ట్‌గా సెట్ అయ్యాయి’’ అన్నారు. సాహిత్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో పాత్ర విభిన్నంగా ఉంటుంది. నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో నందు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో నేను చాలెంజింగ్ రోల్ చేశాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన సాహిత్‌కు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంకా శర్మ. -
కామెడీ ‘సవారి’కి రెడీ
బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ కూరి ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. సవారీ చిత్రం నా కెరీర్లో బెస్ట్ అని భావిస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సాహిత్ కొత్త కథను మీముందుకు తీసుకొని వస్తున్నారు. నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. నా బాడీ ల్యాంగేజ్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తాము’ అన్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... ‘తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ డిఫరెంట్‌గా ఉంది, దాన్ని తెరమీద బాగా చూపిస్తాడన్న నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్న. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్‌కు నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నా’ అన్నారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘కొత్త చిత్రాలను యూత్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. సవారీ సినిమా టీజర్ కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను. నందుకు, డైరెక్టర్ సాహిత్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ... ‘మీడియా వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్‌కు థాంక్స్, నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సినిమా విడుదల తరువాత మళ్ళీ మాట్లాడుతాను’ అన్నారు. హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ... ‘నందు మంచి నటుడు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఛాలెంగింగ్ రోల్ చేసాను, నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సాహిత్‌కు థాంక్స్. టీజర్ బాగుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సినిమా కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
నందు, ప్రియాంకా శర్మ జంటగా నటించిన చిత్రం ‘సవారి’. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన సాహిత్ మోతుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్ పతాకాలపై సంతోశ్ మోతుకూరి, నిషాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. జంతు నేపథ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఫ్రెష్ స్టోరీతో నిర్మించిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: మోనిశ్ భూపతిరాజు. -
వ్యక్తీకరణ
‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని. స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతా బెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్ చేసిన మీమ్. మాధవ్ శింగరాజు ప్రియాంక చోప్రా, ప్రియాంక గాంధీ.. వీళ్లలా ప్రియాంక శర్మ పెద్ద పేరున్న వ్యక్తి కాదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక ‘మీమ్’ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, షేర్ చేసిందన్న ఆరోపణపై ఈ నెల పదవ తేదీన దాస్‌నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశాక కానీ.. ప్రియాంక శర్మ అనే ఒకరు బీజేపీ యువ మోర్చాలో కార్యకర్తగా ఉన్నారన్న సంగతి దేశానికి తెలియరాలేదు. మే ఆరున న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్ గాలా’ ఫ్యాషన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విచిత్ర వేషధారణలో కనిపించారు. ఆ వేషాన్ని ప్రియాంక శర్మ మమతకు వేసి, ఆ ఫొటోను నెట్లో పెట్టడమే పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి కారణం. ఆమెను తక్షణం బెయిలు మీద విడుదల చేయాలని సుప్రీంకోర్టు గత మంగళవారం ఆదేశించింది. ఆ సందర్భంలోనే కోర్టు ఒక వ్యాఖ్య కూడా చేసింది. మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించకూడదని. అంతేకాదు, మమతకు క్షమాపణ చెప్పాలని కూడా ప్రియాంక శర్మకు ఆదేశించింది. అయితే తనేం క్షమాపణ చెప్పబోవడం లేదని జైలు నుంచి బయటికి వచ్చీరాగానే పెట్టిన ప్రెస్ మీట్లో ప్రియాంక ప్రకటించారు! మొత్తం ఐదు రోజులు జైల్లో ఉన్నారు ప్రియాంక. ఈ ఐదు రోజులూ జైలు అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని, కనీసం తాగడానికి కూడా నీళ్లివ్వకుండా ప్రతిరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారనీ ఆరోపించారు. అయితే ఇదంతా కూడా ప్రియాంక కోరి తెచ్చుకున్నదే.ఏదైనా ఒక సామాజిక మార్పును ఆశించిగానీ, ప్రజల్లో ఏదైనా ఒక ప్రగతిశీల ఆలోచనను రేకెత్తించేందుకు గానీ మమత ఫొటోను ఆమె మార్ఫింగ్ చేయలేదు. రాజకీయ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా కించపరచడానికి.. ఏమీ తోచక చేసిన పని మాత్రమే అది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్ లీడర్స్ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్ల కన్నా తక్కువైనదేమీ కాదు ఈ మార్ఫింగ్ మీమ్. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! స్త్రీని స్త్రీ పరిహసించడంలో అసాధారణత ఏమీ లేదనుకున్నా.. మమత సాధారణమైన వ్యక్తేం కాదు. పోరాట పటిమగల రాజనీతిజ్ఞురాలు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేయడం పిల్ల చేష్ట కూడా కాదు. పని లేని చేష్ట.మమతను సాటి మహిళగా కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ప్రియాంక శర్మ చూసినప్పటికీ.. ప్రియాంకను బీజేపీ యూత్ లీడర్లా కాకుండా సాటి మహిళగా మమత చూశారని.. 2012 నాటి పాత కేసునొకదాన్ని గుర్తు చేసుకుంటే.. పోలిక తెలుస్తుంది. అదీ ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ కేసే. మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రి అయిన మరుసటి ఏడాది.. ఆమెను, రైల్వే మంత్రి ముకుల్ రాయ్‌ని, మాజీ రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీలను కలిపి కార్టూన్‌గా వేసి, ఆ కార్టూన్ని ఈ–మెయిల్‌గా పార్వర్డ్ చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అంబికేశ్ మహాపాత్ర పైన, ఆ ఈ–మెయిల్‌ను అందుకున్న సుబ్రతాసేన్ గుప్తా అనే ఆయనపైన రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి పరువునష్టం కేసు. ఇంకోటి ఒక స్త్రీ శీలప్రతిష్టకు భంగం కలిగించిన కేసు. ఈ రెండు కేసులూ ఇప్పటికీ నడుస్తున్నాయి! బెయిల్ మీద ఉన్న మహాపాత్ర నేటికీ విచారణకు హాజరవుతున్నారు. సుబ్రతా సేన్‌గుప్తా గతవారమే తన 79 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రియాంక శర్మ పోస్ట్ చేసిన మీమ్‌తో పోలిస్తే, అప్పట్లో మహాపాత్ర ఫార్వర్డ్ చేసిన కార్టూన్ ఎంతో అర్థవంతమైనది. శుభ్రమైన ఒక పొలిటికల్ సెటైర్. అయినప్పటికీ ‘గౌరవనీయులపై చేసిన ఆక్షేపణీయమైన వ్యాఖ్య’గా పరిగణించి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రైల్వే మంత్రిగా ఉన్న దినేశ్‌ని తప్పించి, ఆ పదవిని మమత.. ముకుల్‌కి ఇప్పించారని మహాపాత్ర కార్టూన్ వేశారు. మమత ముకుల్‌తో అంటున్నట్లుగా ఉన్న ఆ కార్టూన్‌లోని కామెంట్లను 1974 నాటి సత్యజిత్ రే మిస్టరీ మూవీ ‘సోనా కెల్లా’లోని డైలాగులతో మహాపాత్ర సంకేతపరిచారు. ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ప్రియాంక విషయంలో మమత మరీ అంతగా గట్టిగా ఉండకపోవచ్చు.సెటైర్‌కి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ప్రభుత్వం ఒకలా స్పందిస్తుంది. తీవ్రవాదులు ఒకలా స్పందిస్తారు. అసలు ఏ విధంగానూ స్పందించకుండా ఇగ్నోర్ చేసేవారూ ఉంటారు. గత ఏడాది ఆరంభంలో కశ్మీర్లో జరిగిన ఒక అత్యాచార ఘటనతో లింక్ చేస్తూ సీతమ్మవారిని సీన్లోకి తెచ్చి ఆమె చేత రామభక్తులపై కామెంట్ చేయించిన కార్టూన్ ఒకటి హైదరాబాద్ నుంచి ఫేస్బుక్లో పోస్ట్ అయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. జైల్లో పడేయడం కన్నా పెద్ద శిక్ష ఇగ్నోర్ చేసి పడేయడం. ఫ్రీడమ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకునేవారు ఒక్క హైదరాబాద్‌లోనే, ఒక్క బెంగుళూరులోనే, ఒక్క పశ్చిమబెంగాల్లోనే ఉండరు. ఫ్రాన్స్‌లోనూ ఉంటారు. అక్కడొక పెద్ద గుంపే ఉంది. ఆ గుంపు ఒక పత్రికనే నడుపుతోంది. ఆ పత్రిక పేరు ‘చార్లీ హెబ్డో’. వ్యంగ్య రచనల వారపత్రిక.గవర్నమెంటు మీద కార్టూన్లు వేసినన్నాళ్లూ ఏమీ కాలేదు కానీ.. ఒక మతం మీద సెటైర్లు వేసినందుకు ఆ పత్రిక ముఖ్య సంపాదకుడిని, ముగ్గురు కార్టూనిస్టులను పత్రికా కార్యాలయంలోకి వెళ్లి మరీ కాల్చి చంపారు తీవ్రవాదులు.2015లో జరిగింది ఈ ఘటన. ప్రజల్లో ఇస్లాం ఫోబియాను కలిగించే విధంగా ఫ్రెంచ్ రచయిత మిషెల్ వెల్బెక్ రాసిన వివాదాస్పద వ్యంగ్య నవల ‘సబ్మిషన్’ (ఆ ఘటనకు రెండ్రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చింది) లోని అంశాలపై వెల్బెక్ని సమర్థిస్తూ సెటైర్లు ఉన్నాయి.ఆ సెటైర్లే తీవ్రవాదులకు ఆగ్రహం తెప్పించాయి.‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని.స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతాబెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్ చేసిన మీమ్. జైల్లో తననెంతో మానసిక క్షోభకు గురిచేశారని అంటున్న ప్రియాంకకు.. తన చేష్ట ద్వారా మమతను అభిమానించేవాళ్లను తను ఎంతటి క్షోభకు గురి చేసి ఉంటుందోనన్న ఆలోచన వచ్చి ఉంటుందా? కేసు జూలైకి వాయిదా పడింది. ఆలోపు వస్తుందేమో మరి.. ఆలోచన! ప్రియాంక శర్మ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్ లీడర్స్ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్ల కన్నా తక్కువైనదేమీ కాదు ప్రియాంక శర్మ మార్ఫింగ్ మీమ్. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! -
నేను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్ చేశారు
-
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ప్రియాంక
సాక్షి, కోల్‌కతా : ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో జైలు నుంచి విడుదలైన బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మ తనపట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ఫోటో మార్ఫింగ్‌పై తాను క్షమాపణ చెప్పేది లేదని ప్రియాంక శర్మ మరోసారి స్పష్టం చేశారు. తనతో అధికారులు బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసినా, అధికారులు మాత్రం తనను ఇవాళ విడుదల చేశారని ఆమె అన్నారు. అంతేకాకుండా తన కుటుంబసభ్యులతో పాటు న్యాయవాదిని కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రియాంక శర్మ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ట్రోల్ చేసినందుకు మమతా బెనర్జీనే అరెస్ట్ చేయాలని ప్రియాంక శర్మ డిమాండ్ చేశారు. తనపై పెట్టిన కేసుపై పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నేను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్ చేశారు చదవండి: (మమత సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక) -
మమత సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మమతా సర్కార్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా మమతా బెనర్జీపై వివాదాస్పద ఫోటోను ఫార్వర్డ్ చేసిన ప్రియాంక శర్మ అరెస్ట్ ఏకపక్షమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆమెను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, లేకుంటే తదుపరి పర్యవసానాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరికలు చేసింది. చదవండి: మమతకు కోపం వస్తే అంతేమరి! క్షమాపణ లేకుండానే బెయిల్! ప్రియాంక శర్మను విడుదల చేయాలని నిన్న (మంగళవారం) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా సర్కార్ బేఖాతరు చేసింది. దీంతో ప్రియాంక బంధువులు మమతా బెనర్జీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా మమతపై అభ్యంతరకర పోస్ట్‌ను ఫార్వర్డ్ చేసినందుకు ప్రియాంశ శర్మ బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆమెను విడుదల చేస్తామని పశ్చిమ బెంగాల్ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఆమెను ఇవాళ ఉదయం 9.40కి విడుదల చేసినట్లు ప్రభుత్వతరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రియాంకా శర్మను తక్షణమే ఎందుకు విడుదల చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. -
మమతకు కోపం వస్తే అంతేమరి!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడు చిటపటలాడుతున్నట్లు కనిపిస్తారు. ఆమెకు ముక్కు మీద కోపం అని సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఆమెకు ఇప్పుడు ఎన్నికల వేడి, అటు ఎండ వేడి తోడైందంటే ఆమె కోపం కాస్త ప్రచండమై ఎంతటి వారినైనా దుమ్ము దులుపుతారనడంలో సందేహం లేదు. సరదా కోసమో, రాజకీయ దురుద్దేశంతోనోగానీ బీజేపీ నాయకుడు ప్రియాంక శర్మ శుక్రవారం మార్ఫింగ్ చేసిన మమతా బెనర్జీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతవారం న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్ గలా’ ఫ్యాషన్ షోలో విచిత్ర దుస్తులు ధరించి కెమేరాల ముందు ఫోజులిచ్చిన బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా ఫొటోలో ముఖాన్ని మమతా బెనర్జీ ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమతా బెనర్జీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీజేపీ నేత ప్రియాంక శర్మపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్ (పరువు నష్టం), 66 ఏ సెక్షన్ (అభ్యంతరకరం), 67ఏ సెక్షన్ (అసభ్యకరం) కింద కేసులు నమోదు చేశారు. ఆ మధ్య అంటే, ఫిబ్రవరి నెలలో బెంగాల్ రాజకీయాలపై తీసిన వ్యంగ్య చిత్రం ‘భోబిష్యోతర్ బూత్’ విడుదలైంది. దాని గురించి తెలిసి మమతా బెనర్జీ కన్నెర్ర చేశారు. అంతే విడుదలయిన మరుసటి రోజే అన్ని థియేటర్ల నుంచి ఆ సినిమా అదృశ్యమైంది. దాంతో ఆ సినిమా నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అరికడతారా? అంటూ మమతా బెనర్జీకి చీవాట్లు పెట్టిన కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 20 లక్షలు మమతా మంత్రివర్గం నుంచి ఓ లక్ష రూపాయలను నిర్మాతకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఆదేశించింది. 2013లో మమతా బెనర్జీ నాయకత్వాన రైతులు జరిపిన ఆందోళన కారణంగా టాటా మోటార్ కంపెనీ బెంగాల్ నుంచి నిష్క్రమించిన విషయం తెల్సిందే. ఆ పరిణామంపై వ్యంగోక్తులు ఉన్నాయన్న కారణంగా ‘కంగల్ మల్సాత్’ అనే సినిమాను కూడా నాడు మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధించింది. అంతుముందు 2012లో ఆమె ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింల దుస్థితిపై ఐపీఎస్ అధికారి నజ్రుల్ ఇస్లాం రాసిన ‘ముసల్మాండర్కీ కరనియా’ పుస్తకాన్ని నిషేధించింది. మమతా బెనర్జీ అసహనం సినిమాలకు, పుస్తకాలకు, కళలకే పరిమితం కాలేదు. రోజువారి రాజకీయాల్లోనూ ఆమె అసహనం కనిపిస్తోంది. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అది స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థులను నామినేషన్ వేసేందుకు తృణమూల్ పార్టీ కార్యకర్తలు అనుమతించక పోవడం వల్ల నాటి ఎన్నికల్లో 34 శాతం మంది తృణమూల్ సర్పంచ్‌లు పోటీ లేకుండా విజయం సాధించారు. ‘పొరిబొర్తన్ (పరివర్తన)’ నినాదం ద్వారా 34 ఏళ్ల సీపీఎం పాలనకు చరమ గీతం పాడుతూ 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అసమ్మతిని అణచివేయడంలో మాత్రం ఆమె ‘పరివర్తన’ కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మకు బెయిల్
-
క్షమాపణ లేకుండానే బెయిల్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్ఫెడ్ ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు అరెస్టైన బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. మమతా బెనర్జీ మీమ్ పోస్టు చేసినందుకు క్షమాపణ చెప్పాలని మంగళవారం వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు బీజేపీ నేత ప్రియాంక శర్మను ఆదేశించింది. ఎన్నికల సమయం కావడం, పిటిషనర్ రాజకీయ పార్టీ కార్యకర్త కావడంతో ఈ సమయంలో క్రిమినల్ చర్యల అంశాన్ని ప్రస్తావించడంలేదని, కానీ ఎన్నికల నేపథ్యంలో క్షమాపణ అర్థించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట ఒకరి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయడాన్ని తాము సహించబోమని, క్షమాపణ చెప్పాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ మేరకు వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం.. అనంతరం ప్రియాంక శర్మ లాయర్ ఎన్కే కౌల్‌ను పిలిచి.. క్షమాపణ షరతను తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : బీజేపీ యువమోర్చా నేత ప్రియాంక శర్మకు బెయిల్ చదవండి: సీఎం మార్ఫింగ్ ఫొటో షేర్ చేసినందుకు... -
ఉచిత విద్య కోసం పోరాటం
సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి.. అప్పుడే సమాజం బాగుంటుందనే సామాజిక సృహతో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్‌బిఎమ్’ (మేరా భారత్ మహాన్). అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భరత్ మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కించాం. మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సవరించాలన్నదే మా అభిప్రాయం. ముఖ్యంగా విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నదే మా పోరాటం’’ అన్నారు. చిత్ర నిర్మాత, కథా రచయిత, నటుడు డా.శ్రీధర్ రాజు ఎర్ర మాట్లాడుతూ– ‘‘సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి ఓ సందేశాత్మక చిత్రంగా నిర్మించాం. ఇప్పటి ప్రభుత్వాలు ప్రవేశపెడుతోన్న పథకాలు, వాటిలో లోటుపాట్లు చూపిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో మరణించిన రెండు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. డా.తాళ్ల రవి, డా. టి.పల్లవి రెడ్డి, అఖిల్ కార్తీక్, రచయిత ‘అంపశయ్య’ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: లలిత్ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోమర్తి సాంబేష్. -
నాన్న నన్ను హీరోగా చూడాలనుకున్నారు
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శివకాశీపురం’. ఇందులో ప్రియాంకా శర్మ కథానాయికగా నటించారు. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ– ‘‘నేను హీరో అవ్వడం మా నాన్నగారి (సంగీత దర్శకుడు శ్రీ) ఆశ. నన్ను హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఈ టైమ్‌లోనే ఆయన మాకు దూరమవడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్స్ పడ్డాయి. మా తాతగారు, నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్స్ అయినప్పటికీ నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాను. ‘కల్యాణ వైభోగమే’ సినిమాకు నందినీరెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశా. ‘నువ్వు చాలా హాట్ గురూ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. ఇప్పుడు ‘శివకాశీపురం’ సినిమాలో హీరోగా చేశాను. మూఢ నమ్మకాల అంశాలతో గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న ఓ ఆటోడ్రైవర్ క్యారెక్టర్ చేశాను. మంచి సినిమా చేశాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత కమిట్ అవుదాం అనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఖాయం
సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన సినిమా ‘శివకాశీపురం’. ఇందులో ప్రియాంకా శర్మ కథానాయికగా నటించారు. వచ్చే నెల 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, రుద్రరాజు పద్మరాజు, నల్లమోతు శ్రీధర్ అతిథులుగా పాల్గొని చిత్రం పాటలు, ట్రైలర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ‘‘ట్రైలర్ బాగుంది. రాజేష్ బాగా నటించాడు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కేవీవీ సత్యనారాయణ. ‘‘ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ రోజుల్లో చిన్న సినిమా విడుదల కావడం కష్టంగా మారింది. ట్రైలర్లో టీమ్ తపన కనిపిస్తోంది. వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని మిత్రుడు విజయవర్మ సినిమా విడుదల బాధ్యతను తీసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు రుద్రరాజు పద్మరాజు. ‘‘మంచి కథతో సినిమా తీశాం. హరీష్ బాగా తెరకెక్కించాడు’’ అన్నారు నిర్మాత మోహన్. ‘‘ఒక మంచి చిత్రం చేయడానికి నిర్మాత ఎలాంటి సహయం అదించాలన్నది మోహన్‌బాబుగారిని చూసి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో సినిమా చేయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. ఆ బాధ్యతను తీసుకున్న విజయ్‌వర్మకు థ్యాంక్స్’’ అన్నారు హరీష్. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు విజయ్. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో రాజేష్. ప్రియాంక శర్మ పాల్గొన్నారు. -
సామాన్యుల పరిస్థితి ఏంటి?
‘‘నాకు ఇష్టమైన దర్శకుడు భరత్. తను గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తాడు. కానీ, టైమ్ బాగా లేకనో, మరేంటో కానీ.. కొన్ని మిస్‌ఫైర్ అవుతున్నాయి. ‘మేరా భారత్ మహాన్’ పాటలు, ట్రైలర్స్ చూశాక సూపర్ హిట్ సాధించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేశా. నిర్మాతలు ఎంతో అభిరుచితో ఈ సినిమా నిర్మించారు’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా భారత్ మహాన్’. వరంగల్‌కు చెందిన వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. లలిత్ సురేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బాబూమో హన్ విడుదల చేసి, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందించారు. ‘‘విద్య, వైద్యం సామాన్యులకు అందడం లేదు. డబ్బున్న వాళ్లకే దక్కుతున్నాయి. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే వ్యవస్థలోని కొన్ని సమస్యలు. వాటిని సవరించమని చెప్పే ప్రయత్నమే తప్ప, ఎవరికీ వ్యతిరేకంగా ఉండదు’’ అన్నారు భరత్. శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్, అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, పాటల రచయిత పెద్దాడమూర్తి, మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి, కథా రచయిత,నటుడు డా. శ్రీధర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.