కూచిభొట్ల హంతకుడికి జీవిత ఖైదు | Srinivas Kuchibhotla Killer Life Sentenced To Jail | Sakshi
Sakshi News home page

కూచిభొట్ల హంతకుడికి జీవిత ఖైదు

Published Sat, May 5 2018 8:01 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Srinivas Kuchibhotla Killer Life Sentenced To Jail - Sakshi

శ్రీనివాస్‌తో సునయన (పాత ఫొటో)

కన్సాస్‌, అమెరికా : హైదరాబాద్‌ టెకీ శ్రీనివాస్‌ కూచిభొట్ల(33) హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. స్నేహితుడితో కలసి బార్‌లో ఉన్న శ్రీనివాస్‌పై అమెరికా నేవీ మాజీ సైనికుడు ఆడమ్‌ ప్యురిన్‌టన్‌(52) ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’అంటూ కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్సపొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్‌తో పాటు బార్‌లో ఉన్న అలోక్‌ మాదసాని గాయాలతో బయటపడ్డారు. వీరిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఇయాన్‌ గ్రిలట్‌ అనే వ్యక్తికి కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. శ్రీనివాస్‌ హత్యపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.

ఈ ఏడాది జనవరిలో కూచిభొట్ల భార్య సునయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగానికి ఆహ్వానించారు. ఈ వేదికపై నుంచి ట్రంప్‌ కూచిభొట్లపై జరిగిన దాడిని ఖండించారు. ప్యూరింగ్‌టన్‌ శిక్షపై మాట్లాడిన న్యాయవాదులు 50 ఏళ్ల తర్వాత అతనికి పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఆడమ్‌కు జీవిత ఖైదు విధించడాన్ని శ్రీనివాస్‌ భార్య సునయన ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. విదేశీయులపై దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement