life sentence
-
17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు
న్యూయార్క్: హత్య కేసులో అమెరికాలో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. దోషికి కఠిన యావజ్జీవ శిక్షను విధించారు. ఫిలిప్ మ్యాథ్యు, మేరిన్ జోయ్(26) కేరళకు చెందినవారు. వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది జోయ్. అయితే.. మనస్పర్థల కారణంగా మ్యాథ్యు విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న జోయ్‌ని మ్యాథ్యు అడ్డగించి కత్తితో 17 సార్లు పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పైనుంచి కారును పోనిచ్చాడు. జోయ్ సన్నిహితులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో తనకో పాప ఉంది అని తెలిపిన జోయ్.. నిందితుని వివరాలను తెలిపింది. దీని ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. కేసును నమోదు చేశారు. దాదాపు మూడేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం దోషికి యావజ్జీవ శిక్ష విధించింది. తీర్పుపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు దోషికి శిక్ష పడినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు -
ఆ ఇద్దరు ఖైదీల క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో యావజ్జీవశిక్ష పడి 27 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా నిర్ణయం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఒకే కేసులో ఖైదీలుగా ఉన్న ముగ్గురికి క్షమాబిక్ష ప్రసాదించి.. తమను పట్టించుకోవడంలేదని అషారఫ్ అలీ, ఆరిఫ్‌ఖాన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. 1997లో నమోదైన ఓ కేసులో కిందికోర్టు ఈ ఇద్దరితోపాటు మరో ముగ్గురికి యావజ్జీవ జైలుశిక్ష విధించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టులో అప్పీలు చేసుకున్నా కొట్టివేసిందని చెప్పారు. ఈ ఐదుగురిలో ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆగస్టు 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిలో ముగ్గురిని విడుదల చేసి, ఇద్దరి వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. -
బాలికపై హత్యాచారం.. కామపిశాచికి యావజ్జీవ శిక్ష
బనశంకరి: బాలికపై అత్యాచారం, హత్య కేసులో యువకుడికి నగర ఎఫ్‌టీసీ 1వ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. సోమసంద్రపాళ్య నివాసి సీ.రాజు (25) అనే యువకుడు ఓ బాలిక (15)ను పరిచయం చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో రాజుకు యావజ్జీవ శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కేఎన్.రూపా తీర్పు ఇచ్చారు. డెవలిరీ బాయ్‌గా ఉన్న రాజు వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లో బాలిక పరిచయమైంది. కరోనా లాక్డౌన్ సమయంలో బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో వెళ్లి రహస్యంగా కలుసుకునేవాడు. ఇలా పలుమార్లు స్కూల్ అయిపోగానే బాలికను రాజు ఇంటికి తీసుకెళ్లి శారీరకంగా కలుసుకునేవాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో ఇద్దరిని హెచ్చరించారు. అప్పటి నుంచి రాజుతో బాలిక దూరంగా ఉంటోంది. బాలికపై కోపం పెంచుకున్న రాజు 2021 ఏప్రిల్ 3న బాలికను వెంబడించి తన ఇంటికి రాకపోతే అంతుచూస్తానని బెదిరించాడు. చివరికి బాలిక రాజు ఇంటికి వచ్చింది. వెంటనే అల్యూమినియం వైర్‌తో గొంతు బిగించి ఊపిరాడకుండా నోటిలో బట్టలు కుక్కి హత్య చేశాడు. అనంతరం తానూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. మళ్లీ అక్కడే కూర్చొని ఈ విషయాన్ని స్నేహితులకు తెలిపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన రాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బండేపాళ్య పోలీసులు హత్య కేసు నమోదు చేసి రాజును అరెస్ట్ చేసి ఎఫ్‌టీసీలో చార్జిషీట్ వేశారు. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు న్యాయమూర్తి కేఎన్.రూపా గురువారం రాజుకు యావజ్జీవ శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి..
సాక్షి, మిర్యాలగూడ, కోదాడ: నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన దొరల, రజాకార్ల హత్య కేసులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే), దోమల జనార్ధన్ రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరికి ప్రత్యేక ట్రిబ్యునల్ 1949 ఆగస్టు 13, 14న మరణశిక్ష వేసింది. ఉరిశిక్ష పడిన వెంకులు (14), ఎర్రబోతు రాంరెడ్డి(15), నంద్యాల శ్రీనివాసరెడ్డి (20) తోపాటు నల్లా నర్శింహులు (22) నల్లగొండ జైల్లో ఉండగా టైమ్ పత్రికకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వారిని కలిసి మైనర్ అయిన ఎర్రబోతు రామిరెడ్డి ఫొటోతో వ్యాసం రాసింది. అది పెను సంచలనంగా మారింది. లండన్ న్యాయవాది డీఎన్ ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్‌బాగ్ వంటి న్యాయవాదులు స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపేందుకు ప్రయత్నించారు. అంతర్జాతీయంగా ఉరిశిక్ష లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జెకొస్లోవేకియాలో 10 వేల మందితో భారీ నిర్వహించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారింది. 1956లో కొందరు, దీంతో 1958లో మరికొందరు విడుదలయ్యారు. నిజాంపై గర్జించిన కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయడంలో, రజాకార్లను ఎదుర్కోవడంలో కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1944లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్యను రజాకార్లు కాల్చేయడంతో తీవ్రరూపం దాల్చింది. నల్లగొండ జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమంగా విస్తరించింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది నేతలు ఈ సాయుధ పోరుకు ఊతమిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. సోవియట్ యూనియన్ తరహాలో విజయవాడలో ‘కమ్యూన్’ఏర్పాటు చేశారు. వడిసెలు, రాళ్లు, కత్తులు వంటి ఆయుధాల ప్రయోగం, తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. పగలంతా కలిసికట్టుగా శ్రమ చేసి సంపాదించిన సొమ్ముతో ఒకే చోట వండుకుని భోజనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేవారు. ఇక్కడ శిక్షణ పొంది వెళ్లి నల్గొండ జిల్లాలో దళాలు ఏర్పాటు చేశారు. దళాల నేతృత్వంలోనే సాయుధ దాడులు జరిగాయి. ఈ పోరాటాల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రాణత్యాగాలు చేశారు. ‘దారి’ చూపిన ‘మెతుకుసీమ’ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య చేపట్టాలని నిర్ణయించిన రోజులవి. అప్పటి కేంద్రహోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఉత్తరాన ఉన్న ఔరంగాబాద్ వైపు నుంచి సైనికచర్య మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా మీదుగానే హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది. అదెలా జరిగిందంటే.. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు లాతూర్(మహారాష్ట్ర) నుంచి జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)కు రైలులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారత సైన్యం బాంబుల మోత మోగించింది. దీంతో రజాకార్లు రైలు దిగి పరుగెత్తారు. ట్రక్కుల్లో పారిపోయారు. కొన్నిట్రక్కులు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతల్లో కూరుకుపోయాయి. అప్పటికే దౌల్తాబాద్, హుమ్నాబాద్, జాల్న ప్రాంతాలు భారతసైన్యం వశమయ్యాయి. 1948 సెప్టెంబర్ 16 భారత సైన్యం జహీరాబాద్ వైపు రోడ్డుమార్గంలో వస్తుండగా రజాకార్లు ఎక్కెల్లి (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) వంతెనను కూల్చేశారు. అయితే భారత సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించుకుని ముందుకు సాగడంతో నిజాంసేన చెల్లాచెదురైంది. ఇలా జహీరాబాద్‌ను భారత సేనలు వశపరుచుకున్నాయి. 1948 సెప్టెంబర్ 17 భారతసైన్యం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు ప్రాంతంలో రజాకార్లు రోడ్డుకు ఇరువైపులా పేలుడు పదార్థాలు ఉంచారు. అప్రమత్తమైన భారతసైన్యం రూట్ మార్చి బొల్లారం మీదుగా ముందుకు సాగాయి. 1948 సెప్టెంబర్ 18 (సాయంత్రం 4 గంటలు): భారత సైన్యం బొల్లారం చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడైన ఎల్.ఎద్రూస్ తన ఆయుధాలను వీడి భారత సైన్యం మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఎదుట లొంగిపోయారు. దీంతో ప్రజలు జయజయ ధ్వానాలతో భారత సైనికులకు స్వాగతం పలికారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందామని ఆనందోత్సవాలు చేసుకున్నారు. -
ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో... భవనానికి నిప్పంటించి...
కొంతమంది ప్రేమ పేరుతోనే లేక స్నేహితులు కారణంగానో తెలిసో/ తెలియకో దారుణంగా మోసపోతుంటారు. దీంతో వారు ఆ మోసాన్ని జీర్ణించు కోలేకపోవడమే గాక మరోకర్ని నమ్మాలన్న భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితి నుంచి సాధ్యమైనంత తొందరగా బయటకొచ్చేందుకు యత్నించాలి గానీ తనను తాను గాయపర్చుకోవడమే లేక పక్కవారికి హాని తలపెట్టడమో చేయకూడదు. ఇక్కడొక మహిళ అలాంటి దారుణానికి ఒడిగట్టి కటకటాలపాలైంది. వివరాల్లోకెళ్తే....తైవాన్‌లోని 51 ఏళ్ల హువాంగ్ కే కే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్‌సియుంగ్‌లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పంటించింది. దీంతో సుమారు 46 మృతి చెందగా, దాదాపు 41 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆమెపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని, పైగా ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. అయితే కోర్టు విచారణలో ఆమెను దోషిగా నిర్థారించింది గానీ భవనంలోని నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశ్యం ఆమెకు లేదని పేర్కొంది. అంతేకాదు ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని కూడా స్పష్టం చేసింది. ప్రియుడు మోసం చేయడంతో జీర్ణించుకోలేక ఆవేశంతో సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది. పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించి కోర్టు ఆమెకు జీవిత ఖైదు జీవించింది. ఐతే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది, కానీ ఈ ఘటనకు ప్పాలడే ముందు ఏ జరిగిందనేది అస్పష్టంగా ఉంది. అదీగాక ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు పై కోర్టుకి అప్పీలుకి వెళ్తామని తేల్చి చెప్పారు. (చదవండి: నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి దుర్మరణం) -
సరదా తీర్చిన ట్రూత్ ఆర్ డేర్.. జీవిత ఖైదు
లండన్: ఫన్ కోసం సరదాగా ఆడే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఓ యువకుడిని జైలు పాలు చేసింది. గేమ్‌లో భాగంగా సదరు యువకుడు తన నానమ్మను చంపేశాడు. ఈ సంఘటన రెండేళ్ల క్రితం జరగ్గా.. తాజగా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఆ వివరాలు.. లాంక్షైర్ కాన్స్టాబులరీ ప్రకారం, యూకేకి చెందిన టియర్నాన్ డార్న్‌టన్ అనే యువకుడికి రిస్కీ పనులు చేయడం అంటే చాలా ఇష్టం. థ్రిల్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికే కాదు.. తీయడానికి కూడా రెడీనే. ఈ క్రమంలో 2018, మే 28న ఇలాంటి థ్రిల్లింగ్ పనికే పూనుకున్నాడు. స్నేహితులతో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాడు. (చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!) ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు డేర్ సెలక్ట్ చేసుకున్నాడు డార్న్‌టన్. దానిలో భాగంగా తన నానమ్మ మేరీ గ్రెగోర్ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటనలో మేరీ మరణించింది. న్యూమోనియా, ఊపిరిడకపోవడం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు, లాంక్షైర్ కాన్స్టాబులరీ ఉమ్మడి పరిశోధనలో సిగరెట్‌ని ఆర్పకుండా పడేయడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మరి ఇప్పుడెలా బయటపడింది అంటే డార్న్టనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల క్రితం డార్న్‌టన్ ఓ కౌన్సిలర్ని కలిశాడు. మాటలో మధ్యలో గతంలో తాను తన నానమ్మ ఇంటికే నిప్పు పెట్టానని.. ఈ ప్రమాదంలో ఆమె మరణించిందని తెలిపాడు. ఈ విషయాన్ని కౌన్సిలర్ పోలీసులుకు తెలపడంతో వారు కేసును రీఒపెన్ చేశారు. (చదవండి: ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!) కేసు విచారణలో డార్న్‌టన్ సంచలన విషయాలు తెలిపాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా తానే తన నానమ్మ ఇంటికి నిప్పు పెట్టినట్లు వెల్లడించాడు. దీని తర్వాత మరో సారి కూడా ఇలాంటి పని చేసినట్లు తెలిపాడు. ఈ క్రమంలో 2021, మార్చిలో డార్న్‌టన్ మీద హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు డార్న్టన్కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పెరోల్ లభించాలంటే.. డార్న్‌టన్ కనీసం 15 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. ఆ తర్వాతే అతడికి పెరోల్ లభించనుంది. చదవండి: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. గ్రాండ్‌గా విడాకుల పార్టీ -
Hyderabad: మూడేళ్ల క్రితం లైంగికదాడి, కామాంధునికి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తె వయసున్న బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో కామాంధుడు ఎడ్ల రమేశ్ (45) బతికున్నంత కాలం జైలు జీవితం గడపాలని చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణ (పోక్సో) కేసుల విచారణ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అలాగే రూ.20 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి బి.సురేశ్ తీర్పులో పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయస్సు 11 సంవత్సరాల 6 నెలలని, ఈ నేపథ్యంలో బాధితుల పరిహార పథకం కింద రూ.7 లక్షలు పరిహారం ప్రభుత్వం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థను ఆదేశించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని జాతీయ బ్యాంకులో బాలిక పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఈ డబ్బును బాలిక మేజర్ అయిన తర్వాత తీసుకోవచ్చని పేర్కొంది. మిగిలిన 20 శాతం డబ్బును బాలికకు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. -
130 మంది దారుణ హత్య.. జైలులో మృతి చెందిన ‘డేటింగ్ గేమ్ కిల్లర్’
వాషింగ్టన్/కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న.. "డేటింగ్ గేమ్ కిల్లర్" గా ప్రసిద్ది చెందిన ఓ హంతకుడు శనివారం మరణించినట్లు జైలు అధికారులు తెలిపారు. రోడ్నీ జేమ్స్ అల్కల (77) కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆసుపత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలీఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130 మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. 2013లో న్యూయార్క్‌లో మరో ఇద్దరిని నరహత్య చేసినందుకు గాను అల్కలాకు అదనంగా మరో 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. 1977 మృతుల్లో వ్యోమింగ్ ప్రాంతంలో లభించిన ఓ 28 ఏళ్ల మహిళ మృతదేహానికి సంబంధించిన కేసులో డీఎన్ఏ ఆధారంగా అల్కలా ప్రమేయం వెలుగు చూడటంతో అతడికి 2016లో మరోసారి శిక్ష విధించారు. ఆరు నెలల గర్భవతి హత్య కేసులో అల్కలపై ఇంకా విచారణ కొనసాగుతుందని జడ్జి వెల్లడించారు. ఉరి శిక్ష విధించినప్పటికి అల్కల మెడికల్ సంరక్షణ నిమిత్తం జైలులో కాక అతడి నివాసంలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. గావిన్ న్యూసోమ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఉరిశిక్షపై తాత్కాలిక నిషేధం విధించారు. అధికారులు.. అల్కల తాను హత్య చేసిన మహిళల చెవిపోగులను ట్రోఫీలుగా తీసుకునేవాడని తెలిపారు. గతంలో అల్కల ధరించిన బంగారు చెవి రింగులు తన కుమార్తె రాబిన్ సామ్సోకు చెందినవని ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన మహిళ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ అల్కలా మాత్రం చెవిపోగులు తనవేనని.. వాటిని 1978 లో తాను ధరించినట్లు ‘ది డేటింగ్ గేమ్’ టీవీ షోలో కనిపించిన ఒక క్లిప్‌ని చూపించాడు. సామ్సో చనిపోవడానికి దాదాపు ఒక సంవత్సరం ముందే తాను ఈ బంగారు చెవి పోగులను ధరించానని అల్కలా కోర్టుకు తెలిపాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. దర్యాప్తుదారులు ఒక బాధితురాలి డీఎన్ఏ.. అల్కలా దగ్గర ఉన్న గులాబీ రంగు చెవి పోగులో గుర్తించడమే కాక.. సామ్సో శరీరంలో అల్కలా డీఎన్ఏ గుర్తించారు. ఈ కేసులో అతడికి రెండు సార్లు మరణశిక్ష విధించారు. కాని రెండు నేరారోపణలు తారుమారు చేయబడ్డాయి. రెండు దశాబ్దాల తరువాత, కొత్త డీఎన్ఏ, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా, నలుగురు మహిళల హత్యలకు సంబంధించి అల్కలాపై అభియోగాలు మోపారు. తీర్పు తరువాత, అధికారులు అల్కాలా ఆధీనంలో ఉన్న యువతులు, బాలికల కి చెందిన100 కి పైగా ఫోటోలను విడుదల చేశారు. -
చెల్లిని చంపిన అన్నకు జీవిత ఖైదు
సాక్షి, జగిత్యాల : చెల్లిని హత్యచేసిన అన్నకు జీవితఖైదు, కేసులో నిందితురాలైన వదినకు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జగిత్యాల సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి సుదర్శన్ సోమవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా.. రాయికల్ మండలం చెర్లకొండాపూర్కి చెందిన పల్లికొండ గంగుకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త చిన్ననర్సయ్య చనిపోయిన అనంతరం ఇద్దరు కూతుళ్లకు, కుమారుడికి పెళ్లి చేసింది. మరో ఇద్దరు కుమార్తెలు పెళ్లికి ఉండటంతో ఆమెకున్న ఐదెకరాల భూమిలో మూడెకరాలు విక్రయించి మూడో కుమార్తె సునీతకు వివాహం చేసింది. అనంతరం చిన్న కుమార్తె రోజా వివాహానికి మిగతా కొంత డబ్బు నిల్వ ఉంచగా కుమారుడు అశోక్ ఆస్తుల పంపకం విషయంలో గొడవపడ్డారు. 2015 మే 16న ఉదయం 8.30 గంటలకు రోజా కిరాణం షాపులో ఉండగా అశోక్ అక్కడికి వెళ్లి రోకలిబండతో ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉండగా గంగు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రాయికల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కేసులో అడిషనల్ పీపీ శ్రీవాణి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా సరిలాల్, విజయ్‌రాజ్, సురేందర్, రాజశేఖర్‌రాజు, సీఎంఎస్ ఎస్సై రాజునాయక్, కోర్టు కానిస్టేబుల్ నవీన్, సీఎంఎస్ కానిస్టేబుల్ కిరణ్ నిందితులకు శిక్ష పడేందుకు కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టారు. సోమవారం పల్లికొండ అశోక్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా, ఆయన భార్య భూలక్ష్మికి ఏడాది జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా కేసులో దోషులకు శిక్షపడేలా పని చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ సింధూశర్మ అభినందించారు. -
భారత సంతతి వ్యక్తికి 28 ఏళ్ల జైలు
లండన్: తనతో విడిపోయిన భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 23 ఏళ్ల జిగుకుమార్ సోర్తి అనే భారత సంతతి వ్యక్తి తన భార్య భవిని ప్రవీన్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం వీధిలో కనిపించిన ఒక పోలీసు అధికారితో తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా పెరోల్ ఇవ్వడానికి కంటే ముందు 28 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ‘ఇది భయంకరమైన, క్రూరమైన, కనికరంలేని హత్య. కేవలం 21 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక అందమైన, ప్రతిభావంతులైన యువతి ప్రాణాలను దారుణంగా తీశారు’ అని జస్టిస్ తిమోతి స్పెన్సర్ బుధవారం లీసెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణలో భాగంగా జిగుకుమార్ సోర్తితో అన్నారు. లీసెస్టర్ నగరంలో నివసించిన భవిని ప్రవీన్ కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 2వ తేదీ 12:30 నిమిషాల సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన జిగుకుమార్ కొద్ది సేపు ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను కత్తితో పొడిచి, ఆ కత్తిని అక్కడే వదిలేసి బయటకు వచ్చాడు. పోలీసులకు స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు భవినిని హాస్పటల్లో చేర్పించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్ట్‌మార్టంలో ఆమెను అనేక సార్లు పొడవడంతో గాయాలయ్యి మరణించినట్లు వెల్లడయ్యింది. చదవండి: తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు.. -
ముప్పై ఏళ్లలో 13 హత్యలు.. 50 రేప్‌లు
వాషింగ్టన్: ముప్పై ఏళ్లుగా వరుస హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ‘గోల్డెన్ స్టేట్ కిల్లర్’గా పిలవబడే అమెరికా మాజీ పోలీసు అధికారి జోసెఫ్ జేమ్స్ డీ ఏంజెలో సోమవారం తన నేరాలను కోర్టు ముందు అంగీకరించాడు. 13హత్యలు, పదుల సంఖ్యలో అత్యాచారాలు, కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడుతూ మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాను భయభ్రాంతులకు గురి చేసిన జోసెఫ్‌కు సోమవారం కోర్టు శిక్ష విదించింది. విచారణలో అతడు పాల్పడిన భయంకరమైన నేరాలకు సంబంధించిన వివరాలను కోర్టు వెల్లడించింది. జోసెఫ్ దాదాపు 30 ఏళ్లుగా నేరాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. 74 ఏళ్ల జోసెఫ్ కోర్టు విచారణ సమయంలో తన నేరాలకు సంబంధించి ‘అవును’.. ‘ఒప్పుకుంటున్నాను’.. ‘తప్పే వంటి’ సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో ప్రాసిక్యూటర్ అమీ హాలిడే గతంలో జోసెఫ్‌కు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ.. పెరోల్‌కు అనుమతి లేకుండా 11 జీవిత ఖైదుల శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ‘గోల్డెన్ స్టేట్ కిల్లర్’గా పిలవబడే జోసెఫ్‌ను మూడు దశాబ్దాల తర్వాత 2018లో అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన డీఎన్ఏను జోసెఫ్ డీఎన్ఏతో పోల్చారు. రెండు మ్యాచ్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. మూడు దశాబ్దాలుగా సాగిన నేరాల పరంపరకు ముగింపు పలికారు. మొదట ఇతడికి 1978లో నూతన జంట బ్రియాన్, కేటీ మాగ్గియోర్ హత్య కేసులో మాత్రమే కోర్టు శిక్ష విధించింది. ఆ తర్వాత 2018 నాటి కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి జోసెఫ్ దాదాపు 13 హత్యలు, 50 అత్యాచారాలు, పదుల కొద్ది దొంగతనాలకు పాల్పడ్డట్లు వెల్లడయ్యింది. న్యాయమూర్తి జోసెఫ్ నేరాల చిట్టాను చదువుతూ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఒక అత్యాచారం కేసులో జోసెఫ్ బాధితురాలి కొడుకు చెవి కోస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కోర్టు వెల్లడించింది. భారీ వస్తువుతో బాధితుల తలలు పగలకొట్టి హత్యలు చేసేవాడని తెలిపింది. ఇతడి నేరాలు మొదట 1975 సెంట్రల్ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో ప్రాంతంలో ప్రారంభమయ్యి.. తర్వాత రాష్ట్రమంతా వ్యాపించాయి. 1986లో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇదే ఇతడి ఆఖరి హత్య. ఈ క్రమంలో ‘ఈస్ట్ ఏరియా రేపిస్ట్’, ‘డైమండ్-నాట్ కిల్లర్’, ‘ఒరిజినల్ నైట్ స్టాకర్’ వంటి అనేక పేర్లతో జనాల గుండెల్లో భయాందోళనలు రేకెత్తించేవాడు. 1979లో ఓ షాపులో దొంగతానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. దాంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత జోసెఫ్ 20 ఏళ్ళకు పైగా సాక్రమెంటో ప్రాంతంలో నివసించాడు. అక్కడ ట్రక్ మెకానిక్‌గా పని చేస్తూ.. 2017లో పదవి విరమణ చేశాడు. కోర్టు జోసెఫ్‌కు శిక్ష విధిస్తూ.. ‘హత్యగావింపబడిన వారి కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారికి న్యాయం జరగడం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. లైంగిక వేధింపుల బాధితులు న్యాయం కోసం ఇంతకాలం ఎదురు చూడటం విషాదకరం’ అంటూ బాధపడ్డారు. -
కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి
న్యూఢిల్లీ : మానవ మృగాల్లో కూడా అనిర్వచనీయ కరడుగట్టిన మృగాలు ఉంటాయని అమెరికాకు చెందిన హెన్రీ మిచెల్లీ పియెట్ నిరూపించాడు. 63 ఏళ్ల ఆ కామ పిశాచి తన సవతి కూతురిని 11 ఏళ్ల వయస్సులో కిడ్నాప్ చేసి అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మెక్సికోకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై ప్రతిరోజు భౌతికంగానే కాకుండా లైంగిక దాడి చేసి ఏకంగా తొమ్మిది మంది పిల్లలను కన్నాడు. తాను మాత్రం బీరు సీసాలతో, హోటల్ భోజనంతో కులాసాగానే బతుకుతూ భార్యా, పిల్లలను అర్ధాకలికి వదిలేసి భూలోక నరకం చూపించాడు. (బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం..) 1997 నుంచి 19 ఏళ్ల పాటు తన సవతి తండ్రి పియెట్ నిర్బంధంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన రొసాలిన్ మ్యాక్గిన్నిస్, స్థానికుల సహాయంతో 2016 జూన్‌లో ఎనిమిది మంది పిల్లలతో తప్పించుకొని అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. పెద్ద కుమారుడు అంతకుముందే ఆ చెర నుంచి తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు. రొసాలిన్ తన భర్తగానీ భర్త పియెట్‌పై కేసు పెట్టగా, ఆయన్ని ఓక్లహామ పోలీసులు 2017లో అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్ కోర్టు పియెట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గత బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు రొసాలిన్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చ లేదని, ఆమె పట్ల సానుభూతి చూపడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని అమెరికా అటార్నీ బ్రియాన్ జే. కుస్టర్ వ్యాఖ్యానించారు. రొసాలిన్‌కు ప్రస్తుతం 34 ఏళ్లు. ఆమె ‘పీపుల్ టీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం ఆమె తొమ్మిదవ ఏట, ఆమె తల్లి, పియెట్‌తో డేటింగ్ చేస్తూ కలిసి ఉన్నారు. అప్పుడే పియట్, రొసాలిన్‌ను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పియట్ భౌతికంగా కొడుతుండడంతో రొసాలిన్ తల్లి కూడా ఆయనతో విడిపోయింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలున్న పియెట్ ఓ రోజు వారితో కలిసి రొసాలిన్ చదువుతున్న స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అప్పటికి 11 ఏళ్లున్న రొసాలిన్‌ను పియెట్ తన పిల్లలకు తల్లిగా పరిచయం చేసి, వారి సాయంతో ఆమెను అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. మెక్సికో వెళ్లిన తర్వాత పియెట్ ఓ షెడ్డులో రొసాలిన్తో వేరు కాపురం పెట్టాడు. బయటకు వెళ్లేటప్పుడు పియెట్ షెడ్డుకు తాళం పెట్టి వెళ్లేవాడు. రొసాలిన్‌కు 15వ ఏట మొదటి సంతానం కలిగింది. అప్పటి వరకు పారిపోయేందుకు పలు సార్లు ప్రయత్నించి విఫలమైన రొసాలిన్ ఆ తర్వాత తెలియని మానసిక స్థితిలో నిస్తేజంగా ఉండిపోయి తొమ్మిది మంది పిల్లలకు తల్లయింది. పిల్లలు కూడా సరిగ్గా తిండిలేక ఇబ్బంది పడుతుండడంతో వారిని తీసుకొని ఎక్కడికన్నా పారిపోవాలనుకుంది. చేతిలో చిల్లి గవ్వా లేకపోవడం, ఇరుగు, పొరుగు వారితో కనీసం ముఖ పరిచయం కూడా లేకపోవడంతో పారిపోయేందుకు అంతగా సాహసం చేయలేక పోయింది. 2016లో కొద్దిగా పరిచయమైన పొరుగింటి మహిళ సహకారంతో రొసాలిన్, మెక్సికోలోని అమెరికా అంబసీని సందర్శించి అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. ‘నేను ఎలా బతికానో, ఎందుకు బతికానో తెలియదు. నా 19 ఏళ్ల జీవితం జీవచ్ఛవంలా, అగమ్య గోచరంగా, ఒకరకమైన అపస్మారక స్థితిలో సాగింది’ అంటూ ఆమె ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. పియెట్ పైసాచిక ఉదంతం ఆస్ట్రియా రేపిస్ట్ జోసఫ్ ఫ్రిజిల్ ఉదంతాన్ని గుర్తు చేస్తోంది. ఆ రాక్షసుడు సొంత కూతురిని నేల మాలిగలో 24 ఏళ్ల పాటు నిర్బంధించి ఏడుగురు సంతానాన్ని కన్నాడు. (చదవండి: చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!) -
సైనైడ్ పదార్థమిచ్చి అమ్మాయిలను దారుణంగా..
మంగళూరు : 20 మంది యువతులను దారుణంగా రేప్ చేసి ఆపై హత్య చేసిన సీరియల్ కిల్లర్' సైనైడ్' మోహన్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు మంగళూరు సెషన్స్ కోర్టు మంగళవారం పేర్కొంది. కాగా 2006లో కేరళలోని కస్రాగోడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని రేప్ చేసి హతమార్చినందుకుగానూ మోహన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తున్నట్లు సెషన్స్ కోర్టు జడ్జి సయీదున్నిసా తన తీర్పులో వెల్లడించారు. వివరాలు.. సైనైడ్ మోహన్.. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి మొదట రూంకు తీసుకెళతాడు. ఆ తర్వాత సైనైడ్ పూసిన పదార్థాలను వారికి అందించి రేప్ చేస్తాడు. తర్వాత వారు చనిపోయారని నిర్దారించుకొని మెల్లగా అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 20మంది యువతులను ట్రాప్ చేసి హతమార్చాడు. కాగా ఇదే విధంగా 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్కో యూనిట్‌కు పని నిమ్మిత్తం వచ్చిన 23ఏళ్ల కేరళ యువతితో మోహన్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున బస్టాండ్‌కు చేరుకొని యువతి ఒంటిపై ఉన్న నగలన్ని తీసుకొని గర్భనిరోధక మాత్ర అని నమ్మించి సైనైడ్ పూసిన పదార్థాన్ని అందించాడు. పదార్థాన్ని మింగిన ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. కాగా 2009లో బంట్వాల్లో పోలీసులకు పట్టుబడిన మోహన్ 20 మంది యువతుల్ని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. -
నేరానికి తగిన శిక్ష
అధికార మదంతో, తలపొగరుతో ఇష్టానుసారం చెలరేగే రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నావ్ అత్యాచార ఉదంతంలో బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఆయన తన శేష జీవితం మొత్తం జైల్లోనే గడపాలని, బాధితురాలికి రూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని, మరో పది లక్షల రూపాయలు ఆమె తల్లికి ఇవ్వాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రెండేళ్లక్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా అలజడి రేపింది. చివరకు ఐక్యరాజ్యసమితి సైతం ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేసి, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉన్నావ్ బాధితురాలు పడిన వెతలు అన్నీ ఇన్నీ కాదు. ఆమెను అపహరించి పదిరోజులపాటు అత్యాచారం చేయడం మాత్రమే కాదు... అదేమని ప్రశ్నించిన పాపానికి ఆ ఇంటిల్లిపాదినీ సెంగార్, ఆయన అనుచరగణం భయభ్రాంతులకు గురిచేశారు. వారికి పనులు దొరక్కుండా చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడా లంటే భయపడేలా ఊరు మొత్తాన్ని శాసించారు. అతగాడిపై కేసు పెట్టాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా ఎప్పటికప్పుడు ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం, దౌర్జన్యం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. తనను అపహరించారని, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం అపహరించడం(ఐపీసీ సెక్షన్ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ 366) వంటి ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్లో రాశారు. సెంగార్ సోదరుడు బాధితురాలి తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినప్పుడు పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ లాకప్‌లో ఉంచారు. ఆలస్యంగా వైద్య చికిత్స అంద డంతో ఆయన రెండురోజులు నరకం అనుభవించి కన్నుమూశాడు. ఇక తానూ, తన కుటుంబం ఏకాకులమని, ఎవరి ఆసరా తమకు లభించే అవకాశం లేదని నిర్ధారణయ్యాక బాధితురాలు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసగృహం సమీపంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సెంగార్ సోదరుడు, మరికొందరు ఆమె తండ్రిపై దౌర్జన్యం చేయడం, నెత్తురు ముద్దలా మారిన ఆ వృద్ధుణ్ణి స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు తాపీగా ప్రశ్నించడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి అల్లరై జనం ఛీ కొట్టాకగానీ ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేయలేదు. అటు తర్వాత ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాతే కులదీప్ సెంగార్‌ను అరెస్టు చేశారు. ఈలోగా బాధితురాలి బాబాయ్‌పై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారు. ఉన్నావ్ ఉదంతం మన దేశంలో రాజ్యాంగమూ, చట్టమూ ఉన్నాయా అన్న సందేహాన్ని కలిగించింది. ఉన్నావ్ బాధితురాలు ఆ ఉదంతం జరిగేనాటికి మైనర్. 2012లో వచ్చిన పోక్సో చట్టం కఠినమైనది. మొన్న జూలైలో సవరణలు చేసి దాన్ని మరింత కఠినంగా మార్చి నేరగాళ్లకు ఉరిశిక్ష పడే నిబంధన తీసుకొచ్చారు. కానీ 2017లో ఆ చట్టం బాధితురాలికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ చట్టం ఉన్నా అది తమకు తెలియనట్టు, అసలు లేనట్టు పోలీసులు ప్రవర్తించారు. మన దగ్గరున్న సమస్య అదే. నేరగాళ్లు సాధారణ వ్యక్తులైతే ఒకలా, రాజకీయ పలుకుబడి గలవారైతే మరోలా వ్యవహరిస్తుండటం రివాజుగా మారింది. ఉన్నావ్‌లో అది పరాకాష్టకు చేరింది. మొన్న జూలైలో న్యాయస్థానంలో జరిగే విచారణలో పాల్గొనడానికి బాధితురాలి కుటుంబం కారులో వెళ్తుండగా ఒక ట్రక్కు దాన్ని ఢీకొట్టింది. ఇందులో ఆమె పిన్ని, మేనత్త మరణించారు. బాధితురాలు, న్యాయవాది గాయపడ్డారు. ఈ ఉదంతం తర్వాత బాధితురాలు నేరుగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాశాక ఆయన జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించిన కేసుల న్నిటినీ లక్నో న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. రోజువారీ విచారించాలని, 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. అటు తర్వాతే బీజేపీ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరారోపణలొచ్చిన వ్యక్తి అధికార పక్ష నాయకుడైతే అధికార యంత్రాంగాన్ని కదిలించడం ఎంత కష్టమో, ఎంత ప్రాణాంతకమో ఉన్నావ్ బాధితురాలు, ఆమె కుటుంబం పడిన కష్టాలు గమనిస్తే బోధపడుతుంది. సెంగార్ ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిటిలోనూ పనిచేశాడు. ఎక్కడున్నా ఆయనపై ఆరోపణలు తరచు వస్తూనే ఉన్నాయి. బీజేపీలో చేరకముందు ఆయన బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీల్లో పనిచేశాడు. కానీ ఆయన ఓట్లు సాధించిపెట్టే బలమైన నాయకుడు గనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అరాచకాలపై ఎవరూ నోరెత్తలేదు. దేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తరా దిలో ఇలాంటివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్నావ్ బాధితురాలు రెండేళ్లపాటు ఒంటరి పోరు చేయాల్సి రావడం ఇందువల్లే. నేరం జరిగినప్పుడు వెంటవెంటనే వ్యవస్థలు కదలకపోయినా, ఆ నేరానికి తగిన శిక్ష పడకపోయినా సమాజంలో మరింతమంది నేరగాళ్లు పుట్టుకొస్తారు. ఏం చేసినా తమకేమీ కాదన్న ధైర్యంతో బరితెగిస్తారు. కనుక చట్టాలు కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. అవి సత్వరం రంగంలోకి దిగాలి. అప్పుడే అందరిలోనూ చట్టాలంటే భయం ఏర్పడుతుంది. నిర్భయ ఉదంతం జరిగాక నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఒక విలువైన మాట చెప్పింది. సమాజంలో నేరాలు అధికంగా అణగారిన వర్గాలు, మహిళలు, పిల్లలపైనే జరుగుతాయని, అందువల్ల వారి రక్షణకు ఉద్దేశించిన విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండాలని ఆ కమిటీ తెలిపింది. ఏ అధికారి అయినా, కింది స్థాయి సిబ్బంది అయినా అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తేలితే తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఉన్నావ్ ఉదంతం దేశంలోని అన్ని ప్రభుత్వాలకూ గుణపాఠం కావాలి. చట్టాలు సమర్థ వంతంగా పనిచేసేలా, వ్యవస్థలు సత్వరం కదిలేలా తీర్చిదిద్దాలి. అప్పుడు మాత్రమే చట్టాలంటే భయభక్తులు ఏర్పడతాయి. -
జీవిత ఖైదును సవాల్ చేసిన చచ్చి, బతికిన ఖైదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఇదో చిత్రమైన కేసు. చచ్చి, బతికిన ఓ ఖైదీ దాఖలు చేసిన పిటిషన్‌తో యావత్ దేశం దృష్టికి వచ్చిన కేసు. తనకు విధించిన యావజ్జీవ శిక్ష తన చావుతోనే ముగిసిందని, తనను తక్షణమే విడుదల చేయాలంటూ ఖైదీ వాదించిన కేసు. ఈ వాదనతోటి కోర్టు అంగీకరిస్తుందా, లేదా? అంటూ తీర్పు కోసం దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసిన కేసు.....చివరకు ఏమైందీ? అమెరికా, అయోవా రాష్ట్రంలోని పెనిటెన్చరీ జైలులో హత్యానేరం కింద యావజ్జీవ కారాగారా శిక్ష అనుభవిస్తున్న బెంజామిన్ శ్రైబర్ ఓ రోజు హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. జైలు అధికారులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన ఆస్పత్రి అధికారులు పెదవి విరిచారు. ‘లాభం లేదు, చనిపోయాడు’ అన్నారు. అంతలోనే ఖైదీ గుండె కొట్టుకోవడం గమనించారు. వైద్య చికిత్సల కోసం అతడిని ఆపరేషన్ థియేటర్లోకి తరలించారు. తనకు ‘పునర్జీవ చికిత్స’లు చేయరాదంటూ అంతకు కొన్నేళ్ల ముందే బెంజామిన్ ఓ పత్రం మీద సంతకం చేసి ఉన్నారు. బతికే అవకాశం లేదనుకున్న రోగులకు నరాల్లోకి కొన్ని రకాల రసాయనాలను పంపించడాన్ని ‘పునర్జీవ చికిత్స’లుగా వ్యవహరిస్తారు. బెంజామిన్ అపస్మారక స్థితిలోనే ఉండడంతో టెక్సాస్‌లో ఉన్న అతని సోదరుడిని పిలిపించి రోగి పరిస్థితిని వివరించారు. కిడ్నీ నిండా రాళ్లు పేరుకు పోయాయని, పునర్జీవ చికిత్స ద్వారా ఆయన్ని స్ప్రహలోకి వస్తే ఆపరేషన్ చేయవచ్చని చెప్పారు. ‘బెంజామిన్‌కు ఏమైనా బాధ కలుగుతుంటే అందుకు మందులివ్వండి. లేదంటే అలాగే వదిలేయండి’ అని చెప్పడాన్ని అనుమతిగా తీసుకున్న వైద్యులు అన్ని చికిత్సలు చేసి బెంజామిన్‌ను బతికించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బెంజామిన్ జైలు అధికారులు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. 1997లో ఓ దారుణ హత్య కేసులో బెంజామిన్‌కు ఒక్క రోజు పెరోల్ కూడా దొరకని యావజ్జీవ కారగార శిక్ష పడింది. 2015, మార్చి నెలలో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలయ్యారు. తిరిగి జైలుకొచ్చాక తాను చావుదాకా వెళ్లి తిరిగి వచ్చినట్లు బెంజామిన్‌కు తెల్సింది. 2018, ఏప్రిల్ నెలలో జిల్లా కోర్టులో బెంజామిన్ ఓ చిత్రమైన పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు విధించిందీ యావజ్జీవ కారాగార శిక్ష కనుక, తన చావుతో అది ముగుస్తుందని, తాను ఆస్పత్రిలో చనిపోయినప్పుడే అది ముగిసిపోయిందని, అనవసరంగా నాలుగేళ్లు అదనంగా తనను జైలులో ఉంచారంటూ కేసు వాదించారు. అందుకు సంబంధించి ఆస్పత్రి రికార్డుల కాపీలను కూడా సమర్పించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసులో జీవం లేదని, అస్సలు పరిశీలనార్హం కూడా కాదంటూ జిల్లా జడ్జీ తీర్పు చెప్పారు. దాంతో తీర్పును సవాల్ చేస్తూ బెంజామిన్ న్యాయవాది అయోవాలోని అప్పీళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొన్న బుధవారం నాడు అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. ‘యావజ్జీవ కారాగార శిక్ష అంటే డాక్టరిచ్చే డెత్ సర్టిఫికెట్తో ముగిసేది కాదు. బతికున్నంత కాలం జైలులో ఉంచడమే యావజ్జీవ కారాగార శిక్ష. పైగా నీవు బతికి లేకుంటే కోర్టుకు ఎలా వచ్చావు?’అంటూ జడ్జీ అమంద పాటర్‌ఫీల్డ్ కేసును కొట్టివేశారు. ‘పునరుజ్జీవ చికిత్స’ వద్దంటూ తన క్లైంట్ సంతకం చేశాక ఎలా చేస్తారని, అందుకు నష్ట పరిహారం చెల్లించాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ గురించి బెంజామిన్ న్యాయవాది ప్రశ్నించగా, జిల్లా కోర్టు ఆ అంశాన్ని ప్రస్తావించలేదు కనుక, తాము పరిగణలోకి తీసుకోలేదని జడ్జీ స్పష్టం చేశారు. -
హైదరాబాదీని చంపిన పాకిస్తానీ
లండన్: తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ పాకిస్తానీ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో పాకిస్తాన్, యూకే పౌరసత్వం కలిగిన పెర్విజ్ (27)కు లండన్‌లోని క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెరోల్ దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. యావజ్జీవ శిక్షతో పాటే దీన్ని కూడా అనుభవించాలని పేర్కొంది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మేలో ప్రజలు చూస్తుండగానే పెర్విజ్ హైదరాబాద్‌కు చెందిన తన సహోద్యోగి నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (24)ను లండన్‌కు సమీపంలో పొడిని చంపాడు. మొహమ్మద్ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మొహమ్మద్‌ను కిరాతకంగా చంపాడని మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంది. -
పరువు హత్య.. తల్లిదండ్రులకు జీవిత ఖైదు
సాక్షి, గుంటూరు: ఓ పరువు హత్య కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ బుధవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్ 2వలైనులో పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి అనే కుమార్తెలున్నారు. దీప్తి హైదరాబాదులోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేది. అదే కంపెనీలో పశ్చిమ గోదావరి జిల్లా రాజఒమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి కిరణ్‌కుమార్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో దీప్తి(26), కిరణ్‌కుమార్ ప్రేమించుకున్నారు. 2014 మార్చి నెల 21వ తేదీ దీప్తి, కిరణ్ హైదరాబాదులోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు 22వ తేదీ హైదరాబాద్‌కు వెళ్లి గుంటూరులో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తామని నమ్మ బలికి, దీప్తిని ఇంటికి తీసుకెళ్లి మంచానికి కట్టేసి చున్నీ మెడకు బిగించి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో హరిబాబు, సామ్రాజ్యం దంపతులకు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఉన్మాదికి యావజ్జీవ శిక్ష!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన హత్య, హత్యాయత్నం కేసుల్లో అరెస్టయిన ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం పెరియకాళియమ్మన్ ఆలయ వీధికి చెందిన గురునాథన్ (29). ఇతను తిరుప్పూర్‌లోని ఓ బనియన్ సంస్థలో పనిచేస్తున్నాడు. తిరుప్పూర్‌కు చెందిన ప్లస్-1 (16 ఏళ్ల) విద్యార్థిని ప్రేమ పేరిట వేధించాడు. ఇందుకు విద్యార్థిని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే వేరొకరితో వివాహం చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన గురునాథన్ 2015, సెప్టెంబర్, 14న సాయంత్రం పాఠశాల ముగిశాక.. విద్యార్థినిపై బీర్ బాటిల్‌తో దాడిచేశాడు. తీవ్రగాయాలైన విద్యార్థినిని స్థానికులు చికిత్స నిమిత్తం తిరుప్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి గురునాథన్‌ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తిరుప్పూర్ జిల్లా మహిళ కోర్టులో నడుస్తోంది. బుధవారం ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి జయంతి గురునాథన్‌కి యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లుడి హత్యకేసులో మేనమామకు.. నాగై సమీపం వేలాంగన్ని నిరత్తణ మంగలం మేల వీధికి చెందిన జిమ్మిగార్డన్ భార్య ఉషా. వీరి కుమారులు రాబర్ట్ (12), రాబిన్. ఉషా తమ్ముడు అంథోని (25). ఇతను చిన్నప్పటి నుంచే తన అక్క ఇంట్లోనే ఉంటున్నాడు. 2012లో ఉషా సారాయి విక్రయ కేసులో అరెస్టయి తిరువారూర్ జైల్లో ఉంది. ఈ స్థితిలో ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదు కనిపించలేదని జిమ్మి గార్డన్ వెతికాడు. అప్పుడు రాబర్ట్, ఆ నగదుని ఆంథోని మామ తీశాడు అని తెలిపాడు. ఈ క్రమంలో అంథోని ఆ రోజు రాత్రి రాబర్ట్‌ని గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి అంథోనిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నాగై జిల్లా కోర్టులో నడుస్తోంది. బుధవారం ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి పద్మనాభన్ అంథోనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బ్యాంకు కుంభకోణం : ఆరుగురికి జీవిత ఖైదు
సాక్షి, ముంబై: దాదాపు 20 ఏళ్ల నాటి కేసులో ముంబై స్పెషల్ కోర్టుసంచలన తీర్పును వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మాజీ అధికారితోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాదు ఈ కేసులో న్యాయవాదికి మూడేళ్ల జైలు శిక్షను విధించిందని గురువారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2000 బీఓఐలో చోటు చేసుకున్న 2.91కోట్ల కుంభకోణానికి సంబంధించి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సీబీఐ అందించిన సమాచారం ప్రకారం, 2000లో స్విఫ్ట్ సేవల కింద బ్రాంచ్ అధికారులతో కుమ్మక్కై, నకిలీ పత్రాలతో ఆహుజా అతని భాగస్వాములు కలిసి 2.50 కోట్ల రూపాయల మేర లోన్ తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో 2004 ప్రారంభంలో ఎన్పీఏగా ప్రకటించబడింది. దీంతో బ్యాంకు నష్టం మొత్తం రూ. 2.91 కోట్లకు చేరింది. 2004లో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ అనంతరం నవంబరు 2005లో చార్జిషీట్ దాఖలు చేసింది. బ్యాంకుకు చెందిన అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భగవాన్జీ డి.జోషి, బ్యాంకులో రుణం తీసుకున్న 5గురు వ్యాపారవేత్తలు - మనోహర్‌లాల్ ఆహుజా, అతని కుమారుడు అమిత్ ఆహుజా, మహేష్ బోరా, సందేష్ రామచంద్ర నాగే, జి.కె.శర్మ, శాంతిలాల్ చౌహాన్ తోపాటు న్యాయవాది యూనస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. దీనిపై ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు చాలా అరుదైనది. ఒక మైలురాయిలాంటిదని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆహుజా తండ్రీకొడుకులిద్దరికి చెరి రూ. 50 లక్షలు, బొహ్రా రూ. 3లక్షలు, నాగే రూ. 60వేల, చౌహాన్ రూ .50వేలు జోషి రూ. లక్ష, న్యాయవాదికి రూ .3 వేల జరిమానా విధించడం గమనార్హం. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన శర్మ ఆగస్టు ,2008 లో చనిపోయారు. -
జర్నలిస్ట్ హత్య కేసు: డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
-
ఆర్మీ మేజర్ జనరల్‌కు జీవితఖైదు
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో 1994లో జరిగిన సంచలన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఓ ఆర్మీ మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్లు సహా ఏడుగురికి జీవిత ఖైదు పడింది. డిబ్రూగఢ్ జిల్లాలోని దిన్జన్‌లో సైనిక కోర్టు విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్లు థామస్ మాథ్యూ, ఆర్ఎస్ సిబిరెన్‌లతోపాటు జూనియర్ కమిషన్డ్, నాన్ కమిషన్డ్ అధికారులుగా ఉన్న దిలీప్ సింగ్, జగ్దేవ్ సింగ్, అల్బీందర్ సింగ్, శివేందర్‌సింగ్‌లను ఆర్మీ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. 1994 ఫిబ్రవరి 23న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యు) కార్యకర్తలు ప్రవీణ్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దేవాజిత్ విశ్వాస్, అఖిల్ సోనోవాల్, భాబెన్ మోరన్‌లను దోషులు అపహరించి, నకిలీ ఎన్కౌంటర్ చేసి చంపారు. డంగారి ఫేక్ ఎన్‌కౌంటర్‌గా ఈ కేసు పేరుమోసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నాటి ఏఏఎస్యు అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత జగదీశ్ భుయాన్ ఒక్కరే హైకోర్టులో పోరాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజులు సీబీఐ దర్యాప్తు జరిగిన అనంతరం ఈ కేసును తాము మిలిటరీ చట్టం కింద విచారిస్తామంటూ కోర్టు అనుమతిని ఆర్మీ పొందింది. ఇప్పుడు ఏడుగురికి జీవితఖైదు విధించడంపై భుయాన్ స్పందిస్తూ ‘24 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, సైన్యంపై నేను నమ్మకం కోల్పోలేదు. ఆర్మీ తన సొంత సిబ్బందికే గుణపాఠం నేర్పే శిక్ష వేసింది’ అని అన్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ తప్పుచేసే సైనికులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తీర్పును కోల్‌కతాలోని తూర్పు ఆర్మీ కమాండ్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ఇందుకు మూడు నెలల సమయం పట్టొచ్చు. దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దోషుల్లో ఒకరైన ఏకే లాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహోద్యోగిని 2007లో ఫిర్యాదు చేయడంతో ఆర్మీ విచారణ అనంతరం 2010లోనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. -
సబ్ర్మతి రైలు దహనం; మరో ఇద్దరికి జీవిత ఖైదు
-
గోద్రా దుర్ఘటన; మరో ఇద్దరికి జీవిత ఖైదు
అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా రైలు దహనం కేసులో సిట్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అల్లరిమూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్దమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న 59 మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు. దీంతో గుజరాత్ వ్యాప్తంగా ఒక్కసారిగా మత ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. ఈ కేసులో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టిన సిట్ ప్రత్యేక న్యాయస్థానం 2011 మార్చి 1న ఈ కేసులో 31 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వారు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు 2017 అక్టోబర్‌లో మరణశిక్ష ఖరారైన 11 మంది శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. మిగతా 20 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్ధించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫరూఖ్ బానా, ఇమ్రాన్ షేరు, హుస్సేన్ సులేమాన్, ఫరూఖ్ ధాంతియా, కసమ్ బమేదీలను పోలీసులు 2015-16 మధ్య కాలంలో అరెస్ట్ చేశారు. వీరిలో ఫరూఖ్ బానా, ఇమ్రాన్ షేరులకు కోర్టు జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మరో 8 మంది నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. -
అత్యాచారం కేసు.. నిందితునికి జీవిత ఖైదు
ముజఫర్‌నగర్: పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ నిందితుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.25 వేల జరిమానా కూడా విధించింది. 2014 సంవత్సరం జూలై 8న కిరణ్‌పాల్ అనే వ్యక్తి ముజఫర్‌నగర్ జిల్లా పంచెండకాలా గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలికను ఇంట్లో నుంచి ఎత్తుకు వచ్చాడు. అనంతరం స్కూల్ వద్ద అత్యాచారం చేసి పారిపోయాడు. స్కూల్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తర్వాత నిందితుడు కిరణ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. నిందితునిపై భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. -
కూచిభొట్ల హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు