తెలంగాణలో జీవిత ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జనవరి 26న కటాఫ్ తేదిగా నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణలో జీవిత ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జనవరి 26న కటాఫ్ తేదిగా నిర్ణయించారు. ఈ తేదిని దృష్టిలోపెట్టుకొని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడిచిపెట్టనున్నారు.
ఐదేళ్లు శిక్షను అనుభవించిన మహిళా ఖైదీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న ఇతర ఖైదీలకు కూడా దీనిద్వారా ఉపశమనం కలగనుంది. ఖైదీల విడుదల జాబితా తయారీ కోసం ఆరుగురు అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారు.