మలుపుల సరోవరం | Sarovaram Telugu Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

మలుపుల సరోవరం

Published Thu, Oct 17 2019 6:04 AM | Last Updated on Thu, Oct 17 2019 6:04 AM

Sarovaram Telugu Movie Pre Release Event - Sakshi

ప్రియాంక, విశాల్‌

విశాల్‌ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్‌ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో సురేష్‌ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్‌.శ్రీలత. ‘‘మాస్‌కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్‌’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పులి ఈశ్వర్‌ రావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement