వైద్యం చేయాల్సిన డాక్టర్ పశువులా మారి రోగిపైనే.. అది కూడా ఐసీయూలో అత్యాచారం చేసిన కేసులో బాంబే హైకోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ పి.వి.హరిదాస్, జస్టిస్ పి.ఎన్.దేశ్ముఖ్తో కూడిన ధర్మాసనం శిక్షణను ఖరారు చేసింది. గత జనవరిలో ధానెలో విశాల్ వన్నె (29) అనే వైద్యుడు ఓ ప్రైవేటు ఆస్ప్రత్రిలో ఐసీయూలో ఓ రోగిపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. జనరల్ వార్డులో ఉన్న మహిళా రోగిని నైట్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విశాల్ ఐసీయూకు తరలించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ కేసులో విశాల్ నేరం చేసినట్టు రుజువు కావడంతో దిగువ కోర్టు విశాల్కు జీవితఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టును ఆశ్రయించాడు. నిందితుడు నేరం చేశాడన్న ప్రాసిక్యూటర్ ఉషా కేజ్రివాల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అప్పీలు తిరస్కరించింది.
రేపిస్టు డాక్టర్కు జీవిత ఖైదు
Published Sat, Sep 21 2013 8:25 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement