Vishal Wanne
-
మలుపుల సరోవరం
విశాల్ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్.శ్రీలత. ‘‘మాస్కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు. -
రేపిస్టు డాక్టర్‌కు జీవిత ఖైదు
వైద్యం చేయాల్సిన డాక్టర్ పశువులా మారి రోగిపైనే.. అది కూడా ఐసీయూలో అత్యాచారం చేసిన కేసులో బాంబే హైకోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ పి.వి.హరిదాస్, జస్టిస్ పి.ఎన్.దేశ్ముఖ్తో కూడిన ధర్మాసనం శిక్షణను ఖరారు చేసింది. గత జనవరిలో ధానెలో విశాల్ వన్నె (29) అనే వైద్యుడు ఓ ప్రైవేటు ఆస్ప్రత్రిలో ఐసీయూలో ఓ రోగిపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. జనరల్ వార్డులో ఉన్న మహిళా రోగిని నైట్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విశాల్ ఐసీయూకు తరలించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో విశాల్ నేరం చేసినట్టు రుజువు కావడంతో దిగువ కోర్టు విశాల్‌కు జీవితఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టును ఆశ్రయించాడు. నిందితుడు నేరం చేశాడన్న ప్రాసిక్యూటర్ ఉషా కేజ్రివాల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అప్పీలు తిరస్కరించింది.